Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 31

    మగాడికి అదో పెద్ద తప్పుకింద జమా? అనుకుంది. "ఏమిటి ఆలోచిస్తున్నాడు, ప్లీజ్! చెప్పండి సారీ.....ఫర్ మై బాడ్ తెలుగు. ఇంకా అంత బాగా రాలేదు. డిపార్ట్ మెంటల్ పరీక్ష పాసయ్యానుగాని మాట్లాడడం మీలాగా రావడంలేదు, ప్లీజ్! మా వారితో మీకెలా .......మీ సుమిత్ ఎలా అంతా చెప్పండి" అంది తడుముకుంటూ, "నా తెలుగు చూసి నవకండి" అంది.
    "వై డోన్ట్ట్ట్ యూ అస్క్ యువర్ హస్బండ్. ఆయననే అడగవచ్చుగదా!" అంది రూప.
    "నో! ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రం యూ " అంది ఆమె నిష్కర్షగా.
    "అల్ రైట్ ! ఇఫ్ యు వాంటు టు హియర్, ఐ విల్ టెల్ " అంటూ రూప మొదట్నించి అంతా చెప్పుకొచ్చింది. అనుపమ కళ్ళు వెడల్పు చేసుకుని ఆశ్చర్యంగా అంది.
    "నిజంగా యింత జరిగిందా, హి నెవర్ టోల్డ్ మీ" అంది.
    "హౌ ఎలా చెప్తాడు? ఒక ఆడపిల్లని వాడుకుని వదిలానని ఏ మగాడు భార్యతో చెబుతాడు."
    "ఎస్ రూపా! మీరు నిజంగా చాలా ధైర్యస్తులు. కోర్టు కెక్కి సురేష్ కి బుద్ది చెప్పడానికి మీ ఫ్యూచర్ కూడా లెక్క చెయ్యలేదంటే నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంతే కాదు పెళ్ళి లేకుండా యిలా ఒక పిల్లవాడ్ని కని పెంచుకోవాలంటే ఎంత సాహసం వుండాలి. రియల్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ" అంది అభినందన పూరకంగా.
    "అభినందిస్తున్నారా? అంటే నేను చేసిన పనిని అసహ్యించుకోడం లేదా? ఇలా అక్రమంగా ఓ బిడ్డని కన్న దానిమీద మీకు సానుభూతి వుందా?" రూప సందేహంగా అడిగింది.
    "వై షుడ్ ఐ హేట్ యూ? మీరన్నట్టు మీరొక్కరే తప్పు చెయ్యలేదు. అసహ్యించుకుంటే సురేష్ పిరికితనాన్ని , కుసంస్కారాన్ని అసహ్యించుకోవాలి." అంది అనుపమ తీవ్రంగా.
    రూప మొహంలో అనందం కదలాడింది. ప్రశంసా పూర్వకంగా అనుపమాదేవిని చూస్తూ "మీరింత ఆహ్రుదయులని అనుకోలేదు. మీరు నా తరపున మాట్లాడుతారని అనుకోలేదు" అంది పట్టుకున్న గొంతుతో.
    "సో, యు హావ్ అండర్ ఎస్టిమేటెడ్ మీ ఎస్ రూపా! నేను ఒక స్త్రీని, నేనూ చదువుకున్నాను. కాస్తో కూస్తో అభ్యుదయ భావాలున్నాయి. మన స్త్రీలకి అనాదిగా జరుగుతున్న అన్యాయం నాకు మాత్రం తెలిదా? రూపా! నిజంగా నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒకరన్నా వుండి ధైర్యంగా మగాళ్ళ మోసాలని ఎదుర్కొంటే వాళ్ళ ఆటా ఎప్పుడో కట్టేది. రూపా! మై సింపతిస్  ఆర్ విత్ యూ ఇ విల్ నెవర్ ఫర్ గివ్ సురేష్ ఫర్ దిస్" తీవ్రంగా అంది.
