Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 4


    "ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని."

 

    " అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా" క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు.

 

    "అలానే"

 

    నరుడు ఖుషీ అయిపోయాడు.

 

    "పట్టణాలు బోరు కొట్టాయి గురుడా..... ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను  'గురుడా' అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ.  అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను."

 

    "కానీ నాకు వ్యవసాయం లేదే."

 

    "మరి నీ భుక్తి?"

 

     "ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది."

 

    "రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?"

 

    "గ్రామస్థులు."

 

    "గ్రామస్థులా? ఎందుకు?"

 

    "అదో పెద్ద కథలే!"

 

    "చెప్పు గురుడా. ఇక్కడే వుండిపోతానన్నాను గదా! మరి నీ గురించి నాకు తెలియద్దూ. వ్యవసాయం లేకపోతే ఇంకేమైనా ఆదాయం వుందా?"

 

    "లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనూ నీలాగా అనాధనే నరుడా. కాకపొతే ఈ ఊర్లో వున్నా ఓ ఆచారం వల్ల రాజభోగాలు అనుభవిస్తున్నాను. అంతే మనిద్దరికీ తేడా."

 

    "ఏమిటా ఆచారం?"

 

    "మొత్తం చెబుతాలే. మాడి మదనకామరాజు వంశం. ఈ ఊరికి మేము జమీందారులం. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని పొలాలన్నీ మావే. అంటే ఈ ఊరికి మేం రాజులం అన్నమాట. మామాటే వేదం ఇక్కడ. అయితే భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి మా నాన్న చనిపోయాక."

 

    "మీ నాన్న చనిపోయాడా?" నరుడు బాధతో ప్రశ్నించాడు.


    
    "ఆఁ! నేను సిటీలోని ఓ  హాస్పిటల్ లో పుట్టాను ప్రసవం అయ్యాక అమ్మను, నన్నూ కార్లో ఇంటికి తీసుకొస్తున్నారు నాన్నగారు. అప్పుడు ఎదురుగ్గా  వస్తున్న ఓ లారీ మా కారును గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో అమ్మా, నాన్న చనిపోయారు. నేను  కొన్ని రోజుల పసిగుడ్డుని. నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. వెనుకనే మా దివాను, మరికొంతమంది పనిమనుషులూ మరోకారులో వస్తున్నారు. యాక్సిడెంట్ లో బతికున్న నన్ను ఎత్తుకున్నారు. అలా నేను అనాధనైపోయాను."

 

    "తరువాత?"

 

    "చెప్పాను కదా. ఈ ఊరిలో ఓ ఆచారం వుందని. అదేమిటంటే, మా వంశానికి చెందిన పురుషుడితో ఏ స్త్రీ అయినా ఓ రాత్రి గడిపితే ఆమెకూ, ఆమె  కుటుంబానికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలూ కలుగుతాయని గ్రామస్థుల నమ్మకం. నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాక ఆ వంశంలో మిగిలింది నేనొక్కడ్నే. దాంతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న నన్ను గ్రామస్థులే పెంచి పెద్ద చేశారు. నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు చెప్పించారు. విద్యాబుద్ధులు నేర్పించారు. నేను నవ్వితే గ్రామమంతా నవ్వింది. నేను ఏడిస్తే గ్రామమూ ఏడ్చింది. అలానే పెరుగుతుండగా మా దివాను పనిమానేశారు. మా పొలాలన్నింటినీ ఎవరెవరో ఆక్రమించుకున్నారు."

 

    "నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నావా?" నరుడికి ఆ పాయింట్ చాలా కొత్తగా వింతగా వుంది. అందుకే ఆ ప్రశ్న వేశాడు.

 

    "అక్షరాలా. అది ఆచారం కదా.  కేవలం దానివల్లే జనం నన్ను పెంచి పెద్ద చేశారు. మా వంశంలో మిగిలిన పురుషుడ్ని నేనొక్కడ్నే కదా. అందుకే దాన్ని పాటిస్తున్నాను, పధ్నాలుగవ ఏటనుంచే ఆ ఆచారం ప్రారంభమైంది."

