Previous Page Next Page 
కాలనాగు పేజి 30

    నా కనులు మూతలుపడ్డాయి.దబ్బున జారిపడ్డట్టయింది బాత్ రూం తలుపుకి అనుకున్నాను.

    అయిదు నిమిషాలు గడిచయేమో!

    పెరట్లో అమ్మా గొంతు వినిపించింది.

    ఏదో తెలియని దైర్యంతో కళ్ళు తెరిచాను.

    బాత్ రూంలో ఎవరూ లేరు_

    ఉలూచి లేదు- ఉన్నట్టునిపించిన మరో యువతీ లేదు"

    చెప్పట్టం అపేడు ఆదిత్య.

    విచిత్రం అనిపించింది సంద్యకి. ఆమెకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయింది.

    'సంద్యా! నువ్వు నమ్ముతావా!'

    'ఊఁ' అంది అనాస్తకంగా

    ఇప్పుడు మనం చూసిన ఆ రెండు పాములా అవేనేమో! అందులో ఒకటి 'కాలనగు'_ అదే ఉలూచి- మరో పాము ఇంకెవరూ? ఈ ఉలూచి ఆ పాముకి భయపడుతున్నదేమో!'

    'అంత మన హిలూసినేషన్! పిచ్చి ఊహూ !'

    'ఊహూఁ అలా మా యింట్లోకి ఎలా వస్తున్నదో!' సాలోచనగా అన్నాడు ఆదిత్య.

    'దితీ! మనం వెళదామా?' కదిలింది సంధ్య    మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం?'

    'నేను ఫోన్ చేస్తాగా!' అంది సంధ్య. ఆమె నెమ్మదిగా నడిచి గుడి ముందుకి వచ్చింది.

    అక్కడ నాగలింగేశ్వరస్వామివారి ముందు నుంచున్న కనక దుర్గమ్మని చూసి ఆగిపోయింది సంధ్య.

    అంతలో వచ్చాడు ఆదిత్య.

    అతనూ ఆమెని చూశాడు.

    'సంద్యా! మీ అమ్మగారు కళ్ళు మూసుకుని ప్రార్దిస్తున్నారు. ఆమె కళ్ళు తెరిచేలోగా మనం_ కనీసం నువ్వు_ ముఖద్వారం దాటాలి. పడ' అన్నాడు చప్పున. ఆమెకి మాత్రమే వినిపించేంత మెల్లిగా.

    సంధ్య గబగబ నిదిచిమ్ది తలవంచుకుని.

    ముఖద్వారం దాటి వచ్చి హమ్మయ్య అనుకుంది. అక్కడే వున్న రజని కేకేసి వెళ్ళి కూర్చుంది.

    ఆదిత్య బయటకి వచ్చేసరికి రిక్షా వెళ్ళిపోయింది.

    అతను గదంగా నిట్టూర్చేడు.
   
   
                                                                            30


    'ఏమిటి నీ వుద్దేశం?'

    ఆదిత్య, సంధ్య వెళ్ళిపోగానే పున్నాగ చెట్టుక్రింద ప్రత్యక్షమైంది. ఉలూచి ఆమెకి శరీరమంతా వేడి శగలు సోకుతున్నట్టుగా వుంది. మంటలు మద్యలో చిక్కుకున్నట్టుగా వుంది.

    ఫక్కున నవ్వింది వినత. ఆమెకి ఎంతో ఆనందంగా వుంది. ఉలూచిపై ఆదిత్య సాధించింది. ఒకటి కాదు రెండుసార్లు పొందిన విజయం అది. అది వ్యక్తిగత విజయమే కాదు. ఒక ప్రేమికుల జంటని ఆశీర్వదించాగలిగానన్న విజయభావనకూడా వుంది అందులో.

    వినిత జవాబు చెప్పలేదు

    'ఎందుకిలా నా మార్గానికి అడ్డుపడుతున్నావ్?'