    "నో, నో మేడమ్ నా గురించి అనవసరంగా అతనితో మీరు ఘర్షణ పడకండి. జరిగిపోయిందేదో జరిగింది. ఇప్పుడు నాకింతకంటే జరిగే ప్రమాదం ఏమి లేదు. నష్టపోయిందేదో చాలా రోజుల క్రితమే నష్టపోయాను. ఇప్పుడింక నా ఏకైక లక్ష్యం సుమిత్ ని బాగా చదివించి వాడికి మంచి భవిష్యత్తు కల్గించడమే! వాడికి తండ్రి లేని లోటు ఏ విషయంలోనూ కనపడకుండా పెంచాలన్నదే నా కోరిక. నేను చేసిన తప్పుకి నా బిడ్డని ఏ అనాధ శరణాలయాలపాలో చేసి వాడ్ని బిచ్చగాడిగా, దొంగగా సమాజానికి చిడపురుగులా తయాదుచేసి వాడ్ని శిక్షించకుండా నేను చేసిన తప్పుకి, నా తొందరపాటుకి నన్ను నేను శిక్షించుకున్నాను. ఎలా పుట్టినా బిడ్డని కాని పెంచుకునే హక్కు తల్లికి వుండాలని, అలాంటి బిడ్డకి సంఘంలో స్థానం వుండాలన్న నా ధ్యేయం నెరవేర్చడం కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాను. ఎన్నెన్నో విమర్శలు, హేళనలు, తిరస్కారాలు ఎదుర్కొంటూ ఇన్నేళ్ళు వాడిని పెంచాను. మరెన్ని కష్టాలు పడ్డా వాడిని ఒక మంచి సంస్కారవంతుడిగా, మంచి విద్యవంతుడిగా, మంచి పౌరిడిగా తీర్చి దిద్దాలన్న నా ధ్యేయం నెరవేర్చుకుంటాను.
    "మేడమ్! సురేష్ కి తనబిడ్డ బతికే వున్నట్టు, వాడో అనమకుడుగా, అక్రమ సంతానంగా కాక చక్కగా మంచి పిల్లవాడుగా, క్రమశిక్షణలో పెరుగుతూ రేపు పొద్దున తండ్రిని మించిన తనయుడిగా తయారవుతాడు నా పెంపకంలో....అని తెలియచేప్పడానికే ఈరోజు సుమిత్ కి ఆయనే నీ తండ్రి అని చూపాను"
    "అంటే మీకు ముందే యిలా మేం స్కూలికి వస్తున్నట్టు అంత తెలుసా? మేం ఇలా సుమిత్ తండ్రి పేరు అది అడుగుతామని ఎలా గెస్ చేశారు" ఆశ్చర్యంగా అడిగింది అనుపమాదేవి.
    రూప నవ్వింది. "మనిషి సైకాలజీ ఆ మాత్రం తెలియదంటారా నాకు. సుమిత్ అన్నింట్లో ఫస్టు వచ్చాడు. నేచురల్ గా అందరూ ఎవరి పిల్లాడని తెల్సుకోగోరుతారు. ప్రైజులిచ్చేవాళ్ళు సహజంగా స్మార్ట్ గా, తెలివిగా వుండే పిల్లాడు ఎవరీ అబ్బాయి అని అడగడం సహజం. మిరడుగుతారని నాకు తెల్సు. అడగకపోయినా, హెడ్ మిస్ట్రెస్ ప్రైజ్ డిస్ట్రి బ్యుషన్ అయ్యాక స్కూలు మొత్తం మీద ఎక్కువ బహుమతులు గెల్చుకున్న అబ్బాయిని నా కొడుకుగా పరిచయం చేసి ఉండేవారు. తల్లిని చూశాక తండ్రిని గురించిన ప్రశ్న వస్తుంది. ఆ విధంగా సురేష్ సుమిత్ తండ్రిని తెలిసేది. ఆలా జరగకపోయినా మీటింగ్ అయ్యాక సురేష్ దగ్గరికి తీసికెళ్ళి సుమిత్ కి నీ తండ్రి అడుగో అని చూసేదాన్ని."
    "అంటే, సురేష్ ఎక్కడుంది, ఏం చేస్తుంది అంతా తెలుసన్నమాట మీకు?"
    "ఎందుకు తెలియదు. మా సంగతి ఆంటీ వల్ల సురేష్ సంగతి తెల్సుకుంటునే వున్నాను. సురేష్ ఆర్నెల్లు జైలు శిక్ష, తరువాత అహ్మదాబాద్ లో ట్రెయినింగవుతూ ఓ గుజరాతి అమ్మాయిని పెళ్ళాడాడని అన్నీ తెలుసు. ఆ వురికి కొత్తగా వచ్చిన కలెక్టరుగారిని సభకి ఆహానిద్దాం అని హెడ్ మిస్ట్రెస్ మీపేరు చెప్పగానే నాకు చాలా సంతోషం కల్గింది. నేను అనుకున్నది ఇంత త్వరలోనే సిద్దిస్తున్నందుకు"
    "ఏం అనుకున్నారు?"
