Previous Page Next Page 
కాలనాగు పేజి 40

    తల ఆడించింది ఆమె. రివ్వున చల్లగాలి వీస్తొన్నా ఆమె ముఖాన చెమటలు పడుతున్నాయి. అతని ధైర్యానికి ఆశ్చర్యపోతున్నది, అతని సాహసానికి, తెగింపుకినివ్వేరపడుతుంది. "చెప్పు!" అంది మళ్ళీ.
 
    'నేను వశీకరణం ప్రయోగించాను!'

    'నీకెలా తెలుసు?" కూతుహలంగా ప్రశ్నించింది.

    "నీకు తెలుసు న కిలాటివి ఏమీ తెలీవని. కానీ తెలిపిన ఓ గురువును పట్టేను. అయన వశీకరణ విద్యలో అఖండుడు, ఎన్నెన్నో  సాధించాడు. రాజవశీకర, స్రీ వశీకరణ, దైవవశీకరణ, భూతప్రేత పిశాచ వశీకరణ అన్నీ సాధించాడు_'

    "ఎవరు?" ఆత్రంగా అడిగింది.

    'వైద్యనాథన్ అని కేరళ మంత్ర శాస్ర్తవేత్త. త్రీవేడ్రంనుంచి ఎప్పుడో మనదేశం వచ్చాడు. అతనికి మలయాళ కుట్టి కూడా వచ్చు, అతను కాష్మోరా, రాష్మోకా దేవతలని మించిన షాక్మరా దేవతనికూడా వశీకరణ చేసుకున్నాడు_ట!'

    'ఊహూ' అంది ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. నిజానికి లోకంలో మంత్రాలున్నాయి, తంత్రలున్నాయి మంత్ర ప్రయోగానికి సంభందించిన తంతులే_ క్రియులే_ పనులే_తంత్రాలు. వాటితో మాములూ జనాన్ని అద్బుత లోకంలోకి తీసికెళ్ళచ్చు బెదిరించో, భయపెట్టో మన మార్గానికి తెచ్చుకోవచ్చు అనుకుంది.

    కానీ యీ వైద్యనాథన్ నిజంగా అంత మంత్రవేత్తా! అన్నా సందేహం ఆమె మనస్సు నుంచి తొలగిపోలేదు.

    పెద్దమ్మా!' అతనికి దత్తాత్రేయ మంత్రపటలంలో చేపిన అన్ని తంత్రాలు సిద్ధించాయి. వాటికి సంభందించిన అమ్జనాలు, తిలకాలు అన్నీ అయన సిద్దంచేసి వుంచుకున్నాడు' అన్నాడు భరోసాగా.
 
    "ఊహఁ " అంది మళ్ళీ తల నెమ్మదిగా ఆడిస్తూ.

    ఆమె తలాడిస్తూ వుంటే గాలికి రావి ఆకులూ కదలినట్టుగా, ఆ కదిలే ఆకులూ సర్ప శీర్శాల్లాగా అనిపించాయి నాగారాజుకి.

    అతని కోక్కక్షణం తన పెద్దమ్మా నగదేవతా అనే భావం మనసులో మెదిలింది. ఆ భవం వెంట భయం కదలాడింది. అయితే అదంతా ఒక్క క్షణం అంతే! నాగదేవత అయితే_తను నాగరాజు అనుకున్నాడు.

    'పెద్దమ్మా! సంధ్య నన్నెలా తిరస్కరిస్తోందో నీకు బాగా తెలుసు నన్నెంత నిర్లక్ష్యం చేస్తుందో తెలుసు. నన్నెంతగా హేళన చేస్తుందో తెలుసు. అలాటి సంధ్య యీ సాయంకాలం నాతో ఎంత బాగా మాటాడిందో తెలుసా? ఎంత ఆత్మీయత ప్రదర్శిందో తెలుసా?'

    'అంతా బాగా మాటాడిందా?' నవ్వుతూ అడిగింది.

    'అఁ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. పెద్దమ్మా! ఆ సమయంలో సంధ్య ఎలా ప్రవర్తిచిందో తెలుసా? నేను వద్దంటే సినిమాకే వెళ్ళనన్నట్టుగా మాటాడింది. నేను సినిమాకి వస్తానని ఒక్కమాట అంటే ఆ క్షణంలో నా కిష్టమైనా మూవీకి_ నే ధియేటర్ కి వచ్చేట్టుగా కనిపించింది" గర్వంగా చెప్పాడు నాగరాజు.

