Previous Page Next Page 
మోహిత పేజి 43


    "అంటే... నిన్ను నువ్వు రక్షించుకోడానికి ప్లాన్  వేశావన్న మాట" కోపంగా అంది మోహిత.

 

    "అవును. నిన్ను చంపడంతో పాటు, నన్ను రక్షించుకోవడం కూడా నాకవసరం గదా..."

 

    "నా చేతుల్లో నువ్వు చస్తున్నప్పుడు..... నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తల వలన ఉపయోగం లేదు."

 

    "నోర్ముయ్..... మర్యాదగా సంతకం పెట్టు" విసురుగా వచ్చి ఆమె జుట్టును పట్టుకుని, నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆమెవేపు చూశాడతను.

 

    ఆ జుట్టుని విదిలించుకుని, అతన్ని బలంగా వెనక్కి నెట్టేసి ముందుకు పరిగెత్తింది.

 

    "పట్టుకోండి...... పట్టుకోండి....." అరుస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

    వరండా మీద పరుగెడుతున్న మొహితను, నలుగురు అనుచరులు చుట్టుముట్టి పట్టేశారు.

 

    రొప్పుతూ అక్కడకొచ్చాడు రాజేంద్ర.

 

    "ఒరేయ్..... దానిని కదలకుండా పట్టుకుని  బట్టలిప్పేయండి" ఆజ్ఞాపించాడతను.

 

    ఆ అనుచరుల చేతుల్లో గింజుకుంటోంది మోహిత.

 

    ఒకడు చీరను పరపరమని లాగేశాడు. ఇంకొకడు జాకెట్ ని లాగేశాడు.

 

    బ్రా, లంగాతో నిస్సహాయంగా నిలబడిపోయిందామె.

 

    "నీ అందాల్ని అందరూ చూడాలి.... ఆ రెండూ ఎందుకు?" బ్రా, లంగాని లాగేశాడు రాజేంద్రకుమార్.

 

    చేతుల్ని  రెండూ గుండెలకు కప్పుకుని నిల్చుండిపోయింది.

 

    ఒక్కసారిగా ఆమె ధైర్యం కోల్పోయింది.

 

    "ఒక్క సంతకం పెట్టేయ్..... నిన్నొదిలేస్తాను..... క్విక్....." సిగరెట్ ను తీసి వెలిగిస్తూ అన్నాడతను.

 

    ముగ్గురి అనుచరుల చూపులూ ఆమె నగ్నదేహంమీదే వున్నాయి.

 

    "అయిదే అయిదు నిముషాలు నీకు టైమిస్తున్నాను. నువ్వు సంతకం పెట్టకపోతే..... వాళ్ళు నీ నగ్నత్వాన్ని పరీక్ష చేస్తారు. నీ చేత బలవంతంగా సంతకం చేయిస్తారు" అంటూ చేతివాచీ వేపు చూచుకున్నాడతను.

 

    సరిగ్గా అయిదు నిముషాలు గడిచాయి.

 

    రాజేంద్రకుమార్ ఒక వ్యక్తివేపు చూశాడు. ఆ  వ్యక్తి చేతిలోని డ్రింక్ బాటిల్ గడగడ తాగేసి, ఆమెకు ఎదురుగా వచ్చి నుంచుని ఆమె ఎత్తయిన గుండెలవేపు చూస్తున్నాడు కాంక్షగా.

 

    ఆమె నడుమ్మీద చెయ్యి కాంక్షగా.

 

    చీకట్లోంచి పరుగు పరుగున ప్రళయంలా వస్తున్న ఆ వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు రాజేంద్రకుమార్.

 

    మైత్రేయ.....

 

    "ఒరేయ్.....వాడ్ని...." ఏదో చెప్పబోయాడు రాజేంద్రకుమార్.

 

    తనమీదకు దూసుకుని వస్తున్న వ్యక్తిని ఎడంచేత్తో పైకి లాగి కుడిచేయి బిగించి, ముఖమ్మీద గుద్దాడు. ఆ దెబ్బకు వాడు అరుస్తూ గోడను ఢీకోని కిందపడ్డాడు.

 

    మిగతా వ్యక్తులు ఒక్కసారిగా మైత్రేయమీద పడ్డారు. పక్కనే వున్న ఇనుపరాడ్ ని అందుకుని ఒక్కొక్కర్నీ తుక్కు తుక్కుగా చేసేశాడు. అతని ధాటికి తట్టుకోలేక ఆ వ్యక్తులు గెస్ట్ హౌస్ లోంచి బయటకు పారిపోయారు.

 

    సరిగ్గా ఆ సమయంలో రాజేంద్రకుమార్ రివాల్వర్ తీసి, మైత్రేయ గుండెలకు గురిపెట్టాడు.

 

    అదే సమయంలో దుస్తులు వేసుకుంటున్న మోహిత పక్కనే వున్న ఖాళీ డ్రింక్ బాటిల్ ను అందుకుని పిస్టల్ కేసి విసిరికొట్టింది. రాజేంద్రకుమార్ చేతిలోని పిస్టల్  ఎగిరి కిందపడిపోయింది. కిందపడిపోయిన పిస్టల్ ని, పరుగు పరుగున వెళ్ళి అందుకుని రాజేంద్రకుమార్ గుండెలకు గురిపెట్టింది మోహిత.

