వెనకనుంచి కంఠానికి తగిలింది. వెంటనే కిందపడిపోయి గిలగిలా కొట్టుకోసాగాడు చంద్రప్ప.
ఆ దృశ్యాన్ని తడారిపోయిన గొంతుతో చూస్తోంది ఇందు.
అయిదు నిమిషాలసేపు గింజుకున్న చంద్రప్ప, ఒక్కసారిగా బాధతో అరిచి తల పక్కకి వాల్చేసాడు.
ఆ సమయంలో-
శ్రీమహాలక్ష్మి కలకత్తా కాళికలా వుంది.
"అక్కా!" ఏడుస్తూ శ్రీమహాలక్ష్మిని చుట్టేసింది ఇందు.
అనూహ్యంగా జరిగిపోయిన ఆ సంఘటననుంచి తేరుకోడానికి శ్రీమహాలక్ష్మి.
"అతను చచ్చిపోయాడు....." భయంగా అంది ఇందు.
కిటికీల్లోంచి, డాబాలమీంచి చూస్తున్న వ్యక్తులు భయంతో ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు.
"చావనీ.... ఇలాంటి వాళ్ళు ఇలాగే చావాలి...... న మొగుడ్ని చంపినందుకు వీడిలాగే చావాలి..... వీడి శవాన్ని నేనే స్వయంగా పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను..... పద......" అంటూ శ్రీమహాలక్ష్మి రక్తం కారుతున్న ఆ శవాన్ని భుజమ్మీద వేసుకుని పోలీస్ స్టేషన్ వేపు నడిచింది.
* * *
పోలీస్ స్టేషన్ నిద్రపోతున్నట్టుగా వుంది. మెట్లమీద కూర్చున్న సెంట్రీ, మత్తుకళ్ళతో జోగుతున్నాడు.
ఏదో కేసుమీద బైటకు వెళ్ళిన ఇన్ స్పెక్టర్ ఏ సమయంలోనైనా బైటనించి రావచ్చు.
అందుకే అతను అతిప్రయత్నం మీద నిద్రని ఆపుకుంటున్నాడు.
బీడీ వెలిగించుకుంటూ గేతువేపు చూసిన సెంట్రీ కానిస్టేబుల్, భుజంమీద శవంతో విక్రమార్కుడిలా వస్తున్నా ఆడమనిషి చూసి భయంతో కొయ్యబారి పోయాడు.
అది నిజమో, దెయ్యమో అర్థంగాక బిక్కచచ్చిపోయి.....
"ఎవరు...... ఎవరు?" అని అన్నాడు.
శ్రీమహాలక్ష్మి ఏం మాట్లాడలేదు..... శవాన్ని స్టేషన్ అరుగుమీద వుంచి-
"సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్పని నేనే చంపాను... జైల్లో పెట్టండి" అంది శ్రీమహాలక్ష్మి.
"సి.ఐ. చంపేశావా?" తడారిపోతున్న గొంతుతో అన్నాడు కానిస్టేబుల్.
సరిగ్గా అదే సమయంలో, స్టేషన్ ముందు జీప్ ఆగింది.
* * *
లాకప్ వుంది శ్రీమహాలక్ష్మి.
ఆమెను చూస్తూ ఏడుస్తోంది ఇందు.
"అక్కా..... నన్ను రక్షించడం కోసం నువ్వు, నీ భర్తా ఇద్దరూ బలైపోయారు...."
"బాధపడకు..... ఇందూ..... చిన్న వయసులో నువ్వు అనుభవించిన నరకం కన్నా..... నేననుభవించే శిక్ష గొప్పదేం కాదు..... నీ బతుకును బాగుచేసుకో.....! వెళ్ళు నీ బావని వెతుక్కో...... పెళ్ళాడు...... హాయిగా వుండు.... జైలుశిక్ష అనుభవించి నేరుగా నీ యింటికే వస్తానులే" అంది శ్రీమహాలక్ష్మి.
శ్రీమహాలక్ష్మిలో అరుదయిన వ్యక్తిని చూస్తోంది ఇందు. వంగి ఆమెకాళ్ళకు నమస్కారం పెట్టి బైటికొచ్చింది. రోడ్డుమీద నడుస్తోందామె. నేరుగా రామరాజ్ మొహల్లా కాలనీలో కెళ్ళింది.
* * *
మరో అరగంట తర్వాత మోహిత గెస్ట్ హౌస్ లోని రాజేంద్రకుమార్ ఎదురుగా వుంది.
ఆమెను చూడగానే రాజేంద్రకుమార్ పిచ్చెత్తిపోయాడు. వికృతంగా నవ్వాడు.
ఆ వికృత్వంలోని పైశాచికానందాన్ని గుర్తించి మోహిత హృదయం భగభగమని మండిపోయింది.
