Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 35

 

    కొన్ని విషయాలలో మొండితనం పిడివాదం కోసం సుందరముర్తిలో ఏములనో దాగొన్న సత్యం, కొన్ని సందర్భాలలో బైటపడి సీత ముందే మేల్కొనేలా చేశాయి ఇప్పుడు అనవసరంగా వాదించదల్చుకోలేదు సీత. "అలాగా" అని వూరుకుంది.

 

    భార్య అనేది జడ పదార్ధంలా వుంటే ఆనందించే భర్త జాబితాలో చేర్చదగినవాడు సుందరమూర్తి. సీత తను చెప్పిందివిని "అలాగా!" అని వూరుకావటంతో చాలా సంతోషం కలిగింది. 'నికేక్కడ నొప్పోచ్చినా అమ్మని తల్చుకో అదే తగ్గిపోతుంది. ఓసారి ఎమయిన్దనుకున్నావు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది. ఓ రాత్రంతా బాధపడుతూ అమ్మని తల్చుకుంటూ అలాగే పడుకున్నాను. తెల్లారి టకీమని తగ్గిపోయింది. అమ్మని నమ్ముకున్నాగాని మందుని నమ్ముకోలేదు." అంటూ మాతా మహేశ్వరి ఫోటోకేసి భక్తితో చూశాడు. మళ్ళి సన్నాసన్నగా తలనొప్పి మొదలైయింది సీతకి.

 

 

                                                 20

 

    "పెళ్ళికి కొన్న పట్టుచీర కట్టుకో సీతా!" అన్నాడు సుందరమూర్తి. సీత సాదాచిరతో తయారవటం నచ్చక.

 

    "ఈ చీర బావుందిగా, మనం వెళ్ళేది పెళ్ళికి పేరంటానికి కాదు కదా!" అంది సీత జడలో జాజిమాల సరిచేసుకుంటూ.

 

    "అంతకన్నా ముఖ్యమైన చోటుకి, పవిత్ర్రమైన చోటుకి"

 

    "పవిత్రమైన చోటుకెళ్ళేటప్పుడు, పదుగురు నన్ను చూసేలా హంగూ ఆర్భాటం ఆకర్షిస్తూ ఉండకూడదు"

 

    "సీతా! అవతల టైమవుతున్నది. నే అవునన్న ప్రతిదానికి కాదనటం తప్ప బైట తిరిగే మగాడు, వాడికి తెలిసినంత మనకేం తెలుసు అనుకోవటం ఈ అడజాతికే లేదు. ఏది కాకపోయినా భర్త చెప్పడనైనా ఉండాలి" సుందరమూర్తి అలవాటు ప్రకారం కోపం తెచ్చుకుని భర్త అనే మాట నొక్కిపలుకుతూ అన్నాడు.

 

    సీత కళ్ళు చిట్లించి అంతలోనే మాములయింది. మౌనంగా కట్టుకున్న యిస్త్రి వాయిల్ చీర విప్పి పట్టుచీర కట్టుకోవటం మొదలుపెట్టింది.

 

    సీత కాపురానికి వచ్చాక సుందరమూర్తి "మాతామహేశ్వరి " దర్శనానికి సీతని తీసుకెళ్ళలేదు. మాతామహేశ్వరి ఏడాదిలో ఓ నెల భక్తులకి దర్శనమివ్వకుండా దీర్ఘ మౌనంతో దీపంముందు కూచుని సమాధి పూజ చేస్తుందిట. దీపం ఎదురుగా కుచోటం దేనికో? సమాధి పూజకర్ధమేమిటో, సదరు భక్తులకి తెలియదు. కనుకనే భక్తులంతా అది ఆషామాషీ వ్యవహారంకాదని.....అనెలా అమ్మ ముల్లోకాలు తిరిగొస్తుందని..... దేవత, యక్ష, కిన్నెర , కింపురుష లాంటివాళ్ళు కొన్ని పాడుపనులు చేస్తుంటే మందలించటానికి అమ్మ  వెళుతుందని.....సాక్షాత్తూ ఆదిశక్తి అవతారం అమ్మ కాబట్టి ఆ నెలా వివిధ గణాల పూజలు స్వయంగా వెళ్ళి అందుకుంటుందని......తలో రకంగా వీలయినంత గొప్పగా అనుకునేవారు. ఈ అమ్మలని బొమ్మలని నమ్మని హేతువాదుల్లాంటివాళ్ళు మాత్రం "సంవత్సరంలో కర్చెంత అదాయమెంత అని లెక్కలు చూసుకుని పై సంవత్సరం బడ్జెట్ ఏడాది ప్రణాళిక తయారు చేస్తుందని" ప్రచారం చేసేవారు. అసలు రహస్యం అమ్మని నమ్మినవాళ్ళకి తెలియదు,  నమ్మనివాళ్ళకి తెలియదు.

