Previous Page Next Page 
యోధుడు పేజి 40

    ఆ తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేయలేదు.

    యక్సిడెంట్స్కి కాశీచరణ్ గిరికాకాముందు_ అతనిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి డీల్లిలోని ఒకప్పటి తన అసిస్టెంట్ మాత్రమె.

    ప్రస్తుత పరిస్థితుల్లో అతని ద్వారా కాశీచరణ్ సంభదించి ఇంకేమన్నా ఇన్ ఫర్మేషన్ దొరుకుతుందేమోనన్న ఉద్దేశ్యంతో అతనికి ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నాడు నీలకంఠన్.

    టేబుల్ మీదున్న ఫాస్ట్ ను చూడనారంభించాడు. వచ్చిన ఫోస్టు లో ఆకర్షనీయంగా కనిపిస్తున్నా ఓ కవర్ని తీసి ఫ్రమ్ అడ్రస్ చూశాడు.

    మిస్ అర్చన_ లింగ్ షుగర్ .

    వెంటనే ఆ కవర్ని చింపి అందులోని మూడు పేజీల ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించాడు.

    "లాయర్ నీలకంఠన్ గారికి!

    నమస్కారం. నేనెవరో మీకు తెలియకపోయినా, ఉత్తరం కాశీచరణ్ మీ సంరక్షణలో వున్నాడని తెలిసి మీకీ ఉత్తరాన్ని రాస్తున్నాను.

    నాపేరు అర్చన" గబగబా ఆ ఉత్తరాన్ని చదవసాగాడు లాయర్ నీలకంఠన్.

    కాశీచరణ్ తో తన పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం_తనను కాశీచరణ్ పెళ్ళి చేసుకుంటాననడం, హైదరాబాదు కు బయలుదేరడం,అక్కడ హాస్పిటల్ లో చేరాకా తను ఉత్తరం రాయడం, తన అన్నయ్య అంకుష్ అతన్ని కలవడం, తానెవరో పరిచయం లేనట్లుగా కాశీచరణ్ మాట్లాడటం అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా రాసిందామె.

    "ఒక ఆడపిల్లగా, ఇప్పుడు నేనున్నా పరిస్థితి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అతన్నే నేను స్వయంగా నమాను. మేంపెళ్ళి చేసుకుంటామన్న విషయం మా రిలేటివ్స్ కి, ప్రెండ్స్ కందరకీ తెలుసు. ఇప్పుడతను నేనెవరో తెలీదని మా అన్నయ్యతో అన్నాడని తెలిసి నాకేం చేయాలో అర్ధంకావడంలేదు.

    మీరు నాకు న్య్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో నే ఈ ఉత్తరంరాస్తున్నాను. మీ ద్వారా కూడా నాకు న్యాయం జరగని పక్షంలో నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గంలేదు.

    మిమల్ని కలవమంటే మీ ఉత్తరం చూసుకుని నేను హైదరాబాదు వస్తాను. అర్చన..."

    ఆ ఉత్తరాన్ని చదివి తల పట్టుకుని కూర్చున్నాడు నీలకంఠన్. అతనికేం చేయాలో అర్ధంకాలేదు.

    కాశీచరణ్ కి అర్చన ఎవరో తెలీదు. తనని పెళ్ళి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అర్చన అంటోంది? దేని కేమిటి పరిష్కారం? హైదరాబాదు కి రమ్మనమని అర్చనకు ఉత్తరం రాస్తే? పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు లాయర్ నీలకంఠన్.
   
                        *    *    *    *   

    సరిగ్గా అదే సమయంలో_ హస్పిటల్లోని కాశీచరణ్ చేతుల్లో అర్చన రాసిన ఉత్తరం వుంది. అప్పటికే అతను ఆ వుత్తరాన్ని రెండుమూడుసార్లు చదివాడు.

    చరణ్ నన్ను అన్యాయం చెయ్యకండి. మనం ఏకాంతంగా గడిపిన సంఘటనల్ని ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోండి. హృదయావిదారకంగా రాసింది ఆ ఉత్తరం.

    బహుశా ఇంకో కాశీచరణ్ ని ఆమె ప్రేమించిదేమో! ఆ ఆలోచన రాగానే అతని మనసు తెలీకపడింది.

    మరికొద్ది సేపటికి తన రూమ్ లో కొచ్చిన మధురిమ కు ఆ ఉత్తరం యిచ్చాడు అతడు.

    "అర్చన నుంచి ఇంకో వుత్తరామా?" అంటూ ఆ వుత్తరాన్ని చదివిందామే.

    "ఆమె రాసిన ప్రతి విషయం చాలా కన్విన్సింగ్ గా వుంది. కానీ మరోసారి చెబుతున్నాను_ అర్చన ఎవరో నాకు తెలీదు. ఆమె ప్రేమించిన వ్యక్తి పేరు కూడా కాశీచరణ్ ఏమో?"

    "ఆమెను మీరు చూస్తె గుర్తుపట్టాగలరేమో" అతని వైపు చూస్తూ అడిగింది ఆమె.

    "అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా?"

    "లేదు. ఇలాంటి చికాకులేవీ వుండకపోతేనే మీరు అతి త్వరలో కోలుకునే అవకాశం వుంది అందుకని."

    "అయితే మీరు నాకో హెల్ప్ చేస్తారా?"

    "చెప్పండి"

    "ఆ అర్చనను హైదరాబాదు రమ్మనండి. నన్ను కలవమనండి" ఆ గొంతులో ద్వనించిన ఉద్రేకానికి ఆమె ఆశ్చర్యపోయింది.

    "ఈ విషయం గురించి లాయర్ నీలకంఠన్ తో మాట్లాడిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను లాయర్ తో మాట్లాడి వస్తాను" అంటూ బయటకెళ్ళింది డాక్టర్ మధురిమ.
   
                                                     *    *    *    *
   
    "ఆ అర్చనను హైదరాబాదు రమ్మంటున్నాడా? తనని కలవమంటున్నాడా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు  నీలకంఠన్.

    "ఏస్ లాయర్!" చెప్పింది  మధురిమ.

    "డాక్టర్ మధురిమా! అతనిప్పుడు అమ్నేషియా పేషెంట్. అతను కోలుకున్నాక మొదట తెలాల్సిందిఅతను సుశీల కొడుకు అవునా? కాదా? అన్నది. ఆ తర్వతే మిగతా విషయాలన్నీ. మేరీ అవసరమైతే ఆ అర్చనతో నేను మాట్లాడుతా. ఈ పరిస్థితుల్లో మీరు ఎంత త్వరగా అతన్ని షిప్ట్ చేస్తే అంత మంచిది" సలహా యిచ్చి ఫోన్ పెట్టేశాడాయన.

    అతని వాదనతో స్థిమితపడింది డాక్టర్ మధురిమ.
   
                            *    *    *    *
   
    ఒక్కసారిగా హాస్పిటల్ లో కలవరం రేగింది.

    ఒక జూనియర్ నర్స్ పరుగు పరుగునవచ్చి మేరీతో ఆ విషయం చెప్పింది_"పొలిటికల్ పేషెంట్ ఉదయంనుంచి కనబడంలేదు."

 Previous Page Next Page