    'గుర్తుకు తెచ్చుకో_ నీవు తక్షకుని గుంపులోని దానిని నేను వాసుకి గుంపులోనిదాన్ని నేను శేషుని ప్రేమించాను అతనూ నన్ను ప్రేమించాడు. ఒక పర్యాయం నువ్వు నా  రూపంలో అతన్ని భ్రమ పెట్టావు మీరిద్దరూ కలసిపోయాయి.

    నేనంటే దీర్ఘముడికి యిష్టంగా వుండేది అతడు శేషురూపంలోవచ్చాడు రూపమయితే మార్చగాలిగాడు కానీ గుణం ఎక్కడికి పోతుంది? అతని తొందరపాటుని చూసి నేను అనుమానించాను.

    నాకు నారాయణ మంత్రం ఉపదేశించాడు మా  తండ్రీ ద్విజిహ్వుడు దాన్ని పఠించాను నేను. మన సర్పజాతికంతా అది శేషుడు అధికుడు, అయన, శ్రీమన్నారాయణుని పాన్పు. అందుచేత మనకి నారాయణమంత్రం శిరో మంత్రం దాన్ని నేనుసిద్ది పొందాను.

    నామంత్రం వల్ల దీర్ఘతముడు యధారూపానికి వచ్చాడు. నేనతన్ని శపించాలనుకున్నాను కానీ నా తపస్సెందుకు నాశనం చేసుకోవాలి అదెందుకు వ్యర్దమై పోవాలి, అతనంటే నాకు అసహ్యం వేసింది. మరోసారి ఇలా జరిగితే నాగలోకంలో ఘోరమైన యుద్ధం జరుగుతుందని చెప్పాను.

    అతనిక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

    నేను సరసరమని శేషువద్దకి వచ్చాను.

    నువ్వుతన్ని ప్రలోభపెడుతున్నావ్. నా అందం_ నీ హొదాచూసి శేషు లొంగిపోబోతున్నాడు. నే వచ్చిన అలికిడి చూసి నువ్వు ఏదో సాకు కనుమరుగై అదృశ్యమయ్యావ్.

    క్షణం తర్వాత నే నతన ముందుకి వెళ్ళాను.

    అతనికి నా పై కోపం వచ్చింది. కోపంగా నన్ను కాటేశాడు అతని విష రక్తం అంతా నా శరీరంలో ప్రవేశించింది. గోధుమ వన్నెలో ఎంతో అందంగా వుండే 'కాలనాగు'వై పోయాను.

    నీకు తెలుసు. మన అర్ప జాతిలో ఒక సర్పం విషం మరో సర్పానికి రంగులో ఎంతో హాని చేస్తుందని. ఆనాటి నుంచీ నేను ' కాలనాగు నై పోయాను. ఇప్పటికీ శేషుకి నేనంటే ప్రాణం.

    ఆ దుర్మహుర్తానికి అతనెంతో విచారించారు. నేను అతనికి నీ విషయం తెలియనివ్వలేదు. తెలిస్తే ఒకటికి రెండుసార్లు కాటువేసేవాడు .

    ఏమయ్యది_

    నీ యీ అందమైన శరీరం వికృత మయ్యేది. ప్రవర్తనా వికృతమైందే! అప్పుడు శరీరం కూడా వికృతమైయ్యేది నాకు రంగు మారిపోయి నీకు శరీరంపై వికృతమైన పొడలు కూడా వచ్చేవి.

    కానీ నేను జాలి తలిచాను

    అయితే పగపట్టాను నీ పై!

    పాముపై మరో పాము పగ! ఎంత విచిత్రంగా వుంది చూడు నేనెపుడూ నీ నడవడి గమనిస్తూనే వున్నాను నువ్వెవరికయినా హానితలపడితే దాన్ని భగ్నంచేయటమే నా కర్తవ్యంగా భావిస్తూ వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు గడిచాయి! ప్రతిసారీ నేను అడ్డుకుంటూనే వున్నాను నువ్వు గమనించటం లేదు.

 Previous Page Next Page