అతనేం చెబుతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది డాక్టర్ మధురిమ.
చిన్నగా నవ్వాడు కాశీచరణ్.
కాశీచరణ్ నవ్వేటప్పుడు చాలా అందంగా వుంటాడు అనుకొంది మధురిమ.
కాశీచరణ్ బెడ్ నుంచి లేచి_"ఒన్ మినిట్ ప్లీజ్" అని బట్ రూమ్ కేసి వెళ్ళాడు.
"కాశీచరణ్ బహుశా రెండు సూట్ కేసులతో బయలుదేరి వుండవచ్చుగా_ ఒకటి ఎక్కడో మిస్ అయిపోయే
అవకాశం లేకపోలేదుగా? వారం రోజులపాటు హైదరాబాద్ లో వుండందే ఆస్తి వ్యవహారాలూ తెలవని అతనూహించలేకపోతాడా?
అలాంటప్పుడు కేవలం ఒక సూట్ కేస్ తోటే ఎలా వస్తాడు ?" చిన్నగా చెవిలో అంది మధురిమ.
విప్పారిన కళ్ళతో అమెకేసే కొద్దిక్షణాలు అలా చూస్తుండిపోయాడు. ఆమె చెప్పిన దానిలో రీజనింగ్
లేకపోదనిపించింది నీలకంఠన్ కి.
అంతలో ముఖం కడుక్కొని టవల్ తో తుడుచుకుంటూ వచ్చాడు కాశీచరణ్.
"నీలకంఠన్ గారూ... నా పేరు కాశీచరణ్ అవునో, కాదో నాకు తెలీదు నాపేరు కాశీచరణ్ అని మీరే అన్నారు
అలాగే నాకు కోట్లాది రూపాయల్;అ తాతగారి ఆస్తి వుండి. ఆ ఆస్తికి వారసుడని నేనే అని అన్నారు. ఇంకెవరో వచ్చి అర్చన అనే
అమ్మాయిని నువ్వు ప్రేమించావు పెళ్ళి చేసుకోకపోతే గొడవలైపోతాయని హెచ్చరించి వేళ్ళారు.
నిజానికి ఇవన్నీ నాకు ప్రమేయం లేకుండా జరిగిన, జరుగుతున్నా సంఘటనలు_ నేనీ హాస్పిటల్ కు ఒక
పేషెంట్ గా, యాద్రుశ్చకంగా వచ్చుండవచ్చు. నేనిప్పుడు ఒక అనమకుడ్ని, నాకేం జ్ఞాపకంలేదు. అసలేమీ జ్ఞాపకంలేని
పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలీక నేనెంత మధనపడుతున్ననో మీకు తెలీదు.
డాక్టర్ మధురిమ అపారమైన అభిమానంతో, నేనెవరో ఎంతో తెలీని పరిస్థితుల్లో కూడా నా బాగుకోసం కృషి
చేస్తున్నారు. నేను మళ్ళీ మనిషిగా మారేపక్షంలో నేను ముందుగా తీర్చుకోవలసింది. డాక్టర్ మధురిమ రుణం. నేనిప్పుడు
అలోచిస్తోంది త్వరగా కోలుకోవాలని, ఈమే రుణం తీర్చుకోవాలిలని. ఇంతకుమించి నేనేం చెప్పలేను. మాణిక్యమ్మ మనవడిగా
నిరూపించుకోవాలని, ఆమె ఆస్తిని దక్కించుకోవాలని నాకు లేదు. అసలావసరం నాకు లేదు" అన్నాడతను లాయర్ నీలకంఠన్
కేసి అసహనంగా చాస్తూ.
తన గురించి మాట్లాడుతూన్నప్పుడు కాశీచరణ్ కనుకొలకుల్లో కదిలిన కన్నీటితెరను గమనించింది మధురిమ.
ఆమె మనసంతా అర్ధమైపోయింది.
భావంలేని చూపులతో లాయర్ నీలకంఠన్ డాక్టర్ మధురిమవైపు చూశాడు.
