"తెలుసు."
"మరి... మొదటిసారి మీరు నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు పేరు చెప్పకుండా చావుబ్రతుకుల్లో వున్న కేసుని
ధైర్యంగా టేకఫ్ చేసి అతన్ని బ్రతికించడం అంటూ మాట్లాడారేగాని, అప్పుడతని పేరు నాకెందుకు చెప్పలేదు?" అని అడిగింది.
"టెన్షన్ లో వుండి చెప్పలేకపోయుంటాను. మీరు అడిగినట్లు గుర్తులేదు. మీకేకాదు_అతనికి కూడా అతని
పేరు కాశీచరణ్ అని, ఆ విషయం లింగ్ షుగర్ లో తెలిసిందని చెప్పలేదు. హాకీం సత్యం ఏకైక పుత్రిక సుశీల కుమారుడివాణి
చెప్పాను."
"దానిమూలంగా ఇక్కడ చాలా గందరగోళం జరిగింది. అతని పేరు తెలీక ఏదో ఒక పేరు పెడదామని మా
శివానందం, మేరీ ప్రతినిస్తుండగా మా జూనియర్ వార్డ్ బోయ్ వెళ్ళి అతని పేరు కాశీచరణ్ అని చెప్పాడట. ఆ విషయం మేరీ వచ్చి
నాకు చెప్పేవరకు తెలీదు" అన్నది డాక్టర్ మధురిమ.
"అయామ్ సారీ డాక్టర్! వృద్ధాప్యంగదా జ్ఞాపకశక్తి సన్నగిల్లడం మూలంగానే అలా జరిగింది" సంజాయిషీ
యిచ్చుకుంటున్నట్లుగా అన్నాడు నీలకంఠన్ .
"ఇట్స్ ఓ.కే... కాశీచరణ్ ని ఎలా ప్రెస్ చేశారు?" తిరిగి వివరాలలోకి వెళ్ళింది మధురిమ.
"డీలిల్లో వున్న లాయర్ శ్రీనాథ్ ని కాంటాక్ట్ చేసి కాశీచరణ్ ని ట్రేస్ చేయమని అడిగాను. శ్రీనాథ్ ఒకప్పుడు నా
జూనియర్. అతను డిల్లీలో వున్న కన్నడ అసోషియేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. లింగ్ షుగర్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి శ్రీనాథ్
కి పరిచయమయ్యాడు. అతని ద్వారా కాశీచరణ్ గురించి తెలుసుకుని అతను పనిచేస్తున్న యాడ్ ఏజెన్సీకి వెళ్ళాడు. కాశీచరణ్
చేత నాకు ఫోన్ చేయించాడు."
"కాశీచరణ్ ని సుశీల కొడుకుగా ఎలా నిర్ఘారించాగలిగారు?" అని అడిగింది ఆమె.
"అతను ఫోన్ లో చెప్పిన విషయాల ద్వారా, అవసరమైన సర్టిఫికేట్స్ తో నన్ను కలవడానికి వస్తున్నానని
చెప్పడం ద్వారా."
"అంతమాత్రంచేతే అతను మధురిమకేసి విస్మనియంగా చూశాడు నీలకంఠన్ .
"నేను మొదటిసారి కాశీచరణ్ గురించి తెలుసుకొనేందుకు_ లింగ్ సుగర వెళ్ళినప్పుడు అతను కోట్లకు
వారసుడని ఎవరికీచేప్పేలేదు. డబ్బు ప్రస్తాపన, ఆశ లేనప్పుడు ఎవరయినా నిజాలే చెబుతారు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం
ఎవరకీ వుండడు" చెప్పాడు నీలకంఠన్ .
అయనకేసి ప్రశంసగా చూసింది మధురిమ. ఏమ్తమయినా సేనియర్ అడ్వకేట్.
"అతను మిమ్మల్ని కలవడానికి డిల్లీ నుంచి ఏ.పి.ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాడు. దారిలో రైలు యాక్సిడెంట్
అయింది. అలాంటప్పుడు కాశీచరణ్ బ్రతికేవున్నట్లు, అదీ నా హాస్పిటల్లో వున్నట్లు మీకెలా తెలిసింది?"
