Previous Page Next Page 
కాలనాగు పేజి 29

    భయంకరమైన కాలసర్పం. అయిదు పడగలలో వుంది  కెవ్వుమన బోయిన సంధ్యని చూసి ఆమె చేయి పట్టుకుని నోరుమూశాడు ఆదిత్య.

    కలనాగు తనని వేదిస్తుందన్నమాట అనుకున్నాడు. ఎలా చెప్పాలి సంద్యకి అనుకుంటున్నాడు.

    సంధ్య మనస్సు తనకి యిమ్తివడ్డ 'దర్శనం'యిచ్చిన పాము గుర్తుకి వచ్చింది. ఆ రోజు పార్కులో కనిపించిన పాము గుర్తుకి వచ్చింది.

    ఏమిటిది? పాములు పట్టుబడుతున్నాయా?

    ఈ దివ్య సర్పాలకి తమ పెళ్ళి యిష్టం లేదా?

    ఎందుకు?

    వరాలిచ్చి కరుణించే పాములు ఎందుకు అడ్డుకుంటున్నాయ్. ఆమె మనస్సు తీవ్రమైన అందోళనకి  తీవ్రమైన  లోనయ్యింది.

    అంతలో మరో పాము డబ్బున పున్నాగ చెట్టు మోదల్లోంచి కాలనాగు ముందు దూకింది.

    రెండూ శత్రువుల్లా ఒకదాని కొకటి ఎదురుగా తల్లెత్తి, పడగలు విప్పి, కోరలు చాస్తూ వున్నాయి.

    అది చూస్తున్న ఇద్దరికీ వాళ్ళంతా చెమటలు పట్టేయి.

    "ఏమిటిది?"

    ఇద్దరూ యీ రెండు పాములకీ బలై పోతారా?

    శత్రువుల్లాగా పోంఛాయేమిటియీ పాములు?

    ఇవి దివ్య సర్పాలా? శత్రు సర్పాలా?

    ఒకటి పగబడితే మరొకటి తమని రక్షించేందుకి వచ్చిందా వీటిలో వీటికి వైరం వుండా?"

    పరిపరి విధాల సాగుతున్నాయి ఆదిత్య ఆలోచనలు.

    ముందు కనిపించిన పాము మెల్లగా పాడగా దించుకున్నది, తల వంచుకున్నది అవమానంతో కృంగిపోతున్నట్టుగా అయింది. మెలిమెల్లిగా వెనక్కి వెనక్కి జారుకున్నది. రెంటి మధ్య పడి పదిహేను మీటర్ల దూరం ఏర్పడింది.చూస్తోన్న ఇద్దరికీ హత్యల్లో ఆరితేరిన ఇద్దరు ఖూనీకోర్లు ఎదురుపడి, ఒకరి కొకరు భయపడి, అందులో ఒకడు తన ప్రాణ రక్షణ చేసుకుంటూ, మరొకడిని బెదిరిస్తూ తప్పకుంటున్నట్టుగా అనిపించింది.

    రెంటి మద్యా దూరం బాగా ఎక్కువైంది.

    తొలిపాము చొప్పున పడగని తిప్పుకుంది జరజరమని శబ్దం చేసుకుంటూ మహావేగంతో చెట్టుచాటుకి వెళ్ళి మాయమైంది.

    అదంతా గమనిస్తూన్న ఇంకో సర్పం  బుసకొట్టింది. అది ఆపద తప్పిపావుయిమ్దన్న ధైర్యంతో ఓ మనిషి ఉస్సురని నిట్టూర్చినట్టుగా అనిపించింది ఇద్దరికీ.

    ఆ సర్పం అలాగే నిలిచిపోయింది కొద్దిసేపు. తోకపై నిలువుగా లేచింది ఇద్దర్నీ ఆశీర్వదిస్తూన్నట్టుగా పడగావిప్పి,శిరస్సు వంచింది అయిదు పడగలపై వున్న వణులు ఒక్కసారిగా వెలిగేయి.