"నువ్వు నామీద పగబడతావా....? నీకే అద్భుతమయిన తెలివితేటలున్నాయని.... అందర్నీ ప్లాన్డ్ గా మర్డర్ చేస్తావా? నిన్నీ క్షణంలోనే చంపెయ్యగలను..... కానీ చంపను..... యీ రోజంతా నిన్ను చిత్రహింసలపాలు చేసి, నీ మట్టుకు నువ్వే ఆత్మహత్య చేసుకుని చచ్చేట్టుగా చేస్తాను" కసిగా అన్నాడు రాజేంద్రప్రసాద్.
"తాగుతావా.....?" అడిగాడతను.
జవాబు చెప్పలేదామె.
"ఎంతయినా తాళికట్టిన పెళ్ళానివి కదా..... చనిపోయేముందు నీ కోర్కె తీర్చడం నా ధర్మం.... నీకు కావాల్సిన డ్రింక్ వేసుకుని తాగు" డ్రింక్ బాటిల్ నీ, గ్లాసునీ ముందుకు తోసాడు.
గ్లాసులో డ్రింక్ ని వేసుకుని గడగడా తాగేసింది మోహిత.
"ఏంటలా చూస్తున్నావ్?" తీరుబడిగా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడతను.
"నన్నెలా చంపాలని ప్లాన్ వేస్తున్నావా?" గట్టిగా నవ్వుతూ మళ్ళీ అన్నాడతను.
"నిన్ను చంపడానికి ప్రత్యేకంగా ప్లాన్ అక్కర్లేదు.... దారుణంగా చస్తావ్..... నేనే చంపుతాను" నిర్భయంగా అంది మోహిత.
"ఎక్కడో, అనామకంగా వున్న నిన్ను తీసుకొచ్చాను. పెళ్ళి చేసుకున్నాను. ఫ్లాట్ యిచ్చాను..... కారిచ్చాను..... క్యాష్ యిచ్చాను..... హాయిగా వుండమన్నాను. వున్నావా? లేదే.....! నన్ను సుఖపెట్టి, నువ్వు సుఖపడు. నువ్వు ఎవరితో తిరిగినా నాకభ్యంతరం లేదు..... అయిపోయిందేదో అయిపోయింది. ఆ మర్డర్ కేసుల్నించి రక్షించే బాధ్యత నాది. ఆఖరి అవకాశం ఆలోచించుకో!" నెమ్మదిగా అన్నాడు రాజేంద్రకుమార్.
"ఎందుకు నామీద జాలి చూపుతున్నావ్? ఎందుకు నన్ను రక్షించాలను కుంటున్నావు? ఎందుకు నీతోనే వుండమంటున్నావ్.....? తాళికట్టి, భార్యగా తెచ్చి, నీ పనుల్ని నెరవేర్చడం కోసం అడ్డమయిన మగవాళ్ళ దగ్గర పడుకోబెట్టడానికి, నీ రహస్యాల్ని కాపాడడానికి నీ స్వంత ఆడది నీక్కావాలి. ఆడదానికో వ్యక్తిత్వం వుంటుందని, ఆ వ్యక్తిత్వానికి గౌరవం వుంటుందని, నీలాంటి మగాళ్ళకు ఎప్పుడూ అర్థంకాదు. స్త్రీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బతికే ఏ మగాడూ బతకడు..... అందుకు నిదర్శనం..... నీఫ్రెండ్స్! కొన్ని గంటల్లోనే నీ చావు రాసిపెట్టి వుందని మర్చిపోకు౧" క్రోధపు చూపులతో చూస్తూ అంది మోహిత.
ఆ మాటకు విసురుగా లేచి ఆమె జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి-
"ఏమిటీ! స్త్రీ వ్యక్తిత్వం....? ఏమిటి స్త్రీ ఆత్మగౌరవం? ఇప్పటి ప్రపంచంలో అధికారానికి, వ్యాపారానికి, రాజకీయానికి..... ఒకటేమిటి..... అన్నిటికి తనను ఉపయోగించుకోమని..... మీ ఆడజాతి ముందుకు వస్తోంది. మాలాంటి మగాళ్ళు రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో అంతర్జాతీయస్థాయిలో మీవెనక లేకపోతే మీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుండేదో ఆలోచించుకో. స్త్రీ సెక్స్ కి డబ్బుకి, స్త్రీ సెక్స్ కి అధికారానికి, స్త్రీ సెక్స్ కి అవకాశాలకి 'లింక్' ఈనాటిది కాదు. ఒక్కసారి చరిత్రను తిరగవెయ్..... నీకే తెలుస్తుంది....." విసురుగా అన్నాడు రాజేంద్రకుమార్.
"ఇప్పుడు నువ్వు నన్ను ఏ అధికారంతో కొట్టావో చెప్పగలవా?" అడిగిందామె. సమాధానం చెప్పలేకపోయాడతను.
"నిన్నుకూడా నేను కొట్టగలను. ఇదికూడా చరిత్రలో వుంది. తెలుసుకో" వ్యంగ్యంగా అంటూ తన కాలిచెప్పును తీసి అతనిమీదకు విసిరింది మోహిత.
