తను చేసిన పొరపాట్లు చక్రపాణికి తెలుసు. అవిగాక యింకేమైన వున్నయోమోనని కావాలని అడిగాడు.
వీళ్ళు చెప్పి చేస్తారు వీళ్ళని సరి అయిన పేరుతొ పిలవాలి అంటే క్రుయాల్ పర్సన్స్ కాని వీళ్ళని తను సరైన పేరుతొ పిలవడు. మానవరణ్యం యిది అటు మనిషి ఇటు జంతువు గాని వీళ్ళని బ్రూటల్ బాడీస్ అంటే సరిపోతుంది, నవ్వుతూ చెప్పినా ఏడుస్తూ చెప్పినా చెప్పింది చేసి తీరుతారు.
వాడు చెప్పినట్లు
తనకి ఆపరేషన్ చేయటం ఖాయం. బతికించటం ఖాయం. అ తర్వతమాత్రం చంపటం పూర్తిగా ఖాయం. ఈ లోపల తను చేతనయితే పారిపోవాలి. ఇక్కడనుంచి తప్పించుకోవటం అన్నది, పద్మవ్యుహంలోంచి శత్రువులని తప్పించుకుని బయటకు రావటం లాంటిదే. అది అయ్యేపనికాదు. తన శాయశక్తులా ప్రయత్నించి చేయగలిగితే ఒకే ఒక పని చేయాలి. అంతిమ వార్తలని భద్రంగా దాయటం, అది చేయగలిగితే ఆ తర్వాత అదృష్టమంటూ వుంటే.....
చక్రపాణి ఆలోచిస్తుంటే గుర్రం ముఖం వ్యక్తీ మరో యిద్దరు వ్యక్తులని వెంటబెట్టుకుని వచ్చాడు.
చక్రపాణి ఏం మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాలేదు. ఆఖరికి గుర్రం ముఖం వ్యక్తీ కూడా మాట్లాడలేదు.
చక్రపాణి ధరించిన ఫ్యాంటు షర్టు విప్పేశారు. వంటికి డ్రాయరు మాత్రం వుంచారు. ఫ్యాంటు షర్టులో ఆపదలో ఆదుకునేవి కొన్ని దాచి వుంచాడు. వాటికన్నా డ్రాయరు ముఖ్యం అసలు సిసలైంది డ్రాయరు బొందులో వుంది. వంటిన డ్రాయరు అలాగే వుండి ఏ మాత్రం అవకాశం చిక్కిన చాలు వార్తని భద్రపరచడానికి. అవకాశం చిక్కుతుందా లేదా అన్నదే అనుమానం.
చక్రపాణి వంటిమీద డ్రాయరు మాత్రమే వుంచి తెల్లనిది పల్చనిది గుడ్డ సన్యాసులకి చుట్టినట్లు చుట్టారు.
"మనం యిప్పుడు ఆపరేషన్ దియటర్ కి వెళుతున్నాము." గుర్రం ముఖం వ్యక్తీ చెప్పాడు.
వంటరిగా వుండే అవకాశం మళ్ళి తనకి రాకపోవచ్చు. ఇప్పుడే తను తొందరపడాలి అనుకున్న చక్రపాణి, "ఓసారి బాత్ రూంకి వెళ్ళి రావాలి అర్జెంట్!" అన్నాడు.
"ఆపరేషన్ దియటర్ కి ఎటచ్ద్ బాత్ రూం వుంది. అక్కడ తిర్చుకుందువుగని అవసరం."
చక్రపాణికి చాలా సంతోషం కలిగింది. చాలు ఆ చిన్న అవకాశం చాలు, తను చాలా పెద్దపని చేయటానికి ఆ తర్వాత జరిగేది అదృష్ట దురదృష్ట బలాబలాల పోటి మీద వుంటుంది ఏదైనా. కర్తవ్యం ముందు, తన కర్తవ్యం తను నేరవేరుస్తే సరి.
ముఖంలో భావాలు కనపడకుండా జాగ్రత్తపడుతూ "థాంక్స్" అన్నాడు చక్రపాణి.
12)
వెలుగుతున్న దీపాలు చమక్ ,మంటూ ఆరిపోయాయి.
చక్రపాణి చేతికి కళ్ళకి సంకెళ్ళు వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు.
మరికొద్దిసేపటిలో ఆపరేషన్ ధియేటర్ లో వున్నారు. వాళ్ళు. ధియటర్ విశాలంగా చాలా చక్కగా వుంది. ఫారెన్ మోడల్ ల్లో వుంది. డాక్టర్లు తదితరులు రడిగా వున్నారు.
చక్రపాణితో సహా వాళ్ళు లోపలికి వెళ్ళిం తరువాత.
ధియటర్ తలుపులు నెమ్మదిగా మూసుకున్నాయి.
11
ఆ రూమంతా భయంకర నిశ్శబ్దం ఆవరించింది.
ఉండి ఉండి సన్నని రోదన ధ్వని.
కళ్యాణి నర్సింగ్ హోమ్ లో ధైర్యని చేర్చారు. స్పెషల్ రూం తీసుకున్నారు. డా. కళ్యాణి అందరు డాక్టరమ్మలులాంటిది కాదు. పేషంట్ ప్రాణం ముఖ్యం, ఈ రోజు నుండి రేపు పోయేది డబ్బు చిరకాలం వుండేది కీర్తి. మంచితనం పేరు.
బిజీగా వుండి కూడా మధ్య మధ్య డా. కళ్యాణి వచ్ పేషంట్ ధైర్యని చూసి వెళుతున్నది. ఆమెకి ఈ కేసు అర్ధం గాక మరో డాక్టరుని పిలిపించి చూపించింది. ఈమెకి ఎంత అర్ధంఅయిందో ఆయనకి అంతే అర్ధంఅయింది.
ధైర్యకి వ్యాధి కాదు. ఆమెకి తగిలింది షాక్. అంతవరకూ డాక్టర్లు నిర్ణయించగలిగారు. బి.పి. నార్మల్. ఇతరత్రా ఏమి లేదు. షి ఈజ్ పర్ ఫెక్ట్ల్లి లీ అల్ రైట్. మరి యిదేమిటి?