Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 34

    "మాధవ్"
    సంతోషంతో అల్లుడిని కౌగిలించుకున్నాడాయన. "నీ వంటి భర్తని పొందగలిగిన శ్రీదేవి అదృష్టం చాలా గొప్పది బాబూ, ఏ నాటికీ మీలో కల్లోలాలు లేకుండా మీరు హాయిగా జీవించటమే నాకు కావలసింది. అంతే బాబు, అంతే. ఆ మాత్రం భరోసా నీవు యిస్తే చాలు."
    దృడ నిశ్చయంతో అన్నాడు మాధవ్ "ఆ విషయంలో ఇక మీరు నిశ్చంత. ఆ భాద్యత నాది."
    తర్వాత ఇద్దరూ సంతోషంగా పొలాలన్నీ తిరిగేసి, భోజనాల వేళకి యిల్లు చేరుకున్నారు.
                                                       20
    కర్నూలు వచ్చాక శ్రీదేవి మాధవ్ లిద్దరూ నాలుగయిదు రోజులు అంటి అంతనట్టుగానే గడిపారు. కేవలం అవసరాలకి తప్ప మాతడుకోవటం కూడా లేదు.
    ఆనుక్షణం మాధవ్ కి ఆ నాటి రాత్రి శ్రీదేవి అన్న మాటలు మరురోజు మామగారు చెప్పిన విషయాలు స్మృతి పధంలో మెదులుతూ వున్నాయ్. పరస్పరం విరుద్దమయిన యీ విషయాల్ని ఎలా అనుసంధించుకోవాలో అతనికి బోధపడటంలేదు.
    అయినా సమయం వస్తే అన్నీ చక్కబదతాయిలే అన్న వుద్దేశంతో గడుపుతున్నాడు కాలాన్ని,
    ఓ రోజు సాయంకాలం ఆఫీసునుంచి వచ్చేసరికి శ్రీదేవి కృష్ణని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చునుంది కుర్చీలో, దగ్గర్లో కూర్చుని రేడియో ట్యూన్ చేశాడు.
    అరవం పాటలు వస్తున్నాయ్.
    అర్ధం కాకున్న ఆ ట్యూన్ని, ఆ శబ్దాల కూర్పుని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు.
    ఉన్నట్టుండి లేచి రేడియో కట్టేసి "ఏమిటిది?" అంది శ్రీదేవి.
    ముందుగా విభ్రాంతి పడినా తర్వాత తాపిగా అడిగాడు "ఏమిటి?"
    "మీరు ఎందుకిలా చేస్తున్నారు?"
    "ఎలా చేస్తున్నాను?"
    "ఎలా చేస్తున్నారా? ఎలా అడుగుతున్నారి మాట? ఏదో హొటల్ లో భోజనం చేసినట్లు భోజనం ముగించుకుని, మరేదో సత్రంలోనో లాడ్జోలోనో వుంటున్నట్లు వుంటున్నారెందుకని? భార్యా భర్తలంటే యింతేనా? అయితే యిక యీ సంసారాలెందుకు?"
    చిరునవ్వు నవ్వి అన్నాడు "ఏదో నీవు ముభావంగా వున్నావని నేనూ ఎక్కువగా పలుకరించటం లేదు అంతే. కారణం ఏమి లేదు."
    "కాదు లెండి, నా తపన మీకు అర్ధం కాదు. పైగా నే నన్నదంతా అపార్ధం చేసుకుంటారు. మీరే కాదు. ఎవరూ విన్నా అంతే. నా మాటల వెనుక నున్న హృదయం చూడండి."
    మళ్ళీ నవ్వి అన్నాడు "అవన్నీ యిప్పుడేందుకులే శ్రీదూ--నీ మాటల్ని నేను నమ్ముతున్నాను. నీ మనసు నాకు తెలుసు. నేనేంటే నీకు వల్లమాలినప్రేమ. సరేనా?"
    "అదో అదే నే వద్దన్నది. నా కోసం అంటున్నట్టుగా పెదాల చివరి నించి జార్చే మాటలకి విలువ ఏముంటుంది? మీకు తెలీదండి. నేను బ్రతికి వుండగా మీరు అర్ధం చేసుకోలేరు. నిజం. అందుకే కాస్త దూరం వెళితే నన్న అర్ధం చేసుకుంటారేమో ననుకుంటే అది నిష్ప్రయోజనమే అయింది."