    వెన్నెలకన్నా చల్లనైన వెలుగు ఇద్దరి మీదా ప్రసరించింది ఇద్దరి కళ్ళు మిరిమిట్లు గొల్పినట్లయి మూసుక పోయాయి.

    క్షణం గడిచింది.

    చప్పున కళ్ళు తెరిచాడు.

    చూస్తే ఆ పాము లేదక్కడ! "ఎటుపోయింది? అదృశ్యమైయిందా? ఇది దేవతా సర్పమా?" అనుకున్నాడు ఆదిత్య.

    సంధ్య గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
   
   
                                        29


    "సంద్యా!" ఏదో లోకంలో విహరిస్తోన్నట్టుగా వున్న సంధ్య చప్పున "ఉ"అంది ఉలికిపడుతూ!

    "నేను చెప్పాను గుర్తుందా?"

    "ఏమిటి?" అర మోడ్పు కన్నులతో అడిగింది సంధ్య.

    "మా యింటి పెరట్లో ఓ సంఘటన జరిగిందన్నాను"

    "అవును! నువ్వు చెప్పలేదు_ ఏమిటిది?"

    "ఇప్పుడు జరిగిందే!"

    "అంటే!" అర్దంకాక అడిగింది.

    'సంద్యా! నన్ను కాలనాగు వెన్నాడుతున్నది ఆమె పేరు ఉలూచి అని చెప్పింది. వెయ్యి సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్ననన్నది.అపుడు నేను ఏకపత్నీ వ్రతుడినట.నా భార్య పేరు 'స' అనే అక్షరంతో  ప్రారంభమవుతుందట. ఆమె నన్ను జన్మజనలుగా అనుసరించి వస్తావున్నదట!

    ఈ దేశంలో పతివ్రత చావదు. ఇదట సిద్దాంతం. ఆమె నన్ను ఇన్ని జన్మలుగా ప్రేమించి నా కోసం జన్మలెత్తి వస్తున్నా నేను ఆమెని తిరస్కరిస్తూ వస్తున్నానట.

    ఈ జన్మలో ఆమె పేరు సరళ-ట! అలా నాన్నగారికి చెప్పి చెప్పగా' తన మహిమతో ఆయనకి చూపు వచ్చేట్టు చేసింది.

    ఆ రోజు నేను బాత్రూకి వెళ్ళాను. అక్కడ రూంలో ఆమె వుంది. నన్ను స్నానం చేయమంది 'కలసి స్నానం చేద్దామా అంది శిరస్నానం చేయిస్తానంది. ఒక మనసైన జవరాలు తలంటుపోస్తే అద్బుతంగా వుంటుందో స్వయంగా అనుభవించి చూడమంది.

    చిలిపి తలపులు వెన్నాడుతుంటే_ తలుపులచాటు శృంగారం దివ్యంగా వుంటుందో చూద్దాం అంది.

    నేను భయపడ్డాను. తిరస్కరించాను

    ఒప్పుకోకపోతే కాటు వేస్తాను. విషం ఎక్కితే ఏంట్ బాధాకరంగా వుంటుందో చూడు అంది నలుడిని కాటువేసి, నన్ను వికృతంగా మరుస్తానంది
 
    నాకు వానకు ప్రారంభమైంది. ఇదెక్కడి ప్రేమ! పాముప్రేమ! అనుకున్నాను.

    అప్పుడో అద్బుతం జరిగింది.

    బాత్ రూం కిటికీలోంచి ఏదో జరజర పాకి వచ్చినట్టుయింది. నా కళ్ళకి శబ్దం తప్ప రూపం కన్పించలేదు.

    క్షణంలో అదే బాత్ రూం లో మరో యువతి కనిపించింది. ఎలా సంభవం! నేను చూస్తున్నది నిజమా! నా కళ్ళు చూస్తున్నాయా?వాటికి చూసే శక్తి వుందా?

    నా కేమీ తెలియటం లేదు.

    కొన్ని సెకన్లు అంతా విరామయం.

 Previous Page Next Page