Read more!
 Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 3


    నాన్నగారికి యాక్సిడెంట్ అయితే తను విలవిల్లాడిపోదూ?
    అవును! స్కూటర్ డాష్ కొట్టకపోవడమేమంచిదయింది. లేకపోతే నాన్నగారికి దెబ్బలు తగిలి ఉండేవి.
    కింద ఉన్న చిరిగినా పరుపులో నుంచి పైకి వచ్చిన దూది మెడకు రాసుకుంటూ ఉంటే వళ్ళుజలదరించినట్లయి ఆలోచనల్లోంచి బయటపడింది సృజన.
    గది బయట చిన్నగా మాటలు వినబడుతున్నాయి.
    అతికష్టంమీద తల తిప్పి చూసింది. వెనకగా రేకు తలుపు కనబడుతోంది. ఒక్క రేకుతో చేసిందికాదు అది. ఎన్నో రకాల సీనారేకు డబ్బాలను సాపు చేసి, వాటిని చట్రానికి బిగించిన తలుపు అది.
    "ఆటో నవాబ్ గాడు ఎంత తీసుకున్నాడూ?" అంటోంది ఒక గొంతు.
    "రెండొందలు కావాలన్నాడు. వందిచ్చా!" అంటోంది రెండో గొంతు.
    "ఇంతకీ పిల్లని ఇంతకు అమ్మాలనుకుంటున్నారు?"
    "మూడువేలన్నా రాదూ?"
    "ఏమో! నా మాట విని అహల్యకి అమ్ము రాఘవులూ! న్యాయమైన రేటు ఇస్తుంది."
    "అహల్య ఎందుకు జాన్! రాములమ్మే మూడూవేలు ఇస్తానని రెడీగా ఉంటే?"
    "ఇస్తానంటుందయ్యా! కాని ఇవ్వొద్దూ? నేనిదివరకోసారి ఓ పిల్లని అమ్మ జూపితే రెండువేలని రెండొందలయాభై ఇచ్చింది. అనడంవేరూ, ఇవ్వడం వేరూనూ! పైగా ఇంకోసంగతి చూశావా? ఈ పిల్లపాపం పెద్దింటి పిల్ల! అహల్యలాంటి హైక్లాస్ మనిషి దగ్గరైతే బాగా కాలక్షేపం అయిపోతుంది. రాములమ్మవన్నీ రిక్షా బేరాలు, పిల్లా నానా అవస్థలూ పడితే దాని ఉసురు మనకి తాకుద్ది. ఒక రూపాయి తక్కువైనా పిల్లని మంచి కొంపలో పడెయ్యడం మన ధర్మం! అవునా?" అన్నాడు జాన్.
    "చెప్పావు లేవోయ్! సరుకు నీది గాకబోతే నీతులు నిమ్మళంగా ఎన్నయినా చెప్పొచ్చు!" అన్నాడు రాఘవులు మొండిగా, "నా కట్టాంటిసుకుమారాలేం లెవ్వు! ఎవరు ఓ రూపాయి ఎక్కువిస్తే వాళ్ళకే సరుకు అప్పగిత్తా!
    నాకు తెలియకడుగుతా! మాటికీ అహల్య అహల్య అంటావు. నువ్వుగాని అహల్యకిఏజెంటువా ఏంది? అహల్య అంటే అంత ఇది ఉంటే, పో, పోయి రేటెంతవరకూ పెంచుద్దో కనుక్కురా!"
    "మంచిమాట చెబితే మద్దెన నాకేదో ఉందనుకునే రకానివి నువ్వు! ఈ సోషల్ సర్వీసు నాకెందుకొచ్చిందిగానీ, నే ఒత్తా!" అన్నాడు జాన్.
    "నీకూ ఇత్తాలేవోయ్ పాతికో పరకో! నువ్వు కన్నేసిన ఆ టీచరమ్మ కూతుర్ని ఎత్తుకు రావాలంటే రేపు నా గెలుపు అక్కర్లేదా ఏంది? ఎల్లు? ఎల్లి ఎంతస్తిదో కనుక్కురా! ఓకే మాట! ఫైనల్!"
    "ఎత్తాలేవోయ్! నీ పెళ్ళాం ఏది? ఊళ్ళో లేదా? నీళ్ళాడ్డానికి బోయిందా ఏమిటీ?"
    నవ్వాడు రాఘవులు.
    "మావూళ్ళో ఘోషాసుపత్రిలో జేర్పించా? జేర్పించేటప్పుడే వార్నింగిచ్చా! అబ్భాయ్ నికంటే స్పెషల్ రూము. అమ్మాయ్ ని కంటే ఆర్డినరీ రూము" అని ఆ భయానికన్నా అబ్బాయ్ నే కంటది చూడు"
