"మరి ఆ సర్టిఫికెట్స్?" తిరిగి అడిగాడు అంకుష్.
"ఆ సర్టిఫికేట్స్ ని డూప్లీకేట్స్ గా గుర్తించడం బ్రహ్మతరం కూడా కాదు..." కాన్ఫిడెంట్ గా అంది అర్చన.
"ఆ కాశీచరణ్... నీకు రాసినట్లుగా కొన్ని ఉత్తరాల్ని తాయారు చేయమన్నాను. చేశావా?" అడిగాడు రణదీఫ్.
"మీరు డిల్లీ నుంచి తెప్పించిన జిరాక్స్ పేపర్స్ ని చూసి_ బాగాప్రాక్టిస్ చేసి పకడ్బందీగా ఎప్పుడో తయారుచేశాను. చూడండి..." అంటూ ఓ బ్రౌన్ కవర్ని తీసి రణదీఫ్ చేతికిచ్చింది అర్చన.
"ఆ ఉత్తరాల వైపు చూసి_ అతను ఆశ్చర్యపోయాడు.
"అర్చనా! యూ ఆర్ ఏ వండర్ పూల్ గ్రాఫాలజిస్ట్... అచ్చం జిరాక్స్ పేపర్స్ మీద రైటింగ్ లాగే వుండి నీ రైటింగ్_ అది సరే_ కవర్స్ మీద డిల్లీ పోస్టాఫీసు, లింగ్ షుగర్ ఫోస్టఫీసుల స్టాంపులు... ఇదెలా సాధ్యమయింది? ఇవన్నీ ఎలా సంపాదించావ్?" ఆనందోద్వ్హేగంలో మునిగి తేలుతూ అడిగాడు రణదీఫ్.
"అదే ప్రోపోషనల్ సీక్రెట్..." నవ్వింది అర్చన.
"అసలు ఈ గ్రాఫాలజీ ఎంటో... ఈ గొడవ ఎంటో.... నాకంతా అయోమయంగా వుంది. ఎప్పుడైనా మనం దొరికిపోతే, ఈ లెటర్స్ వల్లే దొరికిపోతామని భయంగా వుంది" భయంగా అన్నాడు అంకుష్.
"ఎప్పుడైనా దొరికిపోతే, మీరు చేసే తెలివితక్కువ పనులవల్లె దొరికిపోతాం తప్ప, ఈ గ్రాఫాలజీ వల్ల కాదు" కోపంగా అంది అర్చన.
నీ ప్రతిభమ నేను తక్కువచేసి మాట్లాడటంలేదు అర్చనా! దిసీజ్ అల్ఫోవన్ ఆఫ్ ది క్రైమ్స్... అవునా కాదా... అందుచేత ప్రతి అడుగు ఆచి తూచి వేయాలని అంటున్నాను..." అన్నాడు అంకుష్.
ఆ లెటర్స్ లోని మేటర్ని సీరియస్ గా చదవడంలో మునిగిపోయాడు రణదీఫ్.
"గ్రాఫాలజీ గురించి నీకు తెలిస్తే నువ్విలా మాట్ల్దాడవు" అందామె కోపంగా.
కొద్ది క్షణాలకి తేరుకున్న అర్చన గ్రాఫాలజీ గురించి చెప్పటం ప్రారంభించింది.
"చేతి వ్రాతల ద్వారా ఆ వ్యక్తుల మన స్తత్వాన్ని తెలుసుకునే శాస్రం పేరే గ్రాఫాలజీ_ చేతివ్రాత అంటే అక్షరాలూ మాత్రమె కాదు_
పిచ్చిగీతలు, పిచ్చి బొమ్మలు_ ఏవైనాసరే...
ఒక మనిషి బ్రెయిన్ లో వుందే ఆలోచనలను తెలుసుకోవడానికి ఇప్పటివరకూ అనేక పరిశోధనలు జరిగినా, వ్యక్తి బిహేవియర్, సైకాలజీ, మేనరిజమ్స్ , మాట్లాడే భాష, వేషాధారణ వీటి ప్రాతిపదికన కొంతమేరకు మనమో నిర్ణయానికి రావడానికి ఆస్కారం వుంటుంది తప్ప సదరు వ్యక్తి అభిప్రాయం ఇదేనని స్పష్టంగా చెప్పడానికి ఆధారాల్లేవు.
అందుకే గ్రాఫాలజీ పుట్టింది. దీనినే హేండ్ రైటింగ్ ఎనాలాసిస్ అని కూడా అంటారు.
