ఆ ఉత్తరంలో నీ మతం, నా మతం వేరని సందేహించకు. మనిద్దరి సమ్మతమే ఓ కొత్త మతం.
అదే ప్రేమ మతం_ విశ్వ మానవాళి విశ్వశించవలసిన మతం, నా ప్రేమను నువ్వు ఒప్పుకునే వరకూ ఇదే హాస్పిటల్ ఎదుట ఆమరణ నిరాహారదీక్షచేస్తా గుర్తించుకో.
ఈ విషయంలో నీతో అర్జంటుగా మాట్లాడాల్సి వుంది కాబట్టి నువ్వు రేపు మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు క్రాస్ రోడ్స్ దగ్గరున్న దేవీ ధియేటర్ కు రా. సిసింద్రీ సినిమా మనం చాల విషయాలు మాట్లాడుకోవచ్చు.
ఆ ధీయేటర్ దగ్గర నీ కోసం నేను పన్నెండు గంటలనుంచి ఎదురు చూస్తుంటాను గుర్తుంచుకో" అని వుంది.
ఉత్తరంలో రాసినట్టుగా శివానందం దేవీ ధియేటర్ దగ్గర ఎదురు చూసే వుంటాడు. ఎదురు చూసి చూసి తిట్టుకుని వెళ్ళిపోయి వుంటాడు. ఏంట తిట్టినా పట్టించుకోడు_ ఏమన్నా నవ్వుతాడు.
లోలోనే నవ్వుకుంటూ ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న మేరీ, హైదరాబాద్ టి.వి.లో తెలుగు సీరియల్ ప్రకటనలా ఓ దగ్గు శబ్దం వినబడేసరికి ఉలిక్కిపడింది. ఆ దగ్గుదగ్గిన వ్యక్తి పొలిటికల్ పేషెంట్.
"హాలో సిస్టర్ మేరీ! నీకోసం పొద్దుట్ట్నుంఛీ అందర్నీ అడుగుతున్నా. ఇప్పుడోచ్చావెంటీ ?"
"ఇప్పుడే నా డ్యూటీ... ఎలా వుంది. కానీ కొత్త ప్రభుత్వం నన్ను అన్యాయం చేసింది మేరీ" దిగాలుగా అన్నాడతను.
"ఏమైంది?"
"హుస్సేన్ సాగర్ లో హొటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాడట."
"ఏం?" నవ్వును దాచుకుంటూ అడిగింది మేరీ.
"ప్రస్తుతం అక్కడ బుద్దుని విగ్రహం వుంది కదా? దానికి కాస్త దూరంలో సిసలైన జాతి నాయుకుల విగ్రహాలు పేట్టిస్తుందట ప్రభుత్వం" అన్నాడు
"సిసలైన జాతి నాయుకులా? వాళ్లెవరు?!" అని అడిగింది.
"జాతి నాయుకులుంటే గాంధీ, నెహ్రూ, బోసు తదితరుల్లాంటివాళ్ళు. సిసలైన జాతి నాయుకులుంటే హర్షద్ మెహతాలు, హవాలా జీన్స్, దావూద్ ఇబ్రహింలు_ దగాకోర్లు."
"మరిప్పుడేం చేస్తారు?"
"అదే ఆలోచిస్తున్నాను. మేరీ నవ్వును దాచుకుంటూ.
"స్విస్ బ్యాంక్ అడ్రస్ తెలుసా నీకు?"
"కిస్ బ్యాంకా? ఏం అలా వుంది ఒళ్ళు?"
మహాతల్లి! కిస్ బ్యాంక్ కాదు... స్విస్ బ్యాంక్, అక్కడే మన వాళ్ళందరూ ఇక్కడ అక్రమంగా సంపాదించిన ప్రజల ఆస్తుల్ని దాచుకుంటారన్నమాట."
"ఆ భ్యాంకేందుకు మీకు?"
"భ్యాంకుమెయిల్ చేయడానికి, భ్యాంక్ డోర్ ద్వారా పదవిలోకి వెళ్ళడానికి."
"ఏం పదవి?"