    పెద్దగా నవ్వాడు జాన్" అవునయ్యా! అబ్బాయేబెస్టు. ఇంకో అయ్యకనిపెంచిన అమ్మాయ్ వైతే మనం ఎత్తుకొచ్చి అమ్ముక బతకొచ్చు. మనమే అమ్మాయిని కంటే పెంచి పెద్దచేసి ఇంకో అయ్య చేతిలో పెట్టాలగందా! చేతిచమురు భాగోతం! అయితే మీ యావిడ వచ్చేవరకూ  ఈ పిల్లే నీ పెళ్ళామా?"
    "నాబొందేం కాదూ! ఇదీమరీ కసుగాయకదా! దేనికీ పనికి రాదు"
    "పైపైన.....జపాన్ వర్కు....." మళ్ళీ నవ్వును.
    "అయితే నే వెళ్ళొత్తా!" అన్నాడు జాన్.
    "ఎల్లిరా!"
    తర్వాత తలుపు గొళ్ళెం తీస్తున్న చప్పుడు వినబడింది.
    దుక్కలా ఉన్న రాఘవులు లోపలికి వచ్చాడు.
    "ఏందేపిల్లా నిద్దర పోతున్నావా ఏంది?"
    రోధన లాంటి మూలుగు వెలువడింది సృజన గొంతులో నుంచి.
    "సలి పెడుతోందా? దుప్పటికావాలా?"
    వద్దన్నట్లు, తల గట్టిగా ఊపింది సృజన. "....జ్.....న్ న్ న్ హీం......టి......హం......పె...." నోట్లగుడ్డ ఉండడంవల్లమాట సరిగా రావడం లేదు.
    ఆమె అవస్త చూస్తే నవ్వొచ్చింది రాఘవులుకి. "ఏంటి? ఏంటి అంటున్నావ్?"
    ".....జ్.....న......న్ న్ ను.......హిం......హ....." దుఃఖంతో ఆమె లేతపొట్ట ఎగిరెగిరి పడుతోంది.
    "బువ్వతింటావా?"
    తల అడ్డంగా ఆడించింది సృజన.
    "అయితే మాడు! నా సొమ్మేం పోద్ది?"
    సొమ్మసిల్లిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది సృజన.
    దగ్గరగా వచ్చాడు రాఘవులు.
    గజనిమ్మపండులా రుసరుసలాడుతూ కనబడుతోంది. బాల్యపు మెట్లన్నీ ఎక్కేసి, యవ్వనపు తొలిమెట్టుమీదపాదం మోపడానికి సిద్దంగా ఉన్నదానిలా ముగ్ధమనోహరంగా ఉంది తను.
    ఆమెనిపట్టిపట్టి చూశాడు రాఘవులు.
    కసిరేకిత్తించేలా ఉందిగానీ, ఇంకా పసిపిల్ల కసుగాయ!
    ఉన్నట్లుండి అతనికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. వెంటనే విరగబడి నవ్వాడు అతను.
    భయంగా చూసింది సృజన.
    "రేత్తిరికిరేత్తిరే నిన్ను పెద్దమడిసిని చేసే మంత్రదండం నా దగ్గర ఉంటే ఎంతమజాగా ఉండేదే!"
    అతని మాటలు అర్ధం తెలియకపోయినా, వాటిలో ఏదో తప్పు ఉందని అర్ధమైంది సృజనకి. వెగటుగా అనిపించింది.
    అతనికి కనబడకుండా తనుముడుచుకుపోతే బాగుండని తీవ్రమైన కోరిక కలిగింది.
    కానీ వీల్లేకుండా కాళ్ళూ చేతులూ కట్టేసిఉన్నాయ్ మంచానికి.


                                  2


    "సృజన ఏదీ? కొత్త డ్రెస్సు వేసుకుంటోందా?" అన్నాడు రమణమూర్తి లోపలికి వస్తూనే.
    చిరునవ్వుతో తల అడ్డంగా ఊపింది సృజన క్లాస్ మేట్ ఒకమ్మాయి "సృజన ఇంకారాలేదు అంకుల్!"
    "అదేమిటి? మీతోబాటు బయలుదేరలేదూ?"
    "మాకంటే ముందే బయలుదేరింది అంకుల్!"
    "మరి?" అన్నాడు రమణమూర్తి, అరటిపళ్ళూ, యాపిల్ పళ్ళూ ప్లేటులో పెట్టుకుని బయటికి వస్తున్న భార్యవైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ.
    "వెంటనే బస్సు దొరికి ఉండదు" అంది జానకి" వస్తూ ఉండి ఉంటుంది లెండి"

 Previous Page Next Page