Previous Page Next Page 
యోధుడు పేజి 31

    "అర్ధమైంది కదా.నోర్మూసుకుని వెళ్ళు" అనేసి వేగంగా వెళ్ళి పోయింది మేరీ.

    శివానందం కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్ళు గిరగిరమని తిరిగాయి. వరండాలో చకచకమని వెళ్ళిపోతున్న మేరీవైపు కన్నార్పకుండా చూసి_ అప్పుడే ఆ క్షణంలోనే ఒక నిర్వయానికొచ్చాడతాను. వస్తూనే నెమ్మదిగా ముందుకు నడిచాడు.
   
                                                 *    *    *    *
   
    చాలా సేపటినుంచి మధురిమ డాక్టర్ కే.వి.రావు కోసం ఎదురు చూస్తోంది. ఆమెలో క్షణక్షణానికీ అసహనం పెరుగుతూ పోతోంది.

    ఈ కే.వి.రావు గారేప్పుడూ లేటే. బహుశా 150 ఏళ్ళు బతుకుతాడేమో అప్పుడాయన సమాధిముందు వెరీలేట్ కే.విరావు అని రాయిస్తే బావుంటుంది.

    ఆమె అలా అలోచిస్తుండగానే డాక్టర్ కే.వి.రావు వచ్చాడు రంగు రంగుల పూలషర్ట్, జీన్స్ ప్యాంట్ తో.

    వస్తూనే మధురిమ మేములోని సిరియస్ నేస్ ని పసిగట్టాడాయన. "సారీరా మధూ... కారు పంక్చరయింది" సంజాయిషీ ఇచ్చుకున్నాడు క్.వి.రావు.

    "ఎన్నిసార్లు పంక్చరయింది? గవర్నమెంట్ ఉద్యోగులు లేటయితే_ చుట్టాలకి హార్ట్ ఎటాక్ లు, నాయనమ్మలు అమ్మమ్మలు, తాతయ్యలు ఐదేసిసార్లు చచ్చిపోవటాలు జరుగుతాయి.

    అందుకే దేశంలో వున్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవైట పరమైపోవాలి. పనిచేయకపోయినా, గంట లేట్ గా వచ్చి గంటముందే వెళ్ళే ఎల.ఐ.సి, రైల్వేస్, ఇండియన్ ఎయిర్ లైన్స్, విధ్యుత్ బోర్డ్స్, జాతీయ బ్యాంకులు, టేలీకమ్యూనికేషన్స్, పోస్టల్  డిపార్ట్ మెంట్స్ ని ప్రైవైట్ పరం చేయాలి.

    అప్పుడుగాని వాటిల్లో పనిచేసే సిబ్బంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ని జాయితీగా పనిచేయరు.

    పనిచేయక పోయినా జేతాలు, ఇంక్రిమెంట్స్ మాత్రం పెరగాలి. వాళ్ళేదో ప్రజలకు అల్లుళ్ళయినట్లు ఐ హేట్ ఇన్ సిన్సియర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్" చిరాకుపడిపోయింది మధురిమ.

    "వామ్మో... ఈ మాత్రం లేట్ కే నువ్వు మన్మోహన్ లెవల్లో విరుచుకుపడి పోతున్నవంటే నీక్కబోయే భర్తనైన నేను నిమషం యింటికి లేట్ గా వస్తే ఏకంగా మన్మోహన్ సింగ్ ఇంటివద్ద పనివాడిగా చేర్పించేలా వున్నావ్. అసలు విషయం చెప్పేస్తాను_ కారులో వస్తుంటే తార్నాకదగ్గర ఎల్లోసిల్క్ శారీ, హైహీల్స్, బాబ్ హెయిర్, కూలింగ్ గ్లాసెస్ తో ఐశ్వర్యారాయ్ లాంటి అందమైన అమ్మాయి కనిపించింది. అంతే నా కారు టైర్ కి కాదు నా హార్ట్ కే పంక్చరైంది. అదన్నమాట అసలుసంగతి. అ సంగతలా వుంచి మనం ప్రేమించుకుందామా?" అన్నాడు డాక్టర్ కే.వి.రావు కొంటెగా నవ్వుతూ.

    అయన దోరణకి అంత కోపంలానూ నవ్వోచ్చింది మధురిమకి. నవ్వేసింది.

    "హమ్మయ్య 106 ప్రేమికురాలు నవ్వేసింది. ఇకిప్పుడు చెప్పు ఏమిటి విషయం?" అన్నాడాయన.

