Previous Page
స్వర్గసీమ పేజి 35

   ప్రతి చిన్న విషయానికి సాధించావు నీవు. పోరబాట్లకి కూడా నాచేత క్షమాపణలు చెప్పించావు. అయినా నేను బాధపడలేదు. ఎందుకు? అని చాలా అల్ప విషయాలు, వాటికీ ముర్ఖించి నిన్ను వదులుకోలేక.
    నీ పంతం కోసం నాచేత సిగరెట్స్, కాఫీ మాన్పించావు. ఫ్రెండ్స్ తో తిరగటం మానుకున్నాను నీకోసం.
    పరాయి స్త్రీ ఎవరయినా సరే పిలిస్తే కూడా పలకవద్దంటే సరే నన్నాను. ఆఖరికి బాబుకి పేరు పెట్టటంలో కూడా అంత మందిలోనూ నీవు పట్టుబట్టి నందుకు నీ యిష్టమే నేరవేర్చాను.
    ఎవరైనా ప్రపంచంలో మేకప్ చేసుకుని నీట్ గా వుండి షోక్ గా తిరిగితే దండిస్తారు, ఒప్పుకోరు. అలాంటిది నేను నిన్ను నీట్ గా వుండమంటే నా మాట వినలేదు. శుభ్రంగా తయారు కమ్మంటే వినలేదు. బయటికి అలా తిరిగొద్దాం రా అంటే ససేమిరా అన్నావు. అయినా సహించాను.
    ఎందుకు?
    నీకోసం! కేవలం నీ కోసం!

