"క్షమించటం చాలా తేలిక--కానీ దాని విలువ గుర్తించటం చాలా కష్టం--పోనిలెండి అవన్నీ చెప్పాలంటే కాదు. ఈ యింట్లో గోడలకి చెవులుంటాయ్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం."
లేచిపోతోంటే అడిగాడు "మన ప్రయాణం ఎప్పుడు?"
నిర్లిప్తంగా అడిగాడు "మన [ప్రయాణం ఎప్పుడు?"
నిర్లిప్తంగా చేయి విడిపించుకుంటూ అంది "రేపు శుక్రవారము. ఎల్లుండి పాడ్యమి తర్వాత వారం శూలసోమవారం వెళదాం. అక్కడికి వెళ్ళాకే మన సమస్యలకి పరిష్కారం. ఇహ నేను వెడుతున్నాను. ఆలస్యం అయితే బాబు ఏడుస్తాడు. మీరు పడుకోండి."
తలుపు తీసుకుని, మళ్ళీ తలుపు మూసి వెళ్ళిపోయింది.
అతని మనస్సంతా శూన్యం అయిపోయింది.
19
పైన కండువా వేసుకుని చెప్పులు తొడుక్కుంటూ అన్నాడు.
అలా పొలాల వేపు వెళ్ళొద్దాం వస్తావా మాధవ్?" అతని మామగారు.
"మీరు వెళ్ళి వస్తారా? నాకు కొంచెం పనుంది" అనలేక అనలేక అన్నాడు.
"ఉదయమే పనేమిటయ్యా! అలా వెళ్ళొద్దాం రా! మళ్ళీ ఎంత సేపు--పదింటికలా వచ్చేస్తాం"
ఏదో తనతో మాట్లాడాలనే ఉద్దేశం అందులో కనిపించి అందుకే అలా ఒత్తిడి చేస్తున్నారని గ్రహించి "అలాగే వెడదాం పదండి" అంటూ అయన వెంట బయల్దేరాడు.
ఊరి బయటికి వచ్చాక మామిడితోట వేపు దారి తీస్తూ అన్నాడు.
"ఈ తోట యింకెన్ని రోజులో వుండేట్టు లేదు మాధవ్-- దుర్మర్గుడయినా రాజు ఆక్రమించుకొనేట్టు మాగాణి వోత్తుకుని వస్తూ వుంటే అసహయుడికి మల్లే ఒరిగిపోతోంది మెట్ట"
అయన నిట్టుర్పులో పండినఅనుభవం బాగా ప్రస్పుట మౌతోంది.
ఏమి అనకుండా అయన వెంటే నడవసాగాడు మాధవ్. తోటలో చెట్లన్నీ ముసలవైపోతున్నాయ్. దీనిలో పుష్టి లేదు. వార్ధక్య దశలో కాలిపోబోయేవృద్దిడీలా వున్నాయ్ చెట్లు.
తర్వాత మాగాణి వేపుగా తిసికేడుతూ అన్నడాయన "మన భూములన్నీ యీ వేపుగానే ఎక్కువగా వున్నాయ్"
"ఊ"
"దక్షిణం వేపు కూడా ఓ అయిదేకరాల పొలం వుంది. అది కూడా మాగాణి అవుతుందేమో ఒకటి రెండేళ్ళల్లో, అవేపుగా కూడా యిప్పుడు కాలవలు త్రవ్వకం ప్రారంభించారు, చూశావా మాధవ్?"
తలెత్తి చూశాడు అయన ముఖంలోకి.
ఆందోళనతో విచారంతో ముఖం ముడతలు పడిపోయింది విచారంగా అన్నాడు " పూర్వం మేము గడిపిన జీవితంలో మాకు అన్నీ యీ వూళ్ళోనే దొరికేవి ఏవో కొన్ని ఉప్పు, గుడ్డలు. యిలాంటివి తప్ప అన్నీ దొరికేవి, ఇప్పుడు కాస్త కాస్త మేలు. ఇహ కొన్నాళ్ళు పోతే చివరకు మాకు వరిదాన్యం తప్ప అన్నీ కొనవలసి వస్తుందేమోననిపిస్తోంది. అది నిజం కూడా అయ్యే రోజులు దగ్గర్లోనే వున్నాయ్. పొలం వెళ్ళి అలా అలా తిరిగి ఆరోజుకి కావలసిన కూరగాయలు అన్నీ తెచ్చుకునేవాళ్ళం. కొన్నాళ్ళకి పేరూ అరపేరూ కొంటేనేగానీ గడిచెట్టు కనిపించటంలేదు."
"నిజమే నండి.......ఈరోజుల్ల్లో అందరూ మాగాణిపై భ్రమ పడుతున్నారు తప్ప నిత్యవసరాలకి కావలసిన వాటి జోలికి వెళ్ళటం లేదు. ఏమీ లోకమో క్రొత్త దాని వెంట పడటం తప్ప ఉన్నదాని గుణం క్రొత్తదాని గుణం విచారించదు."
