సోదర కార్మికుల మంచి చెడ్డల గురించి, ఫ్యాక్టరీ బాగు గురించి తపనపడే సామంతేనా ఇతను...?
తనంటే, తన కార్యకలాపాలంటే అసహ్యించుకొనే ఆ సామంతేనా?
చెడును ఎంత త్వరగా..... ఎంత త్వరగా జీర్ణించుకున్నాడు!!
సత్యరాజ్ దీపక్ రాజ్ వైపు చూట్టం. రహస్యంగా కన్నుగీటి సామంత్ ను చూపించటం అంతా కొద్ది క్షణాలలో జరిగితే అదే కొద్ది క్షణాల్లో సత్యరాజ్ నిశ్శబ్దం సందేశాన్ని పోలీసు కుక్కలా పసిగట్టాడు సామంత్.
అసలు విషయాన్ని అందరూ కాసేపు మర్చిపోయారు. క్షణాల్లో సరస్వతి మందు పార్టీకి ఏర్పాట్లు చేసింది. ఎంత బలవంతం పెట్టినా సామంత్ చుక్క కూడా తాగలేదు. తెలివిగా తప్పించుకున్నాడు.
సరస్వతి మత్తెక్కిన చూపుల్నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సతమతమైపోతున్నాడు సామంత్.
అర్థరాత్రి పన్నెండు కావడానికి మరికొద్ది క్షణాలుందనగా తెచ్చుకున్న బాటిల్స్ ఖాళీ అయ్యాయి.
అందరి కళ్ళు నిషాతో ఎరుపెక్కాయి.
"ఆ భాగ్యరాజ్ గాడు నా కూతురు పేరా బిల్డింగ్ కొంటానని అడ్డమైన సమ్మెలన్నీ చేయించాడు నాతో.....వాడు కొనకపోవాలా నా తడాఖా చూపిస్తాను....." సత్యరాజ్ మాటలు తటబడుతున్నాయి. బూతులు ప్రవాహంలా వస్తున్నాయ్.
సత్యరాజ్ నోటివెంట కొన్ని వివరాల్ని, మరికొన్ని రాహస్యాల్ని, ఇతరుల అనుపానుల్ని ఆశిస్తూన్నాడు సామంత్ అలర్ట్ గా ఉండి.
సరిగ్గా ఇదే టైమ్ లో సరస్వతి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సామంత్ ని ఎలాగైనా తన పడకమీదకు లాక్కుని యూనియన్ సెక్రటరీ పదవికి గాలంవేసే పథకంలో సామంత్ పక్కకు చేరిపోయింది. పైటను నేర్పుగా పక్కకు తప్పించింది. ఈ రాత్రికి ఈ పార్టీ జరుగుతుందని, డానికి సామంత్ వస్తాడని ముందే తెలుసుకున్న సరస్వతి కావాలనే బ్రా లేకుండా పల్చటి జాకెట్ తో మాత్రమే వచ్చింది. పార్టీ మొదలవ్వగానే నేర్పుగా ఎవరికీ కనిపించకుండా జాకెట్ పై హుక్స్ రెండు తప్పించి సామంత్ పక్కకి చేరింది.
క్రమంగా తన మీదకు వాలిపోతున్న సరస్వతిని తప్పించుకుంటూనే దీపక్ రాజ వైపు చూస్తూ సామంత్ మనసులో అనుకుంటున్నాడు- వీడ్ని లేపేస్తే తప్ప తన మనుగడ కష్టం! రేపు తను తన అస్థిత్వంకోసం ఎదురు తిరగక తప్పదు అప్పుడు వీడు ముందుగానే పోలీసు కుక్కలా తన చర్యలను, కదలికను, ఆలోచనల్ని సత్యరాజ్ కి మోయకుండా ఉండడు. సత్యరాజ్ కి సగబలం వాక్థాటి అయితే మరో సగబలం ఈ నల్గురు. సరస్వతికి పదవి ఇచ్చి తనవైపు తిప్పుకోవాలి. అప్పుడు ఇక మిగిలేది ముగ్గురు ఆ ముగ్గురిలో హసీంఖాన్ ని తనవైపు తిప్పుకోవడం కొద్దిగా కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. ఇకపోతే దీపక్ రాజ్, లాల్ సింగ్ బిర్కులు. ఈ ఇద్దరూసత్యరాజ్ కి కుక్కలులాంటి వాళ్ళు. చచ్చినా సత్యరాజ్ ని వదలరు. పై పెచ్చు తన ఆలోచనలు తెలిస్తే నిర్దాక్షిణ్యంగా నరికి పారేసి దాన్ని తమ శత్రువులపైకి నెట్టగలరు.
