సాయంత్రం నాలుగుగంటలు-
సోఫాలో జూలు కుక్కపిల్లతో ఆడుతోంది అన్నపూర్ణమ్మ.
డ్రెస్సింగ్ మిర్రర్ లో తల దువ్వుకుంటోంది అన్విత.
ఆ సమయంలో ఆమె నైటీలో వుంది.
బ్రా వేసుకోకపోవడం వల్ల, పల్చని నైటీ ఆమె అందాలను దాచలేకపోతోంది.
"పార్టీలూ, ఫ్రెండ్స్ ఎక్కువైపోయినట్టున్నారు....." అంది అన్నపూర్ణమ్మ.
"తప్పదు కదా!"
"తప్పదు. ఓకే. ఫోన్లో ఆ రవి అంతసేపు ఏం మాట్లాడాడు?" అడిగిందామె.
"మొన్న పార్టీలోంచి మధ్యలో వచ్చేశాను" చెప్పింది అన్విత.
"ఈ కుక్కపిల్లవైపు చూసింది అన్విత.
అన్నపూర్ణమ్మ చేతివేళ్ళను నాకుతోంది ఆ కుక్కపిల్ల.
"మగవాళ్ళు చేతివేళ్ళను నాకుతోంది ఆ కుక్కపిల్ల.
"మగవాళ్ళు కుక్కపిల్లలాంటి వాళ్లు - తాడేసి కడితే, ఓకేచోట వుంటారు. లేకపోతే నెత్తినెక్కుతారు. ఒక్కసారి నెత్తినెక్కించుకుంటే, కిందకు దింపడం చాలా కష్టం జాగ్రత్త."
అన్నపూర్ణమ్మ మగవాళ్ళ గురించి హెచ్చరించడం ఇదే మొదటిసారి.
"కొత్తగా మాట్లాడుతున్నావు...." అందామె.
"అవును..... ఆ రవి, నిన్ను ఇష్టపడుతున్నాడనుకుంటాను. డాక్టర్ పరశురాయ్ నేరుగా నీ రూమ్ కే వచ్చి, గంటల తరబడి మాట్లాడుతున్నాడు. నీ ఫ్రెండ్ మధు...... నువ్వు లేనప్పుడు రెండుసార్లు ఫోన్ చేశాడు. ఇంకో పక్క అనురాగ్..... నిన్ను పెళ్ళి చేసుకుంటానని డైరెక్ట్ గా చెపుతున్నాడు. వీళ్ళందరికన్నా... ఆరోజు వచ్చాడు.... ఆ కరెంట్ కుర్రాడు, అతను నయం. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు" అంది అన్నపూర్ణమ్మ.
రోడ్డు బయట అంబాసిడర్ కారులో కూర్చుని మాటలు వింటున్న తేజ, అన్నపూర్ణమ్మ తన ప్రసక్తిని తీసుకురావడంతో ఎలర్ట్ అయ్యాడు.
"నీకు ఆ తేజ నచ్చాడ?" అంది అన్విత.
"అవును."
"ఎందుకని?"
"మనిషిని చూస్తే తెలిసిపోతోంది. ఎవరి మంచో, ఎవరు చెడో."
"తేజ మంచివాడా?"
"మంచివాడని నేను చెప్పానా? అటూ ఇటూగా మగవాళ్ళందరూ ఒకటే. మరో ఆడదాని దగ్గర పెళ్ళాన్ని అమితంగా ప్రేమించే కొంతమంది భర్తలు కూడా ఎందుకంత ప్రేమ వ్యక్తం చేస్తారో తెలుసా?"
"ఎందుకు?"
"మరో ఆడది కావాలని వాళ్ళకు కోరిక వున్నా, ఆ ఆడదాన్ని పట్టుకోవడం వాళ్ళకు తెలీదు."
"వీళ్ళలో ఎవర్నయినా నువ్వు ప్రేమిస్తున్నావా?" సూటిగా ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ.
"తెలీదు" అంది అన్విత.
"అంటే?!"
జవాబు చెప్పలేదు అన్విత.