" మిష్టర్ కాశీచరణ్! నీలకంఠన్ గారు మీకు మేలుచేస్తే మనిషే.... బాధపెట్టే మనిషి కాదు. టేక్ రెస్ట్" అంటూ
ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేసింది మధురిమ. ఆమెను అనుసరించాడు లాయర్ నీలకంఠన్ .
"నేను కాశీచరణ్ ని మనిషిగా, మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను. కోట్లాది ఆస్తి వస్తుందన్నా నా మీద చిరాకుపడి
పోతున్నాడు. అతని మంచితనం నాకర్ధమైంది. రణదీఫ్ కేవల్కర్ గురించి మాత్రం లాయర్ గా ఆలోచిస్తున్నాను. లక్షరూపాయల
ఆస్తికోసమే కుట్రలు, హత్యలు, కూనీలు జరుగుతున్నారోజులవి. రణదీఫ్ కేవల్కర్ సుశీల కొడుకుగా వచ్చాడు.
సుశీలకు ఒకే కొడుకున్నాడు. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సుశీల కొడుకు కాదనే విషయం మనకిప్పుడు
తెలుస్తోంది.
ఎవరో డ్రామా ఆడుతున్నరనే విషయం మనకు తెలుస్తూనే వుంది.ఎవరు డ్రామా ఆడుతున్నారు? ఈ డ్రామా
ఎప్పుడు ప్రారంభమైంది? అనే విషయం తెలుసుకొందే ఈ ఆస్తి వ్యవహారం తెలెట్లులేదు. నాకీ వయస్సులో మాణిక్యమ్మ ఇంతటి
బాధ్యతను అంటగడుతుందని ఊహించలేదు" భారంగా నిట్టూర్చి లేచి నిలబడ్డాడు లాయర్ నీలకంఠన్.
డాక్టర్ కే.వి.రావు చెప్పిన విషయాన్ని నీలకంఠన్ తో చెప్పింది మధురిమ.
"ఏదేమైనా కాశీచరణ్ పూర్తిగా మనిషిని చేసే పూచీ మీదే. ఎందుకంటే అతనికి జ్ఞాపకశక్తి తిరిగి వస్తేనే, చాలా
సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి" తల వంచుకుని ముందుకు నడుస్తూ అన్నాడు లాయర్ నీలకంఠన్.
అయన అక్కడనుంచి వెళ్ళిపోయాక డాక్టర్ మధురిమ ఒంటరిగా మిగిలిపోయింది. కాశీచరణ్ గూర్చి
ఆలోచిస్తున్నకొద్దీ ఆమె మెదడు వేడెక్కిపోతోంది. డాక్టర్ కే.వి.రావు చేసిన హెచ్చరిక ఆమెను వెంటాడుతోంది.
ఇలాంటి రేర్ కేసుల్లో చాలా ప్రధమైనా విషయం పేషెంట్ ఎట్టిపరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి గురికాకూడదు.
అతడికి సాధ్యమైనంతవరకూ ఏకాంతం కావాలి. శుభ్రమైన గాలి, వెలుతురూ వుండాలి. ఈ ద్వనులకు ఈ వచ్చేపోయే
మనుషులకు దూరంగా అతన్ని వుంచడం అవసరం. ఆ విషయమై ప్రస్తుతం సీరియస్ గా ఆలోచించసాగింది డాక్టర్ మధురిమ.
* * * *
లింగ్ సుగర్ సిటీ, ఫోటోస్టూడియోకి అనుకుని వున్న రూమ్ లో ఈజీచైర్లో రిలాక్స్డ్ గా కూర్చుని, సిగరెట్
వెలిగించాడు రణదీఫ్ కేవల్కర్. అతని ఎదురుగా సోఫామీద అర్చన కూర్చుంది_ ఆమెకు కొంచెం దూరంలో కేన్ చైర్ లో అంకుష్
కూర్చున్నాడు.
"పది హేనురోజులైంది.లాయర్ నుంచి ఎమేసేజ్ రాలేదు. అంటే ఆ లాయర్ మనుషులుగానీ ఇక్కడకొస్తే,
నేనారోజు చెప్పిన వ్యక్తుల్నే కలుస్తాడు. వాళ్ళెలాగా నేనే సుశీల కొడుకుని చెప్తారు" అన్నాడు రణదీఫ్.