"నేను దేనికీ భయపడదలచుకోలేదు......" అన్నాడు మధు. చేతివాచీవేపు చూసుకున్నాడతను. ఒంటిగంట దాటింది.
"ముందు హొటల్లో లంచ్ చేద్దాం..... పద" అని ఆటో పిల్చాడు సుల్తాన్.
* * *
ఎ.సీ. ఆగిపోవడంతో కళ్ళిప్పింది అన్విత.
కుషన్ బెడ్ మీంచి లేచి, కర్టెన్స్ ఓపెన్ చేసి సముద్రంవేపు చూస్తూ కాసేపు నిలబడింది.
అనంతమైన జలరాశిలో, నిరంతరం దోబుచులాడుకునే కెరటాలు, ప్రతిరోజూ అవే కెరటాలు..... అదే ఉరవడి.... కానీ మారే రంగులెన్నెన్నో.... ప్రతిఫలించే ప్రతిబింబాలెన్నో..... ఒక్కసారి విసురుగా గాలి రావడంతో, పల్చటి షిఫాన్ పైట ఉల్లి కాగితంలా కిందకు జారిపోయింది.
ఎదురుగా నిలువెత్తు అద్దం.
సౌందర్యాన్ని ఆవిష్కరించడానికి బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా తయారుచేసి పంపిన ప్రియదర్శినిలా వుంది.
తన అందాలను అద్దంలో చూసుకుంటూ నవ్వుకుందామె.
అప్పుడే లోనికొచ్చిన అన్నపూర్ణమ్మ-
"ఏంటీ.... పైట తీసేసుకుని అద్దంలో చూసుకుంటున్నావ్. ఏదైనా విశేషమా?" అని అడిగింది నవ్వుతూ.
"అంటే...."
"అదే ప్రేమలో పడబోతున్నావా?" అని.
"మొన్నటివరకూ సోషల్ సర్వీస్..... ఇప్పుడు రోమాన్సా నీ టాపిక్" అన్విత నవ్వుతూ అంది.
"ఏ వయసుకి ఆ ముచ్చట వుండాలే తల్లీ..... భక్తి, భక్తే..... రక్తి రక్తే..... నిత్యం భగవంతుడి దగ్గర గడిపే పూజారులు పెళ్ళిళ్లు చేసుకోరా ఏమిటి? నీ వయస్సులో నా చుట్టూ యంగ్ బాయ్స్ ఎంతమంది కుక్కల్లా తిరిగేవారో తెలుసా?" అంది గర్వంగా అన్నపూర్ణమ్మ.
"వాళ్ళందర్నీ ఏం చేశావు నువ్వు?"
"ఆట్లాడించేదాన్ని..... లవ్ చేసే ప్రేమ చదరంగం పాపం గిలగిల్లాడి పోయేవారు..... నా మనువరాలివేగానీ- నా డేరింగ్ నీకస్సాలు రాలేదు..... వండ్రపుల్ బ్యూటీ నీకుంది.... ఏంటి లాభం? ఒక్కడు నీ దగ్గరికి రాడు..... వెనక తిరగడు..... ఏంటో అంది సోఫాలో కూలబడుతూ.
"నాన్నమ్మా! నీకు రోమియోలు లవర్స్ గానూ, రోమియోతనం ప్రేమగానూ కన్పించింది...... అంతేనా?"
"కాకపొతే...."
"యూ ఆర్ రాంగ్! ఓల్డ్ లేడీ..... బోల్డ్ గా చెబుతున్నాను విను- పెళ్ళికాని చాలామందికి ప్రేమంటే కామం, ఆ వేడి చల్లారడానికి కామానికీ, ప్రేమ ముసుగు వేస్తారు. ఆ ముసుగునే అమ్మాయిలు ప్రేమను కుంటారు. కొంతమందికి ప్రేమంటే బెడ్ రూమ్ లో భార్యలాంటిది. పాతివ్రత్యం ముసుగులో పైశాచికమయిన సెక్స్ కు ఆడది అక్కా డస్ట్ బిన్......" చాలా సీరియస్ గా చెప్పి ఆగింది అన్విత.
విచిత్రంగా చూసింది మనవరాలివైపు అన్నపూర్ణమ్మ.
"అసలు నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటే.....?"
"నా దృష్టిలో ప్రేమంటే కళాసృష్టి..... ఆత్మతృష్ణ, దివ్యజ్యోతి. అది కంటికి కనపడదు. మనసుకి తెల్సినట్టుగానే వుంటుందిగానీ తెలీదు. సెక్స్ లో ఒక పార్ట్ ప్రేమనుకుంటారు చాలామంది. కానీ ప్రేమకూ, సెక్స్ కూ అసలు సంబంధంలేదు. సముద్రంలాంటి ప్రేమలో చిన్న బిందువు సెక్స్. ఆ చిన్న బిందువునే ప్రేమనుకుంటారు మనుషులు" చాలా కూల్ గా చెప్పింది అన్విత.
