విశాలాక్షి తో సినిమాకి వెళుతున్నానని చెప్పింది.
ఆమె నోరువిప్పి ఏదో అనబయింది.
కానీ సంధ్య వినిపించుకోకుండా బయటకి వచ్చింది. లోపలి నుంచి గట్టిగ అరుస్తొన్న విశాలాక్షి మాటల్ని లేక్కించదలచుకాలేదామె.
సంధ్య యిల్లు దాటివచ్చి రోడేక్కింది.
సూటిగా బాటని గమనిస్తూ పూర్ణ యింటి వైపు నడవ సాగింది.
* * *
'సంద్యా!'
మబ్బుకమ్మిన నీలాకాశాన్ని చూసి పురివిప్పి నాట్యం చేయబోయే నెమలి ఏదో అపస్వరాన్ని విని భయపడ్డట్టుగా ఆగిపోయింది.
'ఏమిటి యీ అపశకునం!' అనుకుంది మనస్సులో
'ఎక్కడికి!'
'సినిమాకి!' అంది క్లుప్తంగా. ఇతనితో అనవసరంగా వాదనేందుకు అనుకుంది మనస్సులో.
'ఏ సినిమాకి ?'
వెర్రి మనిషి అనుకుని చెప్పింది సినిమా పేరు.
'ఒక్కత్తివేనా?' అరాతీస్తున్నట్టుగా అడిగేడు.
'ఊహుఁ నేనూ పూర్ణ వెళుతున్నాం!'
'పూర్ణరేవరు?'
'నాప్రేండ్!' అంది 'ఇక వెళతాను'అన్నట్టుగా నాలుగడుగు లేసింది.
'నేను రానా?'
అతని సిగ్గులేని తనానికి, మొరటు తనానికి అసహ్యంచుకుంది సంధ్య. కానీ ఇతనితో తగాదా ఎందుకు అనుకుని' రాజూ! 'నేనూ నా ప్రెండ్ కలసి వెళుతున్నాం,ఆడవాళ్ళం వెళుతూ వుంటే మాతోపాటు నువ్వెందుకు? మనం మరోసారి వెళదాం అయినా ప్రెండ్స్ ని పిక్చర్ కి ఆహ్వానించాలి' కానీ వెళుతూ వుంటే నేనూ వస్తానని వెంట పడతారా?'అంది నవ్వుతూ.
ఎన్నడూ తనతో బాగా, ఫ్రీగా మాటాడదు, తనతో నవ్వాడు. తన ముఖమే సరిగ్గా చూడదు అలాటిది? ఏమిటిది ఈ వింత! హయ్ హయ్! అనుకున్నాడు_ తనని మూవీకి ఇన్ వైట్ చేయమని పరోక్షంగా చెబుతున్నదని అనుకున్నాడు. నాగరాజులో ఎక్కడలేని అనందం పట్టుకొచ్చింది.
ఆ ఆనందంతో అక్కడే ఆమెతో కలసి నాట్యం చేయలన్నంత ఉత్సాహం పుట్టుకొచ్చింది.
'సంద్యా. మనం కలసి సినిమాకి వెళదా,!'
అతని ముఖంలో వచ్చిన మార్పుల్ని గమనించి 'అలాగే' అంది యికవేల్తా' అంది మళ్ళీ.
'వెళ్ళిరా సంద్యా! జాగ్రత్త! ఈ మధ్య ధియేటర్స్ లో పోకిరి అబ్బాయిలు ఎక్కువవుతున్నారు. అటూ ఇటూ చూసుకుని కూర్చోండి! పూర్ణ అంతే సుబ్బాయమ్మగారికి కూతురిగా! ఆ అమ్మాయి ఫర్లేదులే! మంచిదే అ అన్నట్టు ఆ ధియేటర్ కి ఆదిత్య వస్తున్నాడా?'
సంధ్య మనస్సు చివుక్కమంది. 'సినిమాకి టైంమవుతోంది. ధియేటర్ వద్ద పూర్ణఒక్కతే వెయిట్ చాటో వుంటుంది. ఇంకా రాలేదేమని మనస్సులో ఆరాటపడుతూ వుంటుంది. మధ్య యిఇజిద్దుగాడు తగులుకున్నాడు సుత్తివేస్తున్నాడు!' అనుకుంది.
అయినా పైకి చిరునవ్వు నవ్వూతూ అంది.