    విశాలాక్షి ముఖం పండువెన్నెల్లో కోడేత్రాచుని చూసిన నాగుబాము, పాడగా విప్పినట్టుగా వికసించింది.

    'రాజూ! సంధ్య పెళ్ళి జరగటం బొత్తిగా యిష్టం లేదు. ఆ మాటకొస్తే దాన్నల పెంచటమే నాకు సంధ్య చదువు సంద్యల విషయంలో నా మాట సాగలేదు.

    అయితే దాని ఫలితం విశ్వేశ్వరం, కనకదుర్గ అనుభవించారు.అనుభవిస్తున్నారు. కానీ పెళ్ళి ఆగదు అన్నప్పుడు ఆ జరిగే పెల్లెదావు నీతో జరిగిపోతే అదో సంతృప్తి" అందామె.
 
    నాగరాజు ముఖం పురివిప్పిన నెమలిలా అయింది. ఆమె "విశాల" హృదయానికి మనస్సులోనే ధనధాన్యాలు సమర్పించుకున్నాడు.

    "తప్పక నే నామేని పెళ్ళి చేసుకుంటాను!"

    ఆశీర్వదిస్తున్నట్టుగా చేయెత్తింది ఆమె.

    అది ఒక మహానాగం పడగవిప్పి చత్రంలాగా పట్టి, తన భక్తుల అభీష్టాన్ని నెరవేర్చే విధంగా ఆశీస్సులు కురియిస్తున్నట్టుగా వుంది.

    నాగరాజు మనస్సులో అనందం కడలి తరంగమే అయింది. అతనామేకి మనసారా నమస్కరించాడు.

    "ఏమిటో అంత దైర్యం?"

    "పెద్దమా! సంధ్య అంత బాగా ప్రవర్తించిందాన్నానే. కారణం తెలుసా? వైద్యనాథన్ గారుఎన్నో తంత్రాల్ని సాధించారు.

    మనం శిలంచ కర్పూరం పేషయేత్ కదళీరసే
    అనే నైవాటు తంత్రేణ తిలకం లోక మోహనమ్
 
    అనే తంత్రాన్ని అది దత్తాత్రేయ తంత్రంలో_ద్వితీయ పటలంలో చెప్పాబడిందట_ అయన సాధించారట. ఇది స్రీ వశీకరణ తంత్రమట!

    పెద్దమా! ఆ తంత్రంలో అంజనంలాటి తిలకాన్ని అయన తయారు చేశారు. దాన్ని ముఖాన_ కనుబొమల మధ్య ధరిస్తే కోరిన స్త్రీ మన వశం అవుతుందట_ ఆ పురుషుడికి అనుకూలంగా మొలుగుతుందట ఆ స్రీ.

    పెద్దమా! దాన్ని ధరించే ముందు ఆ మగవాడి మనస్సులో మరే భావమూ, మరెవరి కూడదట. తను ఏ స్రీనైతే బాగా ఇష్టపడి వశము చేసుకో దలచుకున్నాడో  ఆమె రూపాన్ని మనస్సులో నిల్చుకోవాలట!

    అప్పుడు నా మనస్సులో ఏ భవం లేదు. సంధ్య ప్రేమ తప్ప ఎవరి రూపమూ లేదు. సంధ్య రూపం తప్ప. నేను అయన చబుతూ వుంటే ఆ మత్రాన్ని ఉచ్చరిస్తూ, ఆయన నా బ్రూ మద్యలో ఆ తిలకాన్ని తీర్చిదిద్దుతూ వుంటే సంధ్య రూపాన్ని మనస్సులో నిల్చుకుంటూ వున్నాను.

    "అందుకే సంధ్య నాతో బాగా మాటాడింది"   గర్వంగా, గొప్పగా చెప్పాడు నాగరాజు.

    విశాలాక్షికి వైద్యనాథన్ ప్రక్రియలపై. నాగరాజు అదృష్టపరిస్తే తొలిసారిగా విశ్వాసం కుదిరింది.

    ఆమె మరోసారి అతన్ని అశీర్వదించింది.

 Previous Page Next Page