 

    "మిష్టర్ రాజేంద్రకుమార్..... ట్రిగ్గర్ నొక్కితే..... ఈ క్షణంలో నువ్వు ఛస్తావ్. కానీ...... నిన్ను అంత తేలికగా చంపను...." అంటూ మైత్రేయ వేపు చూసి-

 

    "మైత్రేయ.... వాడ్ని.... ఆ చెట్టుకేసి కట్టేయ్....." అని చెప్పగానే మైత్రేయ, రాజేంద్రకుమార్ ని లాక్కెళ్ళి.... గెస్ట్ హౌస్ ముందున్న చెట్టుకి కట్టేశాడు.

 

    "పైన మేడమీద గదిలో పెట్రోల్ టిన్ వుంటుంది తీసుకురా" అరిచిందామె.

 

    మైత్రేయ మేడమీదకు పరుగెత్తాడు.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

     ఒగర్చుకుంటూ తనకెదురుగా వచ్చి నిలబడి తోకాడించుకుంటూ తన దగ్గరి కొచ్చిన 'నిక్కీ'ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె.

 

    "నిక్కీ, వంగోని దాని తోకని నిమిరి-

 

    "రాజేంద్రకుమార్......దీనికున్న విశ్వాసం కూడా నీకు లేదు...... అందుకే  కుక్కచావు ఛస్తున్నావ్" అంటూ  పెట్రోల్ డబ్బాతో వచ్చిన మైత్రేయవేపు చూస్తూ-

 

    "పాపం..... పెద్ద మనిషిని పెట్రోల్ తో స్నానం చేయించు."

 

    మైత్రేయ పెట్రోల్ డబ్బా మూత తీసి, రాజేంద్రకుమార్ తలనుంచి కాళ్ళవరకూ పోశాడు.

 

    రాజేంద్రకుమార్ లో ఇప్పుడు భయం ప్రవేశించింది. వణికిపోతున్నాడతను. అతన్ని చూసి పిచ్చిగా నవ్వుతోందామె.

 

    "ఆఖరకు నువ్వేమవుతున్నావో..... నీ కళ్ళారా చూసుకో..... బతికుండగా మాడి మాసైపోతున్నావ్, ఆడదానిని తక్కువగా అంచనా వేసే, ప్రతి మగాడూ, ఈ ప్రపంచంలో నీలాగే చావాలి. ఛస్తాడు...." కసిగా అంటూ మైత్రేయ చేతిలో వున్న అగ్గిపెట్టను తీసుకుని, పుల్ల గీసి వెలిగించింది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    రాజేంద్రకుమార్ అనుచరులు ఒక్కసారి మైత్రేయని, మొహితను చుట్టుముట్టేశారు.

 

    వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారని ఊహించని మోహిత వెంటనే తేరుచుకుని పిస్టల్ ని వాళ్ళ నలుగురివేపూ గురిపెట్టి,, ట్రిగ్గర్ ను నొక్కింది. చూస్తుండగానే క్షణాల్లో-

 

    ఆ నలుగురు అరుస్తూ కిందపడిపోయారు.

 

    అదే సమయంలో-

 

    కట్టు విప్పుకుని గంధం చెట్ల మధ్యనుంచి నదివేపు పరుగుతీశాడు రాజేంద్రకుమార్.

 

    ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా, దూరంగా పడి వున్న ఇనుపరాడ్ ని అందుకుని, అతని వీపుకి గురిచూసి విసిరింది మోహిత. ఆ రాడ్ అతని వీపులో బలంగా గుచ్చుకుపోయింది రక్తం ధారలు, ధారలుగా కారుతోంది.ప్రాణభయంతో చీకట్లో తుప్పల మధ్యనుంచి పరుగెడుతున్నాడు రాజేంద్ర కుమార్.

 

    ముందుకు పరిగెత్తబోతున్న మైత్రేయని వారించింది ఆమె.

 

    "వాడ్ని...... మనం..... చంపక్కర్లేదు...... మైత్రేయ....." అంటూ పక్కనే వున్న నిక్కీవేపు చూస్తూ-

 

    "నిక్కీ.... గో..... క్యాచ్ హిమ్..... కిల్ హిమ్...." అంటూ రాజేంద్రకుమార్ శరీరంలోంచి కారి, నేలమీద ఇంకుతున్న రక్తం దగ్గరకు తీసికెళ్లింది 'నిక్కీ'ని ఆమె.

 

    'నిక్కీ' అటూ, యిటూ తిరుగుతూ నేలను, రక్తాన్ని వాసన చూసింది.

 

    ఒక్కక్షణం వేడి రక్తం....

 

    రక్తం గడ్డకడుతున్న వేడిమట్టిని, కాళ్ళతో కసిగా దువ్వుతూ అటు యిటూ చూస్తోంది నిక్కీ.

