Previous Page Next Page 
కాలనాగు పేజి 35

    'ఇది విన్నావా!

    మనశ్శిలా, కర్పూరం అరటి దుంపరసంతో రంగరించి ముఖాన తిలకంగా దిద్దుకుంటే ఆడవారికి మగవారు, మగవారికి ఆడవారు వశ్యులైపోతారు.

    మనః శిలాంచ కర్పూరం పేషయేత్ కదళీరసీ

    అనే నైవతు తంత్రేణ తిలకంలోక మోహనమ్ అనే తంత్రం దత్తాత్రేయ తంత్రం_ ద్వితీయ పటలంలో అయిదవ శ్లోకంగా చెప్పబడింది. ఇది అందరకీ సిలభంగా లభించేది. మరి లోకంలో అందరూ యీ 'తంత్రాన్ని' ప్రయోగించ వచ్చు కదా?' చిరునవ్వు నవ్వూతూ అడిగేడు.

    గంగిరెద్దులా తలాడించాడు నాగరాజు.

    'అదే మూర్ఖం లక్షణం_'

    మళ్ళీ తలాడించేడతను. ఆ తిట్టు తనకో_ సమ్మె వాళ్ళకో - నమ్మి ఆచరణలో పెట్టాలని అనుకునే వారికో_ అతనికి తెలీయదు.

    'రాజూ! మంత్రాలు, తంత్రాలు అందరికీ అంత సులభంగా లభించవు. లభించినా సిద్దించవు. సిద్దిమ్చినా మంత్ర దర్శనం కాదు. మంత్రాది దేవత దర్శనం కాదు. తంత్ర మార్గం తెలీదు-'

    అంతా కొత్త నాగారాజుకి. అతనికివేవీ తెలీవు. అంచేత అదంతా వాఖ్యానం లాగా వింటూ కూర్చున్నాడు.

    "నేను_ ఆ వరసలో ఎన్ని భరిణలున్నాయి. వాటిలో ఒక్కో విషయానికి ఒక్కో తిలకం తయారు చేశాను    నువ్వు అయిదో నంబరు భరణి యిలా అందుకో_'

    లేచి వెళ్ళి తెచ్చాడు నాగరాజు.

    'ఇదిగో తిలకం!

    దీన్ని నీ ముఖాన దిద్దుకో_

     మామూలు బొట్టులాగే భ్రూ మాధ్యమంలో అలకరిమ్చు రాజూ అది శ్రీదేవీ శానం, శ్రీ సరస్వతీ నిలయం... తెలుసా? మూర్ఖుడా! మూడోకన్ను ఒక్క సర్వజ్ఞుడైన సర్వేశ్వేరునికే వుంది. అదెప్పుడూ నివురుగప్పిన నిప్పులా వుంటుంది.

    ఆయన కన్ను తెరిస్తే ఆ దృష్టి ప్రసరించినంతమేరా ఆనాడుమన్మధుడు భససాత్క్రూతుడయినట్లు అయిపోతారు.     
    ప్రళయకాలంలో అయన కన్ను తెరిస్తే ఆ ముక్కంటి కంటే మంతలకి యీ లోకం_ యీ సృష్టి- అంతా సర్వనాశనం అవుతుంది.

    దేవీ విగ్రహం ముందు బలిపీఠాన్ని కుంకుమతో అర్చించినట్లుగా ఆ సర్వేశ్వురుని అర్చించాటానికి మనం ముఖాన నిత్యం తిలకం ధరించాలి కుంకుమలో  అంత మహిమ వుంది తెలుసా?'

    తలాడించేడు నాగరాజు.

    "ఈ తిలకాన్ని వ్యర్దం చేయ్యాద్దు. పరిక్షించటానికివాడొద్దు భస్మాసురిడిలా నాపైన్నే ప్రయోగించద్దు!' నవ్వేడు వైద్యనాథన్.

    లెంపలు వేసుకున్నాడు నాగరాజు "ఎంతమాట గురూగారూ! దీన్ని సంధ్య ముందు మాత్రమే వాడతాను. ప్రామిస్!' అన్నాడు.

    ఏదో తృప్తితో విశ్వశించాడు  వైద్యనాథన్.

    అయన ముఖాన తిలకం దిద్దగానే నాగరాజు లేచాడు, తలవంచి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.

