కుడిచేత్తో అతని గుండెల మీద కొడుతూ "బాస్టర్ట్ వదులు, నువ్వు వదలకపొతే అరిచి గోల చేస్తాను. పోలీస్ కంప్లైంట్ చేస్తాను" అంటూ ప్యానిక్ గా అరిచింది లిపి. అప్పటికే ఆమె కళ్ళలో నిస్సహాయత తాలూకు కన్నీళ్ళు.
"గోల చేస్తావా? అరుస్తావా? పోలీస్ కంప్లయింట్ యిస్తావా. ఈ మూడు ఇక్కడ కుదరవు బేబీ! నీ అపురులు విన్పించినా, ఎవరూ పట్టించుకోరు. నీ కంప్లయింట్ ని కూడా ఈ ఏరియా పోలీసులు పట్టించుకోరు. ఎందుకో తెలుసా? అయామ్ పద్మనాభన్" ఆమె నడుం మీద చెయ్యి వేసి ముందుకు లాగాడు. లిపి ఒక్కసారిగా బెడ్ మీద పడిపోయింది.
పడిపోయిన లిపి మీదకు ఒక్కసారిగా ఎగిరి ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు పద్మనాభన్.
లిపి అరుస్తోంది. ఏడుస్తోంది. అతనినుంచి తప్పించుకోడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెమటతోనూ, భయంతోనూ ఆమె వళ్ళంతా తడిసి ముద్దయిపోయింది.
పద్మనాభన్ కసిగా, కోర్కెగా, విషజంతువులా ఆమె బుగ్గల్ని, భుజాల్ని కొరుకుతున్నాడు.
"కోపరేట్ విత్ మీ" అతను కూడా అరుస్తూ మెడ కింద భాగములో చెయ్యి వేయబోయాడు పద్మనాభన్.
సరిగ్గా అదే సమయంలో.....
లిపి ఒక్కసారి కుడికాలెత్తి అతని గుండెలమీద తన్నింది. ఆ దెబ్బకు ఫిట్ బాల ఎగిరినట్టు ఎగిరి దబ్ మని గోడకు ఢీకోని పెద్ద అరుపు అరుస్తూ కింద పడిపోయాడు పద్మనాభన్. అతని తల గోడకు తడలడంతో రక్తం సర్రుమని విరజిమ్మింది.
అదే అదునుగా.....
లిపి స్ప్రింగ్ లా లేచి డోరు తెరచుకొని చెదిరిపోయిన చీరను సర్దుకుంటూ కారిడార్లోంచి పరుగెడుతూ గబగబా మెట్లు దిగి రోడ్డు మీద కెళ్ళింది.
అప్పుడు రాత్రి సరిగ్గా 11.30 నిమిషాలు దాటింది.
ఊహించని ఆ సంఘటన ఆమెను ప్యానిక్ డిజార్డర్ కి గురి చేసింది. దాంతో వెనక్కి చూడకుండా ముందుకు పరుగెడుతోంది.
ఎక్కడా వీధి దీపాలు వెలగడం లేదు. సందుల్లోంచి పరుగెడుతున్న లిపిని చూసి కుక్కలు మొరుగుతున్నాయి.
శక్తినంతా కూడతీసుకుని లిపి పరుగెడుతోంది.
సరిగ్గా పది నిమిషాల తర్వాత మెయిన రోడ్ మీద కొచ్చింది.
ఎక్కడా ఒక్క ఆటో కూడా లేదు.
వరసగా ఆమెను దాటుకుంటూ వెళ్ళిపోతున్న కార్లు.
ఆటో కోసం అటూ ఇటూ చూస్తూ బస్టాపు వైపు పరుగెడుతోంది.
పైట చెంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ పరుగెడుతూ ఏం చేయాలో తోచక-
దూరం నుంచి వస్తున్న ఒక కారుని చూసి ఆపమన్నట్లుగా చెయ్యి అడ్డం పెట్టింది.
చటుక్కున ఆ కారుకి బ్రేకులు పడడంతో భారంగా నిట్టూర్చి ముందుకు పరుగెత్తింది.
కారులో బ్యాక్ సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి విండో స్కీన్ క్రిందకు దించి ఆమె వైపు చూశాడు.
