తనను ఎవరో కుదువుతుంటే కోపంగా కళ్ళు తెరిచిన నాగ్ ఓ క్షణం విస్మయంగా చూశాడు.
ఎదురుగా నాలుగేళ్ళ పాప-కడిగిన ముత్యంలా బేతింగ్ డ్రెస్ లో తన వైపే విచిత్రంగా చూస్తోంది. ఆ పాప అమాయకమైన చూపులకి నాగ ప్రసన్నమయిపోయాడు.
మృదువుగా ఆ పాపను దగ్గరకు తీసుకొని "ఏం పాప....." అంటుండగానే___
"నో పాప.....సోనీ.....మై స్వీట్ నేమ్ ఈజ్ సోనీ. రియల్ నేమ్ ఈజ్ హిందు....." అంది చక్రాల్లాంటి కళ్ళను అల్లల్లార్చుతూ.
నాగ్ నవ్వాడు ఆ పాప చమత్కారానికి, దగ్గరకు తీసుకొని నుదుటిమీద అంటీ అంటనట్లు ముద్దెట్టుకున్నాడు.
నాకు ఈత నేర్పిస్తే స్వీట్ కిస్ ఇస్తా, నేర్పిస్తారా అంకుల్?___" తన లేత చేతులతో నాగ్ గడ్డాన్ని కదిలిస్తూ అడిగింది.
ఎవరి పాపయి వుంటుందని నాగ్ చుట్టూపక్కల చూశాడు. ఎవరూ ఆ పాప తాలూకు వారిలా కనిపించలేదు.
పాపని చూస్తూ స్తబ్దుగా కూర్చోలేక పోయాడు నాగ్.
"పదమ్మా నేర్పతాను" అంటూ షూస్ విడిచేసి పాపను ఎత్తుకుని అలాగే వెళ్ళి స్విమ్మింగ్ ఫుల్ లోకి దిగి పోయాడు.
పాప వింతగా చూస్తూ తన చిన్నారి చేతులతో నాగ్ గడ్డాన్ని ఊపుతూ "అంకుల్ మీ డ్రస్ తడిసిపోతోంది.....షేమ్.....షేమ్..... అంది.
"నో ప్రాబ్లమ్ డియర్" అంటూ నాగ్ సోనిని 5,6 అడుగుల లోతున్న ప్రాంతానికి తీసుకెళ్ళి "పాపా రడీ....నేను నీ నడుం పట్టుకుంటాను, నీవు కాళ్ళు, చేతులు బలంగా ఆడించాలి" అంటూ పాపను నీళ్ళమీద బోర్లా పడుకుండబెట్టాడు.
సోనీ ఏ మాత్రం భయపడకుండా కాళ్ళూ చేతులు ఆడిస్తూకేరింతలు కొడుతోంది.
ఈ లోపు స్విమ్మింగ్ పూల్ ఇన్ చార్ల్ పరిగెత్తుకు వచ్చాడు.
"వెరీ బాద్ సర్......స్విమ్మింగ్ డ్రస్ తోటే ఫూల్ లోకి దిగాలిని తెలిసి ఇలా చేస్తారా? ఊపార్ ఆవో...." అంటూ చిందులు తొక్కుతున్నాడు.
నాగ్ అతని మాటలు పట్టించుకొనే స్థితిలో లేడు.
అతను రిసెప్షన్ లో కంప్లయింట్ చేసేందుకు లోపలకు పరిగెత్తాడు.
పది నిమిషాలు గడిచాయి. పాప అలసి పోయింది.
నాగ్ పాపను భుజాలమీద ఎత్తుకున్నాడు. అంతలో పాప నాగ్ భుజం మీంచి ఎగురుతూ "మిమ్మీ...." అంది ఆనందంగా.
నాగ్ తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు.
ఎదురుగా తనారోజు మాబ్ వయులెన్స్ నుంచి రక్షించిన యువతి.
సాహితీ కూడా ఓ క్షణం తను చూస్తున్నది కలో, నిజమో అర్థం కాక లా నిల్చుండిపోయింది.
* * *
"సో....సామంత్ ఆయువుపట్టుపై తొలి చావుదెబ్బ పడిందన్న మాట?" ఆశ్చర్యానందాలు ముప్పిరిగొనగా అడిగాడు భాగ్యరాజ్.