రెండు నిముషాలు ఏం మాట్లాడలేకపోయింది అన్నపూర్ణమ్మ.
"నువ్వింత లోతుగా ఆలోచించగలవని నాకు తెలీదు బేబీ! నేనూహించ లేదు కూడా" నెమ్మదిగా అందామె.
"అమ్మా! మీకోసం ఎవరో వచ్చారు" చెప్పిన పనిమనిషి వైపు సూటిగా చూసింది అన్విత.
"అనురాగ్ అయ్యుంటాడు" అనుకుంటూ కిందకు దిగుతూ, సోఫా వేపు చూసింది.
అనురాగ్ డాడీ యుగంధరేశ్వరరావు.
"అంకుల్ బావున్నారా?" ఆప్యాయంగా విష్ చేసి ఆయనకెదురుగా కూర్చుంది. ఇంతలో అన్నపూర్ణమ్మ కిందకు దిగింది.
"ముంబయ్ నుంచి మార్నింగ్ ఫ్లయిట్ లో వచ్చాను. మీరిద్దరూ ఇక్కడే వున్నారని అనురాగ్ చెప్పాడు. నేను మళ్ళీ నైట్ ఫ్లయిట్ కి వెళ్ళిపోవాలి. బేబీ నాతో డిన్నర్ చెయ్యవా?" అడిగాడాయన.
ఇద్దర్నీ ఒప్పించాడు ఆయన. పావుగంటలో ఇద్దరూ తయారయ్యారు.
ముందు ఇంట్లోంచి బయటకొచ్చింది అన్విత. తలెత్తి చూసిన ఆమె పోర్టికోలోకి అప్పుడే అడుగుపెట్టిన మధుని ఆశ్చర్యంగా చూసింది.
"హలో..... మధూ..... మీరు ఇక్కడ! ఎప్పుడొచ్చారు? వాటే సర్ ప్రయిజింగ్" అలలు పొంగిన కడలిలా ఉత్సాహంగా అందామె.
ఇద్దరిమధ్యా రెండడుగుల దూరం..... దోబుచులాడుతున్న మత్తయిన పరిమళం.
"మార్నింగ్ వచ్చాను" నెమ్మదిగా అన్నాడతను.
"ఎన్నిరోజులుంటారు?"
"ఉంటాను."
"మా అంకుల్ వచ్చారు. డిన్నర్ కి వెళుతున్నాం. ఆయన నైట్ కి ముంబయ్ వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి మా ఇంటికి రాగలరా?"
'వస్తాను' అన్నట్టుగా కళ్ళతోనే బదులిచ్చాడు మధు.
"సీయూ!" వెంటనే వెనకొచ్చేశాడతను.
మరో మూడు నిముషాల తరువాత, కారు గేటు దాటుతున్నప్పుడు బ్యాక్ సీట్లో అన్నపూర్ణమ్మ పక్కన కూర్చున్న అన్విత రోడ్డుకి అటూ ఇటూ చూసింది.
మధు అలా కనిపిస్తాడని, ఊహించని అన్వితలో పరిపరివిధాలుగా ఆలోచనలు చోటు చేసుకున్నాయి.
* * *
నీరసంగా రూమ్ కొచ్చిన మధుని చూసి, సుల్తాన్ విసుక్కున్నాడు.
"ఏమైంది?" విసుగును దాచుకుంటూ అడిగాడు సుల్తాన్.
చెప్పాడు మధు.
"ఏ మనిషైనా, ఎప్పుడైనా హీరోలా బతకాలి. జీరోలా కాదు. ఏ వ్యక్తి అయినా మరొకరికి ఆదర్శం కావాలి. పిరికివాడు- డబ్బున్నవాడైనా, అందగాడైనా, ఆరోగ్యవంతుడైనా ఈ సమాజానికీ, దేశానికీ ఏ విధంగానూ వుపయోగపడడు.
నాలుగురోజుల బతికినా, పులిలా బతకాలి. దేవినేని వెంకటరమణ అంటే నాకందుకే అసూయ. ఓటు, నోటు కోసం జరిగే రాజకీయాన్ని మటుమాయం చేసిన రియల్ హీరో రమణ! పనులు చేయడం, సమస్యలు పరిష్కరించడం, ప్రతి పల్లెనీ అనుక్షణం పలకరించడం తప్ప, అతనికి మరో పనే వుండేదికాదట. చంద్రబాబుని, రమణ విసిగించినంతగా మరే ఎమ్మెల్యే విసిగించలేదట.
అయినా చంద్రబాబు మాత్రం విసుక్కునేవాడు కాదట. నా నియోజక వర్గానికి రోడ్లు కావాలి. పంపింగ్ స్కీమ్ కావాలి. హాస్పిటల్స్ కావాలి అంగన్ వాడీలు కావాలని ఊపిరి తీసుకోకుండా అడిగేవాడట రమణ. అతనిలోని తపన, సేవాభావం చూసి చంద్రబాబు చాలా సంతోషించేవాడట.
