ఆ తర్వాత అటా చ్ డ్ బాత్ రూమ్.
రూమ్ ని, బాత్ రూమ్ ని పరిశీలించి వచ్చిమ్ బుక్స్ రాక్ లో 'లా' మ్యాగజైన్ ని అందుకుని తిరగేస్తూ, వాచీవేపు చూసింది మోహిత.
అప్పుడు సమయం 9.45 నిమిషాలు.
* * *
` సరిగ్గా 9.47 నిమిషాలు.....
నాజ్ సెంటర్ లోని పోలీస్ ఐలాండ్ దగ్గరికొచ్చాడు టూ టౌన్ సబ్ ఇన్స్ పెక్టర్ సోమరాజు.
అప్పటికే అక్కడ డ్యూటీలో వున్న కానిస్టేబుల్ సెల్యూట్ చెయ్యగా "మారుతీ కారు విషయం గుర్తుంచుకో" అనిచెప్పి రాజ్ దూత్ ముందుకు పోనిచ్చాడు.
సరిగ్గా మూడునిమిషాల తర్వాత, మార్కెట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వెహికల్ ని స్లో చేసి సోమరాజు ఎందుకో తలతిప్పి, ఎడమవేపు చూసి షాక్ తిన్నాడు.
ఎడమవేపున్న సూర్యా కార్ కేర్ సెంటర్లో నెంబర్ లెస్ బ్లూ కలర్ మారుతీ కారు...... ఆ మరుక్షణమే....
అతని రాజ్ దూత్ ఆ మెకానిక్ షెడ్ లోకి ప్రవేశించింది. సబ్ ఇన్స్ పెక్టర్ సోమరాజు వెహికల్ , షెడ్ లోకి ప్రవేశించగానే లోన్నుంచి, మెకానిక్ పరిగెత్తుకుని వచ్చాడు.
"నమస్తే సార్...... ఏదైనా ప్రాబ్లమా?"
"ఆ మారుతీ కారు ఎవరిదీ?" పగిలిపోయిన హెడ్ లైట్స్ వేపు చూస్తూ అడిగాడతను.
"నిన్న సాయంత్రం రిపేరుకొచ్చింది సార్."
"ఎవరు తెచ్చారు?"
"ఒకాయన....."
"అతనికి పేరు లేదా?"
"తెలీదు సార్!"
"రెగ్యులర్ కస్టమరా?"
"ఇదే ఫస్ట్ టైమ్ సార్."
"అతని అడ్రస్ వుందా?"
"లేదు సార్...."
"అతను మళ్ళీ వస్తే అతన్ని ఇక్కడే వుంచి, సీక్రెట్ గా నాకు ఫోన్ చెయ్యి....." అంటూ టెలీఫోన్ వేపు నడిచాడు సబ్ ఇన్ స్పెక్టర్ సోమరాజు.
* * *
జస్టిస్ ఆదిత్య కారు బిల్డింగ్ మెయిన్ గేట్ లోంచి రోడ్ మీదకి వెళ్ళిపోయింది.
అదే సమయంలో టెలీఫోన్ మోగింది.
అక్కడ వున్న రాజేంద్రకుమార్ టెలీఫోన్ అందుకున్నాడు.
"హలో...."
"నమస్తే సార్..... నేను టూ టౌన్ ఎస్.ఐ. సోమరాజుని సార్...."
నెంబర్ లెస్ బ్లూ కలర్ మారుతీకారు కన్పించింది సార్."
"ఎక్కడ.....?" ఒక్కసారి రాజేంద్రకుమార్ తో టెన్షన్ పెరిగిపోయింది.
చెప్పాడు ఎస్.ఐ.
"ఆ ఇద్దరు వ్యక్తులున్నారా?"
"కారు మెకానిక్ షెడ్ లో వుంది సార్. ఆ కారుని చూస్తే నాకు అనుమానంగా వుంది సార్. ఆ ఇద్దరు వ్యక్తులూ ఈ వూళ్ళోనే ఏదో లాడ్జీలో వుండి వుంటారని నా అనుమానం....." చెప్పాడు ఎస్.ఐ.
"ఆ ఇద్దరు వ్యక్తులున్నారా?"
"కారు మెకానిక్ షెడ్ లో వుంది సార్. ఆ కారుని చూస్తే నాకు అనుమానంగా వుంది సార్. ఆ ఇద్దరు వ్యక్తులూ ఈ వూళ్ళోనే ఏదో లాడ్జీలో వుండి వుంటారని నా అనుమానం....." చెప్పాడు ఎస్.ఐ.
"ఇమ్మీడియట్ గా సిటీలో వున్న అన్ని లాడ్జీల్ని, గెస్ట్ హౌస్ ల్ని వెతకండి....... డోన్ట్ వేస్ట్ టైమ్...." అంటూ ఈ విషయాన్ని వెంటనే ఆదిత్యలు చెప్పడానికి పరుగు, పరుగున బయటికొచ్చాడు.
