Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 32

    "డాడి అంటే మంచివాడు బాబూ" అన్నాను. "మరి....మరి సునీతా, కిశోర్, మంటూ ఇంట్లో, అందరింట్లో డాడి వున్నారు. మనింట్లో ఎందుకు లేరు అన్నాడు అమాయకంగా చూస్తూ.
    వాడి మొహం చూస్తుంటే మొదటిసారిగా వాడికి తండ్రి లేకపోవడం వాడి కెంతో లోటుగా వుందో తెల్సి వచ్చింది "లేదు బాబూ! వాళ్ళ డాడీలు మంచివాళ్ళు కనక వాళ్ళింట్లో వున్నారు, మీ డాడీ బాడ్, అంచేత మనదగ్గర లేరు" అన్నాను అంతకంటే ఆ వయసులో ఏం చెప్పినా అర్ధం కాదని.
    "అలా తండ్రి మీద ఆనించి వాడి దృష్టి మరల్చాను. వాడు చురుకైనవాడు. ఏది చెప్పినా నిమిషంలో గ్రహించేవాడు. చదువులో క్లాసు ఫస్టు వచ్చేవాడు. వాడిమీదే నా ఆశలు, కోరికలు అన్నీ, కనక వాడ్ని చదివించి గర్వంగా సురేష్ ముందు నిలబెట్టడమే నా ఏకైక లక్ష్యం.
    "మేడమ్! ఈ జీవితంలో అన్నీ నష్టపోయాను. ఇరవై ఏళ్ళకే జీవితంలో అన్ని అనుభవాలు అనుభూతులు పూర్తయిపోయాయి. గత పదేళ్ళగా వంటరిగా పసివాడ్ని పెట్టుకుని ఎలా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపానో మీకు తెలియదు మేడమ్. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా భవిష్యత్తు గురించి బెంగపదేదాన్నో మీకు అర్ధం కాదు. చేతులారా జీవితం నాశనం చేసుకోలేదు కదా అనిపించేది. ఒకోసారి కోరికల తాకిడికి తట్టుకోలేక. పంతంకొద్దీ నా బతుకు నేను నాశనం చేసుకుని తప్పు చేశాను అనిపించేది ఏ జంటను చూసినా. ఏ భార్యా భర్తలని వారి ముచ్చటైనా సంసారాలని చూసి ఏం పాపం చేశానని వీటన్నిటికి దూరమయ్యానని దుఃఖం వచ్చేది.
    స్కూటర్ల మీద, కార్లమీద తల్లితండ్రుల మధ్య వెళ్ళే పిల్లల్ని చూసి నా పిల్లాడు దీని కెందుకు నోచుకోలేదు అని మనసు గిలగిల్లాడేది. వాడికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఆ ఒంటరితనంలో తోడులేకుండా ఉండడం ఎంత దుర్భరమో తెలిసివచ్చేది.
    వాడికేమన్నా అయితే నా కేవరున్నారు ఇంక అని అనవసరంగా భయంతో వణికేదాన్ని, పనిమనిషి, పాలవాడు, కూరలవాళ్ళు, చాకలి, ఇరుగుపొరుగు, స్కూల్లో తోటి టీచర్లు నా గురించి కొందరు గుసగుసలాడుకునేవారు. కొందరు మొగుడోదిలినదానినని సానుభూతి చూపేవారు. మరికొందరు ఎలాగైనా రాజీ కుదుర్చుకోమని సలహా ఇచ్చేవారు.
    "సుమిత్ కి తండ్రి సురేష్ అనే అందరికి చెప్పరా? స్కూలు రిజిస్టర్ వాటిల్లో..."అనుపమ సందేహంగా అడిగింది.
    "ఆహా..... బర్త్ సర్టిఫికేట్ దగ్గరనించి సురేష్ తండ్రి అనే రాయించాను. ఎవరు అడిగినా ఆ పేరే చెప్పాను.
    మేడమ్! ఈరోజు ఇలా కుర్చుని ఇంత సులువుగా జరిగినందుకు చెప్పగలుగుతున్నానుగానీ, ఆనాడు నా ఆందోళన, ఆరాటం అవమానం ఇవన్నీ ఎదుర్కోలేక నేను పడిన ఆవేదనని ఎలా చెప్పగలను. ఎలా వాడ్ని పెంచాను. ఓహ్! ఆ దిగులు, అవ్యద అనుభవిస్తేనే అర్ధం అవుతాయి. " రూప నిట్టూర్చి అంది.
    "అర్ధమైంది మిస్ రూపా! నౌ లెట్ మీ సీ, వాట్ ఐ కెన్ డు ఫర్ హిమ్, సురేష్ తో మాట్లాడుతాను, ఇదంతా నా దగ్గర దాచి నన్నెందుకు మోసగించాడో అడుగుతాను" ఆవేశంగా అంది అనుపమ.
    "వద్దు మేడమ్! దానివల్ల జరిగేది ఏముంది. మీ యిద్దరు ఘర్షణ పడినంత మాత్రాన నా బతుకు యిప్పుడు చక్కబడదుగదా! ప్లీజ్....మీరు నన్ను అర్ధం చేసుకున్నారు. నా కంతే చాలు, ప్లీజ్ ఫర్ గెట్ యిట్" అంది రూప.
    "ఉహు....సురేష్ లాంటి మగాళ్ళకి బుద్ది తెప్పించాలి. మీ కేలాగో అన్యాయం జరిగింది. అది పుడ్చలేనిది. కనీసం సుమిత్ కైనా" సాలోచనగా అంటూ లేచి నిల్చుందిఆమె. అభిమానంగా రూప చెయ్యిపట్టుకుని నొక్కి, "నేను సురేష్ తో మాట్లాడి మళ్ళి వస్తాను. ప్లీజ్ వద్దనకండి. మిమ్మల్నిలా చూశాక నాకేం పట్టనట్లు నేను ఊరుకుంటే నా చదువుకి అర్ధం వుండదు. గుడ్ నైట్" అంటూ చకచక వెళ్లి కారులో కూర్చుంది.
