Previous Page Next Page 
కాలనాగు పేజి 33

    తలాడించింది

    'మీ అత్తగారు ఆదివారాలు చేసేవారు. అది ఆమెతోనేపోయింది. ధర్మరాజుకి యివెవీ పట్టవు_'

    'నిజం స్వామీ!'

    'అరుంధతీ! రేపే ఆదివారం! ఉదయం తలారా స్నానం చెయ్! మీ యింటికి తూర్పు వైపున ఓ పెద్ద పుట్ట వుంటుంది. సుమారు పర్లాంగు దూరంలో వుంది. తడి బట్టలతో వెళ్ళి పసుపూ కుంకుమలతో పుట్టని పూజించి వట్టి, పట్టి పెట్టి పూజ చెయ్! పచ్చపాలు పుట్టలో పోసేయ్ !

    అక్కడ పాముందా? పాము నీ పాలు తాగుతుందా ?

    ఈ ప్రశ్నలు వద్దు ఇది సంప్రదాయం_ ఆచారం_ వ్రాత విధానం అంతే! పూజ అయ్యేదాకా నువ్వు కాఫీ కూడా పుచ్చుకోకు. కాఫీకేంలే అనే మాటలు వినడ్డు చలిమిడి పెసరపప్పు నైవేద్యం పెట్టు!

    ఆదివారంనాడు నీ ఆహారం అదే! రాత్రికి ఏదో ఫలహారం చెయ్యి అక్షరాలా పాటించు... ఏవో పళ్ళు తినాలన్నమాట_ తర్వాత మీ కులస్వామిని దర్శించుకుని రావాలి_'

    'ఎక్కడున్నారు స్వామీ! ఆ జిల్లాల్లో నంద్యాలకి చాలా సమీపంలో సుబ్బారాయుని కొత్తూరు అనే క్షేత్రం వుంది. అది స్వామికి నిలయం. అక్కడ స్వామి ప్రత్యక్ష దైవం! వెళ్ళిరండి!

    ఇక చెప్పాల్సింది లేదన్నట్టుగా కళ్ళు మూసుకున్నారు.

    వెళ్ళిరండి అన్నమాట ఆజ్ఞ, అనుజ్ఞ_ రెండునూ అంత అర్ధవంతంగా మటాడేరు అయన.

    అరుంధతి స్వామికి, శాస్రీగారికి నమస్కరించింది.

    ప్రసాదం తీసుకుని బయటకి వచ్చింది.

    లక్ష్మి ఆమెని అనుసరించింది.

    శాస్రీగారిల్లు దాటివచ్చి ఇద్దరూ రోడ్డెక్కారు! ఆమెకి తనవెంట ఏదో నాగాదేవతా రూపం రక్షిస్తూ వస్తున్న భావన! వెనుదిరిగి చూసింది అక్కడేం వుంది! గాలి!

   
                                                                            32


    అరుంధతి వెళ్ళిన తర్వాత శ్రీధరశాస్రితిరిగి నాగపూజలో మునిగిపోయారు. ఆయనకి తన తపశ్శక్తి రోజురోజుకి తరిగిపోతున్నట్టుగా  అనిపించసాగింది. ఇది క్షుద్ర కాదు. దైవికమే! అయితేనేం! ఆనాగ దేవతిని తిరోగమనని  చేయటానికి తన తపశ్శక్తి ధార పోయవలసి వస్తోంది.

    ఎన్నో సంవస్తారలుగా కూడా బెట్టుకున్న దానం ఒక్కసారిగా దోపిడి దొంగల పాలయి పోయినట్టుగా, ఇన్నేళ్ళ జీవితంలో, నియమ నిష్టలతో, సంపాదించుకున్న శక్తిని ఒక్కసారిగా ధర పోయవలసివస్తోంది.
    ఇది జీవస్మరణ సమస్య అయి కూర్చుంది!
 
