Previous Page Next Page 
కాలనాగు పేజి 39

    అది ఎండుటాకుల మీద జాతినాగు సర్రున జారిపోతున్నట్లుగా వినిపిస్తోంది. ఆ సవ్వడి వినే వాళ్ళకి వేణుగానం కొండ కొమ్మున నుంచి జారి, మహావృక్షాల దూరి, సెలయేళ్ళ మీదుగా తేరి, స్పందించే సహృదయ శ్రోతల లోకాల్లోకి పారినట్లుగా వుంది.

    ఇంట్లో ప్రవేశించారు నాగరాజు.

    ఆ సమయానికి విశ్వేశ్వరం పూజ మండపం ఎదురుగ కూర్చుని కాలభైరవవాష్టకం బిగ్గరగా పఠిస్తున్నాడు.

    అతనికి కొద్ది దూరంలోనే కూర్చున్నఅతని భార్య కనక దుర్గమ్మ దేవీ స్తోత్రం పఠిస్తోంది లోగోంతులో.
 
    విశాలాక్షి మంద్ర స్వరంతో కాలభైరవ వాహ్స్త్కం చదువుకుంటున్నది. ఆమె పూజకి వత్తులు చేసుకుంటున్నది.
 
    ఇల్లు అదో విధమైన 'భక్తీ' వాసన వేస్తున్నది.

    వాకిట్లో నుంచున్న నాగరాజు ఒక్కసారి వాతావరణాన్ని  పరిశీలనగా చూశాడు.

    ఈ మనుషుల మధ్య యీ వాతావరణంలో పెరిగిన సంద్యకి అన్నీ చాందన భావాలే వుండటంలో వింతేముంది? ఆమె మనస్సులో అన్నీ పూజలు_ పురస్కారాలే వుంటాయ్ మో!

    ముందు యీ వాతావరణం నుంచి తప్పించాలి" అనుకున్నాడతను సంధ్య తనది. ఆమె బాగోగులు తనవి అనుకోగానే అతని కాదో విధమైనా తృప్తి కలిగింది.

    'రాజ!' మెల్లిగా పిలిచి, లేచి వచ్చింది విశాలాక్షి.

    ఆమెకి అతన్నా సమయంలో అక్కడ చూడగానే ఏదో ఊహా ప్లాష్ లాగా వెలిగింది.

    అతనతూ ఇటూ చూశాడు.

    'సంధ్య యింట్లో లేదు!' అంది మెల్లిగా

    'తెలుసు!' అన్నాడు సంధ్య విషయం తనకి తెలీదాన్నట్టు 'ఎక్కడికి వెళ్లిందో తెలుసా?'

    'ఆఁ తెలుసు. సినిమాకి!' ఇంకా భరోసాగా చెప్పాడు

    'ఛ! వెధవ!' ఈసడించుకుంది విశాలాక్షి

    'పెద్దమా!'ఆశ్చర్యపోయాడు. 'ఎందుకంత' ఏహ్యభావం?' అడిగాడు ఆమె మనస్సు గ్రహించలేక.

    'ఎవరితో వెళ్లిందో తెలుసా?'

    'అఁ అన్నపూర్ణ అని సంధ్య ప్రెండ్!' అలక్షణంగా జనాలిచ్చాడు.ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా.

    చలగా వీస్తున్నది గాలి పైని వెన్నెల వీణ శృతిచేసి రాగాలాపనచేసినట్టుగా మనో మోహనంగా వర్షిస్తున్నది.

    అయినా విశాలాక్షి మనస్సు కుతకుతలాడి పోతున్నది.

    'వెధవ్విరా నువ్వు! అందుకే సంధ్య దృష్టిలో అంతహినుడి వయ్యావు. అది అన్నా పూర్ణతో వెళుతున్నాని చెప్పగానే నేవు వెధవలా తలాడించి వచ్చేశావు.

    ఒరే!రాజూ. అది ఖచ్చితంగా ఆదిత్యతోనే కలసి సినిమాకి వెళ్ళి వుతుంది నీకు తెలీదు. సంధ్య మనస్సుని అతనెంతగా ఆక్రమించుకున్నాడో_ మన ఊహకి అందదు.

