Previous Page Next Page 
కాలనాగు పేజి 32

                                        31


    సాయంకాలం అరుగంటలైంది ఇంకా సూర్యాస్తమయం కాలేదు.సురాసుర సంపత్తికి యుగయుగాలుగా సాగుతున్నది వైరం వేలుక్కి_ చీకటికి సృష్ట్యాది నుండి శత్రుత్వమే. తన ప్రభవెలిగినంతసేపు సూర్యడు చీకటి- ఆ మోరాక్షసుడి తరిమి తరిమికొట్టి నామరూపాలు  లేకుండా తన శాతహస్రకోటి_ హస్తాలతో కబళిస్తాడు.

    వృద్యాప్యంలో ఎవరికైనా శక్తి క్షిణిస్తుంది. ఆ స్తమయ వేళ మహసర్పమైనా మునగదీసుకుని పడుకోయెప్పుడు కోరలన్నీ ఉప సంహరించుకుని తలలో దాచుకున్నట్టుగా సూర్యుడు తన కిరణాలన్నీ తనలోకి తీసుకుంటాడు.

    అప్పుడోస్తుంది వేయిరెట్లయిన తన బలంతో నిషా సుందరి!

    పరమ క్షుద్ర విద్యాపాసకులూ, మహా మంత్రోపాసకులు కూడా సంద్యా సమయంలో జపతపాలు కొనసాగిస్తారు.పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు....

    అరుంధతీ వచ్చేసరికి శ్రీధరశాస్రీగారు జపం ముంగించి ప్రదోషపూజ ముగించి నివేదన చేస్తున్నారు.

    అరుంధతికి  హారతి యిచ్చాడు. ఆమె కళ్ళకద్దుకుంది.తీరడం ప్రసాదం, మహప్రసాదం అనుకుని స్వీకరించింది.

    లక్ష్మి యీ పూట గది బైటేకూర్చున్నది.  లోపలికి రాలేదు.

    'ఈ రోజు గొప్ప ప్రమాదం తప్పిపోయింది తల్లీ! లేకపోతే యీ శ్రీధరశాస్రీకి బదులు అతని శవాన్ని చూసేదానివి నువ్వు!' ఆ మాట నవ్వూతూనే అన్నారాయన.

    `అరుంధతి ముఖం రక్తమంతా ఏదో పాము పగ బట్టి  పీల్చి అదృశ్యమైన్నట్టుగా పాలిపోయింది.

    'ఏమైంది స్వామీ!' అంటూ గాబరాగా ప్రశ్నించింది.

    'ఏమీ కాలేదు.... కాబోయింది  ఆగిపోయింది!'

    ఆమెకి అర్ధం కాలేదు.

    'అరుంధతీ! నేను సూర్యోదయానికి పూర్వమే ఏటికి వెళ్ళి స్నానాద్యనుష్టానాలు పూర్తీ చేసుకుంటానని తెలుసు. ఈ రోజూ మామూలుగా వెళ్ళాను. ఏదో పాము ఎదురైంది.
 
    అది నాకు సామాన్యమైన అనుభవమే! ఇన్నేళ్ళు జీవితంలో స్నానానికి వెళ్ళేప్పుడో- తిరిగొచ్చే వేళలోనో పొలాల్లో ఎన్నెన్నో పాములు ఎదురయ్యేవి. అవన్నీ బేతాళుడిని చూసిన భూతల్లా పక్కకి తొలగిపోయేవిఏ పామూ నా దారికి ఏనాడూ అడ్డు రాలేదు.

    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు తన సహస్ర ఫణామండలి నా రక్షాభత్రంగా వున్నప్పుడు మామూలు పాములు నన్ను అడ్డుతాయా!

    కానీ యీ రోజూ ఎదురైనా పాము నిలేసింది! అదేపామో! దివ్యమో! అసురమో! తెలీలేదు.

    అడుగు వెయ్యనివ్వదు. అడ్డు తోలగదు.

    కాటేస్తుందా అన్నంతగా దగ్గరి దగ్గరి కొస్తున్నది. సర్ప నిరోధ మంత్రాలు ఎన్నో పఠిస్తున్నాను. అది ఆగటం లేదు.