ఇది కూడా సైన్స్ లో ఒక భాగమని ప్రపంచదేశాల్లోని శాస్రవేత్త లందరూ గుర్తించారు. పరిశోధనలు చేశారు.
ఇప్పుడు కొన్ని వర్ధమాన దేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్దుల చేతివ్రాతల ద్వారా వారి మనస్తత్వతాన్ని విశ్లేషించి వారిని ఎంపిక చేస్తున్నారు.
ఆయా వయస్సుల రీత్యాఎన్ని రకాల మనుషులుంటారో, వారి వారి చేతివ్రాతలు కూడా ఆ వ్యక్తుల వ్యక్తులకు, మానసిక పరిణతకు, ఆలోచనలకూ అద్దంపడతాయి. అయిదేళ్ళ పిల్లవాడి వ్రాతల ద్వారా అతని మనస్సును ఎలా అంచనా వేయగలమో, తొంభై ఏళ్ళ వృద్దుడి వ్రాతల ద్వారా అతని మనస్సును కూడా మనం అంచనా వేయడానికి గ్రాఫాలజీలో ఎక్కువగా అవకాశం వుంటుంది.
భూగోళం మీద కొన్ని కోట్లమంది ప్రజలు బ్రతుకుతున్నారు. అయినా ఏ ఇద్దరి వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ఒకేరకంగా వుండనట్టే, ఏ ఇద్దరి చేతివ్రతాలూ కూడా ఒకేరకంగా వుండవు. కొంతమందిలో చాలా దగ్గరగా వ్రాతలో పావులికలున్నట్టు కన్పించినా, స్వల్పమైన తేడా వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక మనిషి మెదడులో ఒక నిముషంలో ఒక లక్ష నుంచి ఒక కోటి వరకు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయని, ఆ రియాక్షన్స్ అతి సున్నితమైన శాస్రపరికరాలకు కూడా అందవని,కానీ అలాంటి రియాక్షన్స్ ఆన్నీ మనం చేతివ్రాతల్ని విశ్లేషించడం ద్వారా తెలుసుకోవచ్చని శాస్రజ్ఞలు అంటున్నారు.
చేతులు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి అతి కష్టంమీదొక గ్లాసుతో మంచినీళ్ళు తీసుకున్నాడనుకోండి, ఆ సమయంలో అతని మెదడు నిచ్చిన ఆదేశాల కనుగుణంగానే అతని చేతులు పనిచేస్తాయి.
అలాగే ఆ చచ్చుబడిన చేతులతోనే ఆ వ్యక్తి పేపరు మీద కొన్ని అక్షరాలు వ్రాశాడు అనుకోండి. ఆ వ్రాతలవల్ల కూడా అతని బ్రెయిన్ ఇచ్చిన ఆదేశాలను, శరీరంలో కలిగిన మార్పులకు మనం గుర్తించడానికి అవకాశం అధికంగా వుంది.
చేతివ్రాతల ద్వారా ఆయా అడ, మగ వ్యక్తుల మానసిక పరిస్థితులను మాత్రమే కాకుండా, వారు ఆ వ్రాతల్ని రాసిన సందర్భంలో పరిసరాల ప్రభావాల్ని, వారు వ్యక్తీకరించే భావాల వెనుక, వారిని ఇన్ ప్లూయన్స్ చేసే వ్యక్తులు, పరిస్థితులు, అరైగ్యం, ఆందోళనలు, సంతోషం. దుఃఖం ఇలా రకరకాల మనోవైద్యాన్ని కూడా మనం గ్రాఫాలజీ ద్వారా తెల్సికోవచ్చు."
"అన్ని రాతలు దాదాపు ఒక్కలాగే పంపిస్తాయి గదా. మరి వాటిని ఎలా గుర్తిస్తారు?" ఆసక్తిగా ప్రశ్నించాడు అంకుష్.
"ప్రపంచంలో రకరకాల మనుషులున్నా, ఒక్కొక్క మనిషీ ఒక్కోరకంగా వుంటాడు. అలాగే వ్రాయబడిన అక్షరాలు కూడా. ఒక వ్యక్తి పెన్ను తోనో, పెన్సిల్ తోనో, కుంచెతోనో రాసినప్పుడు అందుకు ఉపయోగించిన ఎనర్జీని కూడా మనం చాలా తేలికగా కనుక్కోవచ్చు.