"నేనసలే టెన్షన్ లో వున్నాను. కావాలంటే మీకు అరవై ఐదు ఏళ్ళున్నా పాతికేళ్ళ నేను మిమల్ని సరదాకోసం ప్రేమిస్తున్నాను_అదీ ఉత్తుత్తిగా. దయచేసి సీరియస్ గా ఆలోచించి చెప్పండి కాశీచరణ్ ప్రస్తుత పరిస్థితేమిటి?" తనలో రేగుతున్న ఉద్వేగాన్ని అనుచుకుంటూ అడిగింది మధురిమ.
"నన్ను ప్రేమిస్తానని చెప్పావుగా... అసలు విషయం చెబుతాను. అతని తలకి పెద్ద గాయం కాలేదు. శరీరం మీద మాత్రం చాలా గాయాలున్నాయి. అవి ప్రస్తుతం హీలింగ్ స్టేజ్ లో వున్నాయి. సో వాటి గురించి కూడా అంతగా భయపడాల్సిన పనిలేదు"
"బహుశా షాక్ వలన గతం మర్చిపోయి వుండవచ్చు. కేవలం బౌతికమయిన గాయాల మూలంగానే మెమోరీ సేల్స్ పాడవ్వవు. షాక్ వల్ల కూడా పాడయ్యే ప్రమాదం వుంది అయితే గతం గుర్తుకువస్తుందా రాదా అనేది నిర్దుష్టంగా చెప్పలేము.
సూర్యలాజికల్లీ హీఈజ్ ఓ.కే.ఎక్సేప్ట్ మెమోరీ సేల్స్... ఆ మెమోరీ సేల్స్ కి దారితీసే బ్రెయిన్ లోని అతి సున్నితమయిన నరాలు తీవ్రమయిన ఒత్తిడికి లోనయిపోయాయి. హైప్రెజర్ కంప్రెషన్... అదే ఇమ్నేషియాకు కారణమైంది. ప్రస్తుతం నువ్వు చేస్తున్నా ట్రీట్ మెంట్ ఓ.కే.ప్రోగ్రస్ రిపోర్ట్ చూసి, అవసరమయితే నేను ఆపరేట్ చేస్తాను.
నా పరిశీలనలో ఒక ఆరోగ్య లక్షణం అతనిలో కనిపించింది. అతను తన గతాన్ని మర్చిపోయినా తన అలవాట్లను, అభిరుచుల్ని మర్చిపోలేదనిపోస్తోంది అలాగే లాగ్వేంజ్ సేల్స్ నాశనమవలేదానిపిస్తోంది. ఏది అమైనప్పటికీ ఇలాంటి రేర్ కేసుల్లో చాలా ప్రధమనమయిన విషయం పేషెంట్ ఎట్టి పరిష్టితుల్లోనూ మానసిక ఒత్తిడికి గురికాకూడదు.
అతడికి సాధ్యమయినంతవరకూ ఏకాంతం కావాలి. శుబ్రమయిన గాలి, వెలుతురూ వుండాలి. ఈ ద్వనులకు, ఈ వచ్చేపోయే మనుషులకు దూరంగా అతన్ని వుంచడం అవసరం. దిసీజ్ మై ఓన్లీ ఎడ్ వైజ్" ఒక స్పెషలిస్టుగా సీరియస్ గా చెప్పాడు డాక్టర్ కే.వి.రావు.
"ఓ.కే డాక్టర్! అతనికి ఏకాంతం కలిపించడానికి ప్రయత్నం చేస్తాను" హామీ యిచ్చింది. డాక్టర్ మధురిమ.
"వస్తాను బేబీ! కృష్ణా ఒబెరాయ్ లో ఓ ఫారిన్ అమ్మాయితో చిన్న సరస కార్యక్రమం వుంది. వాళ్ళంతా టైమ్ లీ పీపుల్. పడుకోవడం, లేవడం అన్నీ టైమ్ కే అయిపోవాలి. రాత్రికి ఫోన్ చేస్తా" అంటూ మధురిమ చెప్పే మాటల్ని వినిపించుకోకుండా బయటకు నడిచాడు.
వరండాలో ఎదురయిన నర్స్ బుగ్గని చేతిటో నిమిరి నవ్వేసి ముందు కెళ్ళిపోయాడు డాక్టర్ కే.వి.రావు.
"ఎవడు మేడమ్ అతడు... మేరీ మేనర్స్ లేకుండా" కొత్తగా జాయిన్ అయిన ఆ నర్స్ అడిగింది.
