Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 29

 

    చక్రపాణి అలా ఆలోచిస్తుండగా "మిస్టర్ చక్రపాణి మీ అదృష్టం పండింది, అందుకు అభినందిస్తున్నాను" అన్నాడు గుర్రం ముఖం వ్యక్తీ.

 

    "మిస్టర్ చక్రపాణి!" ఆ మాట వింటూనే చక్రపాణి ముఖం పాలిపోయింది. సి. ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి నుంచి నిన్ను పేరుతొ పిలువము మిస్టర్ ఎక్స్ అనే పేరుతొ పిలుస్తాము. అలా అయితేనే పలకండి" అన్న ఈ వ్యక్తీ ఇప్పుడు మిస్టర్ చక్రపాణి! అని పిలిచాడంటే అర్ధం? తనని పూర్తిగా తొలగించినట్లేకదా?"

 

    "నా పేరు మిస్టర్ ఎక్స్!" చక్రపాణి తెలివిగా అన్నాడు.

 

    గుర్రం ముఖం వ్యక్తీ గుర్రంలా సకిలిస్తూ మరీ నవ్వాడు.

 

    ఎక్కడ పొరపాటు జరిగిందో జరిగింది. దాన్ని గురించి విచారించేకన్నా ముందు జరగబోయేదాన్ని గురించి జాగ్రత్త వహించడం మంచిది. తూచి తూచి మాట్లాడటం ఒకటి నాకేం తెలియదు అనటం రెండొవది. అన్నింటికన్నా బెటర్ మౌనం, చక్రపాణి మౌనంగా వుండిపోయాడు.

 

    "మీ పేరు నాకు తెలుసు మిస్టర్ చక్రపాణి! మీ వ్యక్తిగత చరిత్రే తెలియదు. కొంప మునిగేలోపలె మిరేవరో చూచాయగా తెలిసింది. కాబట్టి యింకా మీ గురించి మొత్తం తెలుసుకోవటం ఏమంత కష్టం కాదు. ఓ వ్యక్తిని అందలం ఎక్కిద్దామని మేము చూస్తుంటే అందుకోకుండా వెర్రివేషాలు వేస్తాడు అనుకొంది యితరులు అయితే నరికి పోగులు పెడతారు. కాని మేమలా చేయం." గుర్రం ముఖం వ్యక్తీ అన్నాడు.

 

    చక్రపాణి మాట్లాడలేదు. "దెయ్యాలు వేదాలు వల్లించినట్లు!" ఈ మాట మనసులో అనుకున్నాడు.

 

    "మీరెలా రాంగ్ స్టెప్ వేశారో తెలుసుకోవాలని వుందా!"

 

    మీరు మీరు అంటూనే రక్తం తాగే ఈ నరరూప రాక్షసులతో మాట్లాడి ప్రయోజనం ఏముంది? చక్రపాణి అనుకున్నాడు.

 

    "ఇంకోగంట తర్వాత మీ స్టమక్ కి ఆపరేషన్ జరగబోతున్నది. ఈ విషయంలో మీరు ఆదుర్దా ఆందోళన పడనక్కరలేదు. చాలా పెద్ద సర్జన్ మీకు ఆపరేషన్ చేస్తాడు." గుర్రం వ్యక్తీ తాపీగా చెప్పాడు.

 

    చక్రపాణి ఉలిక్కిపడ్డాడు. "నాకేం రోగం లేదు." కోపంగా అన్నాడు.

 

    "మీకు రోగం ఉంది అని నేను అనలేదే!" నవ్వుతూ అన్నాడు గుర్రం ముఖం వ్యక్తీ.

 

    "మరి నాకెందుకు ఆపరేషను? అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి పొట్ట చీల్చి పేగులు తోడేద్దామనా! దానికైతే సర్జన్ ఎందుకు? వాడి గోళ్ళు చాలు." చక్రపాణి చిరునవ్వుతో అడిగాడు.

 

    చక్రపాణికి తెలుసు. ఇలాంటి వాళ్ళకి చిక్కితే పేగులు తోడేసి వేడినీళ్ళలో ఉడకేసి, బండకేసి బాది ఎందబెదతారని తెలిసి తెలిసి భయపడటం పిరికి వాళ్ళ లక్షణం. నిప్పు అని తెలిసి ముద్దు పెట్టుకున్నడతాను. మూతి కలుతుందని తెలుసు, ఇప్పుడు కాలింది దట్సాల్.

 

    "మీ ధైర్యం చాలా గొప్పది మిస్టర్ చక్రపాణి. మీకు ఆపరేషన్ చేయటం పేగులు తోడేయడానికి కాదు! మిమ్మల్ని అ మిషతో చంపడానికి కాదు."

 

    "మరి?"

 

    "అది టాప్ సిక్రెట్."


    "అవసరం లేని ఆపరేషన్ చేసి నన్ను బతికించడం దేనికి?"

 

    " ఆ తర్వాత చంపడానికి." పకపక నవ్వుతూ చెప్పాడు గుర్రం ముఖం వ్యక్తీ.

 

    చక్రపాణి నోటమాట రాలేదు.

 

    

    నేను చేసిన పొరపాటు ఏమిటి?" గత్యంతరం లేక చక్రపాణి అడిగాడు.

 

    "కాస్త తీవ్రంగా ఆలోచిస్తే మీకే అర్ధం అవుతుంది. మళ్ళి పది నిమిషాల్లో తిరిగి వస్తాము. అప్పటిదాకా ఆలోచిస్తూ ఉందండి." అని చెప్పి గుర్రం ముఖం వ్యక్తీ వడివడిగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.   

 Previous Page Next Page