"అతను పొలిటకల్ పేషెంటో, మెంటల్ పేషెంటో, నాకేం అర్ధం కావడంలేదు. వెతకండి పోస్టుమార్టం రూమ్ వెనకనున్న బావికూడా వెతకండి" అందరితోపాటు తనూ వెతకడం ప్రారంభించింది మేరీ. సరిగ్గా అరవై నిమిషాలు గడిచాయి.
ఆ విషయం తెలిసి మధురిమ కూడా కంగారుపడింది. సెక్యూరిటీ ని పిలిచి చేడామాడా తిట్టేసింది.భయపడుతూ.
"గోడదూకి వెళ్ళిపోయేడేమో" ఎవరో అన్నారు.
"ముందు అర్జెంటుగా పోలీసు రిఫోర్ట్ యివ్వండి. తర్వాత అన్ని చోట్ల వెతకండి" సీరియస్ గా చెప్పి తన రూమ్ లో కెళ్ళిపోయిందామె.
మరో రెండు గంటలు గడిచాయి.
మేరీ పరుగుపరుగున వచ్చింది.
"మేడమ్.... ఆఫోలిటికల్ పేషెంట్, అసెంబ్లీ దగ్గర గొడవ చేస్తుండగా ఫోలీసులు పట్టుకున్నారట."
"ఆ సెంబ్లీ దగ్గరకెందుకేళ్ళాడతను? వెంటనే వెళ్ళి అతన్నితీసుకురండి. డిశ్చార్జి చేసేసి, ఈ తలనొప్పి వదిలించుకోవాలి"నిశ్చయించుకుంది మధురిమ.
మరో పావుగంటకు ఇద్దరు పోలీసులు ఆఫోలిటికల్ పేషెంట్ ను హాస్పిటల్ కు తీసుకొచ్చారు.
"ఏమయ్యా హాస్పిటల్ నుంచి నువ్వెందుకు తప్పించుకున్నావు?" అడిగింది మధురిమ.
"స్వేచ్చకోసం... ప్రజ్కాస్బామ్య రక్షణకోసం.... రాత్రి నాకు ఓ కల వచ్చింది.. ఆ కల్లో ఒక వ్యక్తి ప్రక్షమై న్యాయబద్దంగా నువ్వెప్పటికీ మినిష్టర్ కాలేనని, ఆరునేలలపాటు మినిష్టర్ గా వేలగాలంటే వజ్రాయుధంలాంటి ఆయుధం ప్రభోధం ఒక్కటేనని ధర్మబోధ చేశాడు. అందుకే హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాను" ఆ ధైర్యంగా చెప్పాడతను.
"మరి ఆ సెంబ్లీ దగ్గరకి ఎందుకు వెళ్ళావు?"
అ మాటకి పెద్దగా నవ్వాడు ఆ ఫోలిటికల్ పేషెంట్. "అయ్యో పిచ్చితల్లీ! ఇంత చిన్నా విషయం నీకు తెలీదా? అన్ని మతాలబులూ జరిగేది అక్కడ రోడ్లమీదే తల్లీ, సాలభంజికల మేట్లేక్కేతే మనుషుల మనస్సులు మారిపోయినట్లుగా, అసెంబ్లీ లాబీల్లోకి అడుగు పెట్టడంతోనే ప్రతి ఎమ్మెల్యే తనుకూడా మినిష్టర్ అయిపోయినట్టుగా కలకంటాడు.
ప్రజాస్వామ్యం పరిరక్షణ, ఆత్మశోధన నినాదాలు అక్కడే పుడుతాయి తల్లి. నెత్తురుచుక్క నేలమీద పడకుండా రాజకీయ హత్యలు ఎలా చేయాలో అక్కడి గోడలు తెలియజేస్తాయి తల్లి. అవన్నీ నేర్చుకోవడానికే అక్కడికెళ్ళా" సీరియస్ గా చెప్పాడతను.
"నేర్చుకున్నావా?" అడిగింది సిస్టర్ మేరీ ఉక్రోషాన్ని అనుచుకుంటూ.
"ఎందుకు నేర్చుకోలేదు_ పూర్తిగా నేర్చుకున్నా.చూస్తుండు ఇరవై రోజుల్లో నేను మంత్రిని కాకపోతే నా పేరు బలిపరాంకుశమే కాదు."