    ప్రాణాపాయం వచ్చేసిందని_ ప్రాణావసానాదశ వచ్చిందనీ అనిపించింది. ఆ సమయంలో నా  మెదడులో ఏదో మెరుపు మెరిసింది.

    'ఓం నమశ్శివ నారాయణామ! అని కేకలాగా అరిచాను. అది హరిహర మంత్రం. ఎప్పుడో మా తండ్రిగారు ఉపదేశించింది. సిద్ది, శుద్ధి సాధించింది.

    అదే నా ప్రాణాన్ని కోపాడింది.

    ఆ పాము పడగమీద దేబ్బతిన్నట్టుగా తలొంచుకుని వెళ్ళిపోయింది న తల్లి కడుపు చల్లగా నేను తిరిగొచ్చాను!

    అరుంధతికి శరీరమంతా శైత్యం కమ్మినట్టయింది. వెన్నుగుండా ఒక మహసర్పం జరజరా పాకినట్టయింది.               
    శాస్రీగారు చిరునవ్వు నవ్వుతున్నారు.

    కొన్ని క్షణాలు! విబ్రాంతి నుంచి తేరుకుంది అరుంధతి.

    'భగవంతుడు కరుణామయుడు తల్లీ! ఈ లోకంలోనే కాదు ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ దుష్ట శక్తులున్నాయి. మనల్ని కరుణించి వరాలిచ్చే ఆ దేవతల్లోనే మనపై పగసాదించే వారున్నారు.

    అంతెందుకు! ఆ ఇంద్రుడినే తీసుకో! అతనికెంత పదవికాంక్ష! ఎంత స్వార్దం! కుబేరుడు! అతడెంత పసినిగొట్టు! అగ్ని! ఆయన మానవ జీవితం సుఖంగా బోగవంతంగా సాగేందుకు వచన కార్యానికి ఎంత తోడ్పడుతున్నడో, నిశి రాక్షసుడిని ముక్కలు చేసందుకు జ్యోతి రూపంలో ఎంత సహాయపడుతున్నాడో అంత ప్రమాదకారి.

    ఆయన్ని ఉపయోగంచుకోవటంలో ఏ మ్త్రాత్రం అజాగ్రత్తగా వున్న కొంపలు కాలిపోబోయే! ప్రాణాలు పోతాయి! తలపై పాముదనీ, అది వేయి పడగలు దాచుకుని వుందనీ, అజాగ్రత్తలో వుంటే క్షణంలో నయినా కాటేస్తుందనీ ఎరుకలో వుండాలి!

    అప్పుడది రక్షిస్తుంది

    తన పడగతో పట్టాభిషిక్తులను చేస్తుంది. చల్లని నీదని ప్రసాదిస్తుంది" అన్నారు శాస్రిగారు.

    శ్రీధరశాస్రీగారికి మరోసారి నమస్కారం చేసింది ఆ ప్రయత్నంగా

    'స్వామీ! ఆయనకి తిరిగి జబ్బు చేసింది. కళ్ళవ్యాది తగ్గిపోయిందిలే అనుకుంటే కీళ్ళవ్యాది వచ్చింది!'
    'అరుంధతీ! మీ యింటికి దివ్యసర్పగమనం వున్నది. నే ఇచ్చిన మంత్రపూత రేణువులు మామూలు సర్పాలని నిరోదిస్తున్నాయి దేవతా సర్పాలని కాదు. వాటిని నిరోధించాలంటే ప్రత్యక్ష దైవాన్ని కొలవాలి.
 
    'ఎవరు స్వామీ!' ఆత్రంగా అడిగింది అరుంధతి.

    'మీ యిలవేల్పు!'

    మా యిలవేల్పా ? వేంకటేశ్వరుడా ?' అడిగిందామె.

    'కాదు!' గంభీరంగా అన్నారాయన "శ్రీ వెంకటేశ్వరుడు మీ ఆరాధ్య దైవం! మీ యిలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడు_"

    అపరాధం! అపరాధం అన్నట్టుగా చెంపలు వేసుకుంది

    'మీరాయన్ని మరచిపోయారు!

 Previous Page Next Page