అప్పటికే ఆదిత్య కారు గేటుదాటి వెళ్ళిపోవడంతో, ఇంకో కారులో కోర్టుకు బయలుదేరాడు రాజేంద్రకుమార్ ఈ విషయాన్ని వెంటనే అతనికి చెప్పడానికి.
* * *
విజయవాడ బస్ కాంప్లెక్స్ లో రిటైరింగ్ రూమ్స్ కి వెళ్ళేదారిలో మెట్లమీద కూర్చుంది ఇందు.
తను ఎటువెళ్ళాలో ఆమెకు అర్థం కావడంలేదు. బావ మైత్రేయ గుంటూరు వెళుతున్నానని చెప్పాడు. తను గుంటూరు వెళ్ళినా బావ దొరుకుతాడని నమ్మకం లేదు.
ఇన్నాళ్ళు చంద్రప్ప ఇంట్లో బందీగా బతికిన ఇందుకు, తను అక్కడనుంచి తప్పించుకుని మళ్ళీ బయటి ప్రపంచంలోకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మానసికంగా ఎంతో ఆనందంగా వుందామె. ఎంక్వయిరీ కౌంటర్ దగ్గరికెళ్ళి మైసూర్ వెళ్ళే బస్సు గురించి ఎంక్వయిరీ చేసింది. ఇంకో గంటలో డైరెక్ట్ గా మైసూర్ వెళ్ళే బస్సు వస్తుందని తెలుసుకుని మళ్ళీ యధాస్థానంలో కొచ్చి కూర్చుంది.
రాత్రి ఏడుగంటలు.....
వచ్చే, పోయే ప్రయాణీకులతో బస్ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. హడావుడిగా వెళ్ళిపోతున్న ప్రయాణీకుల వేపు చూస్తోందామె.
సరిగ్గా అదే సమయంలో.....
తనముందునుంచే వెళ్ళిపోతున్న ఓ వ్యక్తిని గుర్తుపట్టి, ఒక్కసారిగా లేచి కేకేసింది.
"సరోజ...."
పిన్ని, బాబాయ్ లతో వెళుతున్న సరోజ ఒక్కసారి తలతిప్పి చూసి వెనక్కొచ్చింది.
"హేయ్..... ఇందు నువ్వు...."
సరోజ అలా కన్పించడంతో, స్వంత ఊరులోని తల్లిదండ్రుల్ని చూసినట్టుగా వుంది ఇందుకు.
"ఏమిటీ..... అలా వెళ్ళిపోయావ్....? మీ బావ కన్పించకపొతే..... వెంటనే నందిగామ వచ్చేయవచ్చు గదా..... మీ అమ్మ నాన్న నీ కోసం బెంగ పెట్టుకుని మంచానపడ్డారు. ఏం జరిగిందసలు....?" అడిగింది సరోజ.
"చాలా జరిగింది....." ఆ సమయంలో ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్థంకాలేదు ఇందుకు.
"మీ బావతో నీ పెళ్ళి అయిపోయిందట గదా....!"
"ఎవరు చెప్పారు?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇందు.
"మీ నాన్న....."
తన పరువు కాపాడుకోవడం కోసం, నాన్న అబద్ధం ఆడాడనే విషయం అర్థమైపోయిన ఇందు పెదవులమీదకు చిన్న చిరునవ్వు వచ్చింది.
"ఎక్కడుంటున్నారు?" అడిగింది సరోజ.
"మైసూర్ లో...."
"ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోవాలంటే, ఆ మాత్రం డేరింగ్ అవసరంలే..... ఆఖరికి మీ బావని సాధించావు.... నాకు కబుర్లు మాత్రమే మిగిలాయి..... ఊరూ, పేరూ లేనివాడని పెళ్ళి చేసుకోవాల్సి వస్తోంది...." చెప్పింది సరోజ.
"నందిగామ ఎప్పుడొస్తున్నావ్?" మళ్ళీ అడిగిందామె.
"వస్తాను..... సరోజ, నాకో హెల్ప్ చేస్తావా?" ఆర్ధ్రంగా అడిగింది ఇందు.
"చెప్పు."
"నేను క్షేమంగా వున్నానని మా అమ్మతో చెప్తావా...."
"ఆ మాత్రం చెప్పలేనా.... చెప్తానులే..... వస్తాను..... బస్సుటైమ్ అయింది....." వెళ్ళిపోయింది సరోజ.
నిశ్శబ్దంగా అలా వుండిపోయింది ఇందు. క్లోజ్ ఫ్రెండ్ తో చాలా మాట్లాడాలని అనుకుంది. కానీ మాట్లాడలేకపోయింది.
దాహం వేస్తోంది. మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని మెట్లవేపు వస్తున్నా ఇందు, తనవేపే పరుగు పరుగున వస్తున్నా వ్యక్తిని చూసి పరుగెత్తింది. ఆ వ్యక్తి చంద్రప్ప.
చంద్రప్ప తనను వెంబడిస్తాడని వూహించని ఇందు, రూరల్ బస్టాండ్ వేపు పరుగెడుతోంది. అక్కడంతా చీకటిగా వుంది.