"ఇరవై రోజుల్లో మంత్రివవుతావా! ఎలా?"
"ప్రస్తుతమున్న చీఫ్ మినిష్టర్ ని జిల్లా యాత్రల కోసం పంపిస్తా. అయన అటు వెళ్ళిపోగానే ఇటు నా వర్గం జనాలను కూడదీస్తా అంతే."
"అంతమాత్రంచేత వాళ్ళు నిన్ను మంత్రిగాఎలా ఎన్నుకుంటారయ్యా?"
"ఎన్నుకోరని నాకూ తెలుసు తల్లీ. వాళ్ళకి కావలసింది డబ్బు, అధికారమే కదమ్మా నన్ను సమర్ధించే ఎమ్మెల్యేలందరికీ, జిల్లాల్ని పూర్తిగా రాసిచ్చేస్తా. ఆ జిల్లాల్లో వచ్చే ఆదాయమంతా వాళ్ళదే. నాకొక్క పైసా అక్కర్లేదు. ఎలా వుంది నా అయిడియా?"
"వండ్రపుల్... మరి నీకో?"
"పిచ్చితల్లీ... రాజకీయం అంటే ఏమిటి? అంతా ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నట్లుగా, ప్రజల్నీ, పేపర్స్ నీ నమ్మిస్తూ మన పనుల్ని మనం చక్కబెట్టుకోవడం, నాకు హైదరాబాదు వుండి కదా దానిమీద వచ్చే రాబడి నాకు చాలు. టాంక్ బండ్ కి ఆ చివర, ఈ చివర గేట్లు కట్టిస్తా ఆ విగ్రహాల్ని చూడటానికి టిక్కెట్లు పెట్టిస్తా.
ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే బాంబుల తయారీకీ అనుమతిస్తా. ఇంటింటా సారా బట్టీల్ని, కుటీర పరిశ్రమల్లా నేలకోల్పాలని రూలు విధిస్తా. ఇదంతా బోల్డంత ఆదాయం కాదా?"
"మరి ప్రజలు... ప్రజా సంక్షేమం."
"పిచ్చి డాక్టరమ్మ... ప్రజా సంక్షేమం... ప్రజా సంక్షేమానికి మనం ఏమీ చెయ్యనక్కర్లేదు. రాష్ట్రంలో పర్యటించేసి ఆ ఫోటోల్ని పేపర్లో వేయించేసుకుంటే చాలు. ప్రపంచం మొత్తంమీద అల్పసంతోషలైన ప్రజలేవారు చెప్పు?" అన్నాడు.
"తేలీదు" అంది నవ్వుతూ మధురిమ.
"మన తెలుగు ప్రజలు" అని మధ్యలో ఆపి_
"అందుచేత వాళ్ళు పాపం మాటలకు, రెడియాలో వార్తలకు, టీవీల్లో ఫోటోలకు మొసపోతారు. వాళ్ళని దండలు వేయించుకోవడానికి, దండాలు పెట్టించుకోవడానికి వుపయోగించుకోవాలి.
అయిదేళ్ళకొకసారి ఓట్లను వేయించుకోవడానికే వాళ్ళ దగ్గర కెళ్ళాలి. ఈ లోపల వాళ్ళను మర్చిపోవాలి. అర్ధమైందా?" అన్నాడు అతను.
పిచివాడిలా కనిపిస్తున్నా ఆ పేషెంట్ వైపు సిరియాస్ గా చూసింది మధురిమ.
"ప్రజాస్వామ్యం జిందాబాద్" ఎలుగెత్తి, ఆనందంగా అరిచాడు ఆ ఫోలిటికల్ పేషెంట్.
* * * *
డోర్ తెరుచుకుని లోనికొచ్చింది. డాక్టర్ మధురిమ. హేండ్ బ్యాగ్ లోంచి పదివేల రూపాయలకట్టని తీసి టీపాయ్ మీద పెట్టింది. "ఈ డబ్బు మీ.దే మీ యిష్టం వచ్చినట్లుగా ఖర్చుచేసుకోవచ్చు"అందామె నవ్వుతూ.