"సి.ఏం. పోస్టుకోసం ఎలాగోలా ఆ భ్యాంక్ అడ్రస్ సంపాదించు తల్లీ. నీకు పుణ్యముంటుంది."
ఆ పొలిటికల్ పేషెంట్ కాళ్ళా వెళ్ళా పడుతుండగా మేరీ బలవంతాన నవ్వును బిగబట్టుకుంటూ_
"అలాగైతే హర్షద్ మెహతాను కనుక్కుని చెబుతా" అని జవాబిచ్చి, ఆ రూమ్ లోంచి బయటికోకోస్తుండగా డోర్ దగ్గర చేతులు కట్టుకుని తెలుగు హీరోలా నిలబడి కారాలు మిరియాలు నూరుతున్న శివానందాన్ని చూసి గబగబా ముందుకు పోబోయింది మేరీ.
డోర్ కి చెయ్యి అడ్డంగా పెట్టాడు వార్డ్ బోయ్ శివానందం.
"చెయ్ తియ్" అంది మేరీ మెల్లిగా.
"నేను తియ్యను. నీ కోసం గంటలసేపు ఎదురు చూస్తూ ఎండలో నిలబడ్డాను తెలుసా?" ఉక్రోషంగా అన్నాడు శివానందం.
"ఎవరు నిలబడమన్నారు? బుద్ధిలేకపోతే సరి!" అంది మేరీ.
"అవును... నాకు బుద్ధిలేదు కాబట్టే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తూన్నాను. నువ్వు చీదరించుకుంటున్నా నీ వెనుక తిరుగుతున్నాను_ ఇవాళ తాడోపేడో తేలిపోవాలి చెప్పు. పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా?" అన్నాడు శివానందం.
"పెళ్ళి... నీతోనా?"
"ఏం నేను మగాడ్ని కానా?"
"మగాడివే... నేనెందుకు కాదంటాను. గుర్రంలా ఎదిగిన మగాడివి. కానీ నువ్వో వార్డ్ బోయ్ వి. ఆ సంగతి మర్చిపోతున్నావ్ " మేరీ నోటి వెంట వచ్చిన ఆ మాటకు నిశ్చేడైఅపోయాడు శివానందం. వెంటనే అతనికి కాశీచరణ్ మాటలు గుర్తుస్తున్నాయి.
"వార్డ్ బాయ్ మనిషి కాడా?" సీరియస్ గా ప్రశ్నించాడు శివానందం.
"నేను హెడ్ నర్స్ ని. నీ లాంటి వార్డ్ బోయ్ ని పెళ్ళిచేసుకుని నీ స్థానంలోకి నేను దిగాజారలేను" అంతకంటే సీరియస్ గా అంది మేరీ.
"అంటే నువ్వు విలువిచ్చేది మనస్సుకు కాదన్నామాట. నీకు హొదాకావాలి అంతేనా? నేనిలాగ వుండిపోతానని అనుకుంటూన్నావా?"
"ఏం... డాక్టర్ అయిపోదామని అనుకుంటున్నావా?" అని ఇంకేదో అనబోయేలోగా కారిడార్ లో వస్తున్న డాక్టర్ మధురిమ చూసి ఆమెను విష్ చేసింది మేరీ తన తడబాతుని కప్పిపుచ్చుకుంటూ.
"ఏమిటి శివానందం.... మేరీతో గొడవపడుతున్నావా?" మామూలుగా అడిగింది మధురిమ.
"చూడండి మేడమ్.... నా డ్యూటీ నన్ను చేసుకొనివ్వకుండా డిస్ట్రబ్ చేస్తున్నాడు" అంది మేరీ చిర్ననవ్వుని దాచుకుంటూ.
ఆ మాటకు కోపం వచ్చి శివానందం "అదికాదు మేడమ్...." అంటూ ఏదో చెప్పాబోయడతను.
"ఏమిటిది శివానందం? మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏవైనా వుంటే ఇంటిదగ్గర మాట్లాడుకోండి_ హాస్పిటల్ ఎట్మాస్పియర్ ని పోల్యూట్ చేయకండి" సీరియస్ గా అనేసి ముందుకెళ్ళిపోయింది డాక్టర్ మధురిమ.