Previous Page Next Page 
యోధుడు పేజి 39

    మీ రెసిడెన్స్ ఎక్కడో తెలిస్తే మీ ఇంటికొచ్చేసి విష్ చేసేవాడ్ని" ఎంతో హుషారుడ అన్నాడు కాశీచరణ్.

    "మేరీ! రెండు ప్రూట్ జ్యూస్ పంపించు. కమాన్ మిస్టర్ కాశీచరణ్!" అని తన ఛాంబర్ లోకి నడిచింది.

    "వెరీ నైస్.... వండ్రపుల్ ఇంటీరియర్ డెకరేషన్. మీ రూమ్ లోకి వస్తే ఒక హాస్పిటల్ లో వున్నట్టుగా వుండడు"

అన్నాడు కాశీచరణ్.

    "మరెక్కడా వున్నట్టుగా వుంటుంది" అనేసి నాలుక కరుచుకున్నాడు కాశీచరణ్.

    "మరీ అంత హుషారుగా వున్నారేమిటి? ఏమిటి విశేషం?" అని అడిగింది డాక్టర్ మధురిమ.

    "అంతా మీ చలవే... రాత్రి మీరు నాకు ఇంజక్షన్ ఇచ్చారో_ ఏమిటో?" అంటూ ఆమె కెదురుగా కుర్చీలో

కూర్చుంటూ అన్నాడు కాశీచరణ్.

    చప్పున మధురిమకు తన చేతిని అతను ఒడిసి పట్టుకోవడం గుర్తుకొచ్చింది.

    ఆ స్పర్శకు రాత్రి రవ్వంత డాక్టర్ల ఫీలైన మధురిమలో ప్రస్తుతం స్రీత్వపు భావస్పర్శ.

    తను ఇష్టపడుతున్న పురుషుడివైపు చూస్తున్నట్టుగా మధురిమ అతని ముఖంలోకి చూసింది.

    ఒత్తుగా పెరిగిన గెడ్డం,మీసం తీర్చిదిద్దిన పెదాలు, కండలు తేరిన భుజాలు, విశాలమైన ఛాతీ కొంపదీసి అతనిలో

అమ్నేషియా వ్యాధిపోయిందా? అదే ప్రశ్న వేసింది కాశీచరణ్ ని.

    "అదే పోతుంది. మీరున్నారుగా అన్నీ, పొగొట్టకోటానికి. ఇక మీదట ఒక్కక్షణం కూడా రూమ్ లో

వుండదలచుకోలేదు. నాకు హైదారాబాద్ అంతా తిరిగాలని వుంది. టాంక్ మీద పరుగెత్తాలని... జోకేసింది మధురిమ.

    "నేనెందుకు మనగడం... మా సోదరుడు మునిగి తేలాడు కదా?"

    "ఎవరా సోదరుడు?"

    "బుద్దుడు"

    ఆ జోక్ కి నిండుగా నవ్విందామె.

    "నవ్వండి. మీ నవ్వు చాలా బాగుంది. ఇది పొగడ్తకాదు, నిజం... నిజంగా నిజం" ఆ ప్రయత్నంగా కాశీచరణ్

నోట్లోంచి ఆ మాటలు వచ్చేశాయి.

    అతనివైపు సభ్రమంగా చూసిందామె.

    "సారీ! నేను అన్నదాంట్లో తప్పు ఏమైనా వుందా?" ఏమనలో తెలియక తల దించుకుంది మధురిమ. కాసేపటికి

తేరుకుని_ "మిస్టర్ కాశీచరణ్! మిమ్మల్ని కోన్నాళ్ళాపాటు ఈ హాస్పిటల్ నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ ఫార్ చేయాలనీ

అనుకుంటున్నాను."

    "ఎక్కడికి?!" ఆశ్చర్యపోతూ అడిగాడు.

    "నమ్మిశ్రగూడెం" చెప్పిందామె.