కేవలం తన తమ్ముణ్ని ఇరికించతానికి కారంత్ అనే యువకుడ్ని నిర్దాక్షిణ్యంగా చంపిన నరరూప రాక్షసులు.
తన పథకం ఒక నిర్దుష్టరూపం దాల్చగానే పక్కకు తిరిగి సరస్వతిని చూసి అయిష్టంగానే ఆమె వీపుమీద చేయివేసి మృదువుగానిమిరాడు.
అంతలో సత్యరాజ్ మరలా పేలాడు. "ఆ సూట్ కేస్ భద్రంగా ఉందా?...." సత్యరాజ్ నోటివెంట ముద్దగా వస్తున్నాయి మాటలు.
సామంత్ ఆ మాటలు విని అలర్ట్ అయిపోయాడు. అతనిమెదడు చురుకుగా పనిచేసింది.
మిగతా ముగ్గురు దాదాపు అవుటయ్యారు.
"ఏ సూట్ కేస్ సాబ్.......?" సామంత్ గొంతుమార్చి అడిగాడు. సాహితి గుర్తు పడుతుంది. అప్పుడా భాగ్యరాజాగాడి పని పట్టొచ్చు__ జాగ్రత్త....." సోఫా ప్రక్కన జారగిలబడి వాగేస్తున్నాడు సత్యరాజు.
అదేదో తను తెలుసుకోవాలి దాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆ భాగ్యరాజ్ ద్వారానో, సాహితీ ద్వారానో సత్యరాజ్ కుడి, ఎడమ భుజాల్ని తెలివిగా వేరుచేయాలి.
తామే ప్రమాదకారులమని......తమను చూస్తే ఎలాంటివారైనా, ఎంతటివారయినా వణికిపోతారనుకుంటున్నా ఆ ఐదుగురికి తమ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఒకడు తయారవుతున్నాడనేది వారిఊహకే అందని విషయం.
ఒక మనిషి నన అవసరాలకి చెడగొట్టటం వరకే తన చేతుల్లో ఉండేది. ఒకసారి చెడుకు ఆ వ్యక్తి అలవాటు పడితే అందులోని మెలుకువలు తెల్సుకుని ముందుకు దూసుకు పోవటాన్ని ఎవరూ ఆపలేరు.
(హాజీ మస్తాన్, కరీముల్లాఖాన్ లాంటి బడా బడా స్మగ్లర్స్ సయితం చిన్నప్పుడు మంచేవారే. ఎప్పుడయితే ఇతరుల స్మగ్లింగ్ యాక్టివిటీస్ కోసం మార్చబడ్డారో, అప్పటినుండి-మనిషి నెత్తురు రుచి మరిగిన మేన్ ఈ టర్స్ లా అంతకంతకు విజృంభించి తమ గురువుల్నే తలదన్నే స్థితికి వెళ్ళారు. ఇక తరువాత నాయకత్వంపై వ్యామోహం పుడుతుంది. దాంతో పాత బాస్ ల్ని మర్డర్ చేయించి ఆ స్థానాల్లో కూర్చుండిపోతారు.
సత్యరాజ్ సిటీలో ఉన్న అన్ని రకాల పరిశ్రమల్లోని కార్మికులకి నాయకుడు. భూపతిరావు కార్మికుల డిమాండ్స్ ని అందరికన్నా ఎక్కువుగా తీర్చుకుంటూ రావటంవలన, సగంమంది యజమాన్యంవైపే ఉన్నారు. మిగతా సగం సత్యరాజు వైపున్నారు. ఆ యాజమాన్యం వైపున్న సగంమందిని తాన్ గ్రిప్ లోకి తెచ్చుకోవటం కోసమే సామంత్ ని బెదిరించి, చెడగొట్టి తన వైపుకు తిప్పుకొని నేషనల్ ఇండస్ట్రీస్ యూనియన్ వరకు నాయకత్వం అప్పగించాడు సత్యరాజ్.