Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 4

    తొమ్మిది అయిదు పద్ద్దానుగు మంది. అందరూ లేచారు. అయిదుగురు నౌకర్లు అయిదుచోట్ల నుంచున్నారు వాళ్ళ చేతుల్లో రకరకాల మారణాయిధాలు వున్నాయి.
   
    బన్సీ లాల్ నైట్ గౌను జేబులో చేయి పెట్టుకుని బయటికి వచ్చాడు. గౌను జేబులో ఫవర్ ఫుల్ మినీ రివాల్వర్ వుంది.
   
    ఓ నౌకరు వచ్చి వీధి గేటు తాళం తీశాడు.
   
    ఇరువురు పోలీసులు లోపలికి వచ్చారు.
   
    పోలీసులు ఇద్దరూ బన్సీలాల్ కి తెలిసినవాళ్ళే వాళ్ళ పేర్లు రమణ, రాజు.
   
    పరస్పరం అభివాదం చేసుకున్నారు.
   
    "ఒంటి గంట పది నిమిషాలు. అర్దరాత్రి పూట వచ్చారేమిటి?" వాళ్ళని లోపలి ఆహ్వానిస్తూ అడిగాడు బన్సీలాల్.
   
    "ఇన్ స్పెక్టర్ సాబ్ పంపారు. స్వయంగా మిమ్మల్ని వెంటనే ఫోన్ చేయమన్నారు. ముందు ఫోను చేయండి..." రమణ అనే పోలీసు చెప్పాడు.
   
    "ఎందుకు?" బన్సీలాల్ అనుమానంగా అడిగాడు.
   
    "ముందు ఫోను చేయండి....సాబ్ ఆజ్ఞ ఇంటికి చేయమన్నారు"
   
    బన్సీలాల్ వెంటనే ఇన్స్ పెక్టర్ ఇంటికి ఫోన్ చేశాడు.
   
    లైన్ ల్లోకి ఇన్ స్పెక్టర్ వచ్చాడు....అంటే ఫోన్ కాల్ కోసం ఇన్ స్పెక్టర్ రెడీగా వున్నాడన్న మాట.
   
    "అర్ధ రాత్రప్పుడు అంకమ్మ శివాలని ఇదేంటి ఇన్ స్పెక్టర్ భాయ్..." నవ్వుతూ అడిగాడు బన్సీలాల్.
   
    "మనం రేపు కల్సుకుని తీరుబడిగా మాట్లాడుకుందాము అప్పుడు నవ్వుకుందాము__కొంప మునిగే విషయం వచ్చింది."
   
    "ఎవరికొంప!"
   
    "ముందు మీది తర్వాత నాది."
   
    "వాటే జోక్__"
   
    "జోక్ కాదు...గంట క్రితం సీక్రెట్ మెసేజ అందింది"
   
    "ఏమిటి, పెద్దవాడు ఎవడైనా వస్తున్నాడా! మందు మగువ సప్లయి చేయలా?"
   
    "నేను చెప్పేదానికి మీరు అడ్డురాకండి. జాగ్రత్తగా వినండి. సి.ఐ డీ లు దిగుతున్నారు. మీ తీపి తిన్నవాడిని కాబట్టి వెంటనే మా వాళ్ళచేత ముందు జాగ్రత్తకోసం కబురు చేస్తున్నారు. లేటర్ రాసి వివరంగా పంపాను. అది చదివి ప్రస్తుతం అలా చేయండి. అన్ని సమయాలు మనవి కావు ప్రస్తుతం మాత్రమే ఆ జాగ్రత్త వహించండిచాలు. వుంటానుమరి సమయం లేదు."
   
    ఆ తరువాత మారుమాట లేకుండా ఫోను పెట్టేశాడు ఇన్ స్పెక్టర్.
   
    బన్సీలాల్ రిసీవర్ ని ఎగాదిగా చూసి క్రెడిల్ మీద వుంచాడు.
   