"నువ్వు లాయర్ వి కాబోయి డాక్టర్ అయినట్లుంది. వెరీగుడ్ రీజనింగ్ పవర్. రైలు యాక్సిడెంట్ జరిగిందని
తెలీగానే అక్కడికి వెళ్ళాను హడావిడిగా. కాశీచరణ్ బ్రతికున్న ప్రయాణికుల్లో లేడని తెలుసుకున్నాను. కనీసం శవంగనైనా
దొరకాలిగదా? లభ్యమైన శవాల్లోకూడా అతను లేడు. డెడ్ బాడీస్ ఐడెంటిఫికేషన్ జరిగింది. అటు బతికి బయటపడినవాళ్ళలో
లేక, ఇటు శవంగానైనా లేకపొడవంతో నాలో ఆత్రుత ఎక్కువైపోయి శవం కలిపోయిందేమోనని వెతికించాను. అలాంటిదెం
జరగలేదని, ఆ ఆనవాళ్ళే లేవని రైల్వే రీలిఫ్ ఫ్స్కాడ్ తెలియజేసింది.
దాంతో నాలో ఎక్కడో మారుమూల చిన్న ఆశ అతను బతికే వుండవచ్చని. దాంతోటే ఆస్టిమిస్టిగ్గా ఆలోచించాను.
భయంకరమయిన ఆ ఏక్సిడెంట్ లో అతను ఎగిరి ఆటైనా దూరంగా పడియుండవచ్చని, ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ
వెతికించాను. అయినా ఫలితం లేకపోయింది.
అయినా నా అశ చావలేదు. అతను ఎవరికైనా కోన ఊపిరితో దొరికితే వాళ్ళు ఏదైనా హాస్పిటల్ లో చేర్పించి
వుండవచ్చని భావించి నిద్రాహారాలు మానేసి ప్రతి హాస్పిటల్ కి ఫోన్ చేయడం మొదలెట్టాను.
ఆ ప్రయత్నంలో భాగంగానే, మీ హాస్పిటల్ కి కూడా ఫోన్ చేశాను. నా అదృష్టం బావుండి నా కాల్ ని మీ
జూనియర్ వార్డ్ బోయ్ దిలీఫ్ రిసేవ్ చేసుకున్నాడు.
అతనప్పటికే కాశీచరణ్ బట్టలు మార్చడం కోసం, అతని సూట్ కేసు ఓపెన్ చేసి అతని పేరు కాశీచరణ్ అని,
అతను డిల్లీ రెసిడెంట్ అని తెలుసుకుని వుండడంతో నా అన్వేషణ ఫలించింది.
ఇదంతా హడావిడిలోపడి నేను చెప్పలేదు. మీ వార్డ్ బోయ్, దీలీఫ్ మాత్రం శివానందంకి, మీరీకి అతని పేరు
చెప్పెశాడని తెలిసింది.
నాకు ఇంకో విషయంకూడా తెలిసింది. కాశీచరణ్ రైల్ ఎక్సిడెంట్ జరిగిన బీబీనగర్ రైల్వేక్రాసింగ్ వద్ద పొదల్లో
గాయపడి వుండగా ఎవరో మేడికోస్ అతన్ని తెచ్చి మీ హాస్పిటల్ లో చేర్పించేటట్లు. దాంతో నా అన్వేషణ పూర్తయింది.
కానీలోపు మరొకడు రణదీఫ్ కేవల్కర్ అంటూ వచ్చాడు.
అతను చూపించిన డాక్యూమెంట్స్ అన్నీ కరెక్ట్ గా వున్నాయి. దాంతో నా పరిస్థితి తిరిగి
మొదటికొచ్చినట్లయింది" అన్న్దయన నిట్టూరిస్తూ.
మరికొద్ది నిముషాల ఇద్దరూ కలసి కాశీచరణ్ రూమ్ కెళ్ళారు.
* * * *
"మిష్టర్ కాశీచరణ్! డిల్లీ నుంచి నువ్వు నాతో ఫోన్ లో మాట్లాడవు. అప్పుడు నువ్వు మీ అమ్మ. నాన్న, నీ
సర్టిఫికెట్స్ తో వస్తున్నానని చెప్పావు. ప్రస్తుతం హాస్పిటల్ లో వున్న నీ సూట్ కేసులో ఆ సర్టిఫికెట్స్ గానీ, ఫోటోలుగానీ లేవు.
కేవలం నీ విజిటింగ్ కార్డ్స్ వున్నాయి. వాటిల్లో నువ్వు పనిచేస్తున్న ఫర్ ఫెక్ట్ ఏడ్ ఏజెన్సీ అడ్రస్_ నీ పేరే వుంది. ఆ ఆస్తి నీ
స్వతం కావాలంటే, లీగల్ గా నువ్వే వారసుడువని ప్రూవ్ చేయాల్సిన అవసరం వుంది" కాశీచరణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ
అన్నాడు లాయర్ నీలకంఠన్ .