    కానీ సంధ్య ఊహలు, ఆలోచనలు, ఆశలు అన్నీ ఆదిత్య చూట్టూ తిరుగుతూ వున్నాయి"

    పక్కున నవ్వేడు నాగరాజు.

    'ఏమిటి పెద్దమా! నన్నింత వెర్రి వెధవని చేశావు నేనేం పూర్కేలేను తెలుసా? న పద్దతిలో నేను కృషి చేస్తున్నాను!' అన్నాడు.

    'ఏం చేస్తున్నావు? వెకిలి_వెర్రి వేషాలు వేయటానికి నేనేం బుద్ధిలేని వాడివి తగిన కరణం వుంది నేను ఆమె ఏదో ఊహాలో వుందని భ్రమించి చేయమట్టుకున్నా దాంతో ఆమెకి కోపం వచ్చింది'

    'నీ చెంప చేళ్ళుమంది అవునా! ఒరే! వెర్రి వెధవులా ప్రవర్తించావు నువ్వు. నాకేం సరిపోలా నీ పద్దతి.
మగాడైనవాడు ఓ ఆడదానిపై మనసుపడితే దాన్ని ఎలాగైనా సామదాన బెద దందావుపాయలూ పాటించినా తప్పు లేదు_'
 
    "ఏం చెయ్యాలి పెద్దమ్మా?' కూతుహలంగా అడిగేడు.
 
    "నీరు నిజంగా వెర్రి వెధవా? లేకపోతే తనని అత పట్టిస్తున్నాడా?"  అనుకుంది ఆమె. ఒక్క క్షణంపాటు అతన్ని నిశితంగా పరిశీలించి చూసి "సంధ్యని బలవంతముగా పెళ్ళిచేసుకో _" అంది.

    "ఎలా?"

    "ఎత్తికెళ్ళు_ ఏ గుళ్ళోనో మూడుముళ్ళు వెయ్_"

    "సంధ్య విషయం నీకు తేలేదు_"

    అతన్ని నోరెత్తకుండా "అక్కడికి మహా నీకు తెలిసినట్టు_ ఆడంగి వెధవా!" అంటూ తిట్టింది విశాలాక్షమ్మ.
    పడగపై దెబ్బతిన్న పాములా చివ్వున తలెత్తాడు అతను.

    "పెద్దమ్మా! నా పేరు మరచిపోయావా! నేను నాగారాజుని. పగబడితే అంతుచూసేదాకా వదల్ను.  నాకు అదిత్యపై పగ వుంది. పట్టుబట్టేనా ఫలితం సాధించేదాకా వదల్ను. నేను సంధ్యని పెళ్ళాడి తీరతాను."

    "సంధ్యని పెళ్ళాడతావు! నే చూడనూ!" హేళనగా అంది. ఆమె పెదాలు వంకర తిరిగాయి. "అదంతసులువు కాదురా అబ్బాయ్! సంధ్య మహా మొండిది_.

    "పెద్దమ్మా నాదస్వరం వూదితే నాగుపామే ఆడుతుంది. మంత్రం వేస్తె మహా సర్పమే కట్టుబడి పోతుంది. గుంజకికట్టేస్తే మహామహ ఏనుగులే లొంగి వస్తాయి. సంధ్య అనగా ఎంత?'

    "మంత్రం వేస్తావా?"

    అతను జవాబువ్వలేదు.

    "మాయ చేస్తావా?"

    "... ... .. ...?"

    "కనికట్టు చేస్తావా?"

    ".. .. .. ..?"

    'వశీకరణం ప్రయోగిస్తావా?'

    'అవును'!' చప్పున అన్నాడు నాగరాజు.
 
    ఆ సమాధానానికి నివ్వెర పోయింది విశాలాక్షి. ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. చూపు తీవ్రమైంది అతన్నె పరిశీలనగా చూసింది.

    'పెద్దమ్మా! ఓ రహస్యం చెప్పనా?"
 

 Previous Page Next Page