Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 34

 

    "అంతకముందు పరిక్షలు తప్పేవారా?" అంది సీత అమాయకంగా.

 

    ఈ ప్రశ్న నచ్చలేదు. అయినా పెద్దగా పట్టించుకోను లెదూ. "నేనెప్పుడు పరిక్ష తప్పలేదులే! విను.....అప్పటినుంచి నా ఆరోగ్యం బాగుంది. జిర్రున చిది ఎరుగను." చెప్పాడు సుందరమూర్తి.

 

    "మీరు అనారోగ్యంగా వుండేవారా?" అంది సీత.

 

    "ఊ... ఎప్పుడూ ముక్కు కారుతూ వుండేది." అన్నాడు సుందరమూర్తి భారంగా.

 

    "ఇంకేం కష్టాలు పడ్డారు?"

 

    "అమ్మని నమ్ముకున్నాకేగా ఉద్యోగం వచ్చింది."

 

    "చదువు పూర్తయ్యాక కదా?"

 

    "పుర్తయ్యాకేలే అయినా ఉద్యోగం రావద్దూ, అదెంత కష్టం ఈ కాలంలో."

 

    "పరీక్షలు పాస్ కావటం జలుబు తగ్గటం ఉద్యోగం రావటం ఇంకా మంచివి ఏం జరిగాయి?"

 

    "ఇంకా ఏమిటంటే...!" సుందరమూర్తి చెప్పబోయేలోగా బైటినుంచి ఫ్రెండ్ పిలవటం వెళ్ళటం జరిగింది. అక్కడితో ఆ ప్రసంగం ఆగిపోయింది.

 

    మతామహేశ్వరిని నమ్ముకున్న సుందరమూర్తి భక్తీ, అమయాకంగా, ఒక్కోసారి మూఢంగాను ఉండేది. సీతకోరోజు విపరీతంగా తలనొప్పి వచ్చింది అనాసిన్ గాని  అస్ప్రో గాని తెమ్మని సుందరమూర్తితో చెప్పింది."అమ్మ మంత్రించి ఇచ్చిన కుంకం ఉంది. అమ్మచేత్తో తయారుచేసిన పటిక బెల్లెం ప్రసాదం ఉంది. ఆ కుంకుం బొట్టు పెట్టుకుని ఓ పలుకు పటిక బెల్లెం తిను. మాతా మహేశ్వరి స్మరణ చేస్తూ కాసేపు కళ్ళు మూసుకుపడుకో చేత్తో తీసేసినట్టు తలనొప్పి పోతుంది" అన్నాడు సుందరమూర్తి.

 

    "మీరు చెప్పింది చేస్తాను మాత్రలు నాకు అలవాటే. కాస్త అవి తెచ్చిపెడుదురూ?" అంది సీత ప్రాధేయపడుతూ.

 

    తగ్గుతుంది చూడు. మరోసారి తలనొప్పి వస్తే ఆ మాత్రల పేరే ఎత్తవు." అంటూ చారెడు కుంకం సీత మొఖనా మెత్తి రెండు ముక్కలు పటిక బెల్లెం నోట్లో వేసి సీత పక్కనే కూచుని మాతా మహేశ్వరి శ్లోకాలు చదవటం మొదలుపెట్టాడు సుందరమూర్తి.

 

    సీతకి తలనొప్పితో పాటు మాడునొప్పి మొదలయింది. పైకే ముల్గటం మొదలుపెట్టింది మధ్య మధ్య మాత్రలు తెమ్మని గుర్తు చేస్తున్నది.

 

    మాత్రలు తేవడానికి బజారుకి వెళ్ళాడు సుందరమూర్తి అలా వెళ్ళిన మరో రెండు గంటలకి ఇంట్లో కాలు పెట్టాడు. అప్పటికి సీత తలనొప్పి ఏ మాత్రం పోగా రెట్టింపయింది.

 

    సీత రెండు అనాసిన్ మాత్రలు మింగి వేడి కాఫీ తాగింది. మరో పది నిమిషాలకి ఉష్ కాకి అంటే కకేగిరిపోయినట్టు తలనొప్పి ఎగిరిపోయింది.

 

    ఆ దెబ్బతో సుందరమూర్తి తల పట్టుకుని ఆలోచనలో పడిపోయాడు. కొద్ది సేపటికి కారణం తెలిసిపోయింది. పోంగానే సీతని పిలిచాడు.

 

    'మాత్ర వేసుకోవటం వల్లనే తలనొప్పి తగ్గిందా!"

 

    నిజం చెప్పి భర్త మనసు నొప్పించటం యిష్టం లేక "ఎలాగో అలా తగ్గిందిగా" అంది సీత.

 

    "నీ తలనొప్పి అంత విపరీతంగా రావటానికి కారణం తెలిసింది" అన్నాడు సుందరమూర్తి.

 

    "ఏమిటి?ఎలా?"

 

    "అమ్మ మతామహేశ్వరి నీకు తలనొప్పి తెప్పించింది"

 

    'నాకు తలనొప్పి తెప్పించటం దేనికి? అంటూ తెల్లబోయింది సీత.

 

    "నిన్ను పరిక్ష చేసింది"

 

    "ఎందుకు?"

 

    "భగవంతుడు భక్తులకు పరిక్ష పెడతాడని భక్తీ పుస్తకాలలో చదవలా! అమ్మ నీ భక్తిని పరిక్ష చేసింది.

 

    "నేను భక్తురాలిని కాదే" అనబోయి నాలుక కొరుక్కుంది సీత.

 

    "నువ్వు పూర్తిగా అమ్మని నమ్మలేదు అందుకే అంతసేపు తలనొప్పి వచ్చింది నీ బాధ చూడలేక నీ భక్తిగా శ్లోకాలు చదవటం వల్ల నీ తలనొప్పి తీసేసింది."

 

    "అప్పుడు తగ్గలేదుగా, మాత్రవేసుకున్నాక' అంటూ నసిగింది సీత.

 

    "ఎదవ మాత్రలు అవేసుకుంటే తగ్గుతాయేమిటి, అయినా మాత్రలు వేసుకున్న అయిదు నిమిషాలకే లేచి కూర్చున్నావు. ఇంకా ఆ మాత్రలు సాంతం కరిగి వుండవు. ఇంకా సగం సగం పొట్టలోనే వుంటాయి" చాలా నమ్మకంగా చెప్పాడు సుందరమూర్తి.  

 Previous Page Next Page