"నా నియోజక వర్గం కుప్పంతో పోటీ పడతావా? చూస్తాను నువ్వు నెగ్గుతావో- నేను నెగ్గుతానో!" అని సరదాగా చంద్రబాబు సవాల్ విసిరేవాడట.
ప్రజలకోసం రాత్రింబవళ్ళు శ్రమించిన రమణని చూసి చంద్రబాబు గర్వపడేవాడట. రమణని సొంత తమ్ముడికంటే, బంధువుల కంటే, భార్యా బిడ్డలకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడట.
ఏరోజూ, చంద్రబాబుని నాకు కొన్ని సొంత పనులున్నాయనిగానీ అవి చేసిపెట్టమనిగానీ అడిగి ఎరగడట రమణ.
రమణలాంటి ఎమ్మెల్యే తన పార్టీలో వున్నందుకు చంద్రబాబు గర్వించేవాడట ఎప్పుడూ.
నిజమైన హీరోలంటే చంద్రబాబు- రమణలే! మనిషిపొయినా, పదిమంది మనసుల్లో శాశ్వతస్థానం పొందగలిగిన రమణ రియల్ హీరో.
అలా ఉండాలి నువ్వయినా. ప్రేమకోసమైనా, ప్రజలకోసమైనా, ప్రాణం పెట్టేవాడే గొప్పవాడు.
ఈ ప్రేమలో నేను గెలవలేను- ఈ రాష్ట్రాన్ని ఎవడూ బాగుచేయలేడనే ప్రేమికుడుగానీ, నాయకుడుగానీ నామమాత్రులే అవుతారుగానీ, నాయకులు కాలేరు.
ప్రజలవద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, రోడ్ల విస్తరణ, విజన్ 2020, వన సంరక్షణ, సాగునీటి సంఘాలు, సి.ఎం.ఇ.వై. విద్యా కమిటీలు, డ్వాక్రా పథకాలు, రైతుబజార్లు, వాటర్ షెడ్ , ఆదరణ, ముందడుగు, చేయూత, రోషిణి, చైతన్యం, ఆపద్బంధు, మదర్స్ కమిటీ, శిశువుల సంరక్షణ పథకం, సుఖీభవ, దీపం- అబ్బబ్బ..... ఎన్ని పథకాలు..... ఎన్ని సేవలు...... పని రాక్షసుడు చంద్రబాబు. ప్రజా రక్షకుడు చంద్రబాబు, నిద్ర సుఖమెరుగని నిశాచరుడు చంద్రబాబుని ఎవరైనా మర్చిపోగలరా?
మంచి పనులు చేసిన వాళ్ళని అభినందిస్తే, మరిన్ని మంచిపనులు చేస్తారు. అదెలాగూ రాష్ట్ర ప్రజలకు తెలుసనుకో.
నీ విషయమే నాకు తెలియడంలేదు. ఎవరైనా, ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా జీవితంలో విజయం సాధించాలంటే, చంద్రబాబు, రమణ జీవన విధానాల్ని ఉత్తేజంగా తీసుకుంటే చాలు.
నీకో తమాషా విషయం చెప్పాలి. కానిప్పుడు కాదు..... రమణ ఇదే విశాఖపట్టణానికి చెందిన ప్రణతి అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆయన ప్రణయ కథని, ప్రణతి ప్రేమని మరోసారి చెబుతాను.
ఇప్పటికైనా ధైర్యం చేసి, నీ ప్రేమను బయటపెట్టుకుని, విజయం సాధిస్తే, నీ ఫ్రెండ్ గా గర్విస్తాను" అంటూ సుల్తాన్ మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు.
మధు ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు.
* * *
రాత్రి తొమ్మిదిన్నర గంటలకు హోటల్ దసపల్లాలో డిన్నర్ పూర్తయ్యాక ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు అందరూ.
యుగంధరేశ్వరరావు, అన్నపూర్ణమ్మతో ఏదో మాట్లాడుతున్నాడు.
"ఏం అన్వితా ముభావంగా వున్నావ్?" అడిగాడు మరో పక్కనున్న అన్విత్ ను అనురాగ్.
"నథింగ్....." అందామె.
"నాకు పట్టుదల ఎక్కువని నీకు తెలుసు. నేను పిలిస్తే నువ్వు డిన్నర్ కి రాకపోవచ్చని అనిపించి డాడీని పంపించాను. ఎలా వుంది ఐడియా?" చెప్పేశాడతను.
"ఏ పనైనా బలవంతంగా చేయడం, చేయించడం మీ అలవాటా?" కోపంగా అంది అన్విత.
"ఎస్! ఇట్ గివ్స్ మి థ్రిల్" అన్నాడు పెద్దగా నవ్వుతూ.