    "అయినా తనశ్సక్తికి ఫలితమేమిటి? తనేమని కోరుతున్నారు రోజూ! లోకాస్సమస్తా సుఖిభవస్తు! గో బ్రహ్మణ్యేభ్య శ్శుభమస్తూ నిత్యం అనుకుంటున్నాడు మనస్పూర్తిగా_

    గోవులంటే సర్వ జంతువులనీ, బ్రహ్మణులంటే సర్వ మనవులనీ ఆ మంత్రద్రష్టుల అభిప్రాయం.

    జంతువులన్నింటిలో ఆవులు, మానవజాతిలో బ్రాహ్మణులు బలహీనులు శ్రేయస్సు కోరినట్టు, వారి పురోభివృద్ధి కోరినట్లు సాదు శ్రేయస్సుని ప్రార్దిస్తున్నారు.

    ఇది తెలియని జనం స్వార్దం అనుకుంటుంది_

    అనుకునీ_ మంత్ర రహస్యం అదికాదు కదా!"

    చప్పున ఊహల్ని మరల్చుకున్నారు శాస్రిగారు.

     ద్యానం  కుదరటం లేదు. సమాధి సిద్దించటం లేదు, ఊరకే జపం సాగుతున్నది.

    'స్వామీ!'

    పిలుపుకి చప్పున కళ్ళు తెరిచారు అయన

    వాకిట్లో ఆదిత్య....

    'రా బాబూ!' పిలిచారాయన.

    లోపలకి వచ్చాడు ఆదిత్య.

    'కూర్చో!'

    వినయ విబూషణుడై నట్టుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఆదిత్య. అతని మనోవల్మికంలో ఊహలు సర్పాల్లాన నర్తిస్తున్నాయి.

    "ఊఁ నువ్వూ ఆలోచనలో పడ్డవన్నమాట?"

    'అవును స్వామీ! మీకు తెలియని దేవుంది? నేను సంధ్య ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నాం. మా నాన్న నా పెళ్ళికి అభ్యంతరం చెప్పారు. సంధ్య గురించి అడ్డు చెప్పటానికే వుంది?

    కాని_

    సంధ్య యింట్లో తీవ్రమైన అభ్యంతరాలు తలెత్తుతున్నాయి, ఆ ఇంటి ఆడపడుచు గణాచారి సంప్రదాయానికి వెళ్ళాలని ఆమె మేనత్త అంటుంది. పెళ్ళి విషయం ప్రస్తావిస్తేనే పూనకం వస్తుంది కనకదుర్గమ్మకి విశ్వేశ్వరంగారు మనస్ప్రుతిలో వుండరు.

    ఇన్నిటి మధ్య నాగరాజు_ అతనో అడ్డుపుల్ల...

    ఈ లౌకికమైన వాటిని జయించుకుంటానులే అనుకుంటే, ఎవరో నాగదేవత నన్ను వెంటాడుతోంది.  జన్మజన్మల ప్రేయసినని అంటుంది. తను ఎక్కడ అనుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నది.

    అదేమిటో? ఎలాగో? నాకు అర్ధం కావటం లేదు.

    అందుకే మీ వద్దకి వచ్చాను"

    శాస్రిగారు క్షణంసేపు కళ్ళు మూసుకున్నారు.

    అయన మనోనేత్రం ముందు బుసలుకొడుతూ ఓ నాగు దాని వెనుక లోకరక్షాకరమైన చల్లని చూపులతో మరో పాము!

    ఆయనకి విషయం తెలిసిపోయింది.

    'ఆదిత్యా!' అయన గొంతులో ఆత్మీయత ప్రవాహరూపంలో పెల్లుబికింది. 'నువ్వు భయపడకు!' అన్నారాయన.

    ఆ మాటలు అతనికెంతో ఉత్సాహాన్ని, దైర్యాన్ని యిచ్చాయి.
 
    'మీరలా అన్నారంటే మాకేం భయంలేదు!'

    "ఆదిత్యా! నే నిప్పుడే మీ యింటికి వస్తాను. నా యింటిలో నిత్య పూజలందుకునే నాగా విగ్రహాన్ని మీ యింటికి వదలి వస్తాను. మీరు నిత్యపూజ చేసుకోండి. అన్ని అరిష్టాలు తొలగిపోతాయి.

 Previous Page Next Page