Previous Page Next Page 
మోహిత పేజి 37


    "గిరిజన తండాకు వెళ్ళారు. పెళ్ళికి" చెప్పింది వనలక్ష్మి.

 

    గూడెంలో నువ్వొక్కదానివే వున్నావా?"

 

    "అవును...... నా కోరికను మన్నించి, మార్చిపోకుండా నువ్వు వస్తానన్నావు కదా..... నువ్వు ఎప్పటికైనా వస్తావని తెల్సు. అందుకే ప్రతిరోజూ నీకోసం ఎదురు చూస్తున్నాను" గ్లాసుని అందుకుంటూ అంది వనలక్ష్మి.

 

    తెల్లటి పూలగుత్తులు వేలాడుతున్నట్లుగా వెన్నెల.....

 

    చల్లగా వీస్తున్న గాలి.....

 

    గుడిసెలో కెళ్ళి లాంతరు తెచ్చి బండరాయి పక్కన పెడుతూ....

 

    "ఎవరూ లేనప్పుడు మంచి సమయానికి వచ్చావులే" ముసిముసిగా నవ్వుతూ అంది వనలక్ష్మి.

 

    లాంతరు వెలుగులో అతని భుజంమీద కారుతున్న రక్తంవేపు చూసి.... అతని దగ్గరగా జరిగి, తన పైట చెంగుతో ఆ రక్తాన్ని తుడవసాగింది వనలక్ష్మి.

 

    కుడిభుజం వేపు అప్పుడు చూసుకున్నాడు మైత్రేయ. కుడి మోచేయి అంతా రక్తసిక్తమయిపోయింది. మోచేయి తుడిచి, గాయానికి పసరు పూసింది.


    
    "మరింక ఏ బాధ వుండదులే..... ఎలా తగిలింది దెబ్బ?" అతని చేతుల్ని గుండెల మీద పెట్టుకుంటూ అడిగింది వనలక్ష్మి.

 

    జరిగిందంతా చెప్పాడు మైత్రేయ.

 

    "అడవిలో నీకు శత్రువులా..... నీకేం భయంలేదు.... ఈ రాత్రంతా నన్ను నీ దానిని చేసుకో.... దేవీమాత అనుగ్రహిస్తుంది...... విజయం జరుగుతుంది" తన నడుంమీద అతని చేతుల్ని వేసుకుంటూ అంది.

 

    "ఏ క్షణంలోనయినా వాళ్ళిటువేపు వస్తారు" అన్నాడతను.

 

    "రానీ..... వాళ్ళని నేనే చంపేసి, నిన్ను రక్షిస్తాను..... భయపడకు.... ఇంతదూరం రారు..... వుండు, ఇప్పుడే వస్తాను" అంటూ గుడిసెలో కెళ్ళింది వనలక్ష్మి.

 

    ఎవరికీ ఎవరిమీద ఎప్పుడు ఎలా అభిమానం కలుగుతుందో అనూహ్యం. కొన్నింటికి బాహ్యమయిన కారణాలు కన్పించినా, వాస్తవానికి అవి నిజాలు కావు. ఒక మనిషి మనసును ఎక్సరే తీసేది, ఇంకొక మనసున్న మనిషి మనసే.

 

    దూరంగా చెరువులో పది మెరుస్తున్న వెన్నెల మంచులా మెరుస్తోంది. ఎక్కడ నుంచో వీస్తున్న పున్నాగపువ్వుల వాసన.

 

    లోనకెళ్ళిన వనలక్ష్మి గ్లాసుతో తిరిగొచ్చింది.

 

    "మేకపాలు తాగు..... నీరసం పోయి బలమొస్తుంది" అంది.

 

    ఆ గ్లాసుని అందుకుని గబగబా తాగేశాడతను.

 

    అరుగుమీద  నున్న నులక మంచాన్ని తెచ్చి, రావిచెట్టుకింద వేసి, దుప్పటి పరిచి, తలగడ సర్దింది. అతని షర్టును తనే విప్పేసింది.

 

    ఒక్కసారిగా గట్టిగా మైత్రేయని కౌగలించుకుంది వనలక్ష్మి...... పెదవుల్ని చప్పుడు చేస్తూ ముద్దుపెట్టుకుంది.

 

    "ఈ రాత్రి నిన్ను వదలను. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను....." అంటూ చెరువువేపు పరుగెత్తింది.

 

    ఫాంటుజేబులో నున్న  సిగరెట్  ప్యాకెట్లోంచి సిగరెట్ తీసుకుని వెలిగించాడు మైత్రేయ.

 

    దూరంగా చెరువులో మునిగి స్నానం చేస్తున్న వనలక్ష్మిని చూస్తున్నాడు.

 

    అయిదు నిముషాలు గడిచాయి.

 

    చెట్ల ఆకుల మధ్యలోంచి పడుతున్న వెన్నెల్లో తడుస్తూ, నీళ్ళు కారుతున్న చీరతో నుంచుంది వనలక్ష్మి.

