Previous Page Next Page 
కాలనాగు పేజి 31

    అదృశ్య శక్తి నై నేను నిన్ను అడ్డుకుంటాను.

    నువ్వు ధర్మరాజుగారి కళ్ళు పోగొట్టేవు. తిరిగి తెప్పించావు. ఒక్కరోజు ఆలస్యమైన వుంటే నేనే ఆయనకి చూపు తెప్పించేదాన్ని.

    నువ్వు శ్రీ ధరశాస్రీగారితో నువ్వే 'కాలనగు' నని చెప్పుకున్నావు. నాకు నవ్వొచ్చింది. ఎందుకీ వేషాలు.
    ఉలూచీ!

    నువ్వు వేయి సంవత్సారాలుగా అతన్ని వేదిస్తున్నావు. అతని ప్రతి జన్మలో ఏదో విధంగా అతని ప్రేమ పొందాలని చూస్తున్నావు. నిజానికి నేది ప్రేమ కాదు. కామం! అవధులు లేని కామం!

    ఇన్ని సంవత్సారాలు అతనిపై పాముపగ సాధించకుండా_ తపస్సు చేసి వుంటే నువ్వు నాగాభరణం అయ్యేదానివి! శివుడి కంఠంలో ఒక్క రోజయినా కంఠంహారంగా వెలిగేదానివి, లేదా భుజ భక్తీ ర్తివి అయ్యేదానివి. ఊహూఁ నీకూ తపస్సులో విశ్వాసం లేదు.

    అస్తీకుడి వంశం అయినా నీది నాస్తిక భావమే!

    అందుకే నా శక్తి ముందు నీ శక్తి వీగిపోతున్నది!'

    వినత బుసకొడుతున్నట్టుగా శాంతంగా నెమ్మదిగా చెప్పిందంతా వింది ఉలూచి.

    ఆమె కోపం శిఖరాగ్రం చేరుకున్నది. బస్ మన్నది. ఆ క్షణంలో ఆమె విడిచిన వేడిగాలికి పున్నాగ చెట్టుకొమ్మకి ఆ వైపు వేలాడుతున్న ఆకులూ నల్లగా మాడిపోయాయి.

    వినత ఫక్కుమని నవ్వింది.

    'ఉలూచీ! ఇదీ పద్దతి ఇలా శక్తిని వృధా చేస్తావు. మనమైనా మానవులైనా, దేవతలయినా యిలా కోపానికి తమ శక్తిని వృధాచేస్తే నిర్వీర్యంలవుతారు.

    ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్న శక్తి మన నాగవత్సరాల్లో రెండేళ్ళు నువ్వు శివద్యానం చేస్తే తిరిగి పొందలేవు!'

    'వినీతా!' కోపంగా పిలిచింది "ఇది మనకి స్థలం కాదు. మనరాజైన సహాస్రజిహ్వాని ముందు తేల్చుకుందాం! సర్ప నృత్యంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓడిపోయినవారు గెలిచినవారి దారికి రాకూడదు.
 
    లేదా పరమ శివుని సన్నిధికి వెళదాం! మనలో ఎవరికీ భక్తీ ఎక్కువుగా వుందో ప్రశ్నిద్దాం. అక్కడి ప్రమాద గణాలని మన తపశక్తిని అంచనా వేయమందాం! నేను పంచాక్షరిని జయించాను. ప్రతిక్షణమూ నేను పంచాక్షరి జపిస్తాను.
    నా పంచాక్షిరీ మంత్రం గొప్పదా?

    నీ నారాయణ మంత్రం గొప్పదా?

    నీ వెక్కువా? నే నెక్కువా?

    తేల్చుకుందాం! పద! పద! అంది ఉలూచీ.

    వినిత గాఢంగా నిట్టూర్చింది.

    అప్పటికీ బాగా చీకటైంది. ఆకాశంలో చందమామ వచ్చి షికారు ప్రారంభించాడు. చల్లని వెన్నెలని ధారగా కురియిస్తున్నాడు. ఆనాడు శుద్ధ దశిమి. రోజు రోజుకీ కళలు పెంచుకునే వయస్సు అత్రేయుడిది.

    చల్లనిగాలి ఆగి ఆగి వీస్తున్నది పున్నాగ పూలపై నుండి పరిమళాలని మోసుకుంటూ వస్తున్నది. తాను మలయపర్వతం నుంచి వస్తోన్నంత గర్వంగా వీస్తున్నది గాలి.

