ఆ జవాబు విని ఆమె నవ్వింది. ఆమె తెల్లని పలువరస మంచు ముత్యాలకోవాలా మిలమిలా మెరిసింది.
సంధ్య ముఖంలో సిగ్గు చోటుచేసుకుంది. ఒక పిల్ల తెమ్మెర వీచినట్టుగా ఆమె ముఖం ప్రసన్నమైంది.
'సంధ్యా!'
'చెప్పండి!"
'నువ్వు అడిత్యని పెళ్ళి చేసుకో_ ఆ పెళ్ళికి నే సాయం చేస్తాను' అమ్దాయువతి.
సంధ్య కనుబొమలు ముడిపడ్డాయి.
'ఎలా సాయం చేస్తావో నీ కనవసరం_ నీ పెళ్ళి అతనితో జరగటం ముఖ్యం. అవునా!'
'మీరెవరు?'
"నా పేరు వినిత!'
"ఎక్కడుంటారు!"
"అదంత ముఖ్యం కాదులే!" తన విషయం చెప్పటానికి యిష్ట పడనట్టుగా అంది.
'తెలియని వాళ్ళ సహాయం పొందటం నా కిష్టం లేదు మీ రేమవుతారని మీ సహాయం పొందాలి!'
'నీ ప్రెండ్ ని_'
నవ్వింది సంధ్య 'మనం ఒక వూరి వాళ్ళం కాదు_ ఒకచోటు కలసి చదువుకున్నవాళ్ళామూ కాదు-'
అయితేనేం- మనం ఒకర్నోకరం చూసుకున్న యీ క్షణాలు చలావూ? సంద్యా! అత్మీయత ఏర్పడ్డాని_ స్నేహం పెరగటానికి_ ఎన్నో ఏళ్లు అక్కర్లేదు. భార్యాభర్తలు కాదోయ్ వధూవరుల మధ్యప్రేమను స్నేహం అనేవి కూడా పెళ్ళి చూపుల్లో ఆ కొన్ని క్షణాల్లో ఏర్పడతాయి.అవే క్రమంగా బలపడతాయి_ స్నేహమూ అంతే! ముందు కలుసుకున్నపుడు కొన్ని నిమిషాలే కదా పరిచయం,అదే క్రమేపీ బలపడుతుంది.
'మన పరిచయాలు యిప్పుడే కదా!'
'ఇదే క్రమేపీ బలపడుతుంది!"
సంధ్య జవాబు చెప్పలేదు.
'అదిగో ఆదిత్య వస్తున్నాడు. నే వెళుతున్నాను. గుర్తుంచుకో! నేను మీ పెళ్ళి జరగటానికి ఎంతయినా తోడ్పడతాను. నీ పెళ్ళి ని ఎవరూ ఆపలేదు_' విసవిసా వెళ్ళిపోయింది వినిత.
ఆమె నడక చూసి ఆశ్చర్యపోయింది సంధ్య! గరుడుడిని చూసి పాము పరిగెడుతున్నట్టుగా వుంది ఆ వేగం.
28
అల్లంత దూరం నుంచి చెయ్యెత్తి విష్ చేశాడు ఆదిత్య. దగ్గరకి రాగానే 'సారీ'! అన్నాడు 'అనుకోకుండా ఆలస్యం అయింది!' అన్నాడు మళ్ళీ.
'పర్వాలేదులే! ఎలాగయితేనేం వచ్చావుగా!' అందిన వ్వుతూ. అతను రాగానే అక్కడి నుంచి కదిలింది. ఇద్దరూ మెట్లెక్కి ముఖద్వారం దాటి గుడి ముందుగా నడిచి గుడి వెనకాల వున్న పున్నాగ చెట్టు వద్దకి నడిచారు.
కర్చీప్ పరిచాడు ఆదిత్య
'కూర్చో ?' అన్నాడు చిర్నవ్వుతో.
థాంక్స్! చెప్పి సంధ్య పక్కన కూర్చుంది. ఆదిత్య తన కర్చీప్ మీద తనే కూర్చున్నాడు.