అవునన్నట్లు తలాడించాడు సత్యరాజ్.
"దీంతో మన దారికి వస్తాడా?" భాగ్యరాజ్ సిగార్ పైపుకి నిప్పంటిస్తూ ప్రశ్నార్థకంగా కనుబొమలు ఎగుర వేశాడు.
"ఆపరేషన్ నెంబర్ వన్ పూర్తయింది. నెంబర్ టూకి ఈ రాత్రే ముహూర్తం పెడుతున్నాడు దీపక్ రాజ్ నెంబర్ టూ వలయంలో చిక్కుకున్నాక నీతి. నిజాయితీ, దేశభక్తి అన్నీ మట్టిగొట్టుకు పోతాయి. యూ డోంట్ వర్రీ...."
"వెరీగుడ్."
"అమరి నా సంగతేం చేశావ్?" సత్యరాజ్ సూటిగా అడిగాడు.
"అవునూ___నువ్వు మరో పని చేస్తే?"
"ఏమిటి?"
"నేషనల్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి కాల్ ఫర్ చేసి భూపతిరావు అసమర్థతను ఎత్తి చూపితే?"
పరమ కిరాతకుడయిన సత్యరాజ్ సైతం భాగ్యరాజ్ ఎత్తుకి ఉలిక్కి పడ్డాడు.
"అదంతా తేలికకాదు. భూపతిరావు మననుకొనేంత తెలివితక్కువ వాడు కాదు. అదలా వుంచి నా సంగతి ఏం చేశావని ఇది రెండోసారి నేను గుర్తు చేయటం......" కరక్టుగా అడిగాడు సత్యరాజ్.
భాగ్యరాజ్ ఓ సారి తల పంకించాడు. బట్టతలను ఓసారి నిమురుకొని సత్యరాజ్ వైపు సర్ క్కాస్టిక్ గా చూస్తూ "నీ సంగతి చూడకపోతే.....?" అని తమాషాగా నవ్వాడు.
సత్యరాజు సత్తా ఏమిటో? తనను ఏం చేయగలడో? చేసేందుకు అతని దగ్గర తన తరపున వున్న తుర్ఫ్ కార్డేమిటో తెలుసుకోవాలన్నదే భాగ్యరాజ్ అంతరంగం.
సత్యరాజు లేచి నిలబడ్డాడు. భాగ్యరాజు వైపు చిరునవ్వుతో చూశాడు.
"సత్యరాజుని ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. ఇంతవరకు నీవూ అంతే. నా పని నువ్వు నెగ్గించలేదనుకో......నేనేం చేయక్కర్లేదు? రవిచంద్ర అనే అభాగ్యుడు ఎలాచనిపోయింది? ఎందుకు చనిపోయింది? దాని వెనుక వున్న కథా, కమామిషు పురాణంలా వినిపించేందుకు నా దగ్గర చాలా వున్నాయి."
సత్యరాజ్ మాటల్ని మధ్యలోనే త్రుంచాడు భాగ్యరాజ్.
"ఆ కొన్ కిస్ కా గొట్టాంగాడు చావటం పెద్ద కైమా? ఎఫ్, ఐ. ఆర నేను దగ్గరుండి రాయించాను. అదంత ప్రాముఖ్యం వున్నా చావని నేను భావించటంలేదు" ఆ హాలు ప్రతిధ్వనించేలా నవ్వాడు.
"ఊరకే లా విరగబడినవ్వాడు ఆ చావుకు ప్రాముఖ్యం వుందా లేదా అనేది చెప్పవలసింది నీవుకాదు ఆ చావుతో ముడిపడ్డ వ్యక్తుల పగ, పట్టుదల, బ్యాగ్ర వుండ్" సత్యరాజ్ కి ఆవేశంతో మాటలు తడబడుతున్నాయి.
"ఆహా.....ఎవరబ్బా అంత పగ, పట్టుదల బ్యాగ్రవుండ్ వున్నవారు?" భాగ్యరాజ్ లో ఆవేశం పాలు తక్కువ- ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగల తెలివి తేటలు ఎక్కువ
"ఎవరో చెబితే గుండాకి చస్తావ్" కసిగా అన్నాడు సత్యరాజ్.
"ఊరకే జోకులెయ్యకు సత్యరాజ్__" భాగ్యరాజ్ సత్యరాజ్ ని దువ్వేడు.