Previous Page Next Page 
కాలనాగు పేజి 41

                                                                          37


    ఆ సమయంలో సంధ్య ధియేటర్లో వుంది.

    మంచి ప్రేమకదని ఎంతో ఆసక్తిగా చూస్తొంది. కళ్ళు సినిమాకి వెండితెరకి అంకితమైన మనసు మాత్రం తన కాదనే స్మరిసో వుంది.

    ఆమెకి ఓ వైపు పూర్ణ కూర్చుంది. అ అమ్మాయి మూవీని తదేక దృష్టిలో, దీక్షతో, ద్యాసతో చూస్తొంది.
    మరోవైపు ఆదిత్య కూర్చున్నాడు. అతితే అతని కళ్ళు తెరకి అంకితమైన మనస్సు మాత్రం తన పరిస్థితుల చుట్టూ తిరుగుతున్నది.
 
    అంతలో యింటర్వల్! లైట్లు వెలిగాయి.

    తమ చుట్టూ వున్న మనుషుల్ని చూసింది సంధ్య ఆ బాల్కనీలో తమకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ ప్రయత్నంగానే హమ్మయ్య అంటూ నిట్టూర్చింది.

    అది గమనించాడు ఆదిత్య.

    'ఏం అలా వున్నావు?'

    ఏమీ లేదు. మనకి తెలిసిన వాళ్ళేవరయినా వచ్చారేమోనని చూశాను అద్రుష్టశాత్తూ ఎవరూ లేరు!'
 
    నవ్వేడు ఆదిత్య.

    'ఏమిటి నవ్వుతున్నావ్?'

    'మనకి తెలిననవాళ్ళు రాకపోయినా, మనం తెలిసినవాళ్ళు వచ్చి వుండవచ్చుగా?' అన్నాడు.

    'అంటే?'

    'సంద్యా! ఈ వూళ్ళో మనం అనామకులంకాదు. మా నాన్నగారు అందరికి తెలుసు నన్ను ఎందరో చూసి వుంటారు. అలాగే నువ్వోనూ పైగా నీ అందం, చందం. చీరకట్టు, నడక అన్నీ ప్రతివారీనీ ఆకర్షిస్తాయి, సంద్యా నువ్వు గమనించావో లేదో కానీ నువ్వు బజారికి వచ్చినప్పుడల్లా నిన్ను చూసినా మగవాడేవడయినా ఒక్క క్షణమయినా నిన్ను పరీశీలనగా చూస్తాడు!

    'ఎందుకు?' ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.

    'ఎందుకేమిటి? అందంగా వుంది, ఆకర్షిస్తొన్నా మనిషిని ఎవరు చూడరు?'

    ఆమె ముఖం పాలిపోయింది.

    'నువ్వు నలుగురిలో ఒకరిలా వుండవు. వందమందిలో ఒకరుగా వుంటావు. నిన్ను ఎంత మందిలో వున్న జనం గుర్తుపట్టేస్తారు!'

    'అదంతా నీ అభిమానం అంతే! జనాలకి యిమ్కేం పనుల్లెవా? ఈ సంధ్య ఎవరు? ఎక్కడ తిరుగుతోంది? ఎవరితో తిరుగుతోంది? ఈ విషయ సేకరనే కావాలా?' అంది ఉక్రోషంగా
 
    ఆదిత్య నవ్వేడు.

    'అదికాదు సంద్యా! మనం తప్పో ఒప్పో మనల్ని ఎవరూ చూట్టంలేదు కదా దైర్యంతో చేసేస్తూ వుంటాం. కానీ అది ఎవరో ఒకరు గమనిస్తారు_'

    అంతలో లైట్లు ఆరిపోయాయి.

    వ్యాపార ప్రకటనలకి సంభందించిన స్లేయిడ్స్ వేయటం మొదలెట్టారు ఇద్దరూ తమతోపాటు పూర్ణకూడా సినిమాకి వచ్చిందన్న విషయమే గమనించనట్టుగా మాటాడుకున్నారు యింతసేపూ!

    'ఏమిటి?' అంది పూర్ణ మెల్లిగా
 
    ఒక్కక్షణం పులికిపడ్డట్టుగా అయింది సంధ్య. తనూ, ఆదిత్యా మాత్రమే ధియేటర్లో వున్నట్టుగా ప్రవర్తించారు. మాటాడుకున్నారు! ఎంత భ్రమ!

