Previous Page Next Page 
యోధుడు పేజి 38

    "మిస్టర్ కాశీ! ఏమైంది? ఎందుకు బయటకు పరుగెత్తారు?" ఆ ప్రశ్నకు అయోమయంగా చూశాడు కాశీచరణ్.

    "ఏదో అనీజీగా వుంది డాక్టర్! ఎవరో తురుముతున్నట్ట్లుగా.... ఏదో యాక్సిడెంట్... ట్రైన్ యాక్సిడెంట్ అనుకుంటూ... మనుషుల అరుపులు.." అని ఆపేశాడు ఇకపైనా చెప్పలేని నిస్సహాయతతో.

    "కలగాన్నారా?" అత్రుతుగా ప్రశ్నించింది మధురిమ.

    లేదు...లేదు...ఏవో అస్పష్టమైన జ్ఞాపకాలు... అంతే..." అతని నుదుటిమీద, గుండెలమీద స్వేదం... స్నానం చేసునట్ట్లుగా. నేఫకిన్ తీసి, తనే స్వయంగా ఆ చెమటను తుడిచింది మధురిమ.

    సడన్ గా ఆసమయంలోనే ఊహించని సంఘటన జరిగింది. సడెన్ గా కాశీచరణ్ తన కుడిచేత్తో మధురిమ కుడిచేతిని గట్టిగా పట్టుకున్నాడు.

    అతను ఆమె చేతిని పట్టుకోగానే ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసింది డాక్టర్ మధురిమ. అమెకొక్క క్షణం ఏం జరిగిందో ఏదంకాలేదు. ఏదో తెలీని వింత అనుభూతి... అతని చేయి చల్లగా వుంది. ఆమె చేయి వెచ్చగా వుంది.

    ఆ స్పర్శకు మధురిమకు కొత్తగా వుంది.

    మరికొద్ది క్షణాల్లోనే ఆ వింతైన అనుభూతి నుంచి తెరుకున్నామే అతనికళ్ళలోకి చూసింది.. అతని కళ్ళలో ఏదో అందోళన ఆదుర్దా కనిపించిందామెకు.

    "డోన్ట్ వర్రీ కాశీచరణ్! అంతా సర్దుకుంటుంది. గతానికి సంభందించిన ఏదో ఇన్సిడెంట్ అస్పష్టంగా మీకు జ్ఞపకానికి వచ్చుంటుంది. అంటే... మీరు కోలుకుంతున్నారన్నమాట....

    డోన్ట్ వరీ! ఇంజక్షన్ చేస్తాను. హాయిగా నిద్రపొండి... ఉదయం మాట్లాడుకుందాం" అంటూనే ఓ ఇంజెక్షన్ చేసింది డాక్టర్ మధురిమ.

    మధురిమ కళ్ళలోకి చూస్తూనే మెలమెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కాశీచరణ్.

    చూస్తుండగానే నిద్రలోకి జారుకున్న అతని ముఖం పసిపిల్లవాడి ముఖంలా కనిపించిందామెకు. ఎంతసేపు అతనికేసే అలా చూసిందో ఆమెకే తెలీలేదు. వరండాలో స్తేక్చార్స్ కదిలి వెళుతున్న చప్పుడుకి తేరుకున్న ఆమె వెంటనే అతని రూమ్ లోంచి బయటకివచ్చి తన రూమ్ లో కెళ్ళిపోయింది. వెళ్ళిన మరుక్షణమే డాక్టర్ కే.వి.రావుకు ఫోన్ చేసి విషమయమంతా చెప్పింది.

    "మరేం ఆలస్యం చేయద్దు డియర్ మధురిమా! అతన్ని తీసుకుని ఏకాంతా ప్రదేశంలోకో  పారిపో. అక్కడ అతనికి స్పృహా వచ్చేస్తుంది. ఆ తర్వత ఇద్దరూ ప్రేమించేసుకోండి.

       అతని ప్రేమలో పడ్డాక దగ్గరకు కూడా అప్పుడప్పుడూ రావాలి సుమా. పతి_పత్ని ఔర్ ఓ అన్నమాట. ఆ ఓ నేనేనన్నమాట" అన్నాడాయన తన సహజ ధోరణిలో పెద్దగా నవ్వుతూ. మేధస్సుని కప్పుకుని వుండే చిలిపితనం, టిపికల్ కారెక్టర్ వల్నరబిలిటీ. ఒకే వ్యక్తిలో ఇవన్నీ ఎలా సాధ్యం?

