Previous Page Next Page 
యోధుడు పేజి 28

    "సంవత్సరం దాటింది."

    రణదీఫ్ అందించిన ఫైల్ లో హైస్కూల్ స్టడీ సర్టిఫికేట్ లోని తండ్రి పేరు వైపు చూశాడు నీలకంఠన్ .

    సంతోష్ కేవల్కర్ అని వుంది . ఇంటర్ సర్టిఫికెట్స్ కాలేజీలోని డిగ్రీ సర్టిఫికేట్స్ తిరగేస్తున్నా లాయర్ నీలకంఠన్  వాటిమధ్యలో వున్న పోస్టుకార్డు సైజు ఫోటోవైపు ఆసక్తిగా చూశాడు.

    "అది పాతికెళ్ళానాటి మా అమ్మనాన్న ఫోటో" చెప్పాడు రణదీఫ్.

    ఇది ఫోటో అని తెలుస్తూనే వుంది. కానీ ఇద్దరి ముఖాలూ అంత స్పష్టంగా కనబడంలేదే" ఆ ఫోటోని  మరింత పరిశీలనగా చూస్తూ అన్నాడు  లాయర్ నీలకంఠన్_

    "అంటే హకీం సత్యం, మాణిక్యమ్మల మనవడిని నువ్వేనంటావు?"

    "అవున్సార్" స్థిరంగా అన్నాడు రణదీఫ్.

    "లింగ్ సుగర లో మీ నాన్న, అమ్మ ఏ ఏ సంవత్సరాల్లో వున్నారు?" అడిగాడు లాయర్.

    ఠక్కున జవాబు చెప్పాడు రణదీఫ్.

    "మీ నాన్న బందువులేవరయినా ఇప్పుడెక్కడ వున్నారా?" అడిగాడు నీలకంఠన్ .

    "ఉన్నారు సార్! మా నాన్నకు బాగా దగ్గరి బంధువు. వరసకు మేనమామ. ఏనాబైయ్ ఏళ్ళ వయస్సు వుంటుంది" తనలో రేగుతున్న ఎద్వేగాన్ని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు రణదీఫ్.

     నీలకంఠన్ కొద్దిక్షణాలేం మాట్లాడలేదు. ఏదో అలోచిస్తూండి పోయాడు.

    "నాకేదో ఆస్తికావాలని నేనిక్కడకు రాలేదు. మా అమ్మ తరపు బంధువులు ఇక్కడున్నారని, నేను ఒంటరివాడిని కాదని తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను" రణదీఫ్ బాగా నిస్తున్నాడు.

    "ఓ.కే మిస్టర్ రణదీఫ్... నీకు  ఏ భాషలోచ్చు?"

    "కన్నడ,ఇంగ్లీషు, తెలుగు."

    "మరాఠీ రాదా... మీ నాన్న మరాఠీ వ్యక్తికదా?"

    "మా నాన్న పుట్టుకరీత్యా మరాఠీ అయినా, స్వాతంత్యంనికిముందే అయన బట్టల వ్యాపారం కోసం లింగ్ షుగర్ లో సేటలైపోయారు.

    మా అమ్మ, నాన్నలకు సంబంధించిన వస్తువుల్లు ఏవైనా నీ దగ్గరున్నాయా?" అడిగాడు నీలకంఠన్ .
    "వస్తువులంటే?"

    "మీ అమ్మకు సంబంధించిన నగలు, దుస్తులు, మీ నాన్నకు సంబంధించిన వాచీ లాంటివేవైనా?"

    ఆ ప్రశ్నకు వెంటనే జబ్వాబు చెప్పలేకపోయాడు రణదీఫ్. ఆలోచనలోపడ్డాడు. నీలకంఠన్  తక్కువవాడు కాదని ఆ క్షణానే నిర్ణయించుకున్నాడు రణదీఫ్.

    "చూడాలి. వెతకాలి" అన్నాడు రణదీఫ్ చిన్నగా.

    "మీ నాన్న, అమ్మ ఎలా చచ్చిపోయారు?"

    "సహజంగానే."

    "సహజంగానా?" ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ అన్నాడు నీలకంఠన్ . తనలో రేగిన ఆశ్చర్యాన్ని బయటపడనివ్వలేదు.

    "అవునుసార్" అన్నాడు రణదీఫ్ విచారాన్ని నటిస్తూ.

    లింగ్ షుగర్ నుంచి బళ్ళారీ వెళుతున్నప్పుడు సుశీల రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తన ఎంక్వయిరీలో తేలింది.

    మరితను సహజంగానే చనిపోయిందంటున్నాడు? నీలకంఠన్  అంతరంగంలో రణదీఫ్ పై తొలి అనుమానపు బీజం పడిపోయింది.

    "సహజంగా అంటే ఎలా చనిపోయారు... వివరాలు చెప్పగలవా?" అడిగే సౌమ్యంగానే వున్నా_ అరాలో చాలా లోటుకేలుతున్నాడు లాయర్ నీలకంఠన్.

    "అనారోగ్య కారాణాలతోనే... మొదట అమ్మా. తర్వాత నాన్న."

    "చచ్చిపోయేముందు మీ అమ్మగానీ. నాన్నగానీ నీతో ఏం చెప్పాలేదా?"

    "చెప్పారు సార్. అమ్మ చెప్పింది... నేను చచ్చిపోయినా నీవు ఒంటరివాడివికాదని, హైదరాబాద్ లో వున్న అమ్మమ్మ మాణిక్యమ్మ దగ్గరకు వెళ్ళమని చెప్పింది" అన్నాడు.

    "నువ్వే సూశీలమ్మఅని నిరూపించటానికి ఇంకా ఏమైనా ఆధారాలున్నాయా?"

    "ఇప్పుడు నేను చూపెట్టినవి సరిపోవా?" వెంటనే ప్రశ్నించాడు రణదీఫ్ తనలో రేగుతున్న అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ.

    కొద్ది క్షణలేం మాట్లాడలేదు నీలకంఠన్ ఆలోచిస్తుండిపోయాడు.

    అయన కేసే అత్రుతుగా చూస్తున్నాడు రణదీఫ్.

    "ఈ ఫైలు నా దగ్గరుంచుకుంటాను. ఆస్తి కోట్లలో వున్నప్పుడు, ఎన్నోజాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందిగదా! ఏమంటావ్?" రణదీఫ్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు నీలకంఠన్ .

    "తప్పకుండా. ఆ మాత్రం జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే ఆస్తి అన్యాక్రాంతమైపోతుంది. ఆ తరువాత అసలైన వారసుడ్ని నేనుంయాయ మైపోతాను. అప్పుడు మా అమ్మ సుశీల ఆత్మ శాంతించదు" అన్నాడు రణదీఫ్ వినయాన్ని, నిజాయితీని నటిస్తూ.

    "వెరీగుడ్_ కొన్ని కోణాల నుంచి నేను నిర్దారించుకొందే ఆస్తిని ఎవరికీ అప్పజెప్పాను. హకీం సత్యం కోట్లాది ఆస్తులకు న్యాయం చేయడం తప్ప అప్పజెప్పాను. హాకీం సత్యం కోట్లాది ఆస్తులకు న్యాయం చేయడం తప్ప ఈ వయస్సులో నాకు మరో పనేముంటుంది? నీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి, వెళ్ళు. అవసరం కలగ్గానే నేనే కబురు చేస్తాను" అన్నాడు నీలకంఠన్  నెమ్మదిగా ఇంకా అతని కేసే పరిశీలనగా చూస్తూ

    రణదీఫ్ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు.

 Previous Page Next Page