    "హమయ్య 106వ ప్రేమకురాలా?  మిగతా 105ఎవరు?" ఆశ్చర్యపోతూ అదిగింది మధురిమ. 

    "నేను నిజాంలాంటోడ్ని_ నిజాంకి 150 మంది భార్యలుంటే నాకు ప్రేమికురాళ్ళున్నారన్నమాట. ఆతనద్రుష్టవంతుడు గనక పెళ్ళాడాడు. నేను అదృష్టవంతుడ్ని గనుక ప్రేమతోటే ఖతం" అన్నాడు తలదువ్వుకుంటూ.

    మధురిమ ఆయన్ని తీసుకుని ఫస్ట్ ప్లోర్ లో వున్న 201 రూమ్ కేసి బయలుదేరింది వాళ్ళిద్దరూ కాశీచరణ్ రూమ్ లోకి ప్రవేశించేటప్పటికే అతను మేల్కొని ఏదో పత్రిక తిరగేస్తూ కనిపించాడు.

    "హి ఈజ్ కాశీచరణ్... నేను చెప్పింది ఇతని గురించే."

    "పేరేకాదు. మనిషి కూడాఎర్రగా, బుర్రగా హిందీ హీరోలా వున్నాడు. ఇలాంటి పేషెంట్స్ వల్లే లేడీ డాక్టర్స్ కి చాలా ప్రమాదాలు  సంభవించే అవకాశాలున్నాయి" అని కుర్చీలో కూర్చుంటూ డాక్టర్ మధురిమ యిచ్చిన బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్ ని అందుకుని పరీక్షించసాగాడు డాక్టర్ కేవి.రావు.

    "ఏమయ్యా! నువ్వు బ్రెయిన్ తో ఎక్కువ ఆలోచించావా?" అని అడిగాడు కే.వి. రావు తమాషాగా.

    "ఏం డాక్టర్...!" అంది మధురిమ.

    "సాధారణంగా మనం ఏదైనా వస్తువుని వుపయోగించకుండా వుంచేశామనుకో ఏమవుతుంది?"
 
    "కుళ్ళిపోతుంది లేదా పనికిరాకుండా పోతుంది" చెప్పింది మధురిమ.

    "అందుచేతే అడిగా."

    ఆ జోక్ కి నవ్వినా, వెంటనే తేరుకుని "వ్వాట్ డాక్టర్ ఎనీథింగ్  సీరియస్?" అంటూ అడిగింది మధురిమ.

    "సీరియస్సా.... కాదా మరి, నువ్వో, దేవుడో ఎవరు రక్షించారో తెలీదు కానీ, అంతా బాగానే వుండది కానీ మెమోరీ సేల్స్ బ్లాక్ అయిపోయాయి" అన్నాడు డాక్టర్ కే.వి.రావు.

    "ఆ సేల్స్ బాగైపోతే జ్ఞాపశక్తి వస్తుందంటారా?"

    "చెప్పలేం.... తెగిపోయిన కరెంటు తీగల్ని కలిపితే లైటు వెలిగినట్టు జ్ఞాపశక్తి వస్తుందనుకున్నావా? ఆపరేట్ చేయాల్సి రావొచ్చు" ఎక్సరేణి పక్కనపడేసి కాశీచరణ్ తలని కాసేపు పరీక్షించి ఆలోచనలో పడ్డాడు డాక్టర్ రావు. మధురిమ అయనకేసే ఆత్రుతగా చూడసాగింది.

    "ఏం ఫర్వాలేదయ్యా...కంగారుపడకు. ఎవ్వరి థింగ్ విల్ బీ అల్ రైట్. కమాన్ బేబీ. కాసేపు ప్రేమించుకుందాం రా" అంటూ బైటికి నడిచాడు డాక్టర్ కే.వి.రావు ఆలోచనలనుంచి తేరుకుంటూ.

    మళ్ళీ ఆశ్చర్యపోవడం కాశీచరణ్ వంతైంది.

    "అయన తరహానే అంత. మళ్ళివస్తా" అంటూ డాక్టర్ కే.వి.రావు వెనక బయటకు నడిచింది డాక్టర్ మధురిమ. ఆశ్చర్యంగా వెళుతున్న ఆమెకేసే చూస్తుండిపోయాడు కాశీచరణ్.
   
                                                                *    *    *    *

 Previous Page Next Page