నగ్నంగా మోడలింగ్ చేసేందుకు అభ్యర్ధినులు కావాలంటూ హెడ్ లైన్ యిచ్చి, క్రింద బొద్దుగా ఉండాలని, డబుల్ చిన్ వుండాలి- కళ్ళు బ్రౌన్ గా వుండాలంటూ ప్రతి ఒక్కరి అటెన్షన్ డైవర్ట్ చేసి, ఆశ్చర్యంలో ముంచెత్తి వయస్సు ఎనిమిదినుంచి పన్నెండు నెలల్లోపు వుండాలి అంటూ అందర్నీ ఫూల్స్ ని చేసి, అందరూ నవ్వుకునేలా చేసి, ప్రతి ఒక్కరి దృష్టిని మరల్చిన జీనియస్ ఎవరో తెలుసుకోవాలి- ప్రతి ఒక్కరిలో యివే ఆలోచనలు.
నిశ్శబ్దంగా అందరిలో ఆలోచనలు రేకెత్తించి, అన్నిచోట్ల సంచలనం సృష్టించిన మాధుర్, అతిత్వరలో వాణిజ్య ప్రచార ప్రపంచంలోకి ధృవనక్షత్రంలా దూసుకురాబోతున్నట్లు ఎవరూ వూహించలేదు. ఊహించలేరు కూడా.
"అవునూ, అసలింతకు ఈ రెండో ప్రకటన ఎందుకిచ్చినట్లు?" మాధుర్, అతిత్వరలో వాణిజ్య ప్రచార ప్రపంచంలోకి ధృవనక్షత్రంలా దూసుకురాబోతున్నట్లు ఎవరూ ఊహించలేదు. ఊహించలేరు కూడా.
"అవునూ, అసలింతకు ఈ రెండో ప్రకటన ఎందుకిచ్చినట్లు?" మాధుర్ మీంచి దృష్టిని బలవంతంగా మార్చుకొంటూ అడిగింది మౌనిక.
"పెద్ద పెద్ద కంపెనీల దృష్టిని మరల్చటానికి, ప్లస్ చిన్నపిల్లలు మనకు మోడలింగ్ అవసరమయి..."
"అవునూ! హోండా కారెంత రేటుందో తెలుసా?" మాధుర్ తమాషాగా అన్నాడు.
"సరదాగా అన్నాను. పోనీ నీకేం కావాలో చెప్పు?" అంది మౌనిక హుషారుగా.
"ఏదైనా యిస్తావా?"
"ఓయస్... అడగడానికి నువ్వే సందేహిస్తున్నావ్?"
అతనో క్షణం ఏదో అడగాలని అనుకున్నాడు. తిరిగి అంతలోనే సిగ్గుపడిపోయాడు.
"అదేంటిలా ఆడపిల్లలా సిగ్గుపడతావ్" అందామె మాధుర్ ని ఉడికిస్తున్నట్టు.
"నువ్వేంటలా మగరాయుడిలా సిగ్గుపడవు" ఉక్రోషంగా అన్నాడు.
ఆమె నిండుగా నవ్వింది.
సరిగ్గా అదే సమయంలో-
"ఎవరది మేడిసిన్ ఎవెన్యూ?" భరద్వాజ తన ఎదురుగా కూర్చునున్న వీనస్ ని అడిగాడు.
ఆమె అప్పటికి ఆ సమాచారాన్ని కనుక్కునేందుకే నాలుగయిదు చోట్లకు ఫోన్ కాల్స్ చేసింది. కానీ ఎవరూ సరయిన సమాధానం యివ్వలేకపోయారు.
అందుకే ఆమె చెప్పలేకపోయింది.
"అతనెవరో చూస్తుంటే జీనియస్ లా కనిపిస్త్గున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిది. జె.జె. ఎంపైర్ మన చేతుల్లోంచి ఎట్టి పరిస్థితులలోనూ ప్రక్కకు వెళ్ళగూడదు. ఇంతకీ మౌనికను ఒక్కసారన్నా కలిసావా?" భరద్వాజ రివాల్వింగ్ చైర్ లో వెనక్కి వాలుతూ అడిగాడు.
"లేదింకా రెండు మూడురోజుల్లో కలవాలనే ఉద్దేశ్యంలో వున్నాను. నాకొచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఆఫీసులో ఎక్కువకాలం గడపడంలేదని తెలిసింది" వీనస్ సాలోచనగా అంది.
"మరి....?" భరద్వాజ చప్పున అడిగాడు.
అతనో క్షణం అనుమానించాడు.
"అదే అర్ధంకావడం లేదు. రమణయ్య అనే ఓ రిటైర్డ్ ఓల్డ్ ఫెలోతో అప్పుడప్పుడూ సమావేశం జరుపుతోందని తెలిసింది.