    ఆ గాలి పీల్చి అదో విధమైన మత్తు నాశ్రయించింది వినిత. అదే గాలిని పీల్చి ఉద్రేకం పొందింది ఉలూచి.
 
    "ఉలూచీ! ఇది మన యిద్దరి సమస్య! దీన్ని వర్గ సమస్యగా మార్చక! మీరు శైవులు. మేం వైష్ణువులం. మీ పూర్వీకులు అంతా శివుడికి అంగంగా శోభని తెచ్చారు. మాది ఆదిశేషుని వంశం. అయన శ్రీమన్నారాయణునికి పాన్పుగా అయి తన జన్మని ధన్యం చేసుకున్నాడు. మేం ఆయన్నే అనుసరిస్తున్నాం.
 
    ఎప్పుడో మన మధ్య పగలు చెలరేగాయి. ఒకరి నోకరం కాటు వేసుకున్నాం, కసికసిగా పెనవేసుకుని పరస్పరం అపకారం కల్పించుకున్నాం చంపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నాగాజాతిని రెండు చేయక!

    అలా చేస్తే నిన్ను దోషిగా నిలబెడతాను.

    పరమశివుని సన్నిధిలో నువ్వు నేరస్తురాలివిగా నిలబడతావు. అయన ముక్కంటి మంట అరసేకను సోకినా నువ్వు భస్మమవుతావు. అపుడు నీకు ఏ హిన జన్మ వస్తుందో!'

    'వినీతా! నన్ను బెదిరిస్తున్నవా?'

    'ఊహూ ! నీకు మంచి  చెబుతున్నాను!'

    'నా నుంచి నాకు తెలుసు లే! నా దారికి అడ్డురాకు! నా మన స్తత్వం నీకు తెలుసు. నేను తీవ్రవాదిని!'

    'అదే నేను చెబుతున్నాను. శాంతం తెచ్చుకో!'

    'నేను యీ జన్మలోనయినా అదిత్యని పెళ్ళి చేసుకోవాలి. అతని పొందు సాధించాలి!'

    'దుష్ట కామినీ!' కోపంగా అంది వినిత. ' నీలో ఎంత వాంఛవుందే! దానివల్ల నీ వెంట పతనమవుతున్నవో నీకు తెలీదు. నీ తపస్సు నీ మహత్తు అంతా వ్యయమైపోతుంది_'

    'పోతే పోనీ!' నిర్లక్షంగా అంది ఉలూచీ.

    'నీ ఖర్మ! కానీ గుర్తుంచుకో! నేను అదిత్యని క్షణ క్షణం కాపాడుతూ వుంటాను. అతన్ని భయపడితే నేను అడ్డురాను కానీ అతనికి ఆపద కల్గిస్తే నేను ఆ క్షణంలో నీ ఎదురుగా వుంటాను.'

    ఇక చెప్పేదేమీ లేదనట్టు ఆ మూల పెరిగిన మహావృక్షంలోకి వెళ్ళిపోయింది. వినితవిశ్రాంతి కోసం.
    ఉలూచీ అలాగే నుంచుని నుంచుని అదృశ్యమైంది.
   
                              *    *    *


    'ఎంత చిత్రమైన కల!' అనుకున్నాడు ఆదిత్య, అతనికి మేలుకువయింది హఠాత్తుగా, చేతికున్న గడియారం చూసుకున్నాడు, నాలుగుంబావు! నల్గోజామన్న మాట. మేకువన వచ్చిన కలలు నీ జమవుతాయంటారు.

    ఈ కల నిజమవుతుందా!

    గుడిలోని పున్నాగ చెట్టు తమకి తెలిసిందే! ఆ మోల పెద్ద పుట్ట వున్నదీ నిజమే!

    మరి ఆ రెండు నాగదేవతలు!

    ఉలూచి! తనని వేధించిన ఆ అమ్మాయి

    ఇప్పడి వినిత!

    బాగుంది! ఆ ఇద్దరే తెల్చుకోనీ! తన కెందుకు!
 
    తనకి తన సంధ్య దక్కితే చాలు-

    ఈ కల విషయం చెబితే సంధ్య ఏమంటుందో!

    ఆలోచనలు సాగుతున్నాయి, తిరిగి నిద్రపట్టిందతనికి

 Previous Page Next Page