Previous Page Next Page 
యోధుడు పేజి 29

    థాంక్యూ లాయరు గారూ! మీరు ఫోన్ చేసినా, టెలిగ్రాం ఇచ్చినా వెంటనే వచ్చేస్తాను" అంటూ లేచి నిలబడ్డాడు రణదీఫ్.

    "సీ యూ మిస్టర్ రణదీఫ్ కేవల్కర్" కరచాలనం చేశాడు నీలకంఠన్ .

    రణదీఫ్ ముందుకు కదిలాడు. ఆ బిల్డింగ్ లోంచి బయటకు వచ్చి ఎటో ఎక్కాడు రణదీఫ్. లాయర్ నీలకంఠన్  ని తను నమ్మించేశావనే ధీమాలో వున్నాడు అతడు.

    తన ప్రవర్తన, తను చెప్పిన జవాబులు, తను చూపించిన డాక్యూమెంట్స్, ముఖ్యంగా సంతోష్ కేవల్కర్, సుశీల ఫోటో ఎక్కడా ఆ లాయర్ తనని అనుమానించినట్లులేదు. నో డౌట్ ఆ కోట్లరూపాయల ఆస్తి తనదే అనుకుంటూ మరో అరగంటకి ధీమాగా హొటల్లోకి అడుగుపెట్టాడు రణదీఫ్.
   
                                                    *    *    *    *

    అప్పటికే హొటల్ రూమ్ లో మందూ మార్బలంతో వున్నాడు అంకుష్.

    "సక్సెస్... గ్రేట్ సక్సెస్, ఆ లాయర్ నా బుట్టలో పడిపోయాడు. ఆ సర్టిఫికెట్స్, ఆ ఫోటో చూసి నోట మాటరాక, అలా బొమ్మగా వుండిపోయాదనుకో_ నువ్వేల్లిన పని ఏమైంది?" టీపాయ్ మీద రెడీగా వున్న రెండు విస్కీగ్లాసుల్లో ఒక గ్లాసును అందుకుంటూ అడిగాడు రణదీఫ్.

    "ఆ కాశీచరణ్ కి ఆ హాస్పిటల్లో వి.ఐ.పీ. ట్రీట్ మెంట్ లభిస్తోంది. అర్చన ఎవరో, ఏమిటో తనకు తెలీదన్నాడు. అర్చన ఊరుకున్నా నేనూరుకొన్ని దబాయించి, భయపేట్టి మరీ వచ్చాను.

    ఆ హాస్పిటల్ డాక్టర్ మధురిమ ఆ కాశీచరణ్ ని వెనకేసుకోస్తోంది. చూస్తుంటే ఆ మధురిమ మీద నాకేదో అనుమానంగా వుంది" గడగడా గ్లాసులోని గరిమకు తాగేస్తూ అన్నాడు అంకుష్.

    "ఏంటా అనుమానం?" అడిగాడు రణదీఫ్.

    "ఆ మధురిమ గురించి, బయట సెక్యూరిటీ దగ్గర ఎంక్వయిరీ చేశాను. ఇంకా పెళ్ళి కాలేదట. ఆ కాశీచరణ్ విషయానికొస్తే అతను గతమంతా మర్చిపోయిన ఇమ్నషియా పేషెంట్ అనే విషయం నిజమని తెలిసింది" అన్నాడు అంకుష్.

    "ఆ రెండు  పాయింట్లు మనకేప్పుడో తెలుసుగా_ అందుకే గదా అర్చన అనే కేరెక్టర్ ని ఆ కాశీచరణ్  లైఫ్ లోకి ప్రవేశపెట్టాం. అల్టిమేట్ గా ఆ ఆస్తి నాదే" నవ్వుతూ అన్నాడు రణదీఫ్.

    "ఎలా?" అంకుష్ ఆశ్చర్యంగా అడిగాడు.

    "ఎలా ఏంటి ఆ కాశీచరణ్ ఒరిజినల్ హీరో అనుకో, ఇమ్నేషియా లోంచి అతను బయటకు వచ్చేశాడనుకో, అతనికోసం రెడీగా అక్కడ అర్చన వుంటుంది. అర్చన అతని పెళ్ళామవుతుంది."

    "ఎలా? అతనికి ఆ వ్యాధి నయమై తన గతం గుర్తుకొస్తే? అర్చన ఎవరో తనకు తెలీదంటే? అడిగాడు అంకుష్.

    "అంటాడు_ అలాగే అంటాడు. ఎందుకంటే అర్చన నిజంగా అతనికి తెలీదు గనుక. అయినా అతను అర్చన నుంచి తప్పించుకోలేడు."

    "అదెలా?!" అంకుష్ మరింత ఆశ్చర్యపోయాడు.