    అతను వైద్యనాథన్ కేసి చూళ్ళేదు.

    చూచి వుంటే అయన ముఖంలో కనిపించే హేళనని తెలుసుకునేవాడు.

    వెనుదిరికి నేరుగా సంధ్య యింటికి కదిలాడు.
   
   
                                                                              *    *    *


     మనస్సు ప్రశాంతంగా లేదు.

    ఈ ఇరవై రోజులుగా రోజూ ఏదో ఒక చికాకు. ఇంట్లో ఏదో ఒక ఘర్షణ. మనస్తాపాలు మనశ్శాంతి కరువయ్యేట్టుగా వగ్దానాలు ఈ వాతావరణం నుంచి కొన్ని గంటలయినా బయటపడాలనిపించింది.

    అందుకే సినిమాకి వెళ్ళాలని అనుకుంది సంధ్య.

    అడిత్యకి ఫోన్ చేసి తనూ అతనూ కలసి వెళదామా అని అలోచించిది సంధ్య.

    కానీ వెంటనే ఆ ఊహని ఉపసంహరించుకున్నది.

    ఇన్ని సంవత్సరాల పరిచయంలో, ఇంనేల్లె స్నేహంలో ఎన్నడూ తాము యిద్దరూ కలసి సినిమాకి వెళ్ళలేదు. డానికి పెద్ద కారణం లడు అవకాశం రాలేదు. అవసరమూ కలగలేదు అంతే!

    ఇప్పుడు సినిమాకి వెళితే_ తమ కుటుంబాలకి తెలిసిన వాళ్ళెవరయినా రూస్తే_

    కొంప మునిగిపోతుందని కాదు_

    తామిద్దరూ ఆ ధియేటర్ లో ఏదో చేయరానిది చేస్తారని కాదు. నలుగురూ అనేట్టు ప్రవర్తిస్తాంనీ కాదు.

    కానీ యీ లోకానికి ఒక వింత దృశ్యం_ ఒక కొత్త దృశ్యం_ ఒక పెళ్ళికాని అమ్మాయి తన కోష్టమైనా సరే_ ఓ యువకునితో కలసి సినిమాకి వెళితే చూసే అవకాశం ఎందుకివ్వాలి....

    తనలో తనే ఎంతగానో వితర్కించుకుంది.

    ఆఖరికి తన క్లాస్ మేట్ పూర్ణతో కలసి సినిమాకి వెళ్ళాలని నిశ్చయించుకుంది.

    ఆ విషయం విశ్వేశ్వరంతో చెప్పి లాభంలేదు.

    కనక దుర్గమ్మకి వివరించి ప్రయోజనం లేదు.
 
    చెప్పాల్సిందల్లా విశాలాక్షికి.... ఆమెకి ముందుగా చెప్పి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. తీరా బయల్దేరే ముందుగా చెప్పి వెళితే చాలు అనుకుంది.

     శరీరం మనస్సు సేద తీరెట్టు స్నానం చేసింది.    
          
    జడ అల్లుకుని, తన కిష్టమైన లవ్ టచ్ శారీకట్టుకుంది. నీలం రంగులో ఆ చీర సముద్రంలా వుంది, ఆకాశంలాగా వుంది. దాన్లో అక్కడక్కడ ప్రింట్ చేసిన చుక్కలు నక్షత్రాల్లా, సముద్రంలోని లంకల్లా వున్నాయి. ఆ చేరకి తగినట్టు బ్లూ పాలిస్టర్ జాకెట్ వేసుకుంది.

    తలలో మల్లెలు తరుమింది.

    తర్వాత ఇంటిమేట్ స్ప్రే చేసుకుంది.

    బ్లూ స్టాప్ వాచ్ పెట్టుకుంది. చేతికి నేలి రంగురాయి వుంగరం... చెవులకి నీలి ముత్యాలు జూకాలు, చేతులకి నీలిరంగు గాజులు అలంకరించుకుంది.

    ముఖాన నీలిరంగు తిలకం దావుసగిమ్జలా దిద్దుకుంది.

    అప్పుడామె ఒక వనమయూరంలాగా, ఒక నీలిమబ్బు తునకలాగా ఒక నీలి శకలంగా, నీలి ప్రవాహంలాగా వుంది కళ్ళకి మనోజ్ఞంగాఉంది.

 Previous Page Next Page