"డాక్టర్ కే.వి.రావు" చెప్పింది మధురిమ.
"రావుగారా?!" అంతవరకూ అయన గురించి వినడమే తప్ప. చూడని ఆ నర్స్ ముఖంలో ఒక్కసారిగా అయన పట్ల గౌరవప్రపత్తులు కనిపించాయి.
"సారీ మేడమ్! ఎవరో జులాయి అనుకుని కామెంట్ చేశాను" అంటూ తన పనిమీద వెళ్ళిపోయింది.
డాక్టర్ కే.వి.రావు కారెక్కి గేటు దాటుతుండగా, అదే గేట్లోంచి లాయర్ నీలకంఠన్ కారు లోనికొచ్చింది. లోని కెళ్ళాబోయిన డాక్టర్ మధురిమ కారు దిగబోతున్న నీలకంఠన్ ను చూసి ఆగిపోయింది.
నీలకంఠన్ మధురిమ ను చూసి విష్ చేసి "మీతో అర్జంటుగా మాట్లాడాలి. అందుకే ,ముందుగా టెలిఫోన్ చేయకుండా వచ్చాను" అన్నాడు.
"నేనే మీకు ఫోన్ చేయలనుకున్నాను. ప్లీజ్ కమ్" అంటూ తన ఛాంబర్ లోకి నడిచింది మధురిమ.
తానెందుకు ఫోన్ చేయలనుకుందో ఆయనకు చెప్పింది డాక్టర్ మధురిమ.
"వాట్! అంకుషా? అర్చన అన్నయ్య... కాశీచరణ్ ని కలసి వెళ్ళాడా?! వెంటనే మీరు నాకు ఫోన్ చేయాల్సింది" అన్నాడు లాయర్ నీలకంఠన్ .
ఈ విషయంలో కాశీచరణ్ ఎలా అర్ధం చేసుకోవాలో నాకు అర్ధంకావడంలేదు... అంతా కన్ ప్యూజ్ ణ్ గా అంది డాక్టర్ మధురిమ.
"నేను కూడా మీలాంటి పరిస్థితుల్లో వున్నాను" అంటూ రణదీఫ్ కేవల్కర్ తనని కలవడం, తదితర విషయాలన్నీ చెప్పాడు లాయర్ నీలకంఠన్.
"అంటే రణదీఫ్ కేవల్కర్ కొడుకా?"
"అని అంటున్నడతాను."
"ఇంతకీ మీరేవర్ని నమ్ముతున్నారు?" అడిగింది మధురిమ.
"ఎందుకో అతనన్ని సాక్ష్యాలు చూపించినా ఆ రణదీఫ్ ని నమలేక పోతున్నాను. అసలయిన వారసుడు కాశీచరణ్ అనే నా గట్టి నమ్మకం" అన్నాడు నీలకంఠన్ ఎక్కడో ఆలోచిస్తూ.
"నాకంతా అయోమయంగా వుంది. అసలు కాశీచరణ్ గురించి మీకెలా తెలిసింది? కీలకమైన ప్రశ్న వేసింది మధురిమ.
"మనం ఇంతకుపూర్వం కలసినప్పుడు పూర్తీ వివరాలు మీకు చెప్పెలేదనుకుంటా. మాణిక్యమ్మ... అదే మనవడు ఎక్కడున్నా వెతికి ఆస్తి అప్పుగిస్తానని. మాణిక్యమ చనిపోయాక మొట్టమొదటి సారి లింగ్ షుగర్ వెళ్ళాను. అక్కడ కొన్ని వివరాలు సేకరించాక బళ్ళారి వెళ్ళాను. అక్కడ కొన్ని వివరాలు తెలిశాయి.
సుశీల చనిపోయాక సంతోష్ కేవల్కర్ కొడుకుని తీసుకుని లింగ్ షుగర్ నుంచి మరోచోటికి వెళ్ళాడట. అక్కడ అనారోగ్య కారణంగా సంతోష్ కేవల్కర్ చనిపోయాడట. ఆ తరువాత సుశీల కొడుకు డిల్లీల్లో ఏదో ఉద్యోగం వస్తే అక్కడి కెళ్ళిపోయినట్లు తెలిసింది" చెప్పడం ఒకింతసేపు ఆపాడు నీలకంఠన్ .
"మీకతని పేరు కాశీచరణ్ అని అప్పటికే తెలుసా?" అడిగింది మధురిమ.