"చదువు కుంటున్నావా బాబూ?"
"యస్"
"అరె! ఇంగ్లీషు కూడా వచ్చిందే నీకు! నేర్చుకుంటున్నావా బాబూ?"
"అవును నాన్నా మాకు యిక్కడ కాన్వెంట్ లో అంతా ఇంగ్లీషే. యిలాంటి చిన్న చిన్నవాటికి జవాబులన్నీ యింగ్లీషులోనే చెప్పారు. అవునంటే యస్. కాదంటే నో, నాన్నంటే ఫాదర్. అమ్మంటే మదర్. మరి నాన్నోయ్- నాన్నని పిలవాలంటే డాడీ అనాలి. అమ్మని అలాగే మమ్మీ అనాలిట. ఇంకా ఎన్ని వచ్చని నాకు! అమ్మా బుక్స్ తేవే, ప్లేట్ పగిలిపోయిందే ఇంక్ అయిందమ్మా- బ్యాగ్ ఎక్కడుంది? ఇలాంటి బోల్డు నేర్పారు నాన్నా"
నిట్టుర్చాడతను.
అబ్బాయి ఉత్సాహానికి అనందం వేస్తున్నా అది పరేర్ట్ అవుతున్నందుకు బాధ అయిందతనికి.
'పుడుతూనే పరబాషకి దాస్యం........"
కానీ యీ మాట అంటే తనని వింతగా చూస్తారందరూ. ఈనాడు యిదే గొప్పై పోయింది.
వస్తున్న ఆలోచనల్ని పారద్రోలి బాబుని దగ్గరగా తీసుకుని మరోమారు ముద్దు పెట్టుకుని "వెరి గుడ్" అని, అంటే అర్ధం తెలుసా బాబూ" అని అడిగాడు.
"తెలుసు నాన్నా, మెచ్చుకుంటున్నారు నన్ను"
"అంతేనా అర్ధం తెలిదూ?"
"అంతేనాన్నా అర్ధం తెలీదు. మాకు యిలాటి మాటలు నేర్పి వాటికీ గుర్తులు చెప్పారే తప్ప, అర్ధాలు చెప్పలేదు నాన్నా"
"అలాగా వెరిగుడ్ అంటే చాలా మంచిది అని బాబూ"
"థాంక్స్ నాన్నా"
"ఈ మాట కయినా అర్ధం తెలుసా బాబూ?" ఆతురతగా ప్రశ్నించాడు.
"లేదు నాన్నా దేనికి గాదు. తర్వాత ఒక్కోసారి వెరి సారి అని, నో మెన్షన్ అని అనాలి, వాటికీ అర్ధం చెప్పలేదు. కానీ ఎప్పుడు చెప్పాలో మాత్రం చెప్పారు."
"పోనిలే బాబూ, నేను చెపుతాను, థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెప్పటం అన్న మాట, తర్వాత ఏదయినా అవతలి వారికీ బాధని కలిగిస్తే, మనస్సులు బాధపడి వెరిసారి అంటాం-- అంటే బాధపడుతున్నామని చెప్పటమన్నమాట నోమెన్షనంటే చెప్ప నక్కర్లేదని"
"బాబూ" వాళ్ళిద్దరి సంభాషణకీ అడ్డు వచ్చి, శ్రీదేవి పిలిచింది, "ఏమ్మా?"
"వెళ్ళి ముఖం కడుక్కుని డ్రస్ మార్చుకుని టిఫిన్ చెయ్"
"ఓ.కె" అంటూ వెళ్ళిపోయాడు హుషారుగా.
శ్రీదేవి వైపు మెచ్చికోలుగా చూస్తూ అన్నాడు "బాబుని ఎంత నీట్ గా తయారుచేశావు శ్రీ-- థ్యాంక్స్"
"నో మెన్షన్" అంటూనవ్వింది.
అతడు నవ్వుతూ అన్నాడు "నిజమేమో అర్ధం తెలియకపోయినా యింగ్లిషులో మాటాడటం యినాటి ఫేషన్."
తనూ నవ్వింది బదులుగా.
తర్వాత ప్లేట్స్ అవి తీసుకుని వెళ్ళిపోయింది శ్రీదేవి.
ఆవిడ తిరిగి వచ్చాకతను తెచ్చిన స్వీట్స్ ఇచ్చి అలా వెళ్ళొస్తానని బయల్దేరాడు మాధవ్.
18
పెరట్లో మంచం వేశారు మాధవ్ కి.
భోజనం చేసి మామగారితో ఆ మాటా యీ మాట మాటాడి వెళ్ళి మంచం మీద వాలాడు. ఇంతజేసి అప్పటికి యింకా యింగ్లిషు వార్తలే రాలేదు.
సాయంకాలం అంతా పిచ్చాపాటి మాటలతో రాత్రి భోజనాల సమయంలో ఉదయంలాగే ఉల్లాసంగా సాగిపోయింది. కాకపోతే ఉదయం కంటే యిప్పుడు శేషం శ్రీదేవి అప్పుడప్పుడు మాటల్లో కల్పించుకోవడమే.
పుక్కోలించి వూసి మంచినీళ్ళు త్రాగి నిదురరాక కాలం గడువక తోచక అవేపు యీ వేపూ దొరలసాగాడు మాధవ్.
పెరటి తలుపు తెరచిన చప్పుడైనట్లైతే తలెత్తి చూశాడతడు.
శ్రీదేవి!
తలుపు మూసి దగ్గరకు వచ్చి కూర్చుంది. మంచం పై ఓ వారగా.
తెల;తెల్లని నల్లబార్డర్ వాయిల్ చీర కట్టుకుని, తెల్లని నీలం అంచు రవిక తొడుక్కుని, ఆ తెల్లని వెలుగులో వెన్నెలకు సైదోడుగా అప్పుడే క్షీరసాగరమధన వేళ జనియించిన శ్రీదేవిలా వుంది.
ఆమె కుడి చేతిని అందుకుని సుతారంగా ముద్దు పెట్టుకుని యింకా ఆ అరచేతిని అలాగే పెదాలకి అనించుకుంటూ పిలచాడు.
"శ్రీ"
"ఊ"
"ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా?"
"ఊహూ"
"చెప్పనా?"
"ఊ"
ఒక్క క్షణం ఆగి అన్నాడు "నాకూ పదాలు దొరకటం లేదు శ్రీ. కానీ ఒక్క విషయం చెప్పగలను. చాలా అందంగా ఆకర్షణియంగా పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో బంగారు బొమ్మలా వున్నావు"
"ఊ"
దగ్గరికి తీసుకుని కోగిట్లో యిముడ్చుకుంటూ అన్నాడు "మాటలు రావటం లేదా శ్రీ? అన్నిటికి ఊ, ఊహూ లు తప్ప ఏమి అనటం లేదు"
"ఊహూ"
"మ్ల"
నవ్వి అంది "మాటల్లో పొగిడి చెప్పాలంటే అప్పటికి భావం సంకరం అవుతుందండి- మనసులో వున్నదానికి చెప్పిన డానికి, వ్రాసినదానికి ఉపన్యసించేదానికి ఒక్కో అవస్థలో ఒక్కో దుర్గుణం సంక్రమించి అచ్చమయిన ఆర్ద్రత అంతా కాకున్నా కొంతయినా లోపిస్తుంది. అఘస్ప్రష్టము కానీ మనస్సులో మరీ"