"అలాగా?"
"మీకు తెలియదా ఏం. భగవద్గీతలో చదవలేదా......"ఆకాశంబున నుండి శంభుని శిరంబా....."అల్లాగా సాకుతూ పతనం అవుతుందన్నమాట"
ఇంకేం బదులు చెప్పలేదు.
అతను ఒక్క నిమిషం ఆగి అన్నాడు.
"నీవు చాలా మంచిదానవు శ్రీ"
"అవున్లెండి. సమయానుకూలే సన్నిహిత స్త్రీ సన్నిదే వినయేన సంభాషణేవ భూషణమ్ అన్నారుగా"
ఆశ్చర్యపోయాడు.
క్షణంలో తేరుకుని అన్నాడు "ఏమిటి సంస్కృతం మాట్లాడుతున్నావ్!"
"మీకు అర్ధం కావటం లేదా ఏమిటి కొంపదీసి?"
"అదికాదు"
"అంతేలెండి- సరిగా అర్ధం కాని విషయాన్ని ఇంగ్లీషులో గ్రీక్ ఎండ్ లాటిన్ అంటారు చూడండి, అలా మనము అర్ధం కాని దాన్ని సంస్కృతం అంటాం......అలాగా మీరు అంటున్నారేమోనని."
ఈ పర్యాయం నిజంగా ఆశ్చర్యపోయాడు "ఇంత ఇంగ్లిషు......సంస్కృతమూ......"
అవునండి! యీ మూడు మాసాలు సయం సంస్కృత బోధిని బట్టి పట్టేశాను. ఇంటర్ చాలించాక ఆగిన యింగ్లిషు యింకాస్త ముందుకి తోశాను.
"వెరీగుడ్" అన్నాడు ఇంకేమనటానికి తోచక.
అయితే యీ శ్రమంతా దేనికోసమో అతనికి అర్ధం కావడం లేదు.
అయితే మరు క్షణంలోనే అతని సందేహ నివృత్తి చేస్తూ అంది "ఇదంతా ఎందుకో తెలుసా? నేను పి.యు.సి.కి వేదదామనుకుంటున్నాను."
ఆశ్చర్యపోయి ప్రశ్నించాడు "ఎందుకు?"
స్థిరమైన స్వరంతో అంది "ఎందుకేమిటి? దేనికైనా ఎప్పుడవసరం వస్తుందో ఎవరికి తెలుసు? ఇలా ఓ నాలుగేళ్ళు గడిస్తే బి.ఏ. డిగ్రీ అందుతుంది- తప్పక అందుకోగలను, తర్వాత అవసరమైతే కాళ్ళ మీద నిలబడే శక్తి వస్తుంది."
అర్ధంకాక నివ్వెరపోయి అడిగాడు "ఎందుకు?"
"ఎందుకేమిటి? మీకేమి బోధపడటం లేదా నిజంగా? వినండి మీతో పేచి వచ్చింది. ఇలా వచ్చేశాను. ఇలా యిహ ముందు రాకుండా వుండటానికి. నేనూ స్వతంత్రంగా బ్రతగ్గలగటానికికీను. అలా నా విలువ తెలిస్తే కాని మీరు నన్ను గౌరవించరు."
విభ్రాంతుడయ్యాడు.
కొన్ని క్షణాలు భారంగా గడిచాక అన్నాడు "నీవు ఆనాటి సంఘటనని యింకా మరచిపోలేదా శ్రీ?"
కఠినంగా అంది - అతని కౌగిలి విడిపించుకుని లేచి కూర్చుంటూ "ఎలా మరిచిపోతాను? మరచిపో తగ్గ విషయమా అది? మాకన్నా అన్నిటా హినమయిన దాన్ని చూచిన చూపుతో ముట్టుకున్న శరీరంతో .....చీ-చీ- ఎన్ని సంజాయిషీలు చెపితే మాత్రం - మనసుకి శాంతి దొరుకుతుంది? అందుకే యీ పుస్తకాల గొడవలో పడ్డాను" అని మళ్ళీ కొంత సేపు ఆగి అర్ద్రమైన కంఠస్వరంతో అంది "మీకేం తెలుసు ఆడదాని మనసు? నేను మిమ్మల్ని రాజాలా. చక్రవర్తిలా చూసుకున్నాను. దాని ఫలితం ఏమిటి? నన్ను కాదని దాసిదాన్ని ఎక్కువగా చూశారు. దానికే ప్రాధాన్యం యిచ్చారు. నేను వెళ్ళిపోతూ వుంటే ఆగిపోమ్మని బ్రతిమాలలేదు.