 

    "నేన్నీకు నచ్చానా.....?" అంది గుసగుసగా అడుగుతూ పైటను తీసి, చీరను విప్పేసుకుంటోంది.

 

    లంగా, జాకెట్టుతో నిలబడిన వనలక్ష్మి వేపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు మైత్రేయ.

 

    "ఏం అలా అడుగుతున్నావ్....? అడిగాడతను.

 

    "నువ్వు నన్ను నిజంగా కావాలని కోరుకుంటేనే..... మనస్పూర్తిగా నాకు సుఖాన్నివ్వగలవు....." స్త్రీ, పురుష సంబంధాల్లోని అసలు రహస్యాన్ని తన భాషలో స్పష్టంగా చెప్పింది వనలక్ష్మి.

 

    జాకెట్ విప్పేసి, కొంచెం చీకట్లోకి వెళ్ళి లంగాను కూడా విప్పేసి, పక్కన పడేసి అతని  పక్కకొచ్చి కూర్చుని, అతని చేతుల్ని తనగుండెలమీద వేసుకుంది.

 

    ఎత్తయిన గుండెలమీద మైత్రేయ చేతులు వెంటనే వేడెక్కాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మారిన వేగం అతనికి తెలుస్తూనే వుంది.

 

    అతని వంటిమీద చెమట ఆరిపోయింది.

 

    ఎక్కడో సంకోచం..... ఇంకెక్కడో బిడియం......

 

    "ఇక్కడెవరూ లేరు. ఇంకెవరూ రారు... మనిద్దరమే..... నువ్వేం చేసినా నాకిష్టమే" అంటూ అతని చేతిని తన నడుంచుట్టూ వేసుకుంది వనలక్ష్మి.

 

    ఆమె నడుం మడతలమీద అతని చేతులున్నాయి. ఆ స్పర్శ మృదువుగా వుంది.

 

    "నన్ను ముద్దు పెట్టుకో."

 

    సంకోచంగానే ముద్దు పెట్టుకున్నాడతను.

 

    "గట్టిగా కౌగిలించుకో...... నీ కౌగిటిలో నా శరీరం మైనపుబొమ్మలా అయిపోవాలి."

 

    గట్టిగా కౌగిలించుకున్నాడతను.

 

    "పాంట్ ఎందుకు అసయ్యంగా..... విప్పెయ్యనా?" ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. అంత చీకటిలోనూ ఆ కళ్ళల్లోని ఎరుపుదనం అతనికి కనబడింది.

 

    అతని నడుమ్మీద ఆమె చెయ్యి వేసింది.

 

    ఏదో హాయి.....

 

    అతని ప్రమేయం లేకుండానే అతను నగ్నంగా తయారయ్యాడు.

 

    వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్న అతని శరీరంవేపు చూస్తూ అతని గుండెలమీద, పెదవులమీద, చేతులమీద ముద్దులు పెట్టుకుంటోందామె.

 

    "నచ్చిన మగాడు ఎదురుగా వుంటే, ఆడపిల్ల గుండెలే కాదు, దుస్తులు కూడా బరువెక్కిపోతాయి" అతని చెవిలో గుసగుసలాడుతూ మంచంమీద పడుకుంది.

 

    "నీకు చాలా తెలుసే" నవ్వుతూ అన్నాడు మైత్రేయ.

 

    "మాలాంటి అడవుల్లోని ఆడాళ్ళకేం తెలుస్తాయి? విచిత్రాలన్నీ పట్నం కుర్రాళ్ళకే తెలుస్తాయి" అతన్ని తన మీదకు లాక్కుంటూ అంది వనలక్ష్మి.

 

    అతను ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో వున్నాడో  మరిచిపోయాడు. నల్లటి ఆకాశంలో గుండ్రటి చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు. వాళ్ళిద్దరి నగ్న శరీరాల మధ్య వెన్నెల సంపెంగ పువ్వులా నలిగిపోతోంది. వేడి వేడి ఉచ్ఛ్వాస- నిశ్వాసాలతో గాలి వేడెక్కిపోతోంది.

 

    పది నిమిషాలు గడిచాయి.

 

    ఇద్దరి వంటిమీదా చెమట.....

 

    అలసిపోయిన కళ్ళతో, ఆమె అరమోడ్పు కళ్ళవేపు చూస్తున్నాడు మైత్రేయ.

 

    నల్లటి రాతితో మలిచిన నగ్న శిల్పంలా పక్కకు ఒత్తిగిలి పడుకుంది వనలక్ష్మి.

 

    "నన్ను పెళ్ళి చేసుకుని, పట్నానికి తీసికెళ్ళిపోతావా?" అతని మీసాల్ని చేత్తో నిమురుతూ అందామె.

 

    "వచ్చేస్తావా?"

 

    "ఇలాగే, ఇప్పుడే వచ్చేస్తాను."

 

    నవ్వాడతను.

 

    మైత్రేయకి ఈ అనుభవం ఎంతో హాయిగా వుంది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న యవ్వనపు అనుభవం.... అందులో అతనికేం తప్పు కన్పించలేదు.