    "మీ జోక్స్ తర్వాత డాక్టర్! మీ సలహా ప్రకారం సాధ్యమైనంత త్వరలో అతన్ని యిక్కడనుంచి పట్టణవాతావరణానికి దూరంగా తీసికెళ్ళిపోతాను. అదే గదా మీ సలహా?" అడిగింది మధురిమ.

    "గుడ్! మరీ అవసరమైతే అక్కడకోచ్చి నేను టెస్ట్ చేస్తాలే. ఇంతకీ ఎక్కడికి తీసికెళ్తావు? చుట్టూ సముద్రం... మధ్యలో దీవి అలాంటి చోటైతే బావుంటుందేమో?" నవ్వుతూనే అన్నాడాయన.

    "ఇంకా నిర్ణయించుకోలేదు డాక్టర్!" అందామె టెలికపడ్డా మనస్సుకో.
    "నిర్ణయించుకో. అక్కడ మీరిద్దరే తప్ప యింకేవరూ వుండకూడదు గుర్తుంచుకో. ఉన్నారనుకో మీ ఇద్దర్నీ ప్రేమించుకోనివ్వరు. అదెంత బాధాకరమైన విషయం చెప్పు? ఎనీవే అల ది బెస్ట్. అతను త్వరలోనే రికవర్ అవుతాడు. డోంట్ వర్రే మై లవ్_ కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అతనిప్పుడున్న స్థితిని అమ్నేషియా అంటారు. లాస్మేమోరీ డ్యూటీ బ్రయిన్ షాక్ ఆర్ బ్రెయిన్ ఇంజ్యూరీ. FATIGUE REPREESSION OF ILLNESS. A GAP IN ONE'S MEMORY_ వీటిల్లో ఏ పేరుతో పిలిచినప్పటికీ, అతనిస్థితిత చాలా సున్నితమైంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉంటాను మరీ. ఇప్పటికే లేటపోయింది. నాకోసం టాఫ్ మోడల్ మధుసప్రే ఒబరాయ్ హొటల్లో ఎదురుచూస్తుంటుంది... బై" అని ఫోన్ పెట్టేశాడు డాక్టర్ కే.వి.రావు.

    ఫన్నీ జెంటిల్ మెన్ అనుకుంటూ నవ్వుకుంది మధురిమ. ఒక విషయం మాత్రం ఆమెకు బాగా అర్ధమయింది. ప్రశాంత వాతావరణంలో కాశీచరణ్ కోలుకుంటాడని. కే.విరావు ఎన్నిజోకులేసినా చివరలో మాత్రం డాక్టర్ కే.వి.రావులా ప్రవర్తింస్తారు.

    అదే అమెకెంతో రిలీఫ్ నిచ్చింది.

   
                         *    *    *    *

    మర్నాడు ఉదయం పదకొండు గంటలు సమయం.... ఇంటినుంచి హాస్పిటల్ కి వచ్చి తన గదిలోకి అడుగుపెట్టినా డాక్టర్ మధురిమ, తన టేబుల్ ముందు ఎవరో నిలబడడం చూసింది. అతని కెదురుగా సిస్టర్ మేరీ కూడా వుంది.

    నీలరంగు పువ్వుల షర్టు, జీన్స్ ప్యాంటు... వెనుకనుంచి చూసి ఎవరబ్బా? అని అనుకుంటూ ముందుకొచ్చింది డాక్టర్ మధురిమ.

    "మేడం వచ్చారా?"అంటూ అతనితో అంతవరకు మాట్లాడుతున్నసిస్టర్ మేరీ అనడంలో ఆ వ్యక్తి తల తిప్పి మధురిమ వైపు చూశాడు.

    డాక్టర్ మధురిమ ఆ డ్రెస్ లో వున్న కాశీచరణ్ ని చూసి విస్మయానికి గురైంది. ఒక్కక్షణం తన కళ్ళను తానె నమలేకపోయింది.

    కొద్దిక్షణాలకు ఆ ఉద్వేగమైనా స్థితి నుంచి తేరుకుంది డాక్టర్ మధురిమ.

    "మీరు మీరేనా? ఏమిటిది ఒక్కసారిగా పూలరంగుడిలా తయారయ్యారేంటీ?"

    "అ రూమ్ లో పేషెంట్ గా, దీర్ఘవ్యాధి సోకిన వాడిలా వుండాలంటే చిక్కాగ్గా వుంది. అందుకే తెల్లవారుజామున  ట్రీమ్ముగా తయారైపోయాను.

 Previous Page Next Page