రాత్రిపదిగంటలు దాటింది.
హాస్పిటల్ అంతా చీకటి దుప్పటి కప్పుకుని నిద్రపావుతున్నట్ట్లుగా వుంది.ఎక్కడనుంచో రాగులు దగ్గుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.
వరసగా వర్డులన్నీ చూసి కాశీచరణ్ రూమ్ లోకి వెళ్ళింది నర్స్ మేరీ.
ప్రక్కకు వత్తిగిల్లి నిద్రపోతూన్నడతను. బెడ్ షీట్ వేసి బయటకు నడిచిందామె.
ఫస్ట్ ప్లోర్ లో హార్ట్ పేషెంట్ ను చూసి, లిప్టులోంచి అప్పుడే క్రిందకు వస్తోంది డాక్టర్ మధురిమ."ఏంటి డిస్ట్రబ్ డ్ గా కనిపిస్తున్నావ్?" నవ్వుతూ అడిగిందామె.
"నార్మల్ గానే వున్నాను మేడమ్" అంది మేరీ తడబాటుని కప్పిపుచ్చుకుంటూ.
"మోన్నటివరకూ నీతోపాటే డ్యూటీ వేయమనే శివానందం_ నీది నైట్ డ్యూటీ అయితే, తనకి మార్నింగ్ డ్యూటీ వేయమంటున్నాడు. ఏమయ్యింది?" నవ్వుతూ అడిగిందామె.
"అతనితో నాకేంటి... అతను వర్డ్ బోయ్.. నేను హెడ్ నర్స్ ని. మీరు కూడా నన్ను టీజ్ చేస్తే ఎలా మేడమ్?" అంటూ ముందుకెళ్ళి పోయింది మేరీ.
తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయింది డాక్టర్ మధురిమ నవ్వుకుంటూ. సాయంత్రమే ఓ హార్ట్ పేషెంట్ జయినయ్యాడు. అతని హార్ట్ బీట్ ను ప్రతిగంటకీ టెస్ట్ చేయాలి. రాత్రి రెండు గంటల వరకూ వుండక తప్పదు. ఛాంబర్ లోకి కెళ్ళిన మధురిమ మెడికల్ జర్నల్ అందుకుంది.
ఒకప్రక్క మేడుకల్ జర్నల్ తిరగేస్తూనే కాశీచరణ్ గురించి ఆలోచిస్తోందామె.
సరిగ్గ అదే సమయంలో....
మగత నిద్రపోతున్న కాశీచరణ్ మస్తిష్కంలో ఏవో మసక మసగ్గా... జ్ఞాపకాల పొరలు...
దట్టమయిన మంచు ...మంచుని చీల్చుకుని పరిగెడుతున్నారైలు_ ఆరైలులో ఒక బోగీలో రగ్గుతీసుకుని కప్పుకున్న ఒక వ్యక్తి.
ఏదో ఒక చిన్న స్టేషన్ లో.... రైలు ఆగిన చప్పుడు... కొన్ని నిమిషాలతర్వాత రైలు కదిలిన చప్పుడు...సన్నగా వీస్తున్న చలిగాలి.... వేగం పుంజుకున్న రైలు...
అకస్మాత్తుగా పెద్ద విస్పోటనం... బాంబులతో కొండని పేల్చినట్టుగా పెద్ద శబ్దం.....
హాహాకారాలు... ఆర్తనాధాలు... ఎవరో పరిగెడుతున్న మనుషులు_ అంతా చీకటి.... నిశ్చబ్దపు చీకట్లో కాలుతున్న మానవ శరీరాలు... ఎవరో తనకు సమీపంలో విహ్వాలంగా అరిచిన కేక...'
భయం... భయం....
ఒక్కసారిగా కాశీచరణ్ శరీరం చెమటతో తడిసిపోయింది. అసంకల్పితంగానే కళ్ళుతెరచి, దిగ్గున లేచినిలబడ్డాడు.