'లేదు నగరాజూ! ఆదిత్య రావటం లేదు మేమే వెళ్తున్నాం!' అంది. అతని తెలివి తక్కువ తనానికి ఆమెలో అసహ్యం పుట్టుకొస్తోంది.
'సరే! వెళ్ళిరా! థాంక్యూ!' అన్నాడు.
'ఎగైన్ థౌజండ్స్థాంక్స్!' అంది సంధ్య
సంధ్య వెళ్ళి పోయేదాకా అలాగే చూస్తూ నుల్చున్నాడు.
సంధ్య పిక్చర్ కి టైం అవుతూ వుండటంతో గబగబా వెళ్ళిపోయింది.
మే వెళ్ళిపోగానే 'హేట్సాఫ్ గురూగారూ! మీ అంజనం అద్బుతం! మీరిచ్చిన తిలకం అమోఘం. మీ మంత్రం, మీ తంత్రం ప్రశంసనీయం! థాంక్యూ! థాంక్యూ! సంధ్య నాకు దక్కాలి. ఆమె దక్కితే 'అమ్మా' పూజకి సమర్చించుకుంటాను. అనుకున్నారు ఆనందంగా.
అతను తన ఆనందాన్ని ఆపుకోలేక వెళ్ళి వైద్యనాథన్ తో జరిగిందల్లా చెప్పాడు. వైద్యనాథన్ చిరునవ్వు నవ్వేడు నాగారాజుని చూసి.
34
శ్రీధరశాస్రి జపంలో కూర్చున్నాడు ఆయనకి య్తిడంత వింతగా వుంది. విడ్డూరంగానూ వుంది.
పాములు పగబడతాయి. కరుణించి వరలిస్తాయి. పగబడితే వెంటాడి వెంటాడి తరిమి తరిమి చిత్రహింస చేసి చంపుతాయి ఆ వ్యక్తిని అవే సర్పాలు దివ్యాలై కరుణించి వరాలిచ్చే వంశాన్ని అభివృద్ధి చేసి, కుటుంభాన్ని సుఖపెడతాయి.
కానీ పాములిలా క్షుద్రంగా ఒక వ్యక్తిని వెన్నాడతాయా?మాములూ బజారు మనిషికి మల్లె పెళ్ళి చేసుకుని వెంటబడతాయా? వాటికీ వాంఛలుంటాయా? అని యింత స్ఖుద్రంగా వుంటాయా? ఇంట హీనంగా ప్రవర్తిసాయా పాములు?
తనకి ఉపదేశం అయినా మహమంత్రాన్ని అనుష్టిస్తున్నారు. శ్రీ ధరప్రారభించారు. పాము రహస్యాన్ని కనుక్కోవాలని ఆయతన తంత్రాన్ని ప్రారంభిచారు.
ఉదయమే వెళ్ళి పొలాలన్నీ తిరిగి ఆ రోజే మరణించిన సర్పాస్టికలుసంపాదించారు. దాదాపు రెండు గంటలు శ్రమిస్తేనే కానీ ఆయనకి నిఇత్న సర్పాస్టికలు దొరకలేదు. వూరికి దూరంగా మెత్త పొలాల్లో తిరుగుతూ వున్న ఓ పెద్ద సర్పాన్ని ఏదో జంతువు కాలితో మట్టగిమ్చిమ్ది అది విజ్రుభించిన పగతో ఆ జంతువు వెంటపడింది. అది చూశాడు జంతు యజమాని. వెంటబడి కర్రతో నుగ్గు నుగ్గుగా చంపేడు.
తర్వాత దాన్ని నోరు తెరిచి రాగి నాణెం నాలికపై పెట్టి చూట్టూ ఎందు పుల్లలు, చిన్న కర్రలు పేర్చి ఆ పాముకి అగ్ని సంస్కారం చేశాడు.
పల్లెల్లో ఇది మామూలే!
పాముని చంపితే తగిలేస్తారు. కోతిని చంపితే దానిని ఊరేగించి బూడ్చి, సమాధి కట్టిస్తారు. పల్లెలు కాలక్రమేనా పెద్దవై అవి పట్టణాలుగా అభివృద్ధి చెందినా, తరతరాలుగా నివసిస్తూ వున్న ఆ ,మనిషుల్లో యింకా 'యీ నాగరికత' చావలేదు.
శ్రీధరశాస్త్రిగారికి ఆ సర్పాస్తికలు దొరికేయి.