 

    దూరంగా చీకట్లో పరిగెడుతున్న మనిషి...... అతని శరీరంలోంచి కారుతున్న రక్తం వాసన-

 

    భౌ.....భౌ....భౌ....

 

    ఒక్కసారి ఆవేశంగా భయంకరంగా అరుస్తూ ముందుకురికింది నిక్కీ.

 

    ఆ దృశ్యాన్ని చూస్తున్న మైత్రేయకి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన రక్తాన్ని మోహిత నిక్కీకి ఎందుకు ముందుచూపుతో తాగించిందో ఇప్పుడు స్పష్టంగా అర్థమయింది.

 

    రాజేంద్రకుమార్ ప్రాణభయంతో పరుగెడుతున్నాడు.

 

    తుప్పలమీద నుంచి, రాళ్లమీదనుంచి, ముళ్ళ కంపల మధ్యనుంచి.

 

    నల్లటి డేగలా, ఆవేశంతో లంఘిస్తున్న నిక్కీ ఒక్కసారిగా ఎగిరి, తన ముందుకాళ్ళను అతని వీపుమీద వేసి, వాడి అయిన పళ్ళతో మెడను కొరికింది.

 

    భయంకరంగా కేకపెట్టాడు రాజేంద్రకుమార్.

 

    వెల్లకిలా మట్టి దిబ్బలమీద పడిపోయాడు.

 

    బాధతో, భయంతో అరుస్తూ, మట్టిలో మోకాళ్ళతో ప్రాకుతున్నాడు.

 

    "నిక్కీ...... లీవ్...... మీ..... లీవ్ మీ" అరుస్తున్నాడు.

 

    ధారలు, ధారలుగా కారుతున్న రక్తం.

 

    శివమెత్తిపోతోంది నిక్కీ.

 

    ఒక్కసారి ఎగిరి, రాజేంద్రకుమార్ గుండెలమీద కూర్చుని, పంజాతో అతని ముఖమ్మీద కొట్టింది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    కావేరి నడికి అనుకుని వున్న మట్టిరోడ్డుమీదకు వరుసగా అయిదు జీపులు దూసుకుని వచ్చాయి.

 

    ఏ.సి.పి రమేష్ బాబు.... ఒక్క వుదుటున జీపలోంచి కిందకు దూకాడు. నదివేపు పరిగెడుతున్నాడు ఇంకొంతమంది పోలీసులు...... గెస్ట్ హౌస్ దిశగా పరుగెడుతున్నారు.

 

    పోలీసుల్ని చూసిన మోహిత-

 

     "మైత్రేయ...... మనం ఇక్కడనుంచి తప్పించుకోవాలి...... పద....." గెస్ట్ హౌస్ వెనక్కి రాళ్ళల్లోకి పరుగెత్తింది. ఆమె వెనక మైత్రేయ పరుగెడుతున్నాడు.

 

    గంధం చెట్లమధ్య, రొప్పుతూ ఇద్దరూ కాసేపు దాగున్నారు.

 

    దూరంనుంచి కాల్పులు కాలుస్తూ, గంధంచెట్లవేపు దూసుకొస్తున్న పోలీసుల బృందాలు.....

 

    "మైత్రేయ.... మనం ఇక్కడినుంచి ఎలాగయినా తప్పించుకోవాలి" అంటూ అటూ,యిటూ చూసి 'కమాన్' అంటూ ఎర్రమట్టి దిబ్బలవేపు పరుగెత్తిందామె.

 

    ఆమె వెనక మైత్రేయ పరుగుతీశాడు.

 

        
                                        *    *    *

 

    రెండే రెండు రౌండ్లు.....

 

    'నిక్కీ' ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

 

    "సేవ్..... మీ.... సేవ్ మీ......" అరుస్తున్నాడు రాజేంద్రకుమార్. ఏ.సి.పి. రమేష్ బాబు రాజేంద్రకుమార్ ని భుజాలమీద వేసుకుని వెనక్కొచ్చి జీపులో పడుకోబెట్టాడు.

 

    "వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు సార్! ఒక సబ్ - ఇన్ స్పెక్టర్ వెనక్కి వచ్చి చెప్పాడు.

 

    "ఈయన్ని అర్జంటుగా మైసూరుకు తీసికెళ్లండి" అంటూ వైర్ లెస్ సెట్ ఆన్ చేసి-

 

    హైవేలోని చెక్ పోస్టు ఆఫీసర్లకు, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇన్ ఫాం చేశాం రమేష్ బాబు

 

    జీపులు ఒక్కసారిగా సిటీకి బయలుదేరాయి.

 


                                            *    *    *

 


    పెద్ద పెద్ద పొదలమధ్య దాగున్న మోహిత వెళ్ళిపోతున్న జీపులవేపు రమేష్ బాబు జీపులో రక్తసిక్తమయిపోయి వున్న రాజేంద్రకుమార్ ని చూసింది. ఆమె రక్తం సలసలమని మరిగిపోతోంది.

 

    "బాస్టర్డ్, బతికిపోయాడు" అందామె.       
   

 Previous Page Next Page