"దిసీజ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ..... నా సహనానికి పరీక్ష పెట్టకు" గర్జించాడతను.
"నువ్వు నన్నేం చెయ్యలేవు....." అంటూ గ్లాసుని విసిరికొట్టిందామె.
"నేనేం చెయ్యగలనో ఇప్పుడే చూపిస్తాను. మత్తు మందిచ్చాక మహేంద్ర, జయంతి, ఆదిత్య అప్పుడెప్పుడో నన్ననుభవించారు. ఇప్పుడు ఈ క్షణంలో ఏ మత్తుమందూ లేకుండా..... నిన్ను రేప్ చేయిస్తాను. టార్చర్ చేయిస్తాను..... చూడు" అంటూ 'ఒరేయ్' అని కేకవేశాడు రాజేంద్రకుమార్.
బయట కాపలాగా వున్న అయిదుగురు అనుచరులు వెంటనే లోనికి వచ్చారు.
"దీనిని తీసికెళ్లి బెడ్ రూమ్ లో మంచానికి తాళ్ళతో కట్టేసెయ్యండి. మీకెంత కావాలో అంత తాగి, ఒక్కొక్కరూ దీన్ని రేప్ చెయ్యండి....." కసిగా చెప్పేసి బయటికొచ్చాడు రాజేంద్రకుమార్.
ఇద్దరు వ్యక్తులు మోహితని బెడ్ మీద పడుకోబెట్టి తాళ్ళతో కట్టేశారు. మోహిత గింజుకుంటోంది. ఇష్టం వచ్చినట్టు తిడుతోంది.
ఒకడు గబగబా గ్లాసులోని డ్రింక్ ను గడగడా తాగేసి, ఆమె దగ్గరికొచ్చి భుజమ్మీద చెయ్యి వేసి నవ్వాడు.
సరిగ్గా అదే సమయంలో.....
పోలీస్ విజిల్..... డజనుమంది పోలీసులు గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టేశారు. ఊహించని పరిణామానికి బిత్తరపోయాడు రాజేంద్రకుమార్.
గబగబా లోనికొస్తున్న ఏ.సి.పి. రమేష్ బాబుకు ఎదురెళ్ళాడు రాజేంద్రకుమార్.
"రండి ఏ.సి.పి. గారూ! మీరు చెయ్యాల్సిన పనిని నేను, నా మనుషులు చేసేశాం. నామీద హత్యాయత్నం చేసిన మోహిత దొరికిపోయింది. బెడ్ రూమ్ లో బందీని చేశాం...... మీకు ఫోన్ చెయ్యాలనుకుంటుండగానే మీరొచ్చారు" నిరుత్సాహాన్ని అణచుకుంటూ లోనికి నడిచాడు.
ఏ.సి.పి రమేష్ బాబు సిబ్బందితోపాటు లోనికి నడిచాడు.
సిబ్బందితో కట్లు విప్పించి-
"యూ ఆర్ అండర్ అరెస్ట్ మోహితా!" అన్నాడతను.
పోలీసుల్ని చూసి ఒకపక్క ఆనందిస్తూనే, మరోపక్క ఆశ్చర్యపోయింది మోహిత.
"రండి..... రూమ్ లోంచి అన్నాడు రమేష్ బాబు.
రమేష్ బాబు వెనక నడుస్తూ, రాజేంద్రకుమార్ వేపు చూసి నవ్విందామె.
సరిగ్గా ఆ సమయంలో. చెట్లమధ్యనించి పరుగు, పరుగున వస్తున్నా మైత్రేయ గెస్ట్ హౌస్ ముందు పోలీసుల్ని చూసి, వెంటనే ఒక పొదచాటుకి వెళ్ళిపోయాడు.
ఆ పొదచాటుకి మైత్రేయ వెళ్ళడం కిటికీలోంచి చూసింది మోహిత.
"మిస్టర్ కుమార్! మీరొక్కసారి స్టేషన్ రేపు రావాల్సి వుంటుంది" అనిచెప్పి ముందుకడుగేశాడు.
పోలీస్ సెర్చ్ లైట్లతో ఆ ప్రాంతమంతా పట్టపగల్లా వుంది.
గత పదిగంటల నుంచి పోలీసు బృందాలు అడవినంతా గాలిస్తున్న విషయం, గెస్ట్ హౌస్ ని ట్రేస్ చేసి మాటువేసిన విషయం తెలియని రాజేంద్ర కుమార్ పోలీసులు అక్కడికి ఎలా రాగలిగారన్న ఆలోచనలో వున్నాడు.
మొహితను కసిగా చంపాలనుకున్న అతని ఆశ, నిరాశగా మిగిలినందుకు లోలోపల వుడికిపోతున్నాడతను.
గెస్ట్ హౌస్ గేటు దగ్గరికొచ్చి-
"ఒక మినిట్ ఇన్ స్పెక్టర్ ......" అంటూ వెనక్కొచ్చి స్తంభానికి కట్టివేసి వున్న 'నిక్కీ'ని విప్పి-