    నీకోసం కాదంటావా?
    నీకోసం కాకపోతే నేను జీవితంలో చేయరాని తప్పు చేసినట్టుగా అపనింద వేసినా ఎందుకు సహించానంటావ్?
    నీ సొంత చెల్లెల్ని అనుమానించావ్.
    ఎంత నీచం అది!
    నమ్మకం వుండాలి మనిషి మీద.
    వురికే దడికడుతూ పోతే దాని వల్ల ఫలితం శూన్యమే అవుతుంది చివరికి.
    శీలం గురించి మగవారికి కానీ ఆడవారికి కానీ కొన్ని నిశ్చితాభిప్రాయలుండాలి తప్ప వూరికె యింట్లో కట్టివేస్తే నిర్భందిస్తే ఆగుతారా? అది సాధ్యమా?
    నీవు నన్ను ఎప్పుడూ నమ్మలేదు.
    అది నా దురదృష్టం, ఏం చెయ్యను?
    నిన్ను నమ్మించే శక్తి నాలో లేదు.
    నాకే కాదు యీ ఆంధ్రదేశంలో ఏ మగవాడు నీ లాంటి ఆడదాన్ని నమ్మించలేడు.
    నీవు ఓ అనుమానానివి.
    నీకు ఎప్పుడూ నన్ను శంకించటమే తప్ప నన్ను నమ్మే జ్ఞానం లేదు. నమ్మకం లేదు. పిచ్చి ప్రేమతో శంకించటం తప్ప మరేమీ చేతకాదు.
    కంటికి ఏ ఆడది కనిపిస్తే దాని వెంట వెళ్ళేవాడిగా నన్ను అనుమానిస్తావే నీవు. కానీ నా గుణం నీకు తెలియదు.
    చెపుతున్నా విను శ్రీ........
    నా కంటికి నీవు రంభవు.....
    నా యింటికి నీవు దేవతవి.......
    నా బాబులకి నీవు అమృతవల్లివి.
    నా పాలిటి జ్యోతివి నీవు.
    నాకై దిగివచ్చిన వరానివి నీవు.
    నిన్ను తప్ప నేను చూడలేను.
    నిన్ను తప్ప నేను అనందించలేను, అనుభవించలేను.
    ఇది నా మనస్సు
    ఇది నా ప్రేమ.
    ఇది నా ఆరాధన.
    ఈ విషయం గ్రహించలేవు నీవు.
    నీ అజ్ఞానానికి హద్దు లేదు.
    నీ అనురాగానికి హద్దు లేదు.
    కానీ అనురాగ స్రవంతి దుడుకుమోతు ప్రహహం లాంటిది. అది ముంచుతుందే తప్ప ఓలలాడించలేదు.
    ఈనాటి కయినా యిది ఎందుకు చెబుతున్నా నంటే నీవు యికనయినా గ్రహించుకుని మెలగాలని,
    నీవు గ్రహించలేకున్న నాకు బాధలేదు.
    నేను నిన్ను మససారా ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రాణపదంగా చూచుకుంటావ్. నా పిల్లల్ని ప్రేమిస్తావ్. వారిని జాగ్రత్తగా పెంచుతావ్. నా కది చాలు.
    నీలో ఎంత ముర్ఖత్వమున్నా నేను సర్ధుకుని పోగలను. అందుకే నీవు ఎంత భీష్మించుకున్నా నేను రాజీకి వచ్చేది. అది నా చేత కాని తనం కాదు.
    నీ షరతులకి లొంగి వచ్చానంటే వానిలో మేలుని నేను గ్రహించబట్టి, ఈనాటి కయినా నా మనస్సుని విప్పి చెప్పాను. ఎందుకంటె నీవు నన్ను విడిచి పోతావనే భయం చేత. నీవు లేకపోతే ఈ ఇంట్లో జ్యోతి లేదు. సుఖం లేదు, శాంతి లేదు సంతోషం లేదు.
    ఇవన్నీ లేని జీవితం ఎందుకు?
    ఇవన్నీ వుండి నీ షరతులన్ని పండుగరోజు కూడా మనవాళ్ళు పచ్చడి చేస్తారు ఎందుకు?
    ఇందుకే!
    కారం కలియని పద్దార్ధాలు ఎన్ని వున్నా అవి రుచిని యివవు.
    నీవు నాకు కావాలి.
    నీవు నా యింటికి కావాలి.
    నీవు నా పిల్లలకి కావాలి.
    ఇహనికి పరానికి దారిని సృష్టించేనీవు లేకుంటే ఎలా శ్రీదూ?
    నీవు నీ యిష్టం వచ్చినట్టు చెయ్.
    కాదనను.
    కానీ--కానీ---నన్ను మాత్రం విడిచిపోకు "అలా నే బ్రతకలేను" బాష్ప లోచనుడై చివరిసారి అతనన్న మాటలకి ఆమె చలించిపోయింది.
    అతడు చెపుతూ ఉన్నంత సేపూ శ్రీదేవికి కొద్దిసేపూ కోపం వచ్చింది. మరికొద్ది సేపు ఆశ్చర్యం వేసింది. ఇంకొద్ది సేపు సంభమమైంది. కొంత సేపు ఆనందంతో తెలిపోయంది.
    తనని యింతగా భర్త ప్ర్రేమిస్తున్నాడనే విషయం వినేసరికి ఆమె మనసుకి పగ్గాలు తెగిపోయాయి.
    ఆనందంతో ఆగలేక వెళ్లి అతని భుజాలపై వాలిపోయి గుండెలకి హత్తుకుని పోయింది.
    అతను ప్రేమగా ఆమెని కొంచెం దగ్గరికి తీసుకుని మూర్ధాన్ని చుంబించేడు లాలనతో.
    మృదువుగా మధురంగా మంద్రస్వరంతో మనోమోహనంగా మెల్లిగా అంది.
    "నిజమా? నిజమా? మీరన్నమాటనిజమా?
    చెప్పండి మాధవ్ నన్నంతగా ప్రేమిస్తున్నారా?
    నా జీవితం ధన్యం.
    నా బ్రతుకు ధన్యం.
    భర్త చేత నీవు నా యింటి జ్యోతివి. నా ప్రాణానికి జ్యోతివి వెలుగువి అనిపించుకోవటం కన్న కావలసింది ఏముంది?
    మీరు.....మీరు....భగవంతులు--ఛ-ఛ- భగవంతుడేమిటి అంతకంటే ఎక్కువే--    
    భగవంతుడిని పూజించాలి. కానీ మిమ్మల్ని పూజించకూడదు. అని తపా పూర్ణ స్వరంతో తీయగా టని చెంతకి చెంప ఆనించి అతని కర్ణపుటంలో మృదువుగా మర్మోగేట్టు అంది.
    "ప్రేమించాలి.....ప్రేమించాలి."                                                          

                                                   ____THE END____
    

 Previous Page