* * *
మాటలు వినిపించకపోవడంతో, తేజా బైనాక్యులర్ తీసుకుని, కిటికీవైపు చూశాడు.
అద్దం ముందు నైటీ బటన్స్ విప్పుతోంది అన్విత.
అర్థనగ్నంగా కనిపిస్తున్న ఆమె అందాలను చూస్తున్న తేజ శరీరం వేడెక్కుతోంది.
ఇంకా స్పష్టంగా పక్కకి తిరిగి, జూమ్ ని తీసి ఎడ్జస్ట్ చేసి, మళ్ళీ ఆ కిటికీకి ఎయిమ్ చేశాడు.
ఇప్పుడు అద్దం ముందు అన్వితలేదు.
అన్నపూర్ణమ్మ ఎందుకో అద్దం ముందుకొచ్చి నిలబడింది.
"ఛా....! మంచి ఛాన్స్ మిస్సయింది" నిరాశగా అనుకున్నాడు.
అన్విత రూపమే అతని కళ్ళముందు మెదులుతోంది.
మరి అక్కడ వుండలేకపోయాడు.
నేరుగా ఆఫీసుకొచ్చాడు.
రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుని ఆలోచించసాగాడు.
అతని కళ్ళముందు అన్విత రూపం....
పచ్చటి దేహ ఛాయలో మెరిసిపోతున్న దేహసంపద, అణువణువు కోరికను రగిల్చే కసితనం.
మగాడికి ముద్దివ్వడం కోసమే తీర్చిదిద్దినట్టుగా వుండే ఎర్రటి పెదాలు.
ఒక్కసారి.....
ఒక్కసారి....
ఆ ఎర్రటి పేదలను ముద్దుపెట్టుకుంటే....!
జన్మ ధన్యమైపోతుంది.
పెదాలేమిటి?
ఆమెనే సొంతం చేసుకుంటే....
ఆ ఆలోచన మనసులోకి ప్రవేశించగానే తేజ శరీరం కరెంట్ షాక్ కు గురైనట్టుగా అయిపోయింది.
అవును.....
అవును....
అన్వితను తను సొంతం చేసుకోవాలి.....!
ఎలా.....?
"ఎలా.....? ఎలా......??
అనేఇతను ప్రేమిస్తూ, చుట్టూ తిరుగుతున్న వ్యక్తులను పక్కకు తప్పించాలి.
ఎలా.....? ఎలా.....?
ముందు మధుని డైవర్ట్ చేయాలి! తరువాత ఒక్కొక్కర్నీ.....
అన్వితతో తను ఇంటిమసీని పెంచుకోవాలి.
ఆ ఆలోచన్లను కట్ చేస్తూ, అసిస్టెంట్ రూమ్ లో కొచ్చి తేజని విష్ చేసి తను టైపు చేసిన పేపర్స్ ని అతనికి అందించింది.
అన్విత చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల వివరాలు.... అంతవరకూ అన్వితను అబ్జర్వ్ చేసిన మేరకు ఎనాలసిస్ రిపోర్ట్ అది!
"రిపోర్ట్ ని మార్చాలి.....
ఆమెకు తెలుగు సినిమాలు ఇష్టమైతె, ఇంగ్లీషు సినిమాలు ఇష్టమైనట్లు రిపోర్ట్ లో రాయాలి."
ఆమె అభిరుచులు ఒకటైతే, రిపోర్టులో అతనికి నచ్చని అభిరుచులు ఆమెకు ఉన్నట్లు రాయాలి.
ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు డిటెక్టివ్ రవితేజ.
"రిపోర్టును మార్చి మన కస్టమర్ మధుకిరాన్ అడ్రస్ కి కొరియర్లో పంపండి" చెప్పాడు అసిస్టెంట్ తేజ ఆశిస్తున్నట్లుగా.
"అలాగే సార్" అందా అమ్మాయి.
వెంటనే ఫోన్ చేశాడు మధుకి.
"మీ దగ్గర్నుంచి మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నాను" అన్నాడు మధు.