 

     సీత కాపురానికొచ్చినప్పుడు మాతామహేశ్వరి అ నెల లీవులోవుంది. ఇంగ్లిషులో గాక తెలుగులో అయితే దీర్ఘ మాస మౌన సమాధిలో వుంది. నాలుగు రోజుల క్రితమే ఆ పూజ పూర్తయి భక్తులకి దర్శనమివ్వటం మొదలుపెట్టింది.

 

    మాతామహేశ్వరి దర్శనానికి ఈరోజు కుదిరింది. అదయినా ఆఫీసు కెళ్ళకుండా శెలవు పెట్టబట్టి, ఆమె దర్శనానికి జంటగా వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సుందరముర్తికి.

 

    ఇన్నాళ్ళు ఆ అమ్మ మహత్యాలు భర్త నోటంట వింటూనేఉంది. ఇంట్లోనే పాతిక ఫోటోలున్నాయి. కళ్ళు తెరిచినా మూసినా కనిపిస్తూనే ఉంది. మాతామహేశ్వరి మహత్యాలు కధలుగా బోలెడు వింది. అయినా సీతకి ఓ మూఢనమ్మకం లాంటిది ఏర్పడలేదు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు ఎవరి నమ్మకం వారిదిలే అని పట్టించుకోలేదు. అలా అని భక్తీ పెరిగిపోనూ లేదు.

    సుందరమూర్తి అడగంగానే పెద్ద కుతూహలం లేకపోయినా తన కోసంగాక భర్త కోసం బైలుదేరింది. పెళ్ళికి కొన్న ఒకే పట్టుచీర ఉంది, ఆచిరకి జరీ బాగా వుండి ముదురురంగులో కొట్టోచ్చేలా ఉంది. అది కట్టుకెళితే ఏం బావుండదని మానేసింది. మాతామహేశ్వరిని చూడటానికి భర్త కోరికపై బయలుదేరింది. ఆ భర్త ఇస్టానుసారమే కట్టిన చీర విప్పి పట్టుచీర చుట్టబెట్టుకుంది సీత. ఈ దేశంలో భర్త భార్యని ఎంత ప్రేమగా చూసినా తన ఆరో ప్రాణంగా భావించినా కోరికలు, ఇష్టాఇష్టాల విషయంలో తన దారే మంచిదనటం, తమ పోయే దారిలోనే ఆమెని నడవమనటం, ఆమె అలా చేయకపోతే నయనో, భయానో కోపగించుకునో మరీ ముర్ఖుడయితే కొట్టి తిట్టి లొంగదిసుకోవటం నూటికి తొంభై తొమ్మిది మందిలో ఉన్న అవలక్షణమని అలా చేయటం భర్తగా తన ధర్మమని చాలామంది పురుషులు భావిస్తారని సీత కాపురానికొచ్చిన ఈ  నెలరోజుల్లో గ్రహించుకుంది. భర్త విషయమే కాదు, ఈ కొద్దిరోజుల్లో ఇరుగు పొరుగు కధలు కూడా చాలానే వింది.   

 Previous Page Next Page