Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 40


    ఇండియన్ ఎక్స్ ప్రెస్ రంగంలోకి దిగకముందు ఆర్ధిక శాస్త్రజ్ఞుళ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 1986లో40  శాతం అమ్మకాలలో అభివృద్ధి సాధిస్తే అది 1977, 1988, 1989కి 200 శాతానికి పెరుగుతాయని, 3,000 కోట్ల రూపాయల వ్యాపారస్థాయికి కంపెనీ ఎదుగుతుందని, భారతదేశ వ్యాపార  చరిత్రలో ఇదే  సరికొత్త అధ్యాయాన్ని రాయిస్తుందని ఇలా ఎదుగుతూ మిగతా పథకాలు కూడా ఫంక్షనింగ్ లోకి వచ్చి అంబానీని పూటకు గతిలేని స్థాయినించి ప్రపంచ పెద్ద  ప్రయివేటు ప్రపంచ వ్యాపార చరిత్రలో చోటు చేసుకుంటుందని అంచనా వేసారు ఇండియాన్ ఎక్స్ ప్రెస్ రంగంలోకి దిగటంతో అంబాని విధి వక్రించింకోండి, అది వేరే కథ.
    సినిమాల్లో నవల్లోనే, నవల్లోనే కాదు నిజ జీవితంలో ఒకే  ఒక వ్యక్తి ఎంత పెద్ద డ్రామా నడిపాడు....?
    ఈ పోలియస్టర్ ఫైబర్ ప్లాంట్ డ్రామా ముందు ముందు  నవల్తో మిక్సప్ అయివస్తుంది.