"మనిద్దరం ఒకసారి కలుసుకోవాలి....."
"ఆఫీసుకి రావాలా...... ఏంటి విషయం.....?"
"వెరీ ఇంపార్టెంట్...."
"రిగార్దింగ్....."
అన్విత...."
"ఎనీథింగ్ సీరియస్....?"
"రామకృష్ణా బీచ్ లో వున్న రెస్టారెంట్ కి సాయంత్రం ఐదుగంటలకు రండి.... నేనొస్తాను...." అని ఫోన్ పెట్టేశాడు తేజ.
మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు.
సెక్స్ కోసం వెంపర్లాడే మగాడు, హత్య చెయ్యడం చాలా సులభం. హత్యకన్న భయంకరమైన పనుల్ని అవలీలగా చేస్తాడు. అన్వితకు పొందడం కోసం ఏమైనా చెయ్యాలని అనుకున్న తేజ అందుకు అనుగుణంగా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు.
* * *
రామకృష్ణా బీచ్....
సీ వ్యూ రెస్టారెంట్.....
ఒకసారి మధు ముఖంలోకి చూసి, సిగరెట్టు వెలిగించుకుని, సముద్రం అలలవైపు చూశాడు డిటెక్టివ్ తేజ.
"సారీ ఫ్రెండ్! నిజం వినటానికి బాధగా వుంటుంది. మా ప్రొఫెషన్ లో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి.
ఆ అన్వితకు నీ మీద గుడ్ ఒపీనియన్ లేదు.....
ఆమె నిన్ను ప్రేమించడం లేదు......
అనురాగ్ అనే మేనమామ కొడుకును ఆమె ఇష్టపడుతోంది. అతను కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నాడు. త్వరలో అమెరికా వెళ్ళిపోతాడు. అన్నపూర్ణమ్మకు కూడా అతనంటే ఇష్టమే" ఆపి సూటిగా అతని కళ్ళల్లోకి చూశాడు తేజ.
ముందు ఆ మాటల్ని నమ్మలేదు మధు.
"మీరంటున్నది నిజమేనా.....?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడతను.
"నిజం......!"
"అన్నపూర్ణమ్మ, అన్విత పర్సనల్ గా నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నేనన్నీ విన్నాను..... శుభ్రంగా ఏలూరు వెళ్ళిపోయి చదువుకోండి..... ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టండి" అన్నాడు తేజ.... మధు ముఖంలో మారుతున్న భావాలను కనిపెట్టి.
'అన్విత ఈజ్ మైన్..... మైన్.....' మధు మనసు ఆక్రోశిస్తోంది.
"ఆమెకు నేనంటే చాలా ఇష్టం......" నెమ్మదిగా అన్నాడతను.
"స్పష్టంగా చెప్పిందా....?"
"లేదు..... ఆమె మాటల ద్వారా తెలుసుకున్నాను."
"పిచ్చివాడా! ఆడపిల్ల మాటలకు అర్థాలు వేరు. నిన్ను చూసి నవ్వి, మరొకడిని పెళ్ళాడే చిత్రమైన మనస్తత్వాలు ఈ ఆడవాళ్ళవి. వాళ్ళని నమ్మొద్దు. నువ్వు ప్రేమించే అమ్మాయి కాకుండా నిన్ను ప్రేమించే అమ్మాయి అయితే నువ్వు సుఖంగా వుంటావ్.....! ఫ్రెండ్లీగా నా సలహా ఇది...."
"పావుగంట తర్వాత మళ్ళీ కలుస్తానంటూ" తేజ వెళ్ళిపోయాడు.
చీకటిపడ్డ వరకూ సముద్రం ఒడ్డునే గడిపాడు మధు.
అతనికేం చెయ్యాలో తోచడం లేదు.
రూమ్ కొస్తూ ఏలూరులోని సుల్తాన్ కి ఫోన్ చేశాడు. అర్జంటుగా వచ్చెయ్యమని చెప్పాడు.
ఆరోజు రాత్రంతా ఆలోచనలతోటే గడిపాడు మధుకిరణ్.