    "తండ్రి లేకుండా, తండ్రి నీడ పడకుండా నా కొడుకుని అతన్ని మించినవాడిని చేసి అతనిముందు సగర్వంగా నిలబెట్టాలనుకున్నాను. నా కొడుకుని చూసి అతను తల దించుకునేటట్టు చెయ్యాలనుకున్నాను. ఆ కోరిక ఎప్పుడో కాకుండా ఇంత త్వరలోనే తీరింది. నే అనుకున్నది సాధించగలిగినందుకు ఈనాడు ఎంతో ఆనందంగా ఉంది మేడమ్" రూప కళ్ళు తడి అయ్యాయి.
    "మీరు ఇలా అవివాహితులుగా వుండి, కొడుకుని కని పెంచుకోడంలో ఏమి ఇబ్బందులు పడలేదా? ఎవరూ ఏమి అనలేదా? విమర్శలు ఎలా ఎదుర్కొన్నారు" కుతూహలంగా అడిగింది ఆమె.
    "ఇబ్బందులు ....హు.....ఈసమజంలో మన కట్టుబాట్ల మధ్య పెళ్ళికాకుండా బిడ్డని కాని పెంచడంలో ఇబ్బందులు ఎడురుగాక ఏమవుతాయి. అయితే మేడమ్! భయపడి ముసుగులో దాక్కునే వాళ్లనే భయపెడ్తుంది సంఘం. నిర్లక్ష్యంగా తిరిగేవారిని ఏమి చెయ్యలేరు ఎవరూ. నాలుగురోజులు అని అని విసుగెత్తి ఊరుకుంటుంది లోకం. అయినా యిలా వంటరిగా అందరినీ ఎదిరించి నిలబడి బాబుని పెంచుకుంటూ బతకడానికి చాలా సమస్యలే ఎదుర్కొన్నాను మేడం. అయితే నా అదృష్టం కొద్ది నాకు సుమతి ఆంటీ, ఆవిడ చెల్లెలు డాక్టరు వసుంధరగారి అండదండలు లభించివారి ధైర్యం, ప్రోత్సాహంతో నా పని సానుకూలపరుచుకోగాలిగాను.
    బాబు పుట్టిన మూడు నెలలకి డాక్టరుగారు ఆవిడ పరపతి ఉపయోగించి ఓ ఊర్లో గర్ల్స్ స్కూల్లో టీచరుగా వేయించారు, అన్నాళ్ళు ఆ యింటి మనిషిగా కల్సిపోయిన నన్ను ఆవిడ వదులుకోడానికి యిష్టపడకపోయినా నా భవిష్యత్తు ఆలోచించి పురుడయి ఇంకా ఆ ఉళ్ళో వుంటే ఉళ్ళోవాళ్ళ ప్రశ్నలకి తట్టుకోలేమని ఆవిడ ఆలోచించి మరో ఊరులో ఉద్యోగం వేయించారు."
    :సుమిత్ కి ఈరోజు వరకు అతని తండ్రి ఎవరో నిజం చెప్పలేదా?" అనుపమ అడిగింది మధ్యలో.
    "తెలుసు. సుమిత్ దగ్గిర ఎప్పుడు నిజం దాచలేదు. వాడికి తండ్రి అంటే ఎవరో తెలిసి మొదటిసారి ఐదేళ్ళప్పుడు అడిగాడు. ఇరుగు పొరుగు పిల్లలు, స్కూలు పిల్లలు అందరూ డాడి మానాన్న అంటూండడం చాలా సార్లు విన్నాక వాడికో సందేహం వచ్చి - "అమ్మా డాడి అంటే ఎవరు?' అన్నాడు. స్కూల్లో చేర్చిన నెలరోజులకి. వాడలా ఎప్పుడో అడుగుతాడని, ఆ ప్రశ్న ఎప్పుడో ఎదుర్కోవాలని ముందే ఉహించాను కనక ఆ జవాబు ఆలోచించే పెట్టుకున్నాను.

 Previous Page Next Page