    "ఇన్ స్పెక్టర్ చెప్పారు....మీ చేత కబురు చేశానని అదేమిటో చెప్పండి" బన్సీలాల్ అడిగాడు.
   
    "కబురు చేయలేదు" రమణ అన్నాడు.
   
    "మీ సాబ్ చెప్పాడు....మీ ఎదుటేగా ఫోన్ చేశాను."
   
    "లెటర్ యిచ్చారు. అదిచ్చి రమ్మన్నారు. అంతకు మించి మా కేమీ చెప్పలేదు." రమణ వినయంగా అన్నాడు.
   
    "ఈ పోలీసు వాళ్ళకి మెడకాయ మీద తలకాయ వుండదు ఎర్రటోపీ తప్పించి" అని బన్సీలాల్ నవ్వుకుంటూ రమణని ఎగాదిగా చూశాడు.
   
    పోలీసు కానిస్టేబుల్ రమణ చేతిమీద ఎర్రగా గాయం.
   
    "అదేమిటి, అంత గాయం అయింది రక్తం ఓడుతూ వుంది." బన్సీలాల్ అడిగాడు.
   
    "ఇద్దరం సైకిలు ఎక్కి వచ్చాము. చీకట్లో రాయి మీదకి చక్రం ఎక్కింది. వీడు బాగానే వున్నాడు. నేను దభేల్ మన్నాను." నవ్వుతూ చెప్పి జేబులోంచి కవరు తీసి బన్సీలాల్ చేతికి యిచ్చి "మేము వెళతాము..." అన్నాడు రమణ.
   
    కవరు అతికించి వుంది....కవరుని ఓ సారి ఎగాదిగా చూసి "సరే..." అన్నాడు బన్సీలాల్.
   
    రమణ, రాజు వెళ్ళిపోయారు.
   
    బన్సీలాల్ వెంటనే కవరు తెరవ లేదు.
   
    "తలుపులు వేసి లైట్లు ఆర్పండి" అని చెప్పి బన్సీలాల్ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు.
   
    ఇన్స్ పెక్టర్ పంపినకవరు అప్పుడు తెరిచాడు. కవరులో మరో కవరుంది. అదీ అతికించి వుంది. ఆ కవరు తెరిచాడు దానిలో మరో కవరు....ఆ కవరులో చిన్న లెటరు.
   
    లేటర్ చదవంగానే బన్సీలాల్ గుండె వక్కసారి ఆగి కొట్టుకోటం మొదలుపెట్టింది. అంతా అయోమయం అనిపించింది.
   
    కాదని బుకాయిస్తే....
   
    అసలీ సీక్రెట్ ఇన్స్ స్పెక్టర్ కి ఎలా తెలిసింది.
   
    ఇది నిజంగా ప్రమాదమా!
   
    అంతే అయి వుంటుంది. లేకపోతే అర్ధరాత్రి ఇన్ స్పెక్టర్ పనిమాలా తన కెందుకు కబురుచేస్తాడు. తనని రక్షించాలానే కదా! తన గుట్టు బయట పడకూడదనే కదా! తను పడేస్తున్న పచ్చగడ్డి తినటం మరిగి మనసునిండా ఆనందం నిండి తనని ఎన్నో సార్లు ఆదుకున్నాడు. ఠాకూర్లకి తమ లాల్ జీలకి  ఎప్పుడూ పడదు. దీనిలో ఠాకూర్ హస్తం వుంటుంది. ఇన్స్ పెక్టర్ తనవాడు కాబట్టి వెంటనే కబురుచేశాడు. తర్వాత సంగతి తర్వాత ముందు తను మేలుకోటం మంచిది.
   
    బన్సీలాల్ ఒకటికి రెండుసార్లు లెటర్ చదివి ఆలోచించాడు. మంచం మీద నుంచి లేచి వెళ్ళి సీక్రెట్ అరలో కవరుని దాచాడు. వెంటనే గది తలుపు తీసి బయటికి వచ్చాడు.

 Previous Page Next Page