అంతలో పొలం చేరుకున్నారు.
మాగాణి అప్పటికి మోకాటి ఎత్తు పెరిగింది. నల్లగా పరవశకరంగా వున్న మాగాణిని చూసి అనందం వెల్లి విరిసింది.
ఆహ్లాదకరంగా వున్న పొలాన్ని ఆనందంగా ఆప్యాయంగా చూస్తోన్న మాధవ్ ని పలకరించి ఆన్నాడు. "మాధవ్ నిన్ను యిలా తీసుకు రావటానికి కారణం వుంది బాబూ"
"పొలం చూపించాలని కదూ? అంతేనండి?"
నిట్టూర్చి అన్నాడు "అంతేకాదు నాయనా! నేను చేసిన ఓ తప్పిదాన్ని నీకు చెప్పాలని యిలా పిలుచుకుని వచ్చాను."
"మీరా......తప్పుచేశారా?" ఆశ్చర్యపోయి అడిగాడు మాధవ్.
"అవును మాధవ్. చేయరాని తప్పిదం చేశాను. అది నీకు చెప్పందే నా మనస్సు శాంతించదు. అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగాడు.
"ఈ ఆస్తి అంతా నాసార్జితంకాదు."
మాధవ్ అమ్మగారిది అంటే మా నాన్నగారు యీ యింటికి యిల్లరికం వచ్చారు. అందుకని యిప్పటికే అన్నిటా ఆమె ఆజ్ఞేశిరసావహించవలసివస్తోంది. మొన్న ఆమె చెప్పిన మాటను వినే నేను యీ తప్పిదాన్ని చేశాను."
నిర్ఘాంతపోయి వింటున్నాడు మాధవ్. అతనికిదంతా నూతనంగా, విచిత్రంగా వుంది భ్రమ కలిగిస్తూ.
"నా ఆస్తినంతా యిద్దరమ్మాయిలకీ వ్రాసి యిచ్చేశాను మాధవ్. అదే నేను చేసిన బ్రహ్మాండమయిన తప్పిదం"
"ఆస్తి రాసిచ్చారా? అందులో తప్పేంవుంది? మీ అమ్మాయిలకి మీరు యిచ్చుకున్నారు. ఓహొ యిప్పుడే ఎవరి భాగం వాళ్ళకి కావాలంటారనా?
నవ్వి "అది కాదు బాబూ శ్రీదేవిదంతా అదో తరహా మనస్తత్వం. తన పట్టుదల, తన పంతం, తన మాట తప్ప ఇంకొకటి వినదు. తను చెప్పినట్లు జరగాల్సిందే తప్ప మరో విధంగా జరగటం ఒప్పుకోదు.
అలాంటి శ్రీదేవికి యీ ఆస్తి కూడా చేతికి అందితే ఇంకేమయినా వుందా? అలాటి స్త్రీలు ఆర్ధికస్వాతంత్రం కూడా వస్తే యిక చెప్పనక్కరలేదు బాబూ, ఎవర్ని లెక్కచెయ్యరు. ఇది మాకు అంత కష్టంగా వుండకున్నా భర్తవైన నీకు చాలా చిక్కుల్ని తెచ్చి పెడుతుంది.
మాధవ్! అన్నిటికంటే ముందు నీవు చాలా యోగ్యుడివి, శాంతవంతుడివి. కాబట్టి యింతవరకయిన సంసారంలో ఎలాంటి కలతలు రాకుండా చూసుకుంటున్నావ్.
కానీ యిక ముందు శ్రీదేవిలో రాబోయేమార్పు నీ సంసారంలో ఎలాటి చిక్కు పరిస్థితుల్ని తెచ్చి పెడుతుందో నేను వూహించుకో లేకుండా వున్నాను. ఈ విధంగా నేను చేసిన తప్పిదంని సంసార విచ్చేదానికి దారి తీస్తుందేమోనని భయపడుతున్నాను నాయనా?" అంటూ అయన చెప్పటం ఆపాడు. ఇహ తను చెప్పవలసింది లేదన్నట్టు,
గద్గద కంఠంతో విశ్వాసం ఉట్టిపడుతుండగా అన్నాడు "మీరు శ్రీదేవికి తండ్రి.......నేను భర్తని......మీరు ఆమె తొలి జీవితానికి బాధ్యులైతే--నేను మలి జీవితానికి బాద్యుడిని, సారధిని. మీరెంత ఆదరాభిమానాలతో శ్రీదేవిని ఆదరించి పెంచి పెద్దచేశారో నేనూ అంతే.ప్రేమాభిమానాలతో శ్రీదేవిని ఆదరిస్తాను. ఇప్పుడే కాదు. ఇక ముందు కూడా ఆవిడకి ఎలాటి బాధ కూడా రానివను. ఏ కారణం వల్లా మా సంసారాన్ని విడిపోనివను. విచ్ఛిన్నం కానివ్వను."