    "చీ! చీ! అలా అనకు శ్రీ, నిన్ను బాగా అర్ధం చేసుకున్నాను. నీవు నీ మనసెంతగా నాపై నిలుపుకుంది నాకు అర్ధం అవుతున్నది. అలాంటప్పుడు అఘాయిత్యం మాట లెందుకు?"
    "చేసేవి అన్నీ అఘాయిత్యాలే! పైగా ఎందుకీ బూకరింపులు?"
    నిట్టుర్చాడతను ఏమి అనకుండా.
    "ఏం జవాబు చెపుతారు, చెప్పలేరు. నాకు తెలుసు, మొదటినించి యింతే. ప్రతిదానికి నేను మీపై పడి చావవలసిందే తప్ప మీరేమి అనుకోరు."
    "ఎందుకంత నిష్టూరంగా మాటాడతావ్? శ్రీ......నిజంగా నాకు నీపై ప్రేమలేదా? నేను నీ మాట వినటం లేదా? అన్నీ వ్యత్యస్తంగా అంటావెందుకు?"
    పళ్ళు కొరుకుతూ అంది "నేను వ్యత్యస్తంగా మాట్లాడుతున్నానా? మీరా? ఎందుకండి బొంకులు. ఏ స్త్రీ కి జీవితంలో జరగకూడని అన్యాయానికి పాల్పడినా, నేను పెద్ద మనసు చేసుకుని మీ వద్దకి వచ్చాను మళ్ళీ. అందుకనేగా మీరు యిలా అలస భావంతో చూస్తున్నారు. మీరు ఏం చెబితే అదినమ్మే వెఱ్రి నాగమ్మ ననుకున్నారా?"
    రాబోతున్న కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు "అబద్దాలు చెప్పటం నాకు అలవాటు లేదు శ్రీ. వున్నది జరిగింది చెప్పాను. అప్పుడయినా యిప్పుడయినా ఒకటే చెపుతాను. నమ్మలేకపోతే నీ ఖర్మ- నీవు ఏమనుకున్నా సరే!"
    "సరే నా ఖర్మ అయితే- నా ఖర్మ అన్నాక యింకేముంది? మీ కోసం ప్రాకులాడటం కన్న బుద్ది తక్కువ యింకేమిటి?"
    తర్వాత ఏదో అనబోతూ వుంటే అడ్డువచ్చి అన్నాడు "నా కోసం నీవు ప్రాకులాడుతున్నవా? ఎందుకీ బుకాయింపులు? మన పెళ్ళయినా యీ ఎనిమిదేళ్ళ నించి ఎవరూ ఎవరి మాట వింటున్నది ఒక్కసారి సింహవలోకనం చేసుకుంటే నీకే తెలుస్తుంది. అలోచించి మాటాడు శ్రీ"
    "అవును ఆలోచించే మతాడుతున్నాను. ప్రతి దానికి నేను బెట్టు చేస్తే కాని మీరు దిగిరారు. పంతం పడితే కాని వినరు. ఇది ప్రేమేనా?"
    "అవును, అదే ప్రేమ--
    ప్రేమంటే నీకేం తెలుసు?
    మనిషిని ఘోష పెట్టడం తెలుసు?
    బాధించటం తెలుసు, బాధపడ్డం తెలుసు.
    అంతకు తప్ప ఏనాడయినా నా దృష్ట్యా ఏ విషయంలో నైనా నీవు ఆలోచించావా?"
    "పోనీ మీరు ఆలోచించారా?"
    "నీవు ఎత్తి పొడుపుగా మాటాడినంత మాత్రాన పోయేదేమీలేదు అవును నేనే ఆలోచించాను.
    చెపుతున్నా విను.
    మన పెళ్ళయిన కొత్తలో ఏ మూడు నాలుగేల్లో హాయిగా గడిచిందేమో కాని తర్వాత అన్ని రాజీలే-- అది ఓ వైపు సంధి మాత్రమే.
    ముర్ఖించి పట్టు సాధించుకోవటం తప్ప మరేమీ తెలీదు నీకు.
    నీవు కొండ దిగి రాకపోతే నేనే శ్రమతో కొండెక్కి వచ్చాను ప్రతిసారి. నీ కోరికల దగ్గరికి నేనై వచ్చాను.

 Previous Page Next Page