"ఏయ్ ఇందూ..... ఆగు...." అరచుకుంటూ ఆమెవేనక పరుగెడుతున్నాడు చంద్రప్ప. చీకట్లో ఎటు వెళుతుందో ఆమెకే తెలీదు. మేడ మెట్లెక్కి ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులవేపు వెళుతోంది. ఆ ఆఫీసులన్నీ క్లోజ్ చేసి వున్నాయి. ఆ చివరి వరకూ పరిగెత్తి, రెండో వేపునున్న మెట్లద్వారా సిటీకెళ్ళే దారివేపు పరుగెడుతున్నది ఇందు.
ఆ మెట్లచివర వున్న చంద్రప్పని చూసి, మళ్ళీ వెనక్కి పరుగెడుతున్న దిశలో ఆమె చీరచెంగును పట్టుకుని, ముందుకు గుంజాడతను.
ఇందు నేలమీద పడిపోయింది.
"మర్యాదగా నాతో వచ్చెయ్...." అరుస్తూ ఆ చీరను గుంజుతున్నాడతను.
"నేను రాను...."
"చంపేస్తాను..... ఎలా రావో...." పైట చెంగును విదుల్చుకుని, ముందుకు పరుగెత్తబోయింది ఇందు. కానీ వీలుకాలేదు.
"హెల్ప్ మీ ..... హెల్ప్ మీ...." అరుస్తోంది.
ఆ సమీపంలో జనం ఎవరూ లేకపోవడంవల్ల, ఆమె రోదన అరణ్యరోదనే అయింది. ఎట్టకేలకు.....
ఆమె చేతికి చిక్కిపోయింది. రెండుచేతుల్తో ఆమెను పట్టుకుని బలవంతంగా లాక్కెళుతున్నాడు చంద్రప్ప. విడిపించుకోడానికి, గింజుకుంటోంది ఇందు.
"స్టాపిట్.... లీవ్ హర్....."వాళ్ళిద్దరి ఎదురుగా నుంచున్న వ్యక్తివేపు చూశాడు చంద్రప్ప.
"హు ఆర్ యూ..... షి ఈజ్ మై వైఫ్...." ముందుకు లాక్కెళుతూ అన్నాడు చంద్రప్ప.
"వైఫ్ అయితే..... జంతువును తీసికెళుతున్నట్టుగా తీసికెళతారా.....?ముందు ఆవిడ్ని వదిలి మాట్లాడండి....." గట్టిగా బెదిరిస్తూ అందామె. ఆమె శిల్ప.
"డోన్ట్ కమ్ ఇన్ టూ మై పర్సనల్ మాటర్స్...." విన్పించుకోలేదు చంద్రప్ప.
శిల్ప విసురుగా, కోపంగా ముందుకెళ్ళి, ఇందు చేతిని పట్టుకుని చంద్రప్ప నుంచి విడిపించింది.
ఇందు, శిల్ప పక్కకు వచ్చేసింది.
"ఇతని బారినుంచి నన్ను రక్షించండి...... ప్లీజ్....." ప్రాధేయపడింది ఇందు.
"నా భార్యను నానుంచి తీసుకెళ్లడానికి నువ్వెవరు?" మీద మీదకొస్తున్న చంద్రప్ప కళ్ళల్లోకి సూటిగా చూసి, కుడిచేయి పిడికిలిని బిగించి ఒక్కకరాటే కిక్ ఇచ్చింది శిల్ప.
ఆ దెబ్బతో చంద్రప్ప దూరంగా వెళ్ళిపడ్డాడు.
"అతను నీ భర్తా.....?" అడిగింది ఇందును శిల్ప.
"కాదు...." అన్నట్లుగా తలడించింది ఇందు.
"చూడండి..... ఈమె మీ భార్య అయినా, మీరు ఈవిడ భర్త అయినా, ఇలా ఇన్ హ్యూమర్ గా ప్రవర్తించడం మర్యాద కాదు.... రండి..... ఈవిడ్ని పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాను...... అక్కడ తేల్చుకోండి. నువ్వు నాతోరా....." అంటూ ఇందుచేతిని పట్టుకుని ముందుకు నడిచింది.
"నేనెవరో తెలుసా? నేనే సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ని.... నేను పోలీస్ స్టేషన్ కి రావడం ఏమిటి? ఎక్కడికి వెళుతుందో.... వెళ్ళిపోమనండి..... దానిని ఎలా నా దగ్గరకు రప్పించుకోవాలో నాకు తెలుసు..." అరుస్తూ అన్నాడు చంద్రప్ప.
లేచి, విసురుగా కాంప్లెక్స్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
బస్ స్టేషన్ బయటకు వస్తూ....
"ఎక్కడికి వెళ్ళాలి.....?" అని అడిగింది ఇందును శిల్ప. జరిగింది చూచాయగా చెప్పింది ఇందు.
"మీ బావ గుంటూరు వెళ్ళాడా....? ఎక్కడున్నాడో తెలీదా? మీ బావపేరు?"
"మైత్రేయ....."