మొన్న మీ నాన్నగారి మంచం క్రింద తవ్వితే ఎముకలు బయట పడ్డాయి కదా! వాటిని తొలగించి వేశాం! దాంతో సగంపీడ పోయింది'
ఆదిత్య ఏమీ అనలేదు.
అంతలో శాస్రిగారు తమ పంచాయతనంలో వున్న చిన్న నాగ విగ్రహాన్ని తమ చేతికి తీసుకున్నారు. పద !'అన్నారు.
ఆ వెనుక శాస్రిగారు.
ఇద్దరూ కలసి యింటికి వెళ్ళేసరికి ధర్మరాజు విశ్రాంతిగా పడుకున్నాడు. అయన అప్పుడే క్లినిక్ నుంచి వచ్చారు. డాక్టర్ దేవనాథ్ ఆక్యుపంక్చర్ చికిత్య ఆయనకి మామూలే అయినా ఆ కొంచెం బాధా నివారణే అయాంకి కొంత బాధా నివారణకి తోడ్పడుతున్నది.
శాస్రిగారిని చూడగానే అరుంధతి లేచి నమస్కరించింది.
ధర్మరాజు కూడా నుంచున్నాడు.
శాస్రిగారు ధర్మరాజు చూడగానే ఉలికిపడ్డారు. అయన యిదేదో క్షుద్ర నాగదేవతలా బాధ అనిపించింది
ఆ పీడా తావులగాతనికి చేతిలో నీళ్ళు తీసుకుని ఏదో మంత్రాన్ని జపిమ్చారు.
"సర్పాపసర్ప భద్రంతే గచ్ఛ సర్ప మహవిష
జనమే జయస్య యజ్ఞాన్తే ఆ స్తీక వచనం స్మర"
మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ నీళ్ళు ధర్మరజుపై చల్లారు.
సరిగ్గా ఆ సమయంలో పెరట్లో ఏదో డబ్బుమన్న శబ్దం వినిపించింది శాస్రిగారి పెదాలపై చిరునవ్వు వెలిగింది.
'ధర్మరాజూ! నీ పీడా విరగడైంది!'
'ఆ శబ్దం ఏమిటి?' అడిగాడు ధర్మరాజు.
'ఆదిత్యా! నువెల్లి చూసిరా!' అన్నారు శాస్రిగారు.
ఆదిత్య పెరట్లోకి వెళ్లేడు. అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చాడు.
ఆదిత్య పెరట్లోకి వెళ్ళి వచ్చేలోగా శాస్రిగారు అరిమ్ధతిని అడిగి పూజ గదిలోకి వెళ్ళేరు. అక్కడ మందసంలో వున్న దేవతా విగ్రహంల సరసన తను వెంట తెచ్చిన నాగప్రతిమని నాద సిద్ది వచనాలు చదువుతూ ఉంచారు.
'అరుంధతీ! నిత్యపూజచెయ్! నీ మాంగల్యం రక్షింపబడుతుంది నీ కుటుంబం హాయిగా, సుఖంగా వుంటుంది. నీ కొడుక్కి మనశ్శాంతి చిక్కి కోరిన అమ్మాయితో పెళ్ళవుతుంది!' అన్నాడు.
ఆ సమయంలో సమీపంలో నుంచి ఎవరో హేళనగా నవ్వినట్టు వినిపించింది. ఆ నవ్వు ఒక్క శ్రీధరశాస్రిగారికే వినిపించింది.
అయన కనుబొమలు ముడిపడ్డాయి
చప్పున పూజగది నుంచి బయటకి వచ్చారు.
అప్పుడోచ్చాడు ఆదిత్య పెరట్లో నుంచి, శాస్రిగారిని చూడగానే "పెరట్లో బావి వద్ద వున్న మామిడి చెట్టు దక్షణ దిశా, కొమ్మ విరిగి బావిలో పడింది!' అన్నాడు.
శాస్రిగారికి నవ్వొచ్చింది.