వచ్చాక ఓ వుత్తరమయినా వ్రాశారా మీరు? నిజంగా ఎంత కఠినులయినారా అనుకుని ఎంతగా దుఃఖించానో మీకెలా తెలుస్తుంది?"
జలజలా రాలిన కన్నీరు అతని చేతిపై రాలింది, కదిలిపోయాడు ఆమె దుఃఖానికి, ప్రేమ తీవ్రతకి. మళ్ళీ అంది "నేను యింటికి వచ్చి మూడు నెలలు దాటి పోయినా యింటి వేపు ఓ సారయినా తొంగి చూశారా లేదు. ఎందుకని? నేనేమనుకోవాలి?
అందుకనే జీవితంలో మళ్ళీ యిటువంటి సంఘటన సందర్భం రాకుండా వుండాలని యీ జాగ్రత్త.
ఉదయం అందరూ అంటూ వుంటే "జవాబులే రాయలేదేమని "మీరు నివ్వేరపోవడం గమనించాను. పాపం నాన్నగారు వారం వారంమీకో వుత్తరం వ్రాసారు. అవన్నీ నావద్ద వున్నాయ్ చదివి యిస్తానని తీసుకుని నేనే పోస్ట్ చేయించానని చెప్పేదాన్ని వాళ్ళకి తెలియదు మీకు తెలియదు యీ విషయం.
ఆడపిల్లను కన్నవాళ్ళమని వాళ్లు లొంగిపోవటం నా కిష్టం లేదు. మగవారు ఆడదాని కన్నా వాళ్లు లొంగిపోవటం నా కిష్టం లేదు. మగవారు ఆడదాని కన్నా ఎందులో ఎక్కువ? ఇద్దరికి ఇద్దరూ సమానమే? కాదని వాదిస్తే ఆడవారే అన్నిటికి ఎక్కువంటాను. ఇది గ్రహించలేని నాడు సంసారాలు నరకమే.
భార్య విలువ గుర్తించలేని భర్త.
భర్త విలువని తెలుసుకోలేని భార్య--
వీళ్ళు భార్యాభర్తలేనా?
అది ఒక సంసారమేనా?
వాళ్లు--పశువులు--అది సంసారం కాదు--నిస్సారం.
సంతానం కోసం కమేచ్చకోసం. తిండి కోసం కలసి బ్రతికే బ్రతుకులు అవి ఓ బ్రతుకులా?"
ఒక్కసారిగా కీ యిచ్చివదిలిన గ్రామఫోనులా అన్నీ అతన్ని కడిగేసినట్టుగా అడిగేసి ఆగిపోయింది.
అతనికి ఏమి తోచలేదు.
అనుకున్నట్టే ప్రళయం వచ్చేసింది.
కానీ అతను ఎడుర్కొటానికి సిద్దంగా లేడు అయినా అతనికి కావాలసింది రాజీ--యుద్ధం కాదు.
అతనికి కావలసిందతని శ్రీ. ఆమె వియోగం కాదు,
అతనికి కావలసిందతని పుత్ర ప్రేమ--
వారి ఎడబాటు కాదు, అంతే!
నిజాయితీ వుట్టిపడే కంఠంతో అన్నాడు. "వెనకటవన్ని మరచిపో........హాయిగా వుందాం. శ్రీ.దూ--నేను ఏమి తప్పుచేయ్యలేదు. నిజం నమ్మకం లేకపోతే నాది తప్పేననుకుంటే క్షమించు"
ఇంకా అదే తీవ్రతలో అంద