    "ఏం గూడెం మేడమ్?"

    "నమ్మిశ్రగూడెం."

    "అక్కడ వింత వింత ట్రైబల్ జతులున్నాయా?"

         "ట్రైబల్ జాతులా? భలేవారే. అది రిమోట్ విలేజేం కాదు. మా అక్కగారి ఊరు అక్కడ మీరు కొన్నాళ్ళు హాయిగా

వుండొచ్చు. మా అక్క, బావ, మా అక్క కూతురు కళ్యాణి అందరూ మిమల్ని ఏంతగానో ఆదరిస్తారు మీకేం

అభ్యంతరంలేదుకదా?"

    వెంటనే జవాబు చెప్పలేదు కాశీచరణ్. కాసేపయ్యాక నేమ్మదిగా ప్రశ్నించాడు_"నా మీద మీకేందికింత

అభిమానం డాక్టర్?"

    వెంటనే ప్రశ్న కాశీచరణ్ నోటివెంట వస్తుందని ఊహించని మధురిమ కలవరపడింది. అయిగే వెంటనే తేరుకుని

అంది "ఒక డాక్టర్ గా  నా బాధ్యత."

    "మీలాంటి మంచి మనిషి అభిమానాన్ని భగవంతుడు నాకీ అమ్నేషియా పట్టుకుని వస్తా" అన్నాడు అతను.

    "చిటికినవేలు పట్టుకుని వస్తారా?" విస్మనియంగా అడిగింది డాక్టర్ మధురిమ.

    అవునన్నట్లు తలూపాడతను.

    "చిటికినవేలు ఎప్పుడు పట్టుకుంటారో తెలుసా?"

    "తెలీదు" అన్నాడతను అమాయకంగా. అతనా మాట తెలిసి అనుమతే బాగుండుననిపించిందామెకు.

    "నమ్మిశ్రగూడెంలో ఏంట లేదన్నా ఒక నేల రోజులు మీరుండాలి. మీకు అవసరమైన బట్టలేమైన

కొనుక్కుంటారా?" అని అడిగింది.

    "భలే గుర్తుచేశారు... తీసుకోవాలి" అన్నాడతను.

    "అయితే ఓ పని చెయ్యండి. రేపో, ఎల్లుండో శివానందాన్ని తీసుకుని అబిడ్స్ వెళ్ళండి షాపింగ్ కి."

    "అలాగే! మీ అక్క, బావ, అక్క కూతురుకి ఏంత వయస్సు?" అని అడిగాడు అతను.

    "అక్క, బావలకు నలభై అటు ఇటు వుంటుంది. అక్క కూతురుకల్యాణికేమో_ అవునూ ఎందుకీ డిటైల్స్?"

అడిగింది ఆమె.

    "మీ బంధువుల దగ్గరకి నేను చేతులూపుకుంటూ వెళ్తే బాగుంటుందా?"

    "మీకేదైనా అవసరమొస్తే ఇమ్మని, లాయర్ నీలకంఠన్ గారు నాకు కొంత డబ్బిచ్చారు ఇమ్మంటారా?" అని

అడిగింది ఆమె.

    "రేపు అబిడ్స్ వెళ్ళేముందు తీసుకుంటాను" ఇంతలో ఓ డాక్టర్ చాంబర్ లో కొస్తే ఆ రూమ్ లోంచి బయటకు

వచ్చేశాడు కాశీచరణ్.

    డిల్లీలో ఒకప్పటి తన అసిస్టెంట్ కి ఫోన్ చేశాడు లాయర్ నీలకంఠన్. కాశీచరణ్ డిల్లీ నుంచి ఏ.పిఎక్స్ ప్రెస్ లో

హైదరాబాదు వస్తున్నట్లు ఏక్సిడెంట్ సంఘటనకు ముందురోజు అతను ఫోను చేసి చెప్పాడు,

 Previous Page Next Page