    అనుపమ ఇన్ స్పేక్షన్ బంగ్లాళాకి వెళ్ళేసరికి సురేష్ బోనులో పడ్డ పులిలా అటు ఇటూ వరండాలో చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు చేస్తున్నాడు. అనుపమ కారు దిగగానే పచార్లు ఆపి "ఎక్కడికి వెళ్ళావు యింతసేపు?" అన్నాడు తీక్షణంగా.
    "రూప యింటికి. ఏ రూప అని అడుగుతారేమో! పదేళ్ళ క్రితం ఆమెని ప్రేమించానని ఆమెతో తిరిగి పెళ్ళి పేరు చెప్పేసరికి మొహం చాటు చేశారే ఆ రూప యింటికి " సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది. సురేష్ మొహంలో రక్తం పొంగింది.
    "దాని మాటలన్ని నమ్ముతున్నావా? నా మీద కసి తీర్చుకోడానికి వున్నవి లేనివి చెప్పి  వుంటుంది. షి ఈజ్ ఎ బిచ్ ....' సురేష్ కొద్రావేశాల్తో అరిచాడు.
    "ఆమె తీరని ద్రోహం చేసి, చేసిన తప్పుకి సిగ్గుపడి పశ్చాత్తాపపడాల్సింది పోయి ఆమెను గురించి ఇలా మాట్లాడడానికి డోంట్ యూ ఫీల్ ఏష్ మ్ డ్, ఆమె 'బిచ్' అయితే అదే పని చేసిన నిన్నేమనాలి?" తీవ్రంగా అంది.
    "అనూ......"
    "ఏం ఎందుకా అరుపు? నీ సంగతి తెల్సిపోయిందనా! నీవేదో చదువుకున్నవాడివి సంస్కారం వుంటుందని భావించాను. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని, అంత నీచంగా ఆమెను అవం,అవమానించి ఆమె ఖార్మానికి ఆమెని వదిలే హినుడవని గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను. ఈ సంగతి నా దగ్గర ఎందుకు దాచి నన్ను మోసం చేశావు. ఐ వాంట్ ఎన్ ఎక్సప్లనేషన్ ఫర్ దిస్ " అనుపమ కఠినంగా అంది.
    సురేష్ మొహం మరింత ఎర్రబడింది. "నా గతం గురించి అడిగే హక్కు నీకు లేదు, పెళ్ళయ్యాక నేనేమన్నా చేస్తే సంజాయిషీ అడిగితే అర్ధం వుంటుంది" ఆమె ముందు తగ్గిపోవటం యిష్టంలేక సమర్ధించుకుంటు అన్నాడు. అనుపమ అతనివంక తిరస్కారంగా చూసింది. "ఓహో నీవు మగాడివి కనక పెళ్ళికి ముందు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఫరవాలేదన్నమాట. అదే నే చేసివుంటే, నా గతం గురించి పట్టించుకోకుండా వూరుకునేవాడివా? నా గతం అవసరం లేదనే సహృదయం వుండేదా?"
    "పెళ్ళికి ముందు పరిచయమున్న ఏ పురుషుడితోనో, ఏ కాలేజి స్నేహితుడితోనో, ఏ అన్నయ్య స్నేహితుడో పలకరిస్తేనే మొహం మాడ్చుకుంటారే మీ మగవాళ్ళు, కాస్త ఎవరితోనోన్న సరదాగా మాట్లాడితేనే వాళ్ళిద్దరిమధ్య ఏదో వుందని అపోహపడి అనుమానాలతో కాల్చుకుతింటారే మీ మగవాళ్ళు. భార్య ఏ చిన్నప్పుడో తెలిసి తెలియని వయసులో ఎవరికన్నా మనసిచ్చి, ఏ ప్రేమలేఖో రాస్తే, అది కంటపడితే పెళ్ళాం శీలాన్ని అనుమానించి, అవమానించి అతడ్ని ఇంట్లోంచి తరిమికొడతారే......అలాంటిది పెళ్ళికిముందు ఒక అమ్మాయితో తిరిగి ఆమెకి ఒక బిడ్డని కన్నా నా దగ్గరి ఇది ఎందుకు దాచావు అని అడిగే హక్కు నాకు లేదా?
    నీ నీతి నియమాలతో, నీ శీలంతో నాకు పనిలేదనా నీ ఉద్దేశం. వివాహం చేసుకునే అమ్మాయి పవిత్రంగా వుండాలని మీరు కోరుకుంటారే, అలాగే వివాహం చేసుకునే పురుషుడు పవిత్రంగా వుండాలని మేము కోరకుడదా? మిస్టర్ సురేష్! ఈ పాతకాలపు కబుర్లు, ఈ దంద నైతిక నీతి సూత్రాలు ఇంకా వల్లిస్తే సహించి వూరుకునేంత దద్దమ్మలం కాం. మేము. నన్ను వివాహం చేసుకునే ముందు, నీవే నిజాయితీ పరుడివయితే నిర్భయంగా నీవు చేసిన తప్పు ఒప్పుకునేవాడివి. ఫ్రాంక్ గా మాట్లాడుకునేవాళ్ళం. నా కిష్టమైతే నిన్ను చేసుకునే దానిని ఇలా నీ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం ఎందుకు చేశావు." అనుపమ అంత ధైర్యంగా దబాయించగానే సురేష్ బెదిరాడు. మాటలకోసం తడుముకున్నాడు.

 Previous Page Next Page