 

    "ఆహాఁ ఆహాఁ ఏమి వంశం గురుడా మీది! వంశపారంపర్యంగా భూములు రావడం చూశాను. పేరు ప్రతిష్టలు రావడం చూశాను. పదవులు రావడం చూశాను. ఇలా ఇంత అద్భుతమైన రొమాంటిక్ సెటప్  రావడాన్ని చూడడం, వినడం ఇదే మొదటిసారి గురుడా! అదృష్టం అంటే నీదే. ఎంచక్కా కొత్త కొత్త ఆడపిల్లలతో రాత్రులను గడిపేస్తున్నావు. నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా వుంది గురుడా."

 

    "అది మా వంశ మహత్యం. వచ్చే జన్మంటూ వుంటే మా వంశంలో పడుదువులే."

 

    "తప్పకుండా గురుడా! ఆ దేవుడ్ని బెదిరించో, బతిమిలాడో మీ వంశంలో పుడతాను."

 

    "రోజూ ఓ అమ్మాయితో గడపాలా?" కొంతసేపయ్యాక ప్రశ్నించాడు నరుడు. అతనికి ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.

 

    "రోజూ కాదు పౌర్ణమి రోజున. గ్రామంలోని స్త్రీలలో ఎవరినైనా ఒకరిని నేను ఎంపిక చేసుకుని పౌర్ణమి రోజున ఆమెకు కబురంపాలి. కబురందుకున్న ఆ స్త్రీ పౌర్ణమిరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి గడుపుతుంది. ఓ అమ్మాయితో ఓ  రాత్రే గడపాలి. అందరికీ ఛాన్స్ రావడానికే ఈ ఏర్పాటు.

 

    ఇక భోజనాలుకూడా అంతే. గ్రామస్థులే వంతులు వేసుకుంటారు. రోజుకొకరు చొప్పున మూడుపూటలా క్యారియర్ పంపుతారు. రొటేషన్. పద్ధతన్నమాట. మొత్తం వేయికుటుంబాలూ రోజుకొకరు చొప్పున భోజనాలు పంపడం పూర్తయ్యాక తిరిగి తొలుత భోజనం పెట్టిన  కుటుంబానికి వంతు వస్తుందన్న మాట.

 

    అయితే పౌర్ణమిరోజున నేను ఎన్నుకున్న అమ్మాయి కుటుంబం తమ కుటుంబంలోని స్త్రీని ఎంచుకున్నందుకుగాను కృతజ్ఞతతో విందు భోజనం పంపిస్తుందన్న మాట."

 

    "గురుడా! నీది జన్మంటే. నీది వంశమంటే" నరుడు రెండు చేతులూ ఎత్తి నాటకీయంగా అన్నాడు.

 

    మళ్ళీ  అతనే "అవును గురుడా! పధ్నాలుగవ ఏటనుంచీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నావుగదా. మరి ఈ వెయ్యి ఇళ్ళూ అయిపోయాక ఏమిటి పరిస్థితి? ఇక అమ్మాయిలు లేకపోతే ఏమిటి గతి?" అని తన  సందేహం వెలిబుచ్చాడు.

 

    "అదీ రొటేషన్ పద్ధతే. ఇది ఎప్పటికీ పూర్తికాని సైకిల్ అన్న మాట."

 

    "మొదట ఏ స్త్రీతో గడిపావు గురుడా? మొత్తానికి నీ చరిత్రంతా వెరీ  ఇంట్రస్టింగ్."

    
        
                                          *    *    *

 

    "అదీ..... అదీ కస్తూరితో" కాసేపు గుర్తు చేసుకున్నాక చెప్పాడు.

 

    "ఎవరామె?"

 

    "ఆమె  నా ఆలనా పాలనా  చూసేది. మా వంశాచారం కూడా  ఆమెతో చాలా తమాషాగా  మొదలయింది. నా బట్టలు ఉతకడం, నాకు స్నానాలు చేయించడం, నాకు బట్టలు వేయడం అన్నీ ఆమే చూసేది. నాకు పధ్నాలుగు ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమె వయసు ముప్ఫై ఏళ్ళు. ఆ వయసులో కూడా ఆమె బాగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలా ఫెళ ఫెళలాడుతుండేది.

 Previous Page Next Page