    
                                                                     *    *    *

    చూస్తుండగానే సామంత్ సత్యరాజ్ కి సరెండర్ అయిపోయాడు. మనసులో మాత్రం సత్యరాజ్ మీద తీవ్రమైన పగ పెంచుకున్నాడు.....అదను చూసుకొని అధఃపాతాళానికి తొక్కేవరకు నిద్రపోరాదు అనుకున్నాడు.
    సామంత్ తమ్ముడు హత్య జరిగిన స్థలంనుంచి సురక్షితంగా బయటపడగలిగాడు. ఒక్కొక్కటి సామంత్ కి అనుకూలంగా జరిగిపోతున్నాయి.
    సామంత్ ఆలోచనల్లో, అలవాట్లలో తీవ్రమైన మార్పులొచ్చాయి.
    సామంత్ ని అడ్డం పెట్టుకొని భాగ్యరాజ్ ద్వారా సత్యరాజ్ ఆడాలనుకుంటున్న డ్రామా ఒకటి సత్యరాజ్ ని అడ్డం పెట్టుకొని భాగ్యరాజ్ ఆడాలనుకొనే డ్రామా  వేరు. వీళ్ళిద్దర్ని సమయం చూసి తొక్కేసి తనో డ్రామా  ఆడాలనుకొనే సామంత్ అంతరంగం వేరు.
    మరుసటి రోజుకు సామంత్ ఏ ఎలక్షన్స్ లేకుండానే నేషనల్  ఇండస్ట్రీస్ టెక్స్  టైల్ యూనిట్స్ కి లేబర్  నాయకుడయిపోయాడు.
    క్షణాల్లో మిస్టర్ 'ఎల్' ఆ వివరాల్ని దినేషుకి అందించాడు.
    ఆ సమాచారం అందిన పది నిమిషాలకే  భూపతిరావు హాల్లో ఆయన ముందు సమావేశమయ్యారు మిస్టర్ 'ఎల్', దినేష్, మిస్టర్  'ఎమ్.'
    చాలా సేపటినుండి సీరియస్ గా పచార్లు చేస్తున్న భూపతిరావు కిటికీ రెక్కదగ్గర ఆగిపోయాడు "ది స్టన్నింగ్ రియల్ లైఫ్ డ్రామా స్టార్ట్సు, కోట్లకు అధిపతిని, అయినా ఒక సాధారణ కార్మికుడు యూనియన్ లీడరయి తీసుకోబోయే నిర్ణయాలపట్ల అందోళన చెందటం చిత్రంగా ఉంది...." అంటూ బిగ్గరగా ఆ హాలు ప్రతిధ్వనించేలా నవ్వాడు.
    అక్కడున్న ముగ్గురూ ఉలిక్కిపడ్డారు. నవ్వుతూనే వున్నాడు భూపతిరావు.
    ఉన్నట్టుండి నవ్వడం ఆపి హాలు మధ్యకు వచ్చి మిస్టర్  'ఎల్' వైపు చూస్తూండిపోయాడు.
    "సామంత్ అనే అతను యూనియన్ లీడరయ్యాడన్నమాట?" భూపతిరావు పట్టిపట్టి అన్నాడు.
    "అవును సార్! దీని వెనుక సత్యరాజ్ హస్తముంది....." ఇంకా  చెప్పమన్నట్లు చూసాడు భూపతిరావు.
    "సామంత్ చాలా మంచివాడు సార్! కష్టించి పనిచేసేవాడేగాని కబుర్లు చెప్పేవాడు కాదు. తన సోదర కార్మికవర్గ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో వ్యవహరించేవాడు. అందుకే ఓవర్ నైట్ అతను లీడరైనా అందరూ తమ  హర్షామోదాలు వ్యక్తంచేసి  అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు......"
    "రాజకీయాలకు దిగేముందు, యూనియన్ లీడరయ్యేముందు. ఉద్యోగాల్లో చేరేముందు మనుష్యులందరిలో నిజాయితే  ఉంటుంది. ఆ తరువాత దా స్వరూపాలు మారెది. ఇంతకి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ సమ్మెను కొనసాగించాలనా?"
    "అతను మంచివాడే. అయినా  వెనుక వున్నది సత్యరాజ్ కనుక అతనే పథకంలో ఉన్నాడో తెలియలేదుసార్....."
    "యూనియన్ లీడరయిన తొలిరోజులలో మంచిపనుల కోసమే పాకులాడుతారు___నిజాయితీ ఇంకా  అప్పుడే చావదు కనుక తోటి కార్మికులు తనను  నమ్మాలిగనుక దానికోసమైన పెద్ద  సమ్మెల జోలికి అప్పుడే వెళ్ళరు...." భూపతిరావు తన ఎనాలిసిస్ చెప్పుకుపోతూ ఓ క్షణం చటుక్కున ఆగిపోయాడు.
    "వెంటనే సత్యరాజ్ ని పిలిపించు......నేనతన్ని కలవాలి........" అంటూనే  లోపలకు వెళ్ళిపోయాడు భూపతిరావు.
    ఆ ముగ్గురూ తృళ్ళిపడ్డారు. భూపతిరావు వెళ్ళినవైపే అయోమయంగా చూస్తుండిపోయారు. ఆ నిర్ణయాన్ని నమ్మలేక పోతున్నారా ముగ్గురు. సరయిన కారణం లేనిదే ఏ నిర్ణయానికయినా రాడనే ఓ గట్టి నమ్మకం. ఆయన ఎప్పుడు ఏది చేస్తాడో ఎందుకు చేస్తాడో ఎవరికీ తెలియక పోయినా ఆయన మాత్రం సాధారణంగా తప్పదనే నమ్మకం ఉంది.
    తండ్రి తీసుకున్న నిర్ణయానికి దినేష్ కి పట్టరాని కోపమొచ్చింది.
    "ఆ బాస్టర్డ్......వాడ్ని చర్చలకు పిలవాలా? వాడ్నసలు ఇంత కాలం బతకనివ్వటమే తప్పు ఎప్పటికప్పుడు నాన్నగారే ఆపుకుంటూ వస్తున్నారు...." దినేష్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
    సరీగ్గా  అదే సమయంలో యూనియన్ ఆఫీసు ముందు సామంత్ లీడరయిన తదుపరి తమను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమానికి వేలాది మంది కార్మికులు తరలి వస్తున్నారు.
    యూనియన్ ఆఫీసు ముందు కోలాహలంగా వుంది. అంతకంతకు ఖాకీ చొక్కాల ఒరిపిడి ఎక్కువవుతోంది. ఆఫీసు ముందువేసిన స్టేజీకి నలువైపులా సామంత్ జిందాబాద్......కార్మిక నాయకుడు సామంత్  వర్థిల్లాలి.....కార్మిక సమైక్యత జిందాబాద్.....నీతినిజాయితే ప్రాణమయిన సామంత్ లాంగ్ లివ్......అనే బ్యానర్స్  కలకలలాడిపోతూ పైకి లేచాయి.
    కేవలం ఇరవై ఐదేండ్లకే కొన్ని వేలమందికార్మికులకు లీడరైన సామంత్ ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రెస్  రిపోర్టర్స్  కెమెరాలతో అప్పటికే సిద్ధమయ్యారు.
    సత్యరాజ్ సరస్వతిని తనివితిరా తనకేసి అదుముకుంటూ మహదానందంలో వున్నాడు. బయట హల్లో హసీంఖాన్, లాల్ సింగ్ బిర్క్, దీపక్ రాజ్ లు కొందరితో మంతనాలు జరుపుతున్నారు.
    "నన్ను మీరే వాడుకోవచ్చుగా.....ఆ చచ్చు పీనుగా దీపక్ రాజ్ కి అప్పజెప్పారెందుకు?" జాకెట్  హుక్స్ విప్పుకుంటూ నిషా కళ్ళను పై కెత్తి అంది సరస్వతి.
    "ఏం.....వాడంత తృప్తినివ్వటంలేదా?" సత్యరాజ్ నోటివెంట బూతుమాటలు వరదప్రవాహంలా వస్తున్నాయి.
    "ఊహు.....వాడికి  బుర్ర  పనిచేసినంతగా నడుం పనిచేయదు" చీరెను బెడ్ క్రిందకు విసురుతూ అంది.
    "అప్పుడే తేడా తెలుస్తుంది. ఆ తేడాలో వున్న ఆనందం తెలుస్తుంది."

 Previous Page Next Page