ఒక్కక్షణం నిశ్చబ్డం.
సంద్యా! మీ నాగారాజు ఎదురయ్యాడు సెంటర్లో. కాఫికీ రమ్మని బలవంతం చేశాడు. ఫామిలీ రూంలోకి తీసికెళ్ళి కాఫీ తెప్పించి నువ్విలా కోవెల వద్ద నా కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.
నాకు తెలుసు. నేను వెళుతున్నానని చెప్పాడు.
వెళ్ళండి! మీరు వెళ్ళాలనే నేను చెప్పాను. కానీ ఒకటి గుర్తుంచుకొండి ఇదే ఆఖరి సమావేశం అయ్యేలా చూస్కోండి. ఎంచేతనంటే నాకూ సంద్యకి పెళ్ళి జరుగుతుందఅన్నాడు.
సంద్యా! నిజంగా తానిలా అంతే నకు నవ్వొచ్చింది. నేను ఎందరో మనిషుల్ని చూశా! వాళ్ళలో మూర్ఘుల్ని చూశా! కానీ మరీయింత మూర్ఘుడిని చూళ్ళేదు' అన్నాడు ఆదిత్య నవ్వూతూ.
సంధ్య నవ్వలేదు.
నవ్వి నవ్వి అలసిపోయిన వాడిలాగా అయ్యేడు ఆదిత్య.
'దితీ! నాన్నగారి కేలా వుంది?
ఆ ప్రశ్న వినగానే అతని ముఖం మాడిపోయినట్టుయింది. ఒక్క సారిగా ధర్మరాజుగారి వేదన కళ్ళముందునిలిచినట్లయింది. గుండెల్ని పిండివేసి ఆ సన్నివేశం తలపులోకి రాగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి వేదాం, తల్లి మనోవేదన. తన సంఘర్షణ అన్నీ గుర్తుకొచ్చాయి.
'సంద్యా! నాన్నగారి ఆరోగ్యం బొత్తిగా బాగాలేదు!' అన్నాడు అతను. విషాద మేఘాలు కమ్ముకున్నట్టయింది.
'డాక్టర్ ఏమంటున్నారు?' ఆదుర్దాగా అడిగింది.
'అయన నయం చేస్తానాన్నారు. కానీ నాన్నగారు పదే ఆ భాద భగవాన్ పగవానికి కూడా వద్దనిపిమ్చిమ్ది.'
'ఇంకేమి ఆలోచించలేదా?'
"అమ్మ ఎవరో శాస్రీగారి వద్దకి వెళ్ళింది. ఆయనేదో చెప్పాడు. ఏదో జపాలు చేస్తానన్నారు. కానీ ఫలితం కన్పించటంలేదు_"
"దీతీ!" మృధుత్వమంతా తన గొంతులో నింపుకుందా అన్నట్టు పిలిచింది. సంధ్య. మా ఇంట్లో ఘర్షణ మొదలైంది" అంది.
"ఏమిటి?"
"నాన్నగారి విషయం తెలిసిందే కదా! దేన్నీ పట్టించుకోరు. అమ్మకి యిష్టం లేదు అత్తయ్య బెదిరిస్తోంది. మధ్య యీ నాగరాజోకడు."
" సంద్యా! మన పెళ్ళి జరిగితీరుస్తుంది!"
నిజంగా జరుగుతుందంటవా ? "ఆశగా అడిగింది" బేలగా ప్రశ్నించింది. ఆత్రంగా వచ్చింది.
'నా ప్రాణాలకి వెలకట్టి అయినా నిన్ను పెళ్ళి చేసుకుంటాను అతను చేయి చాచేడు.
సరిగ్గా ఆ సమయంలో 'బస్' మన్నా శబ్దం వినిపించింది.ఒక కమ్మరి కొలిమి తిట్టి ఊదీనంత శబ్దం.
చప్పున అటు చూశారిద్దరూ!
పాము!