 

    "నాతో ఒక్కసారి చెరువులో స్నానం చేయ్యవూ" నులకమంచం మీంచి లేస్తూ అందామె.

 

    "పద....."

 

    ఇద్దరూ చెరువువేపు నడిచారు. తను చెరువులోకి దిగి, అతన్ని పట్టుకుని లాగింది.

 

    ఆమె ఈత కొడుతూ, అతనికి  కితకితలు పెడుతోంది.

 

    అలా ఎంతసేపు జలకాలాడారో తెలీదు.

 

    ఒడ్డుకి వచ్చి కూర్చున్నారు.

 

    "మరోసారి నా కోరిక తీర్చవూ?" అతని కళ్ళల్లోకి గోముగా చూస్తూ అడిగింది.

 

    అతను ఆమె భుజాలమీద చెయ్యి వేశాడు.

 

    ఇద్దరికిందా  పచ్చిక. కరిగిపోతున్న  యవ్వనపు రాగగంధంలో వాళ్ళిద్దరూ రతీమన్మథుల్లా వున్నారు.

 

    కాసేపయ్యాక-

 

    ఒడ్డున కూర్చుని చెరువులోకి అలలవేపు చూస్తోందామె తృప్తిగా.

 

    "ఈ జన్మకీ సుఖం చాలు" అతని గుండెలమీద తలపెట్టుకుని అంది వనలక్ష్మి. ఎన్నాళ్ళనుంచో కోరుకుంటున్న మధుర స్పర్శాసుఖం పొందిన తన్మయతతో భారంగా వూపిరి పీలుస్తోందామె.

 

    ఆమె ముఖం మీదున్న జుత్తును పక్కకు తోసి, ఆమె నుదుటిమీద చెయ్యివేసి, పెదవుల్ని మరోసారి ముద్దాడాడు.

 

    "నా పెళ్ళి నిశ్చయమయింది..... ముహూర్తం పెట్టడం కోసమే మా  వాళ్ళు ఆ గిరిజన తండాకు వెళ్ళారు" ఆకాశంవేపు చూస్తూ చెప్పింది వనలక్ష్మి.

 

    ఒక్కసారి ఎవరో తన చెంపమీద చెళ్ళున కొట్టినట్టు ఆమెకు దూరంగా జరిగాడతను.

 

    "ఈ విషయం ముందుగా చెప్పలేదేం?" కోపంగా అడిగాడు.

 

    "ముందు చెప్తే నువ్వు నాతో వుండవు కదా" అతని భుజంమీద చెయ్యివేసి నిలబడుతూ అంది.

 

    "తప్పు కదా?" గిల్టీగా అన్నాడతను.

 

    "తప్పయితే నాదవుద్డి..... నీదికాదు..... ఆ దేవత నన్నే శిక్షిస్తుందిలే" కిలకిలా నవ్వుతూ గుడిసెవేపు అడుగుల వేసింది. గబగబా దుస్తులు వేసుకున్నాడు మైత్రేయ.

 

    "చీర, జాకెట్టు వేసుకుని పైటను సరిచేసుకుంటూ-

 

    "మళ్లెప్పుడొస్తావ్?" అంటూ చీకట్లోకి చూసిన వనలక్ష్మి కెవ్వున కేకవేసింది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    అంతవరకూ రావిచెట్టు వెనక నక్కిన సిద్ధరామయ్య, మిగతా వ్యక్తులు ఒక్కసారిగా మైత్రేయమీద పడ్డారు.

 

    ఎడంకాలితో సిద్ధరామయ్య గుండెలమీద తన్ని, మిగతావాళ్ళను పక్కకు నెట్టేసి, వనలక్ష్మిచెయ్యి పట్టుకుని కొండలవేపు పరుగెత్తాడు మైత్రేయ.

 

    కిందపడ్డ సిద్ధరామయ్య అరుచుకుంటూ లేచి, వాళ్ళిద్దర్నీ వెంబడించాడు.

 

    మిగతా రౌడీలు వాడివెనక పరుగులు పెట్టారు.

 

    కొండలు దాటాక విశాలమయిన ప్రదేశం.

 

    "ఇక్కడో  వూబి వుంది బాబూ! దాని వెనక్కి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు వూబిలో పడతారు. పీడా విరగడయిపోతుంది" అంటూ కుడివేపున్న ఈతచెట్ల మధ్యనుంచి ఊబికి వెనక్కి వెళ్ళారు. అక్కడో బండరాయి వెనక నక్కి కూర్చున్నారు మైత్రేయ, వనలక్ష్మి.

 

    ఆ విశాలమయిన ప్రదేశం దగ్గరకు పరుగు పరుగున వచ్చి ఆగారు నలుగురు రౌడీలు.

 

    అంతే.... ఒక్కసారిగా ఆ నలుగురూ బురదలో కూరుకుపోవడం బయటకు రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, రాలేకపోవడంతో వాళ్ళున్నది ఊబి ప్రదేశమని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు వాళ్ళకి.

 

    నలుగురూ ఒక్కసారిగా భయంతో కేకలు పెట్టసాగారు.

 Previous Page Next Page