"మరి... సింఘానియా పొజిషన్?"
"అది మరీ ఆశ్చర్యమనిపిస్తోంది. మన అంచనా ప్రకారం అతన్ని జె.జె. అయినా తొలగించాలి- లేదా మౌనికైనా తొలగించాలి. కొన్ని వేల వ్యాన్స్ ఇప్పుడు జె.జె. ఎంఫైర్ గోడౌన్స్ లో మూలుగుతున్నాయి. దాని మూలంగా ఆ ఎంఫైర్ కి వచ్చే నష్టంవారికీ లెక్కలోనిది కాకపోవచ్చు, కాని బిజినెస్ సర్కిల్స్ లో అవమానంతో తలవంచుకోవల్సి వస్తుంది. ఇవన్నీ వారికీ తెలియనివి కావు. బట్... ఎందుకు మౌనంగా వుండిపోయినట్లు...?" వీనస్ ఆలోచనలు ఓ నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోలేకపోతున్నాయి.
"అయినా మనం మన జాబ్ పర్ ఫెక్ట్ గా చేయలేదనిపిస్తోంది."
"ఏ జాబ్?" భరద్వాజ ఆందోళన వ్యక్తం చేస్తూ అడిగాడు.
అతనికి వీనస్ రియలైజేషన్ లోకి వెళ్ళడం ఇష్టముండదు.
చేసింది తప్పయినా గిల్టీగా ఫీలవకూడదనే వీనస్ పరంగా ఆశిస్తుంటాడు భరద్వాజ.
"మన ఏడ్ ఏజెన్సీ జె.జె. వ్యాన్స్ ని పకడ్బందీగా మార్కెట్ లోకి తీసుకెళ్ళలేదని నాకనిపిస్తోంది..." వీనస్ అసంతృప్తిగా ఫీలవుతూ అంది.
భరద్వాజ ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.
"అదేం లేదు. మన కేంపైన్ సక్సెస్ ఫుల్ గానే నిర్వహించబడుతోంది. జె.జె. వ్యాన్స్ లోనే ఏదో లోపం వుండి వుండాలి. ధర ఎక్కువో.... క్వాలిటీ డ్యూరబిలిటీ తక్కువయ్యో మార్కెట్ కి ఎక్కి వుండదు. దానికి మనమేం చేయగలం?"
"అసలది మార్కెట్ లోకి వెళ్ళందే దాని నాణ్యత, మన్నిక, మైలేజీ గురించి ముందే ఎలా తెలుస్తుంది? ఎట్ లీస్ట్ మొదటిసారన్నా, ఒక్కసారన్నా వినియోగదారులచే కొనిపించకపోతే ఏడ్ ఏజెన్సీ నిర్వాహకులుగా అది మన అసమర్ధత క్రిందకు రాదా?" వీనస్ సరయిన పంథాలో యోచిస్తోంది.
ఆమె ఆలోచనల్ని దారి మళ్ళించకపోతే తను ఇరకాటంలో పడవలసి వస్తున్నది. తప్పదు... రెచ్చగొట్టి దారి మళ్లించాలి.
"దాన్నెలాగో రెక్టిఫై చేసుకుందాం. ముందున్న ప్రమాదం గురించి ఆలోచించు..." అంటూ భరద్వాజ సిగార్ వెలిగిస్తూ ఓ క్షణం ఆగిపోయాడు.
ఆమె ఏమిటా ప్రమాదం అన్నట్టు కనుబొమ్మల్ని ఎగురవేసింది.
"కల్పనా ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఓ యువకుడు దాన్ని పునరుద్దరించబోతున్నాడట. అతనినుంచే మనకు రిజిష్టర్ లెటర్ వచ్చింది" అతని మాటల్లో కసి, కోపం తొంగిచూశాయి.
ఆమె ఓ క్షణం ఆశ్చర్యంగా కనుబొమ్మల్ని పైకి లేపింది.
వాలుగా, వంపు తిరిగే ఆ కనుబొమలే మాధుర్ ని మత్తులో ముంచెత్తాయి.
"తెలీదు. నేనూ ఇంతవరకు అతని పేరు వినలేదు- అతన్ని చూడలేదు. అది సాహసమా? అమాయకత్వమా? పిల్లచేష్టలో! అర్ధం కావడం లేదు..."
"అతనేమని రాశాడు ఆ లెటర్లో...?" వీనస్ చూయింగ్ గమ్ ని తమాషాగా నములుతూ, దానికంత ప్రాముఖ్యత ఇవ్వనట్టుగా అడిగింది.