కొద్ది క్షణాలు గడిచినా తానున్న పరిస్థితేమిటో తనకర్డం కాలేదు. గుండెలోతుల్లో ఏదో వుద్వేగం... రక్తప్రసరణలో అమిత వేఘం.... శరీరమంతా కంపించిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? జవాబులు దొరకని ఆ ప్రశ్నలే అతన్ని తీవ్రంగా వుద్వేగపరుస్తుండగా....
గట్టిగా కేకవేశాడు. ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి కారిడార్ లో పరుగెడుతున్నాడు.
"యాక్సిడెంట్... యాక్సిడెంట్" అని అరుస్తూ ఎదురుగా వస్తున్న ఒక నర్స్ ని డీకొని క్రిందపడిపోయాడు. లేవడానికి ప్రయత్నించాడు. కానీ లేకలేకపోతున్నాడు... ఆశక్తితో శారీరక అసమర్దతో? తెలీదు.
"మేడమ్... మేడమ్" అంటూ కారిడార్లో నర్స్ పెట్టిన కేకకు, మెడికల్ జర్నల్ ప్రక్కన పడేసి తన రూమ్ లోంచి బయటకు వచ్చింది డాక్టర్ మధురిమ. అప్పటికే క్రిందపడిపోయాడు కాశీచరణ్. చట్టూ కొంతమంది నర్సులు గుమికూడిపోయారు.
"ఏమైంది... కాశీచరణ్ ఇక్కడికేలా వచ్చాడు?" అంటూ గబుక్కున అతని చేతుల్ని పట్టుకుంది ఫల్స్ చూసేందుకు.
"రూమ్ లోంచి బయటకొచ్చి యాక్సిడెంట్... అని పరిగెడుతూ నన్నుడీ కొన్నాడు మేడమ్..." అంటూ చెప్పిందా నర్స్.
"మేరీ! అతని రూమ్ లోకెళ్ళి చూడు?" మధురిమ చెప్పగానే అతని రూమ్ వైపు పరుగెత్తింది మేరీ.
కారీడర్ లో క్రిందపడిపోయిన కాశీచరణ్ ముఖంలోకి చూసింది మధురిమ.
"కాశీ... కాశీచరణ్ ..." పిల్చింది మధురిమ. అతనిలో ఉలుకూపలుకూ లేకపోవడంతో నర్సుల సహాయంతో రూమ్ లోకి తీసుకెళ్ళి, అక్కడున్న ఇంటర్ కమ్ లో వరసగా నెంబర్లు నొక్కి... మిగతా డాక్టర్స్ ని వెంటనే రమణి చెప్పింది.
అతని ఫాల్స్ ఒకింత ఎక్కువగానే వున్నా... ఆమె అంతకుమించిన ఉద్వేగానికి గురవుతోంది.
కొద్ది క్షణాల్లోనే నలుగైదుగురు డాక్టర్స్ వచ్చేశారు. వాళ్ళు వససగా చేకఫ్ చేశారు.
"ఎవ్విరిథింగ్ నార్మల్ మేడమ్! నిద్రలో కలోస్తే... ఉలిక్కిపడి అపస్కారకంగా బయటకి పరుగెత్తినట్టున్నాడు." అని తేల్చారు వచ్చిన డాక్టర్స్.
అప్పటికిగాని ఆమె మనసు కుదుట పడలేదు. మరికొంతసేపు అక్కడే వుండి_మరోసారి చెక్ చేసి, డాక్టర్స్ వెళ్ళిపోయాక నర్స్ మేరీతో పాటు అక్కడే కూర్చుంది మధురిమ. మేరీ కాసేపయ్యాక బయటకి వెళ్ళింది. అమెకింకా తృప్తి కలవక అతని నాడి చూస్తుండగా అకస్మాత్తుగా మేలుకున్నాడు కాశీచరణ్.