పసిపిల్లల తగవిలగా తనతో ఆడుకుంటున్న ఆ సర్ప దేవతపై ఆయనకి జాలి కలిగింది. 'నీకు విముక్తి కల్గిస్తాను!' అనుకున్నారాయన దృడంగా.
'వెళ్ళొస్తాను!' అని కదిలారు శాస్రిగారు.
'స్వామీ! మీరు మంత్రజాలం నాపై చిలకరించగానే నా పై వున్న ఏదో బరువు తొలగినట్లయింది. నిజానికి యీ బ్వరువు నా మనస్సుపై వుండింది ఇన్ని రోజుల, శిరోభారంతగ్గినట్టుగా అనిపిస్తోంది!' అన్నాడు ధర్మరాజు.
శాస్రిగారు ముఖాన మందహాసం పర్చస్సులా వెలిగింది.
'ఆరోగ్య సిద్ధిరస్తు!' అని ఆశ్వీరదించి కదిలారు
ఏదో అడగాలన్నట్టు, శాస్రిగారేదో చెప్పలన్నట్టు అయన వెనకే నడిచాడు ఆదిత్య...
'చప్పంది స్వామీ!'
'ఇన్నాళ్ళూ నిన్ను వేధించింది ఓక్షుద్ర నాగదేవత! దెయ్యం లక్షణాలు పెంపోందించుకున్న దేవత. అసుర లక్షణాలు సంపాదించుకున్న సురనగాకన్య! అందుకే కామినీ పిశాచంలాగా నీ చూట్టూ తిరిగింది.
నిజానికి నిన్ను చాలా అభినందించాలి!
ఆమె అందం, యవ్వనం, హోరులు, సైగాసు చూసి నువ్వు ప్రలోభపడి వుండాలి. కానీ నీ జన్మ ఉత్తమమైంది. అందుకే నువ్వు ఆమెను చూసి ప్రలోభాపడలేదు. నీలోని ఆత్మద్రవ్యం గొప్పది" అభినందనగా అన్నారాయన.
'ఇక ఆ నాగకన్య_ ఉలూచీ తిరిగి రాదంటారా?'
'ఊహుఁ వస్తుంది'
'మరెలా?' చప్పున అడిగేడు.
"ఆమెకు కొన్ని శక్తులున్నాయి. వాటిని క్రమశః నాశనం చేయాలి వాటిలో ప్రధమంగా ఇతర్లపై తన శక్తిని ప్రయోగించి బ్దిమ్చే శక్తిని నశింప చేశాను.
"ఆస్తీకస్య వచఃశ్రుత్వా యః సర్పోన నివర్తతే
శతధా భిత్యతే మూర్డ్ని శింశ వృక్షఫలం యధా...
ఈ మంత్రాన్ని నువ్వు ధ్యానించు , జపించకు ద్యానంచాలుదాని మహిమతో ఆమె నీ సమీపానికి రాదు. రాలేదు." చెప్పారు శాస్రీగారు.
ఆదిత్య మనస్సులో మంత్రం ముద్రతమైంది.
"ఇగు అగు" అని చెప్పి వెళ్ళిపోయారు శాస్రీగారు.
33
నాగరాజు వైద్యానాధాన్ వద్దకి వెళ్లేడు మళ్ళీ.
'స్వామీ! సంధ్య నా ముఖం కూడా చూడటంలేదు' దిగులుగా అన్నాడు నాగరాజు అయన పాదాల వద్ద కూర్చుంటూ.
చిరునవ్వు నవ్వేడు వైద్యనాధన్.
అయన పాదాలు వత్తసాగాడు నాగరాజు. అయన కాళ్ళు నొక్కటం హీనంగా భావించలేదు నాగరాజు. అది తన అదృష్టంగా అనుకున్నాడు.
'రాజూ!' అర్ద నిమిలత నేత్రాలతో ఏదో యోగ సమాధిలో వున్నట్టుగా పిలిచాడు వైద్యనాధన్.
'చెప్పండి గురూ!'