    'మనల్ని ఎవరయినా చూశారేమో!'

    'ఏం చూస్తే?'

    'అదికాదు పూర్ణా! నేను సినిమాలకి రావటం యింట్లో ఎవరికీ యిష్టం లేదు. విశాలత్తమ్మ ఏవేవో చెబుతుంది ఉపన్యాసం లాగా! నీటి, నియమం, కట్టుబాటు, పరువు మర్యాద అంటూ ఏవేవో చెబుతోంది'

    'ఏం నువ్వేం పరువు తక్కువ పన్లు చెయ్యటం లేదే!

    'ఇలా సినిమాలకి_ షికార్ల కి_'

    సంద్యా! ఈ దియేటర్ కి యీ మూవీ చూడటానికి దాదాపు వెయ్యిమంది వచ్చారు వాళ్ళు చెయ్యని నేరం_ మనం చేస్తున్నామా? ఈ సినిమాకి ఎందరో వచ్చారు  ఆడామగా! అంతా భార్యాభర్తలేనా? ప్రెండ్స్ వుండచ్చు, అన్నాచెల్లెలు వుండచ్చు, తెలిసినవి వాళ్ళుండోచ్చు. అయినా సినిమా కలసి చూస్తే పోయేదేమీటిట?'
    సంధ్య జవాబువ్వలేదు.

    'సంధ్య! నువ్వేం పెళ్ళయిన దానివి కాదు. నీకు భర్త పిల్లలు, అత్తమామ అంటూ లేరు అతనూ పెళ్ళయినావాడుకాదు. అతనికీ భార్యా పిల్లలు అంటూ బాదరబందీ లేదు. మీ గురించి వాళ్ళు క్షోభపడతారు అనుకోవటానికి ఇద్దరూ స్నేహితులు, ఇప్పుడు ప్రేమికులు, పెళ్ళి చ్సుకావువాలని అనుకుంటున్నారు. మీకేం భయం?'

    సంధ్య మౌనం వహించింది.

    సంద్యా! నే నేప్పుడో చెప్పాలనుకుంటున్నాను. అయినా నువ్వు తెలుసుకుంటావులే అని ఆగెను ఈ లోకంలో ఎప్పుడూ ఎవరో చూస్తారు ఏదో అంటారు, విమర్శిస్తారు. అని క్షణం క్షణం భయపడుతూ చస్తూ బ్రతికే దానికంటే నరకం వుండదు అయినా తప్పో ఒప్పో అది మనకి సంభందించింది కాదు వ్యవస్థని తారుమారు చేసేది కాదు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు_'

    "థాంక్స్!" అంది సంధ్య. ఆమెకి పూర్ణ మాటలు బ్రెయిన్ వాష్ లాగా అనిపించాయి.

    'సంద్యా!" నీకో రహస్యం చెప్పనా! నేనూ ప్రేమించాను. అడిరిపావుకు. మాబావనేలే! యింకెవర్ని కాదు. అతనికి పెళ్లయింది పెల్లయిఉన వ్యక్తిని ప్రేమించటం ఏమిటి ట్రాష్ అనద్దు. అది న అదృష్టం. తలరాత అనను, కర్మ అనను. ఎందుకంటే ప్రేమించటం ప్రేమించబడటం ఓ మహత్తరయోగం అని భావిస్తాన్నేను'

    'స్లేయిడ్స్ చూడనివ్వవా? నవ్వూతూ అంది    'ఏం కొంప మునిగిపోదు. సినిమా చూడనిస్తాలే. విను... నువ్వు చెప్పింది నే వినతంలా?

    "అయితే త్వరగా చెప్పు. ఏదో డాక్యు మెంటరీ చూపుతున్నారులే?

    "మేం పెళ్ళి చేసుకున్నాం_ అదీ రిజిస్టార్ అఫేసులో. పెళ్ళయిన అతను భార్య వుండగా, ఆమెతో విడాకులు తీసుకోకుండా పెళ్ళి చేసుకోవటం నేరం. నాదీ నేరమే! కానీ తప్పదు మా పెళ్ళి నిలవకపోవచ్చు వాలిడ్ కాకపోవచ్చు. కానీ మాకు పెళ్ళయింది. మేం భార్యాభర్తలు. చాలాసార్లు ఎక్కడెక్కడో కలుసుకుని భార్యాభర్తల్లా జీవించాం.

 Previous Page Next Page