    "డీల్లిలో అతను పనిచేస్తున్నా ఎద ఎజేన్సికి ఒక మనిషిని పంపిస్తాను. అతను కాశీచరణ్ ఒరిజనల్ రైటింగ్ జిరాక్స్ పేపర్స్ తీసుకొస్తాడు. వాటి ఆధారంగా కాశీచరణ్_ అర్చనకు రాసినట్లు కొన్ని ఉత్తరాలు తయారయిపోతాయి. వాటిల్లో కాశీచరణ్_ అర్చనను ప్రేమించినట్లు శారీరకంగా కలసినట్లు, త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చినట్లు వుంటుంది.

   
    తనకు త్వరలో కోట్లాది ఆస్తి రాబోతున్నట్లు, ఆ ఆస్తి రాగానే పెళ్ళి చేసుకుంటాన్నన్నట్లు  మరికొన్ని ఉత్తరాలు తయారవుతాయి.

    రేపతనినికి గతం గుర్తుకొచ్చి అర్చన ఎవరో తనకు తెలీదనడం ఖాయం. అప్పుడు ఆ ఉత్తరాల్ని లింగ్ షుగర్ పోలీసులకు, లింగ్ షుగర్ కోర్టుకి అండ జేసి, కోట్లాది డాబు రాగానే ప్లేట్ ఫిరాయ్తించేశాడని మనం పెట్టుకునే లాయర్ వాదిస్తాడు.

    ఆ లెటర్స్ తను రాసినవి కాదంటాడు కాశీచరణ్. అతనివే అంటుంది  అర్చన. ఆ కేసు తేలడానికి కొన్ని ఏండ్లులు పడుతుంది.

    ఈ లోపు అతని ఆరోగ్యం పాడవుతుంది పాడైన ఆరోగ్యం మూలంగా అతను చనిపోతాడు. చనిపోయాక కేసుండదు. లీగల్ గా ఆ ఆస్తి అంతా అర్చనకు చెందుతుంది. అర్చన మన మనిషి కానుక ఆస్తి మనకే వస్తుంది. అప్పుడు ముగ్గురం కోటీశ్వరులమే.

    ఒకవేళ నా సర్టిఫికేట్స్ నిజమైనవని ఆ లాయర్ నమ్మడనుకో_ అప్పుడు సాఫీగానే ఆ ఆస్తి నా పరమవుతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అర్చన కేరెక్టర్ ప్రవేశపెట్టడం జరిగింది" రణదీఫ్ చెప్పడం అపి మిగిలిన బాటిల్ పెకైత్తాడు.
    ఎందుకో ఆ క్షణాన రణదీఫ్ చూస్తూ, అంకుష్ భయపడి పోయాడు.

    "నిన్నే నముకున్నాను. నువ్వు చేబుతున్న అడ్డమైన పనులన్నీ చేస్తున్నాను. మరి నాకు వాటా ఇవ్వవా?" అడిగాడు అంకుష్ తనలో రేగుతున్న భయాన్ని తనలోనే దాచుకుంటూ.

    "ఎందుకివ్వనూ ఇస్తా. ఆస్తి నాకొస్తే ఏంటి? నీ కొస్తే ఏంటి చెప్పు? ముందు మందు తాగు. జల్దీగా ఫినిష్ చేసి బెంగుళూరు బస్సేక్కేద్దాం. చేయాల్సిన పనులు చాలా వున్నాయి." అన్నాడు రణదీఫ్
   
    మరో అరగంటకు డ్రింక్ సెక్షన్ పూర్తయింది. హొటల్ రూమ్ ఖాళీ చేసేసి రణదీఫ్, అంకుష్ ఇద్దరూ  ఆటోలో బస స్టాండ్ కెళ్ళారు.

    మరో ఇరవై నిమిషాల తర్వాత వారిద్దరూ బెంగుళూరు వెళ్ళే జబ్బార్ ట్రావెల్స్ బస్సులో వున్నారు.
   
                         *    *    *    *

    ప్రజల జీవితాలతో చెలగాట మాడుకునే రాజకీయ నాయుకుల మూలంగా నగరంలో బండ్, బస్సులు, ఆటోలు దొరక్క పోవడంలో నానా తంటాలుపడి హాస్పిటల్ కు లేటుగా  వచ్చింది హెడ్ నర్స్ మేరీ.

    అప్పటికి డాక్టర్ మధురిమ ఇంకా హాస్పిటల్ కిరాకపోవడంతో ఊపిరి పీల్చుకుని యూనిఫాం వేసుకుని వార్డ్ లోకి నడిచిందామె.

    శివానందం ఎదురైతే ఏం చెప్పాలోనని కంగారుగా వుందామెకు. దానిక్కారణం రెండురోజుల క్రితం అతనొక ఉత్తరం రాసిచ్చాడు.

 Previous Page Next Page