"సరీగ్గా వారంలోపు కల్పనా ఎడ్వర్ టయిజింగ్ బిల్ సెటిల్ చేయకపోతే పరిస్థితులు విషమిస్తాయని రాశాడు. వాడికెంత సాహసం?" ఆ విషయం తల్చుకున్నప్పుడల్లా భరద్వాజ రక్తం మరిగిపోతోంది.
"అతని బెదిరింపుకంత ప్రాముఖ్యత ఇవ్వడం....?"
అతనో క్షణం తన ఆలోచనల్ని మందలింపు చేసుకుని అప్పుడు అన్నాడు "మేడిసన్ ఎవెన్యూ అడ్రస్, కల్పనా ఎడ్వర్ టయిజెర్స్ అడ్రస్ ఒక్కటే..."
ఆమె ఒక క్షణం వులిక్కిపడింది.
అప్పటివరకు ఆమె దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. రెండు అడ్రసులు ఒక్కటే అని తెలిసిన తరువతః ఆమె అనుమానాలు, ఆలోచనలు వేడెక్కాయి.
ఇద్దరి మధ్య ఒకింతసేపు నిశ్శబ్దం అలుముకుంది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టే విధానంమీదే వారిద్దరి ఆలోచనలిప్పుడు కేంద్రీకృతమయ్యాయి.
పదినిముషాల కాలం అలాగే నిశ్శబ్దాన్ని పెనవేసుకుని కరిగిపోయింది.
"అతనేమయ్యాడు...? ఏమన్నా వివరాలు తెలిసాయా?" భరద్వాజ తన ఆలోచనలు దారి మళ్ళిస్తూ అడిగాడు.
అప్పటివరకు మూడీగా వున్న వీనస్... అప్పటివరకు గంభీరంగా వున్న వీనస్ ఆ మాటలు వినడంతోటే ఆమె సహజ ధోరణిలోనే రియాక్ట్ అయింది.
ఆమె ఇప్పుడు వొల్కనో... రొమేంటిక్ వొల్కనో.... శృంగార దేవత....
ఆమెకు మాధుర్ గుర్తుకొస్తే చాలు- పులకరించిపోతుంది.
పలవరించిపోతుంది.
కలవరించిపోతుంది.
అయితే అక్కడే ఇద్దరిమధ్య కమ్యూనికేషన్ గేప్ చోటు చేసుకుంది. మాధురే మేడిసన్ ఎవెన్యూ స్టార్ట్ చేసిందన్నది ఆ యిద్దరికీ తెలీదు.
కల్పనా ఎడ్వర్ టయిజర్స్ నుంచి రిజిస్టర్ లెటర్ వ్రాసింది. మాధుర్ అనే యువకుడని భరద్వాజకి తెలుసు. కాని తనకు తెలిసిన ఆ పేరును అతను ఆమెకి చెప్పలేదు. కానతనికి మాధుర్ తెలుసు. ఆ తెలపడం అన్నది మాధుర్ అనే పేరుతో కాదు. రవి అనే పేరుతో.
అసలతని పూర్తి పేరు రవి మాధుర్ అని వీనస్ కి మాత్రమే తెలుసు!
ఒక్క మనిషి గురించే ఆ ఇద్దరూ ఆలోచిస్తున్నారు.
కాని ఆ ఇద్దరి ఆలోచనలు ఓచోట కలవలేకపోతున్నాయి.
అతనేమయ్యాడు అంటూ భరద్వాజ వేసిన ప్రశ్నకు ఆమె సమాధానమివ్వలేదు.
"కల్పనా ఏడ్ ఏజన్సీపట్ల కూడా మనం చేసింది అన్యాయమేమో అనిపిస్తోంది. న్యాయంగా మనం ఆ సంస్థకు డ్యూస్ పే చేయాలిగదా?"
"కల్పనా కేంపైన్ ఫెయిల్ అయింది. మన క్రొత్త ప్రోడక్టు దెబ్బతిన్నది. అసలు ఇండియాలో మల్టి క్లీనింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ముందుగా మనమే. మన క్వీన్ ఏడ్ ఏజెన్సీ అప్పటికి స్థాపించలేదు. గనుక కల్పనాకి కేంపైన్ యిచ్చాం. మన వీనస్ మల్టీ క్లీనింగ్ సిస్టమ్ ఎక్కువగా అమ్ముడుపోలేదు. దానిమూలంగా మనకు లక్షల్లో నష్టం వచ్చింది. ఈలోపు యురేకా ఫోర్ బ్రెష్ మైటీ సిస్టమ్ మార్కెట్ లోకి వచ్చి బ్రహ్మాండంగా సక్సెసయింది. దాని మూలంగానే గదా మన క్లీనింగ్ సిస్టమ్ కంపెనీని మూసివేసుకుంది" ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ అన్నాడు భరద్వాజ.