"సార్! నన్ను వెల్లివాకం జంక్షన్లో డ్రాప్ చేస్తారా? ప్లీజ్!" ఇంగ్లీషులో అడిగింది లిపి.
ఒక్క క్షణం లిపి వైపు తేరిసార చూసి-
"గెట్ ఇన్" డోర్ తెరుస్తూ గంభీరంగా అన్నాడు కారులో వున్న వ్యక్తి.
లిపి కారెక్కింది. కారు ముందుకు సాగింది. అయిదు నిమిషాల తర్వాత ఆ వ్యక్తి అడిగాడు.
"ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం జరిగింది?" ఇద్దరి మధ్యా చిక్కటి చీకటి. ఆ గొంతును వింటూ అతనికెంత వయసుంటుందో అంచనా వేసింది లిపి.
ఏం జరిగిందో ఇంగ్లీషులోనే చెప్పింది లిపి. ఆ సమయంలో అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి.
"డోంట్ క్రై..... సమాజంలో మనుషుల రూపంలో రాక్షసులుంటారు. అలాంటి రాక్షసుల్ని ఎదుర్కోవాలి. పిరికితనంతో ఏడవకూడదు" చెప్పాడతను.
"డ్రైవర్ ! ముందు మనం వెల్లివాకం వెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాక గెస్ట్ హౌస్ కి వెళ్దాం" తమిళంలో చెప్పాడు ఆ వ్యక్తి.
తలూపాడు డ్రైవరు.
మరో పావుగంట తర్వాత వెల్లివాకం జంక్షన్ వచ్చింది.
"ఎటు వెళ్ళాలి?" అడిగాడా వ్యక్తి.
"నేను ఇక్కడ దిగి వెళ్ళిపోతాను సార్."
"ఏం ఫర్వాలేదు. నాకు ఇప్పుడు అర్జంటు పనులేమీ లేవు" అన్నాడతను.
ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది లిపి.
కారు మలుపు తిరిగి వెల్లివాకం హౌసింగ్ కాలనీలోకి అడుగుపెడుతున్న సమయంలో......
వీధి దీపాల వెలుగు ఒక్కసారి ముఖాల మీద పడటంతో తలతిప్పి పక్కనున్న వ్యక్తివేపు చూసింది లిపి.
తెల్లటి జుత్తు, విశాలమయిన ముఖం. అదే సమయంలో ఆ వ్యక్తికూడా తల తిప్పి ఆమె వేపు చూశాడు.
అయిదు నిమిషాల తర్వాత ఇంటిముందు దిగింది లిపి.
"థాంక్యూ సర్! మీ హెల్ప్ మరిచిపోలేను" ఇంగ్లీషులో అంది లిపి.
"బీ గ్రేవ్ యంగ్ లేడీ! సమాజాన్ని ఎదిరించడం నేర్చుకో. గుడ్ నైట్ కారు వెనక్కి తిరిగింది.
రెండు నిమిషాలు అలాగే కదలకుండా నిలబడిపోయి వెళుతున్న కారు వేపు చూసిందామె.
దాదాపు అరవై ఏళ్ళ వయసున్న వ్యక్తి, కానీ ఆ గొంతు మాత్రం అరవై ఏళ్ళ వాడి గొంతులా లేదు.
అదే ఆశ్చర్యమనిపించింది ఆమెకు.
ఇంట్లోకెళ్ళాక ఎవరిని పలకరించకుండా తన రూమ్ కెళ్ళిపోయి చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. ఆపిన తేరుకుని తనకు అంతకు ముందు సహాయం చేసిన వ్యక్తి మీదకు తన ఆలోచనల్ని మళ్ళించింది.
"బీ బ్రేవ్ యంగ్ లేడీ! సమాజాన్ని ఎదిరించడం నేర్చుకో" ఆ గొంతు శబ్దం చెవుల్లో మార్మోగుతోంది.
వెల్లివాకంలో లిపిని డ్రాప్ చేశాక ఆ కరు కె.కె. నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియాలోని విశాలమైన గెస్ట్ హౌస్ లో కెళ్ళింది.
ఆ వ్యక్తి హుందాగా కారులోంచి దిగి లోనికి వెళ్ళాడు.